Saturday, October 12, 2024
Homeఓపన్ పేజ్Young gen lacks social responsibility: నేటి తరం సామాజిక బాధ్యతను విస్మరిస్తే ఎలా...

Young gen lacks social responsibility: నేటి తరం సామాజిక బాధ్యతను విస్మరిస్తే ఎలా ?

సమాజంలో రోజురోజుకు అడుగంటి పోతున్న మానవత్వం, మానవ విలువలు పెంపొందించుటకు మెరుగైన సమాజ నిర్మాణానికి ఆ కృషి తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత తరం, నడుస్తున్న కాలానికి సంబంధించి వివిధ రంగాలకు చెందిన విజ్ఞులు , తత్వవేత్తలు, కవు లు, కళాకారులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు వైద్య రంగ నిపుణులు,జర్నలిస్టులు, సమాజాన్ని ప్రభావితం చేసిన వారికి సంబంధించిన చరిత్రను భవిష్యత్తు తరానికి అందించవలసిన బాధ్యత నడుస్తున్న కాలానికి ఉంటుంది.
ప్రాధాన్యత అంశాలు భిన్నంగా ఉంటాయి కనుక ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు కానీ సార్వ జనీనా అంశాలు వారసత్వంగా భావితరాలకు అందించకపోతే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .ఆయా కాలాలకు సంబంధించి నడుస్తున్న చరిత్రను రికార్డు చేయడం నిలువ ఉంచడం పంపిణీ చేయడం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి . ఈ క్రమంలో ఏ మాత్రం తేడా వచ్చినా సామాజిక పెడదొరనులు విస్తృతమవుతున్న నేపథ్యంలో అంధకారమే తప్ప ఆసక్తులు అంతగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది కనుకనే ఈ చీకటిని తరిమి కొట్టడానికి , వెలుతురును అందిపుచ్చుకోవడానికి ,గతంలోని మంచిని వర్తమానంలోనీ ఆసక్తిని పరిశోధనలను భావితరానికి అందించడానికి కృషి జరగవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది అది నడుస్తున్న చరిత్ర యొక్క నడుస్తున్న కాలానికి సంబంధించిన చారిత్రక బాధ్యత.
వర్తమాన కాలానికి సంబంధించి ఈ బాధ్యతను గత వారసత్వాన్ని మనకు అందించిన కొద్దిమంది మహానుభావుల వలన ప్రేరేపించబడి స్ఫూర్తి పొంది ప్రభావితులమై బాధ్యతలను గుర్తించి కర్తవ్యాన్ని సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకుంటున్నాము.
వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి త్యాగం ప్రేమాభిమానాలు మానవ సంబంధాల పటిష్టతకు కృషి చేయడంతో పాటు ఆ వాస్తవము కనుమరుగు కాకూడదని అందులోని నిజాన్ని విప్పి చెప్పడానికి కొంతైన ప్రయత్నం చేస్తున్నా అది ఒక క్రమ పద్ధతిలో జరగకపోవచ్చు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ఏదో ఒక రూపంలో తమకు తెలిసిన విషయాన్ని రేపటి తరం కోసం పంపిణీ చేయడానికి ప్రసారం కావించడానికి ప్రయత్నం గనుక చేస్తే ఆలోచన ఉదయిస్తుంది , త్యాగం మొలకెత్తుతుంది , కర్తవ్యం కలుషితం కాకుండా భవిష్యత్తు కొంతవరకైనా మెరుగైన సమాజం వైపు దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే కదా మనం ఆలోచించేది .
