అమెరికాలో ఇటీవల గన్ కల్చర్ పెరుగుతోంది. తాజాగా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్ ప్రాంతంలోని ఒక బ్యాంకు దగ్గర తుపాకీ పేలింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడిపై బ్యాంకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.అగ్రరాజ్యంలో జనాభా కంటే తుపాకులే ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపో ర్టులు చెబుతున్నాయి.పేరుకు అగ్రరాజ్యమైనా అమెరికాలో ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. గడపదాటి బయటికెళితే మళ్లీ ఇంటికెళ్లే వరకూ భయంభయంగానే గడుపుతుం టారు. ఏ క్షణాన ఎవరు ఢాంఢాం అంటూ కాల్పులు జరు పుతారోనని భయపడుతూనే ఉంటారు. ఇదంతా పెరుగు తోన్న గన్ కల్చర్ ప్రభావం. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో లాస్‌ఏంజిల్స్‌లోని మాంటెరీ పార్క్ సంఘటన మరవకముందే ఫిబ్రవరిలో మిచిగన్ యూని వర్శిటీలో కాల్పులు జరిగాయి. చిన్నారులు చదువుకునే స్కూళ్లను కూడా ఉన్మాదులు వదలడం లేదు. పిల్లల్ని కూడా తమ పైశాచికత్వానికి బలితీసుకుంటున్నారు. 2012 డిసెంబర్ 14న కనెక్టికట్ న్యూటౌన్ లోని పాఠశాలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు.వీరిలో 20మంది చిన్నారులు కాగా ఆరుగురు పాఠశాల సిబ్బంది. ఈ సంఘటనతో అమెరికా స్కూళ్లలో పిల్లలకు సెక్యూరిటీ లేదన్నే విమర్శలు వచ్చాయి. 2018 ఫిబ్రవరి 14న ఫ్లోరిడా లోని డగ్లస్ హైస్కూల్లో నికోలస్ క్రజ్ అనే పంథొమ్మిదేళ్ల కుర్రాడు జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడ్డ నికోలస్ క్రజ్ ఇదే స్కూలు పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆ తరువాత ఇలాంటి సంఘట నలే మరికొన్ని జరిగాయి. 2022 మే 24న లో టెక్సాస్ స్కూల్లో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో 21 మంది చని పోయారు. వీరిలో 19 మంది చిన్నారులున్నారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డే ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది. ఇటీవల లాస్ ఏంజెల్స్ లోని మాంటేరీ పార్క్ లో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారు. లూనార్ కొత్త సంవత్సర వేడుకల్లో ఈ హింస చెలరేగింది. మాంటెరీ పార్కులో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన సమయంలో మాంటెరీ పార్కులో వేలమంది జనం ఉన్నారు. మాంటెరీ పార్కు సంఘటన మరవకముందే తాజాగా మిచిగాన్ యూనివర్శిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు చని పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. కాల్పులు జరి గిన మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
1775 నుంచి అమెరికాలో గన్ కల్చర్
అమెరికాలో గన్ కల్చర్ కొత్త విషయం కాదు. అగ్ర రాజ్యంలో తుపాకుల సంస్కృతి పాతదే. 1775 నుంచి అమెరికా సంస్కృతిలో తుపాకులు భాగమయ్యాయి. ఆఫ్రో – అమెరికన్లను బానిసలుగా పెట్టుకోవాలనే ఉద్దేశం తో అగ్రరాజ్యంలోతుపాకుల వాడకం మొదలైంది. కాలక్ర మంలో తుపాకీ కలిగి ఉండటం అనేది ఒక ప్రిస్టేజ్ సింబల్ గా మారింది. తొలిరోజుల్లో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. ఆత్మరక్షణ అనే సాకును చూపిస్తూ అమెరికన్లు తుపాకులను ఎడాపెడా కొంటున్నారు. గత ఇరవై ఏళ్లలో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు ఒక అంచనా. ఇంట్లో తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే వైఖరి అమెరికా సమాజంలో పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొను గోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ వైఖరి చివరకు గన్ కల్చర్‌కు దారి తీసింది.
ఏడాదికి రెండు కోట్ల తుపాకుల అమ్మకాలు
అమెరికాలో ఏడాదికి దాదాపు రెండు కోట్ల తుపా కులు అమ్ముడవుతున్నాయంటే గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తుపాకులు కొనేవాళ్లలో 40 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా తుపాకుల అమ్మకాలు పెరిగాయి. గన్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం లైసెన్స్ సుల భంగా దొరకడమే. తుపాకి కొనుక్కోవాలంటే లైసెన్స్ తప్ప నిసరి. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు లేకపో లేదు. అయితే నిబంధనలు అంటూ ఉన్నా అవన్నీ తూతూ మంత్రంలాంటివే. దీంతో ఏడాదికేడాది తుపాకులు కొనే వారి సంఖ్య పెరుగుతోంది. గన్ కల్చర్‌కు ఇప్పటివరకు వేలాది మంది బలయ్యారు. 2020లో తుపాకీ హింసకు 19,350 మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో పెద్ద ఎత్తున తుపాకుల వ్యాపారం సాగు తోంది. మిగతా దేశాల్లో మార్కెట్‌కు వెళ్లి నిత్యావసర వస్తు వులు కొన్నట్లు అమెరికాలో తుపాకులు కొంటుంటారు. కేవలం వంద డాలర్ల పెడితే మార్కెట్‌లో గన్ను దొరుకు తోంది. అమెరికాలో దాదాపుగా ప్రతి వ్యక్తి దగ్గర తుపాకీ ఉంటుంది.వందమంది పౌరులుంటే నూట ఇరవై తుపాకు లుంటాయి. ఎవ్రీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ అనే సంస్థ పెరుగు తోన్న గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. అయితే గన్ లాబీ హవా ముందు ఈ సంస్థ చేసే పోరాటం నిలబడలేకపోతోంది.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌కు రాజకీయ పలుకుబడి అమెరికాలో గన్ తయారీ లాబీ చాలా శక్తివంతమైంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ పేరుతో తుపాకీ లాబీకి ఒక సంఘం కూడా ఉంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్‌కు రాజకీయంగా పలుకుబడి ఎక్కువ. సెనేట్ సభ్యులతోపాటు దేశ అధ్యక్షుడి వరకు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్‌కు సంబంధాలుంటాయి. కాల్పుల సంఘటన జరిగినప్పుడల్లా తుపాకుల నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వస్తుంటాయి. విమర్శలు సద్దుమణగగానే మళ్లీ తుపాకులకు సంబంధించిన చట్టాలజోలికి ఎవరూ వెళ్లరు. అయితే ఆత్మ రక్షణ కోసం తుపాకీ కొనుక్కునే హక్కు అమెరికన్లకు రాజ్యాంగం ఇచ్చింది. అమెరికాలో చాలా మంది గన్ ఉండటాన్ని ఫ్యాషన్‌గా భావిస్తారు. అమెరికా లో తుపాకులు, పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. ఎప్పుడు ఎవరికి ఎవరిపై కోపం వచ్చినా కోటు జేబులో తుపాకీ పెట్టుకుని వెళుతున్నారు. మంచీచెడూ ఆలోచించ కుండా కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడో సమస్య ఉంది. తుపాకుల వినియోగానికి సంబంధించి రాష్ట్రాల వారీగా నియమ నిబంధనలున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రక మైన రూల్స్ ఉన్నాయి.పరిస్థితులను చూస్తే ఇప్పట్లో అగ్ర రాజ్యంలో గన్ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు.
- ఎస్, అబ్దుల్ ఖాలిక్
సీనియర్ జర్నలిస్ట్
63001 74320