Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్3rd front: కాంగ్రెస్‌తోనే అసలు పేచీ

3rd front: కాంగ్రెస్‌తోనే అసలు పేచీ

ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రతిపక్షాలు సమావేశమైనప్పుడు జనతా దళ్‌ (యు) నాయకుడు, బీహార్‌ ముఖ్యమంత్రి అయిన నితీశ్‌కుమార్‌, ఎన్‌.సి.పి నాయకుడు శరద్‌ పవార్‌లు ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదర్చే ప్రయత్నం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటి మీద నిలబడడానికి గత రెండు మూడు రోజుల కాలంలో రెండుసార్లు ప్రతిపక్ష నాయకులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల సమయంలో కాంగైన్‌ అధినేత రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకులలో ఒకింత విసుగు, నిరాసక్తత వ్యక్తం అయ్యాయి. మొత్తం మీద, ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహించడానికి, ఆ పార్టీకి ప్రచార బాధ్యత అప్పగించడానికి, ఆపార్టీకి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి ప్రతిపక్షాలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదన్నది ఈ సమావేశాల సందర్భంగా స్పష్టంగా తేలిపోయింది.

- Advertisement -

ప్రతిపక్షాల మధ్య ఏదో విధంగా ఐక్యతను, సయోధ్యను సాధించడానికి నితీశ్‌ కుమార్‌ ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చారు. ఆయన ఆర్‌.జె.డి నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కాంగగైన్‌ నాయకులు మల్లికార్డున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌, వామపక్ష నాయకులు సీతారామ్‌యేచూరి, డి, రాజాలతో ఆయన సుదీర్ధంగా చర్చలు జరిపారు. నితీశ్‌ కుమార్‌ ఢిల్లీ వచ్చి వెళ్లగానే శరద్‌ పవార్‌ ఢిల్లీ వచ్చి, కాంగ్రెస్ నాయకత్వంతో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులు ఎటువంటి పరిస్థితులలోనూ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని స్వీకరించడానికి మాత్రం సేమిరా అంటున్నారు. ఫలితంగా ఈ సమావేశాలు కూడా స్తంభించిపోతున్నాయే తప్ప లక్ష్య సాధనలో ఒక్కఅడుగు కూడా ముందుకు పడడం లేదు. సావర్కర్‌ మీద వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయడం తగ్గించుకోవాలని, ఈ వ్యాఖ్యల వల్ల మహారాష్ట్రలో ఐక్యతా ప్రయత్నాలు విజయవంతం కావడం లేదని శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి నచ్చజెప్పడం జరిగింది.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ అంటే పడని ప్రతిపక్ష నాయకులతో, ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరపడానికి నితీశ్‌ కుమార్‌ ముందుకు వచ్చారు. నిజానికి కాంగ్రెస్‌ను కలుపుకునిపోయే విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కె, చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలోని బి.ఆర్‌.ఎస్‌, మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగగైస్‌, కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించలేకపోతున్నాయి. కాం!గైస్‌ లేకుండా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని ఈ పార్టీలు పట్టుబడుతున్నాయి. మిగిలిన పార్టీలు ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నాయి. కాగా, ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నాయి.

ఎన్నికల లోగా ఈ పార్టీలన్నిటినీ ఒప్పించి బీజేపీయేతర ప్రంట్‌ను ఏర్పాటు చేయడానికి తాను కృషిచేస్తానని, ఎన్నికల అనంతరం కూడా ఈ కూటమి కొనసాగేలా తాను ప్రయత్నిస్తానని నితీశ్‌ కుమార్‌ కాంగైస్‌ పార్టీ నాయకత్వానికి అభయమిచ్చారు. ఎటువంటి బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటెనా, చివరికి అది కాంగ్రెస్‌ చేతికి వెళ్లే అవకాశం ఉందని, కాంగగైన్‌ను దూరం పెట్టడం అనేది జరిగే పని కాదని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నిశ్చితాభిప్రాయంతోనే అవి మొదటి నుంచి ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, బీజేపీయేతర ఫ్రంట్‌కు ఇప్పుడు ఎవరో ఒకరు నాయకుడుగా ఉండాల్సిన అవసరం లేదని, ఎన్నికల అనంతరం ఆ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని సీతారామ్‌ యేచూరి భావిస్తున్నారు. 1996లో నేషనల్‌ |ఫ్రంట్‌, 2004లో యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ ఎన్నికల తర్వాతే ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాల ఐక్యత అనేది రాష్ట్ర ప్రాధాన్యంతో ఏర్పడాలని, జాతీయ స్టాయిలో సీట్ల పంపిణీ గురించి ఇప్పటి నుంచే చర్చలు జరపడం వల్ల ప్రయోజనం లేదని ఆయన సూచించారు.

సీతారామ్‌ యేచూరి, శరద్‌ పవార్‌, నితీశ్‌ కుమార్‌లు మాత్రమే ఐక్యతా ప్రయత్నాలు చేయడాన్ని బట్టి, ప్రతిపక్షాలు ఏ ఒక్క పార్టీ మీదా కాంగ్రెస్‌ ప్రభావం ఏమీ లేదనే సంగతి తేలిపోతోంది. ఒక పక్క ప్రతిప క్షాలను ఒప్పిస్తూనే, కాంగ్రెస్‌ను నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది, కాంగ్రెన్‌ నాయకులు,
ముఖ్యంగా రాహుల్‌ గాంధీ బీజేపీ మీదా, ఇతర పార్టీల మీదా, ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల మీదా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకుండా నిరోధించాలని ఈ నాయక త్రయం భావిస్తోంది. ప్రాంతీయ పార్టీల నాయకులకు కూడా కాంగ్రెస్‌ విషయంలో గట్టి అభయం ఇవ్వడానికి ఈ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోనే ఉన్న సీతారామ్‌ యేచూరి, తరచూ ఢిల్లీ వస్తున్న పవార్‌, నితీశ్‌లు ప్రతిపక్షాల ఐక్యతకు గట్టి ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మాత్రం గణనీయంగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News