నేటి తరం సామాజిక బాధ్యతను విస్మరించకూడదు:యాంత్రికంగా జీవించడం వేరు ఇతరుల గురించి ఆలోచించి సాధ్యాసాధ్యాలు మంచి చెడుల ఫలితాలు పరిణామాలను విశ్లేషించడం వేరు పుట్టుక నుండి చావు మధ్యన ఉన్న జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకోవడమే నిజమైన జీవితం అవుతుంది . అక్కడ ఏమాత్రం తప్పటడుగు వేసిన, బాధ్యతలను గుర్తించకపోయినా, స్వార్థానికి తలవంచిన , త్యాగాన్ని బాధ్యతను విస్మరించిన అది సమాజానికి చేసిన ద్రో హమే అవుతుంది . నేరం చేయకపోయినా జరుగుతున్న అనర్థాన్ని కల్లా రా చూసి కూడా మౌనంగా ఉండి స్పందించకుండా తన బాధ్యతను విస్మరించే ప్రతి వాళ్లు కూడా నేరస్తులే అనే సామాజిక న్యాయ సూత్రాన్ని ఇక్కడ మన జీవితానికి అన్వయి 0చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది . బుద్ధుని సమానత్వాన్ని అశోకుని అహింసను అక్బర్ పరమత సహనాన్ని భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ , ఉ ద్ధం సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర పోరాట వీరుల చరిత్రను భావి తరానికి మరింత ప్రేరణగా అందించవలసిన అవసరం లేదా ? భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి జాతుల పోరాటాలు , జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉనికి కోసం జరిగిన యుద్ధాలు , నిజాం రాజు దౌస్ట్యా లతో పాటు స్థానిక భూస్వాములు దేశముకులు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అసువులు బాసిన, తమ జీవితాలను పన0 గా పెట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగ ఫలాన్ని ఎలుగెత్తి చాటకపోతే మనం ద్రోహులం కామా? స్వాతంత్రం సాధించిన నుండి నేటి వరకు సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్రాల ఆలంబనగా పాలించిన పాలకులు ప్రజల పక్షాన పనిచేసి తమ జీవితాలను సర్వస్వం ఒడ్డీ చిత్రహింసలు జైలు పాలైనా మొక్కవోని ధైర్యంతో లక్ష్యాన్ని మోస్తున్నటువంటి బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు చేస్తున్న త్యాగం సామాన్యమైనదా ?మార్క్స్ స్టాలిన్ లెనిన్ మావో ఎంగేల్స్ వంటి మహోన్నతుల సామాజిక సమానత్వాన్ని ఆశించే పెట్టుబడి దారి వ్యతిరేక ఆలోచన ప్రాంతం ఏదైనా దేశమేదైనా స్వేచ్ఛ కోసం జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అంతర్జాతీయ పోరాట వీరుడు చేగువేరా భారతదేశంలో జన్మించి బహుజనులు అస్పృశ్యుల కోసం మానవాళి మనుగడ కోసం నిద్దుర లేని రాత్రులు ఎన్నో గడిపి కుటుంబాన్ని పక్కనపెట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల ప్రతినిధిగా జీవించిన విషయాన్ని చెప్పకపోతే ఎలా ? రాజ్యాంగాన్ని రచించడంమే కాదు మహిళలు కార్మికులు సబ్బండ వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ అందరివాడు అని ముద్ర పడిన మహోన్నతుడు అంబేద్కర్ జీవితాన్ని అందించకపోతే ఎంతో నష్టం . సమానత్వం , స్వేచ్ఛ , జ్ఞానం , సామాజిక చైతన్యం కోసం జీవితాలను ధారబోసిన సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే కుటుంబ త్యాగాలు మరిచిపోగలమా? స్వతంత్ర పోరాటంలో అతివాదులతోపాటు మిత వాదులుగా కొనసాగితే గాంధీ ఆ వర్గానికి ప్రతినిధిగా అహింసా పూరితంగా చేసిన పోరాటాన్ని మరిచిపోగలమా? సిద్ధాంతాలు ప్రతిపాదించి చర్చోప చర్చలు చేసి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమయోచితంగా విశ్లేషించి తపన పడ్డవాళ్ళు నాటి నుండి నేటి వరకు ఎందరో ఎందరెందరో!
తమ ఆటపాటల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల బాధ్యతలను గుర్తింపజేసి హక్కులకై పోరాడుతూ పోరాటాన్ని సజీవంగా ఉంచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు సామాజిక కార్యకర్తలు కోవలో 2023 ఆగస్టు 6 తేదీన మరణించిన ప్రజా యుద్ధనౌక భారతదేశంలోనే సామాజిక అవగాహనతో శాస్త్రీయ చింతనతో ప్రజా సమస్యల పైన అలవోకగా పాటలల్లి అంబేద్కర్ భావజాలంలో విప్లవ చైతన్య స్ఫూర్తిని నింపుకొని బహుజన వాదాన్ని కార్మిక కర్షక మహిలా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన గద్దర్ రాసిన పాటలు సృజించిన సాహిత్యం ఆంగ్లభాషలోకి గనుక అనువదించబడితే ప్రపంచ స్థాయి ఉత్తమ సాహితీవేత్తగా గుర్తింపు వచ్చేది అని ప్రముఖ సాహితీవేత్త బహుజన ఉద్యమకారుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యక్తం చేసిన అభిప్రాయం గద్దర్ యొక్క పోరాట స్ఫూర్తికి సామాజిక చైతన్యానికి సజీవ సాక్ష్యం.శ్రీకాకులపో రాటం ,నక్షల్బరి లాంటి ఉద్యమాలలో వేల సంఖ్య లో అమరులు, ప్రస్తుతం ఆయా రంగాలలో కొనసాగుతున్న మహానుభావుల యొక్క జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా సందేశాలుగా విద్యార్థులకు పాఠాలుగా నేర్పించాల్సిన అవసరం చాలా ఉన్నది. అక్కడనే సజీవ ఆలోచన మొలకెత్తుతుంది, సాహిత్యం విచ్చుకుంటుంది , సామాజిక బాధ్యత మొగ్గ తొడుగుతుంది. అది మెరుగైన సమాజ నిర్మాణానికి ఆనవాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకే నేటి తరం తను ఆకలింపు చేసుకున్న అన్ని అంశాలను రేపటి కోసం పంచి పెట్టాలి . రేపటి మెరుగైన సమాజ నిర్మాణానికి అది తప్పనిసరి.
