Monday, June 24, 2024
Homeఓపన్ పేజ్New governance: సరికొత్త పాలనకు అవకాశం ఉందా?

New governance: సరికొత్త పాలనకు అవకాశం ఉందా?

ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికీ కౌటిల్యుడి అర్థ శాస్త్రానే అనుసరిస్తుంటాయి. రాజకీయాల గురించి, ఆర్థిక వ్యవహా రాల గురించే కాక, యుద్ధ నీతి గురించి, ధర్మ పాలన గురించి విపులంగా తెలియజేసిన అర్థశాస్త్రాన్ని అనేక దేశాలు తమ భాష ల్లోకి అనువాదం చేసుకోవడం జరిగింది. నిజానికి ఈ గ్రంథం అనే క ఆసియా దేశాల్లో, గ్రీస్‌ దేశంలో ప్రామాణికంగా ఉంటూ వస్తోం ది. ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికలను, కేంద్రంలో కొత్త ప్రభు త్వం ఏర్పడడాన్ని దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం కూడా ఇదే అర్థ శాస్త్రాన్ని మరింత నిష్ఠగా అనుసరించాల్సిన అవసరం కనిపిస్తోంది. “ధర్మమనేది అన్ని రకాల సుఖసంతోషాలకు పునాది లాంటిది. ప్రజల జీవితం ఆనందదాయకంగా సాగిపోవడానికి ఎవరైనా ఈ మార్గాన్ని అనుసరించక తప్పదు. ధర్మానికి పునాది వేసేది, మూలంగా ఉన్నది సమర్థవంతమైన, సంతృప్తికరమైన పాలన, పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ, ఆత్మ సంయమనం, వినయం, సమభావం వంటి అంశాలు” అని కౌటిల్యుడి, అంటే చాణక్యుడి అర్థ శాస్త్రం వందల సంవత్సరాల క్రితమే దిశానిర్దేశం చేసింది. ఏ పాలకుడైనా ఈ అంశాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉన్న ప్పుడే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది.
చంద్రగుప్త మౌర్యుడికి సలహాదారుగా, గురువుగా, మార్గ దర్శిగా వ్యవహరించిన కౌటిల్యుడు చంద్ర గుప్తుడికి రాజకీయ, యుద్ధ వ్యూహాలను రూపొందించి ఆయన అద్భుతమైన, చరిత్రా త్మకమైన పాలన అందివ్వడానికి దోహదం చేశాడు. కౌటిల్యుడు రచించిన అర్థ శాస్త్రం కూడా రాజకీయాలు, పాలనా కళ, యుద్ధం, దౌత్యం వంటి అంశాలకు సంబంధించి అనేక రహస్యాలను, మెళకువలను, కిటుకలను వెల్లడించింది. ఆయన తమ రాజును చక్రవర్తిగా చూడాలని ఆకాంక్షించారు. తమ రాజుకు ఏవి మిత్ర దేశాల్లో, ఏవి శత్రు దేశాల్లో ఆయన బాగా లోతుగా విశ్లేషించారు. ఆయన ప్రోద్బలంతో చంద్రగుప్తుడు కొందరు శత్రు రాజులతో ఒప్పందాలు కుదర్చుకున్నారు. సమయం, సందర్భం కలిసి వచ్చినప్పుడు వాటిని ఉల్లంఘించారు. ఆయనకు సంబంధించిన రహస్య గూఢచారులు కొందరు రాజులను హతమార్చారు. శత్రు రాజుల మధ్య విభేదాలు సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. “యుద్ధాలలో బహిరంగ యుద్ధాలుంటాయి. కనిపించని యుద్ధా లుంటాయి. మౌన యుద్ధాలు కూడా ఉంటాయి” అని కౌటిల్యుడు తన అర్థ శాస్త్రంలో రాశారు. ఆయన తమ సైనికుల్లో ఆత్మవిశ్వా సాన్ని పెంపొందించడానికి మతాన్ని, మూఢ నమ్మకాలను వీలై నంతగా ఉపయోగించుకున్నారు. శత్రు సైనికుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి కూడా ఇవే అస్త్రాలను ఉపయోగించారు. శత్రు రాజుల మీద కనీ వినీ ఎరుగని రీతిలో దుష్ప్రచారం సాగించారు. పుకార్లు పుట్టించారు.
మారుతున్న తీరుతెన్నులు
చంద్రగుప్తుడి వద్ద ఆరు లక్షల కాల్బలం ఉండేది. ఆరు వేల అశ్విక దళం, ఎనిమిది వేల రథాలు, తొమ్మిది వేల ఏనుగులు ఉండేవని చరిత్రకారులు రాశారు. చంద్రగుప్తుడు నంద రాజుల్ని ఘోరంగా ఓడించాడు. గ్రీకుల్ని అడ్డుకున్నాడు. సెల్యూకస్‌తో ఒప్పందం కుదర్చుకున్నాడు. ఆ సమయంలో పాటలీపుత్రం ప్రపం చంలోనే అతి పెద్ద నగరంగా ఉండేదని చరిత్రకారులు పేర్కొ న్నారు. ఎనిమిది మైళ్ల పొడవు, ఒకటిన్నర మైళ్ల వెడల్పు, 570 బురుజులు, 64 ద్వారాలు, 600 అడుగుల వెడల్లు, 45 అడుగుల లోతు ఉన్న కందకాలతో ఈ రాజధాని నగరం ఒక వెలుగు వెలి గింది. నంద రాజులు పరమ క్రూరులు. ఈ రాజుల్ని మిగిలిన రాజు లే కాక, ప్రజలు సైతం ద్వేషించారు. ఈ నంద రాజుల్ని శత్రు శేషం లేకుండా హతమార్చడానికి అనేక మంది రాజులు భారతదేశ సరిహద్దుల్లో అహర్నిశలూ నిరీక్షిస్తుండేవారు. ఇటు వంటి పరిస్థితుల్లో కౌటిల్యుడు కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిం ది. కర్మను, విధి రాతను నమ్మడం, మూఢ నమ్మకాల మీద ఆధార పడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కావని కౌటిల్యుడు భావించే వాడు.
