అనేక మంది కవులు నేటి సాహితీ ప్రపంచంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఎన్నో కావ్యాలను శోధించి ప్రస్తుత పరిస్థితులను గమనించి పాఠక లోకానికి, సాహితీ లోకానికి ఇంకా మిగిలిపోయిన ప్రపంచం ఏదో ఉందని తన వంతుగా సమాజానికి తెలియజేసే బాధ్యతగా కలం కదుపుతున్నారు. కొంగొత్త అనుభూతులు, కొత్త కొత్త భావాల వ్యక్తీకరణతో ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూ మన చుట్టూ శోబిల్లుతున్న ప్రకృతిని వర్ణిస్తూనే కాకుండా సమాజ సమస్యల పరిస్థితులను పరిశీలిస్తూ పరిష్కార దిశగా… ‘ అమృతధారలు‘ కవితా సంపుటితో పాటు సాహితీ లోకాన తన రచనలతో ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్న హైదరాబాద్ వాస్తవ్యులు కవయిత్రి పి పద్మావతి తను వెలువరించిన కవితా సంపుటిని పరిశీలించగా అందులోని ప్రతి కవితను నడిపించిన తీరు, వస్తువును ఎంపిక చేసుకున్న విధానంలో ఒక ప్రత్యేక తత్వాన్ని కలిగి యున్నది. భావి భారత పౌరులైన ఎందరో మంది యువత వ్యసనాలకు లోనై బానిసలై లక్ష్యాలను పక్కనపెట్టి, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులను గమనించి ప్రస్తుత కాలంలో వారికి దిశా నిర్దేశం చేయుటలో పరిపక్వత చెందిన కవిత్వాన్ని పద్మావతి అందించారు.
నేటి యువత… కవితలో
నేటి యువత అంటే..
కన్నవారి ఆశల కుసుమాలు.
శక్తి యుక్తుల నిలయాలు
సమాజానికి మేలు కూర్చి ఆలోచనలు. నవయుగ భారత నిర్మాణానికి పునాదులు.!..
విజ్ఞాన వివేకములకు దీక్షితులు
సమతా మమతలకు సారథులు
ప్రాధనా లక్ష్యాల సర్విచారములు
పరుగులు తీసే ప్రగతికి రథచక్రాలు !
(యువత దేశ ప్రగతికి సోపానంగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తులను ఆధారితంగా ఈ కవనం నడిచింది)
అమ్మ భాష…కవితలో…
తేనెలొలుకే తీయని తీపి భాష
అధరాల మధుబాల ప్రేమలందించే భాష
మమతలకు నెలవైన తెసుగు భాష
అమ్మ ఒడిలో నుడికార గారాల బాష
జోల పాటల పాలించు వాత్సల్య మీ భాష
నాన్నలా జీవన మార్గాలనందించు నా భాష
గురువుల అక్షర అభ్యాసమునకు
ఓంకార ప్రణవ మీ భాష
ఆత్మీయ భావాల నందించు భాష
అనురాగాల బంధాబడిందించు నా భాష
(మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలుగు భాషలో ఉన్న తియ్యదనాన్ని ఈ కవణంలో అక్షర అబద్ధం చేసి సాహితీ ప్రతిభను చాటుకున్నది)
అనాథలం… కవితలో
చిరు చిరు దివ్వెలం
చిదిమిన బతుకులం
ఉలిమే చక్కని శిల్పాలం
కలమే రాయని కావ్యాలం అమ్మ-నాన్నలకి భారమై పోయిన బతుకులం..
కాలే మంటల ఆకలి కేకలం
దారిద్య్ర దావానలంలో మ్రగ్గా ఆవాలం…
ఆమె ప్రశ్నకు దొరకని జవాబులం. కాలమే కాలేసిన చెత్తకుప్ప బిడ్డలం..
(అనాధలకు గాధలను తెలియజేయుటకు రచయిత్రి ఈ కవిత వస్తువును ఎంచుకొని బాధ్యతారహితంగా పిల్లలను అనాధలను చేస్తున్నటువంటి కనికరం లేనటువంటి తల్లిదండ్రులకు మంచి గుణపాఠంగా మారింది ఈ కవనం)
నేటి మగువ… కవితలో
ఇమ్మాయిని, అనుబంధాల ఆత్మీయామరాగాన్ని
యువతిని, అనుభూతుల స్వర మాధురిని
గుండెను గుడిగా మలిచిన ప్రేమాలయాన్ని సద్గుణ సౌశీల్య సంవర్దినిని
మమతల ఒడిలో మాతృత్వపు మరుకాదాన్ని సృజనకు సృష్టికర్తని
రోజుకొక జీవన ఆధ్యాయానికి ప్రారంభాన్ని సంస్కార సంస్కృతి సంప్రదాయాల వారధిని
కష్టాల కడలిలో నైనా
కటిక దారిద్య్రంలోనైనా గూటికై ఏటికి ఎదురీదే ఆత్మ స్థైర్యాన్ని
సబలను , నిత్య నూతనమే నా ఆత్మవిశ్వాసం..