2.మానవ సంబంధాలను పెంపొందించడంలో కుటుంబం,కుటుంబ బంధాల పరిరక్షణలో పురుషులు స్త్రీలు సమాన బాధ్యత వహించి మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేయవలసిన తరుణంలో స్వార్థం, వివక్షత, పెడదో రనుల కారణంగా పురుషుల కంటే స్త్రీలు ముందు వరుసలో ఉండడాన్ని కొంతవరకు మనం గమనించవచ్చు . మనసులు గాయపడినా, ఇబ్బంది అనిపించినా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పటికీ కొన్ని విషయాలు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వరుసలో ముఖ్యంగా కుటుంబ బంధాల విషయంలో వ్యక్తుల మధ్యన పగుళ్లు ఏర్పడడానికి చాలా సందర్భాలలో స్త్రీలే ప్రధాన కారణమని సంఘటనలు సన్నివేశాలు సందర్భాలను గమనించినప్పుడు తేటతెల్లమవుతుంది. కుటుంబ అనుభవాలను ఆధారంగా చేసుకుని, సంఘటనలను సరిచూసుకొని, హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు వాస్తవం, తేడా తేట తెలమవుతుంది . సృష్టిలో జీవితానికి ప్రధానంగా స్త్రీలే ఆధారమని ,అక్కడనే మనిషి కథ ప్రారంభమవుతుందని, కుటుంబ సంతోషానికి సంతాపానికి కూడా స్త్రీలే ముఖ్యమని సినీ రచయితలు కవులు అనేక సందర్భాలలో వర్ణించినవిషయాలను గమనించినప్పుడు ఈ విషయం మరింత స్పష్టమవుతుంది ..పంతాలు పట్టింపులు కయ్యాలు ఘర్షణ సంఘర్షణల విషయంలో ముఖ్యంగా వ్యక్తుల యొక్క వివక్షత బయటపడుతుంది .ఈ క్రమంలో పురుషులు కొంత ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో సర్దుబాటు రీత్యా వ్యవహరించినప్పటికీ స్త్రీలు మాత్రం కచ్చితంగా నిలదేస్తున్న కారణంగా అనేక కుటుంబాల మధ్యన చిచ్చు, గాయాలు చెల రేగుతున్న విషయాన్ని మనం నిత్యజీవితంలో గమనించవచ్చును.
