ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పి. ఓ. కే ) మనదే. ఈ విషయం లో ఎటువంటి బేషాజాలు పనికి రావు. మనం పి. ఓ. కే అని పిలుచుకుంటే వాళ్ళు (పాక్ ) మాత్రం అజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటున్నారు. ఉగ్రవాదం పెంచి పోషించిందే పాక్, అనేక మంది పాక్ ఉగ్రవాదులు హతమైన పాక్ లో మార్పు లేదు. ఉగ్రవాదం మూలాలు పాక్ లోనే ఉన్నాయి అని ప్రపంచ దేశాలు కొడయి కూస్తున్న పాక్ లో చలనం లేదు. మేము కూడ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వం అని ఓ ప్రకటన చేస్తుంది అంతే. ఉగ్రవాదం ఏ రూపం లో ఉన్నా అణచి వేసేది భారతే. మోదీ ది బలమైన ప్రభుత్వం. ఉగ్రవాద నిర్ములనే మా లక్ష్యం అని ఎన్నో మార్లు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా అమిత్ షా పలు సందర్భాలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను హస్త గతం చేసుకుంటాం అని చెప్పడం చుస్తే భారతీయ జనతా పార్టీ తప్పక భారత్ లో చేరుస్తుంది అని గట్టిగా చెప్పడం చుస్తే ఇది జరిగి తీరుతుంది అని అనుకోవచ్చు. ఈ సందర్భంలో భారత్ లో ని పలు పార్టీలు అమిత్ షా కు మద్దతు ఇవ్వక పొరుగు దేశంలో ప్రమాదకర అణు బాంబులు ఉన్నాయి అని చెప్పడం అవివేకం. పాక్ అణు బాంబులు ఏమి చేయలేవు. అలా అని మేము హింసాత్కకంగా ప్రవర్తించం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత దేశం దే నని అక్కడి నాయకులతోను, ముఖ్యంగా ప్రజలతోను చర్చించే నిర్ణయం తీసుకుంటాం. పి. ఓ కే లోని ప్రజలు కూడ భారత్ పట్ల అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే నిత్యం పాక్ లో అలజడి, ఉగ్ర చర్యలు, అస్థిరత, సంక్షోభం ఉన్న నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలలో కూడ మార్పు వచ్చింది. వారు భారత్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. కాని ఇది సరైన చర్య కాదని వివిధ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. భా. జా. పా మాత్రం ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని ముందుకు సాగుతోంది. గతం లో ఈ మాట అన్నప్పుడు పాక్ నాయకులు అది మాదే అని చెప్పడం, కాశ్మీర్ కోసం వేయి సంవత్సరాల యుద్ధం చేస్తాం అని చెప్పడం గమనార్హం. ఇప్పుడు అమిత్ షా చెబుతున్న కూడ పాక్ స్పందించటం లేదు. అంటే వాళ్ళు పి. ఓ. కే ని వదులుకోవటానికి సిద్ధమేనా! అనే సందేహం కలుగుతోంది. ప్రస్తుతం పాక్ లో పరిస్థితులు బాగాలేవు. కాశ్మీర్ కోసం అది ముందు గాంబీర్యం ప్రకటించినా, భారత్ మాత్రం చర్యలు తీసుకోవడం తథ్యం. అందుకే భారత్ లోని పార్టీ నాయకులు అనవసరంగా హింస చెలరేగుతుంది అని చెబుతున్నారు. దానికి భా. జా. పా స్పందిస్తూ కాశ్మీర్ కు 370 అధికరణం రద్దు చేస్తే హింస
రేగుతుంది అని, కాని హింసాత్మాక ఘటనలు ఎక్కడా జరగలేదని అదే మోదీ ప్రభుత్వ గొప్పతనమని అమిత్ షా చెప్పడం కొందరికి మింగుడు పడటం లేదు. ప్రస్తుతం జరుగుచున్న లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గణనీయ మెజారిటీ సాధిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, భారత్ లో కలుపుకోవటం ఖాయం. ఇదొక్కటే కాక ఇంకా పలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ‘జమిలి ‘ఎన్నికలు రావొచ్చు. ఏ పార్టీ సా హాసించని విధానాలు తీసుకుని కొత్త ఒరవడి ప్రవేశ పెట్టవచ్చు. ఏది ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం
భారత్ లో కలవటం గ్యారంటీ. ఇది భారత్ లోని పౌరులందరికి ఇష్టమే. ముందు భారత ప్రజల మద్దతు
తీసుకుని భా. జా. పా ముందడుగు వేస్తే మంచిది. పార్టీలు కూడ మద్దతు ఇచ్చి ఓ నూతన శకానికి నాంది పలకాలి. ఇక్కడ రాజకీయాలు పనికి రావు. మన భూబాగాన్ని న్యాయ బద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నాం అంతే. మరి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
… కనుమ ఎల్లారెడ్డి,
93915 23027.