(మానవ జీవితంలో స్త్రీ యొక్క పాత్రను వర్ణిస్తూ జీవిత పయనంలో వివిధ బాధ్యతల్లో స్త్రీ తన మనుగడను సాగించే విధానాన్ని తెలియజేయుటలో కళ్లకు కట్టినట్లు తెలియజేసింది)
కాలుష్యం కవితలో
కాలుష్యం కాలుష్యం కాలుష్యం
నింగి నేల గాలి నీరు నిండా నిండిన కాలుష్యం
అంతం లేని కాలుష్యం ఆవంతంగా సాగే కాలుష్యం
నిరంతరమై సాగే జీవన చలనం కాలుష్యం.
నకిలీ మందుల కాలుష్యం, పచ్చని ప్రకృతికే కాలుష్యం
ఆహారంలో కాలుష్యం ఆకలి మంటల కాలుష్యం
అజ్ఞానంతో ప్రగతికి కాలుష్యం
ద్వేషం మోసంతో చెదిరిన వ్యక్తిత్వం
మనిషి ఒకడే అయినా రక్తం ఒకటే అయినా
(నేటి కాలంలో కలుష్యం కానిది ఏమిటి..? ప్రతి ఒక్క వస్తువు లను ప్రతి ఒక్క విషయంలోనూ కల్తీ లేకుండా దొరుకుతుందా…? మనిషి ఒక్కటే అయినా అందరి శరీరంలో ప్రవహించేది రక్తమే అయినా అజ్ఞానంతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని మనిషి తన జీవి తాన్ని కాలుష్యంగా మార్చుకుంటున్నాడని నేటి సాంఘిక పరిస్థితుల్లో మానవీయ వ్యక్తిత్వ విలువలను తెలియజేసిన కవనం)
అమృత ధారలు కవితా సంపుటిలో…. అమృత ధారలు, సౌంద ర్యం, జీవన సత్యం, కన్నీటి కథలు, నేటి రాజకీయాలు, అమ్మ భాష, అంతరంగం, మాటతీరు ఆత్మవిశ్వాసం, కాలుష్యం, నేటి జీవితం పూబాలలు, ఆధునిక విజ్ఞానం, కరోనా కాలుష్యం, ఓటు హక్కు, శ్రామికులు, శుభ సందేశం, అక్షరం, నేటి మన భారతం ఇలా 76 కవితలతో అమృత ధారలు (కవితా సంపుటి) కావ్యాన్ని రచించిన పద్మావతి తన .. కవితలను తన వరకే పుస్తకంలో దాచుకుని పరిమితం కాకుండా…. పలు సాహితీ సంస్థల్లో, వివిధ అధ్యాపక సామాజిక మాధ్యమాలైన సమూహాలలో కవితలను అందిస్తున్నది, ప్రముఖ హిందీ కవుల గురించి తెలుగులో వ్యాసాలు రాసి ఆకాశవాణిలో అప్పుడప్పుడు ప్రసంగాలు అందించినది. ఇంటికే పరిమితం కాకుండా తను సాహితీ అధ్యయనం పట్ల ఆసక్తిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నానని తెలియజేయడం సాహిత్యం పైన తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది. పద్మావతి రచనల్లో ప్రధానంగా కవితా వస్తువులను ఎంపిక చేసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న విధానాన్ని పరిశీలిస్తే నేటి సమాజంలో పాతుకు పోయిన, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కాలానికి అపూర్వమైన అమూల్యమైన సంపద కలమేనన్నది పద్మావతి రచనల్లో పరిమళించే కవిత్వమే నిదర్శనం. ముందు ముందు మరిన్ని రచనలతో సాహితీ ప్రపంచానికి మరిన్ని కావ్యాలను అందించాలని అభిలాషిస్తూ… అమృత ధారలు కవితా సంపుటి అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.
-డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, 9490841284
Amruthadharalu: మానవ జీవన వికాసముల సమాహారం
ప్రత్యేక తత్వాన్ని రుచి చూపించిన అమృతధారలు