తన తల్లిదండ్రులు ఒక రీతిగా అత్తమామలను మరొక రీతిగా చూడడంలోనే స్త్రీ యొక్క వివక్షత, ఒంటెద్దు పోకడ, స్వార్థము, అహంకారము, సాధింపులు మనకు స్పష్టమవుతున్నా యి. తన తల్లి తన పుట్టింటిలో అన్నదమ్ముల వదినల చేతిలో అన్యాయానికి గురవుతున్నట్లు , ఆకలి దప్పులతో అలమటిస్తున్నట్లు, నిరాదరణ కారణంగా కుమిలిపోతున్నట్లు ఆవేదన చెందే ఇల్లాలు తన ఇంట్లో తన సమక్షంలో తన ఆధీనంలో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను చూసుకునే విషయంలో ఎంతో తేడాను కనబరుస్తుంటారు. అంతేకాదు తన పుట్టిన ఇంటి నుండి తెచ్చి పెట్టినట్టుగా
అత్తమామల పట్ల సాచివేత వైఖరిని అవలంబించి, మానసికంగా కృంగదీసి , అవమానం పాలు చేస్తున్న సందర్భాలను మనం కోకోలలుగా గమనించవచ్చు . ఈ రకమైన వ్యత్యాసానికి కారణం ఏమిటి? రెండు సందర్భాలు ఒకటే అయినప్పుడు ఒక రి 0ట తన వాళ్లు కష్టపడుతున్నారని ఆరాటపడడం ఎందుకు? తన అత్తమామలను దానధర్మానికి పెంచి పోషిస్తున్నట్లుగా , చులకనగా చూడడం ఎందుకు ? ఇది కొంతమంది తెగించిన మహిళల యొక్క వికృత దుర్నీతి కాదా ?తన తల్లి గారి పక్షం వాళ్లు త నకు నచ్చిన వాళ్ళు ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వానించి, బంధువులుగా గుర్తించి, ఆదరించి ఆత్మీయంగా పలకరించే ధోరణినితో ప్రేమపంచుతుంది. కుటుంబానికి ఉమ్మడిగా బంధువులు అయినటువంటి వారు వచ్చిన సందర్భంలో వారిని బంధువులుగా చూడకుండా, అపరిచితులుగా భావించి, భర్త తరపు వాళ్లుగా రెండవ శ్రేణిగా గుర్తించి, నిరాదరించి అవమానించి సాగనంపిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. అంతెందుకు తన ఇంట్లో తల్లి తండ్రులు అత్తమామలు ఏకకాలంలో ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు గమనిస్తే తల్లిదండ్రుల పైన అమిత ప్రేమను ధారవోసి, అత్తమామల పట్ల కనీస మైన ప్రవర్తన కనబరచకుండా ఉండే పాశవిక నైజాన్ని తత్వాన్ని మీరు, మనం ఎన్ని సందర్భాలలో చూడలేదు ? వ్యక్తులు ఎవరనేది కాదు,ఈ యిo ట జరిగింది అనేది కూడా ముఖ్యం కాదు, కానీ దాదాపుగా ప్రతి ఇంట జరుగుతున్న ఈ దుష్ట దౌర్భాగ్య ధ మన నీతిని ఖండించవలసిన అవసరం లేదా? సుమారుగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ ఆధిపత్యం అధికారికంగా చట్టబద్ధతను సంతరించుకున్న సందర్భంలో…… కుటుంబ గౌరవాన్ని కాపాడే క్రమంలో యజమానిగా పురుషుడు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించి, ఆడవాళ్ళ నోటికి భయపడి, ఘర్షణ వైఖరి తలెత్తకుండా జాగ్రత్త పడుతున్న సందర్భాన్ని బలహీనతగా భావిస్తున్నది నిజం కాదా? కుటుంబంలో జరిగే శుభ కార్యక్రమాలు లేదా ఆశుభ కార్యక్రమాల సందర్భంగా తీసుకునే నిర్ణయాలు, కట్నకానుకలు, గౌరవ మర్యాదలు యి చ్చిపుచ్చుకోవడానికి అన్నింట కూడా స్త్రీలు వివక్షతగా వ్యవహరించడం , పురుషుల ప్రమేయం లేకుండా ఏక వ్యక్తి పాలన లాగా నిర్ణయాలు తీసుకోవడం, దానికి తన తల్లి గారి ఇంటి వాళ్ళు ఆజ్యం పోయడం మన అనుభవములోనిదే .కుటుంబ సంక్షేమం అభివృద్ధి ఇతరత్రా సందర్భాలు సన్నివేశాలు సమస్యల పరిష్కార విషయంలో కుటుంబానికి సహకరించినటువంటి వాళ్లను పక్కనపెట్టి వారిని గుర్తించకుండా మొక్కుబడిగా కేవలం అన్నదమ్ములను తల్లిదండ్రులు, ఆ తరపు వారిని ఆకాశానికి ఎత్తి పీటలపై కూర్చుండబెట్టి లేనిపోని అబూత కల్పనలు కల్పించి క్షణములోనే ఘర్షణలు సృష్టించి కార్చి చ్చు లాగా తయారు చేసే విషయం మనందరికీ తెలియనిదా !
