అతను పుట్టకుండా ఉండి ఉంటే ఈ మాట ఊహించడానికే కష్టం. జాతి మొత్తం ఎక్కువలు, తక్కువలతోని నిండిపోయేది. బానిసత్వం అట్లానే ఉండిపోయేది. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారకుండాపోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు మనుషుల్లా బ్రతికే అవకాశమే లేకుం డాపోయేది. కుల, మత భేదాలు లేని జాతి కోసం జీవితాంతం పోరాడిన గొప్పవాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
చదువుకోవాలంటే కులం అడ్డమొచ్చింది. మంచినీరు త్రాగాలి అంటే జాతి అడ్డు పడ్డది. పనులు చేసే కాడ దండం పెట్టుడు కాడ, ఇది గది అని లేదు, అన్ని జాగల్లా అప్పట్లా తక్కువ కులపోళ్ళకు కులమే నరకం చూపించే టిది. 1891 ఏప్రిల్ 14న తక్కువ కులంగా ముద్రపడిన మహర్ కులంలో పుట్టిననాడు అంబేద్కర్. మిగతావాళ్ల లెక్కనే అంబేద్కర్ కూడా చిన్న వయసు లోనే మస్తు బాధలు పడ్డాడు. అయితే అందరిలెక్క అంబేద్కర్ బెదిరిపొలేదు. తన లెక్క ఎవరు బాధ పడొద్దని, తక్కువ కులంలో పుట్టెటోళ్ళ భవిష్యత్ మంచిగా ఉండాలని ఆలోచించాడు. ముంబైలోని హెల్ఫిన్ స్టోన్ హైస్కూల్ లో చదివినప్పుడు, కుల పిచ్చి ఎట్లుందో అంబేద్కర్‌కి అర్థమైంది. అంటరాని కులంలో పుట్టినటువంటి అంబేద్కర్‌ని క్లాస్ రూమ్‌లోకి కూడా రానియ్యాలే. బయటనే ఉండి పాఠాలు విన్న అంబేద్కర్, చదువులో ఎప్పుడూ టాపర్‌గా వచ్చేటోడు. 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిండు. 1912లో ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‍లో డిగ్రీ పట్టా పొందినాడు. తర్వాత బరోడా రాజు సంస్థానంలో ఏడాదిపాటు గుమస్తాగిరి చేసిండు. అప్పుడు అంబేద్కర్ సత్తా ఏందో జనాలకు తెలిసొచ్చింది. అంబే ద్కర్ మస్తు తెలివైనవాడని బరోడా రాజు గుర్తుపట్టి పై చదువుల కోసం అమె రికాకు పంపించిండు. అట్ల కొలంబియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిండు అంబేద్కర్. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‍లో చేరి చదువుకున్నాడు. 1921, 1923ల రెండు డాక్టరేట్లు పొందినాడు. నాలుగు పీహెచ్‌డీ డాక్టరేట్లు సంపాదించిన గొప్పవాడిగా అంబేద్కర్ పేరు సంపాదిం చుకున్నాడు. 1926ల లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టినాడు అంబేద్కర్. అప్పుడే అంటరానితనం మీద మొదటిసారి పిడికిలి బిగించిండు. బహిష్క ృత హితకారిణి సభ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతి కోసం కష్టపడిండు. అట్టడుగు వర్గాలకు చదువే ఆయుధమని ప్రచారం చేసిండు అంబేద్కర్. అంటరాని కులస్తులుగా ముద్రపడిన వాళ్లందరినీ గుళ్లలోకి తీసుకుపోయిండు. వాళ్ల మీద ఉన్న నిషేధాన్ని ఎదిరించి చెరువులల్లో మంచినీళ్లు త్రాగేటట్టు చేసిండు. కులం జులుం మీద తిరగబడ్డాడు అంబేద్కర్. 1936ల ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసిండు అంబేద్కర్. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీలో చేరి దళితుల గొంతుక వినిపించాడు. తక్కువ కులం వాళ్ళకు ప్రత్యే క నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టిండు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేసిండు. అదే టైంలో దేశానికి దశ దిశ చూపేందుకు రాజ్యాంగ రచన బాధ్యతలు తీసుకున్నాడు. రాజ్యాంగం రాసిన కమిటీకి చైర్మన్‌గా పనిచేసిండు అంబేద్కర్. బడుగుల బతుకులు మార్చేందుకు ఉద్యో గాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చినాడు. భారత రాజ్యాంగం ఇంత మంచిగా ఉంది అంటే దానికి అంబేద్కర్ తెలివితేటలే కారణమని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.
కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ బౌద్ధమతం తీసుకున్నాడు అంబేద్కర్. బడుగులు, అణగతొక్కబడిన వాళ్లందరి బ్రతుకులు మార్చేందుకు జీవితాం తం పోరాటం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న కన్నుమూశాడు.
తాను తీసుకువచ్చిన చైతన్యాన్ని వీలైనంత ముందుకు తీసుకు పొండి, చేతకాకపోతే అక్కడే వదిలేయండి, అంతేగానీ వెనుకకు మాత్రం తీసుకు పోవద్దని అంబేద్కర్ చెప్పినాడు.
అట్ల అంబేద్కర్ నింపిన చైతన్యం నేడు కోట్లాదిమందిలో ప్రవహిస్తూనే ఉంది. అది బహుజన రాజ్యాధికారం సాధించేదాకా కొనసాగుతుంది.
గుండమల్ల సతీష్‌కుమార్
సంస్థాన్ నారాయణపురం