కౌటిల్యుడు రాజకీయాలకు మతాన్ని బాగా దూరంగా ఉంచాడు. రాజకీయ శాస్త్రం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవారే సమర్థమైన పాలన అందించగలుగుతారని, దేశ, విదేశాలను ఆకట్టు కోగలుగుతారని కౌటిల్యుడు చెప్పేవాడు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పాలించేవారు, నిందితులకు, నేరస్థులకు సకా లంలో సరైన శిక్ష విధించే వారు, చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేసే వారు, ప్రజలను కాపాడేవారు ఆ దేశాన్నే కాక, ప్రపం చాన్ని సైతం కాపాడగలుగుతారని ఆయన తెలిపాడు. కేవలం ధర్మప్రవర్తన వల్లే ఏ పాలకుడైనా చరిత్రలో మిగిలిపోతాడని, ఒక మహోన్నత వ్యక్తిగా ప్రపంచ దేశాల ప్రజలతో ప్రశంసలు పొం దడం జరుగుతుందని ఆయన చెప్పాడు. ఏ దేశమైనా, ఏ ప్రభుత్వ మైనా తమ దేశ ఆర్థిక, రాజకీయ, సైనిక అవసరాలకు తగ్గట్టుగా నడుచు కుంటాయని కూడా ఆయన చెప్పాడు.
ఆధునిక పరిపాలన
హిందూ మతంలో ధర్మార్థ కామ మోక్షాలనేవి అత్యంత కీలకమైన అంశాలు. ఇందులో అర్థ అనేది ఆర్థిక ప్రగతికి, సంపద సృష్టికి సంబంధించినది. అదే విధంగా విజ్ఞానానికి సంబంధించి కూడా నాలుగు విభాగాలు ఉన్నాయి. వేదాలు, తార్కిక విజ్ఞానం, ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాలు. పాలనకు సంబంధించిన ఏ వ్యవ హారమైనా ఈ నాలుగింటి చుట్టూ తిరుగుతుంటుంది. పాలకులు తమ విధులేమిటన్నది స్పష్టంగా గుర్తించగలగాలి. సమర్థులైన సలహాదార్లను ఎంచుకోవడం, ప్రభుత్వ విభాగాల మీద పట్టు సాధించడం, పేదల అభ్యున్నతి మీద దృష్టి పెట్టడం, ప్రజల్లో అసం తృప్తి తలెత్తకుండా చూడడం, న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వడం, చట్టాలు సరిగ్గా అమల య్యేలా చూడడం వంటివి పాలనలో కీలకమైనవి. ఇక పన్నుల వ్యవస్థ, కుటుంబ సంబంధాలు, అడవుల సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, గనులు, కర్మాగారాలు, రహస్య విభాగాలు, సమాచార సేకరణ, యుద్ధనీతి, దౌత్యం, విదేశాంగ విధానం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కౌటిల్యుడి అర్థ శాస్త్రం ఈ అంశాలనన్నిటినీ కూలం కషంగా చర్చించింది.
ఏదైనా రాజ్యం లేదా దేశం సుభిక్షంగా ఉండాలన్న పక్షంలో ప్రజల మానప్రాణాలకు, ప్రజల ఆస్తి పాస్తులకు పూర్తి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. సేద్యం చేయని సంపన్నుల వ్యవసాయ భూములను భూమిలేని పేదవారికి అప్పగించి వారితో వ్యవసా యాన్ని చేయించడం మంచిది. ఉత్పా తాలు, వైపరీత్యాల వల్ల దేశ ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా తప్పకుండా వంతెనలు, ఆన కట్టల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. పాలకులు తర తమ బేధం లేకుండా, నిస్వార్థంగా, నిరాడంబరంగా, ఫలాపేక్ష లేకుండా ఒక రాజర్షి వ్యవహరించాలి. సరైన పాలన అందించలేని పక్షంలో బలవంతులు బలహీనుల్ని కబళిస్తారు. సమర్థవంతమైన పాలన ఉన్న పక్షంలో బలహీనులు బలవంతుల్ని నిలువరించ గలుగుతారు. ఆయన రాసిన అర్థశాస్త్రం అప్పటికీ, ఇప్పటికీ పాలనకు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.
చంద్రగుప్త మౌర్యుడే కాకుండా మౌర్య వంశపు రాజులం దరూ దేశాన్ని అద్భుతంగా, సమర్థ వంతంగా పాలించారని చరిత్ర చెబుతోంది. ఎక్కువ మంది చంద్రవంశపు మౌర్య రాజులు కౌటి ల్యుడి ఆర్థిక, రాజకీయ, సామాజిక సిద్ధాంతాలనే అనుసరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజులంతా అంతఃకలహాలతో, వీర శౌర్య ప్రతాపాల ప్రదర్శనతో నాశనం అయిపోయారు. ఆ తర్వాతి కాలపు రాజులు కౌటిల్యుడి అర్థశాస్త్రానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పరాజయాల పాలవుతూ వచ్చారు. ఇందులో ఒక్క రాజు కూడా చరిత్ర సృష్టించలేకపోయారు. పాలనకు సంబం ధించి కౌటిల్యుడి సలహాలు, సూచనలను విస్మరించిన పాలకు లంతా ఏదో విధంగా దెబ్బతినడం జరిగింది.

– ఎస్‌. రాఘవేంద్ర రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News