తన తల్లి గారి ఇంటి తరఫున ఏదైనా అశుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు అన్ని రకాలుగా గౌరవించాలని, నకానుకలు సమర్పించాలని, విందులు వినోదాలలో భాగస్వామి కావాలని కోరుకునే ఒక ఇంటి ఇల్లాలు తన అత్తమామల పక్షాన జరిగినటువంటి శుభ అశుభ కార్యక్రమాలలో కనీసం తన తల్లి గారి ఇంటి పక్షాన భాగస్వామ్యం లేకపోయినా, పలకరించకపోయినా, పరామర్శించకపోయినా ఇది ఎట్లా ?అని ప్రశ్నించకుండా సమర్థించే ధోరణిని ఎలా చూడాలి? ఇన్ని రకాలుగా స్త్రీ వివక్షత పద్ధతిలో తన నిత్య జీవితంలో వ్యవహరిస్తూ అనేక ఉత్పత్తి కుటుంబాలలో కూడా ఉత్పత్తికి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు సైతం యజమాని కష్టాన్ని కన్నీటిని త్యాగాలను కూడా గుర్తించకుండా ఒంటెద్దు పోకడగా వ్యవహరించడం దిక్కుమాలిన పని కాక మరి ఏమవుతుంది ? ఇలాంటి సందర్భంలో తన కూతురు తమను సమర్తిo చి తమ పక్షాన మాట్లాడినటువంటి విషయాల్లో విజ్ఞత గల తల్లిదండ్రులు తమ కూతురు చూపే వివక్షతను గుర్తించి మందలించవలసిన అవసరం ఉంది .కానీ అనేక కుటుంబాలలో సందర్భాలలో ఆ రకమైనటువంటి వారింపు చేయకపోగా కూతురు ఇష్టా ఇష్టాలను, ఆలోచన సరళిని , ఏకపక్ష విధానాలను సమర్థించే ప్రయత్నం చేయడం వల్ల రోజురోజుకు కుటుంబ బంధాలు నిర్వీర్యమై , అవమానకరమై ,ఆదిపత్యానికి చిరునామాగా మారుతున్న సందర్భాలను మందలించవలసినది ఎవరు ?మార్చవలసినది ఎవరు? ప్రేమానురాగాలకు చిరునామాగా ఆత్మీయత అనురాగాలకు నిలయంగా కక్షలు కార్పన్యాలు ఘర్షణ సంఘర్షణలు లేకుండా గృహమేకదా స్వర్గసీమ అనే విధంగా దిద్దుకోవల్సిన మన ఇంటిని తీర్చిదిద్దుకోవలసిన అవసరం లేదా? ఘర్షణలు లేనిపోని కయ్యాలను సృష్టించి, అసమానతలు అంతరాలను రంగరించి, చిన్న చూపు చూసే విధానం లో అక్కడక్కడ పురుషుల పాత్ర కూడా లేకపోలేదు కానీ పెద్ద మొత్తంలో స్త్రీలు ఈ విషయంలో పోటీ పడుతూ తమ హుందాతనాన్ని విశాల హృదయాన్ని మానవత్వాన్ని చంపుకొని ఘర్షణకు దిగుతున్న కారణంగా అనాదిగా మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి భంగం జరుగుతున్న విషయం నిజం కాదా? ఇప్పటికైనా మహిళా లోకం హేతుబద్ధంగా ఆలోచించి నిజాల నీ గ్గు తేల్చాలి .తమ పొరపాటు ఉంటే సవరించుకోవాలి, పురుషుల భాగస్వామ్యంలో గతి తప్పితే మార్చుకోవడానికి సిద్ధపడాలి. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కుటుంబం బజారు పాలు కావడానికి ప్రధాన భూమిక పోషిస్తున్న విధంగా వీధికేక్కుతున్న మహిళలోకం తమ పాత్రను తగ్గించుకుంటే మంచిది. మంచి విషయంలో పోటీ పడదాం! ప్రేమానురాగాలను పెంపొందించడంలో ఆరాటపడదాం! కుటుంబ బంధాల బలోపేతానికి కృషి చేద్దాం! మానవ సంబంధాలు మసకబారి పోకుండా నిరంతరం ఉమ్మడిగా ప్రయత్నం చేద్దాం! కానీ తోటి మనిషిని సాటి మనిషిగా చూడకుండా కట్టుకున్న భర్తనే పక్కన పెట్టే దుష్ట సంప్రదాయానికి నేడే చర మగీతం పాడాలి! మహిళా లోకం తమ మానవతా ధోరణి సమీక్షించుకోవాలి .లొసుగులు లోపాలు ఉంటే సవరించుకుంటే మంచిది . ఆత్మీయతకు అనురాగానికి నిలయమైన స్త్రీలు ఘర్షణలకు వివక్షతకు తావివ్వకూడదనేదే విమర్శకు బలి కాకూడదనేదే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం. “కలిసి పోదాం, కలిసి ఉందాం, పదిమందిని కలుపుకుందాం. .ఇంతకు మించిన మానవతా నినాదం మరొకటి లేదు.

- Advertisement -

డాక్టర్ . రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News