Tirumala Laddu Adulteration Case: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయం రొచ్చురొచ్చుగా మారి పోయింది. టీడీపీ కూటమి నేతలకు, వైసీపీ నేతలకు మధ్య గొడ వలు నిత్యకృత్యంగా తయారవుతున్నాయి. ఏ చిన్న విషయం దొరి కినా దాని మీద ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికి విపరీ తంగా ఉత్సాహం చూపిస్తున్నారు. తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ వ్యవహారం, మద్యం కుంభకోణం, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన మహత్కార్యం.. వీటన్నింటి మధ్య సందట్లో సడేమియా అన్న ట్లు గీతం విశ్వవిద్యాలయానికి అప్పనంగా రూ.5వేల కోట్ల భూసం తర్పణ… ఇలాంటి సవాలక్ష వ్యవహారాలు తెగ నడుస్తున్నాయి.
వీటన్నింటితో కావల్సిన వారికి కావల్సినంత కాలక్షేపం దొరుకు తోంది. మద్యం కుంభకోణం మీద, తిరుమల లడ్డూలకు ఉపయో గించిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల గురించి దర్యాప్తు, విచారణ, కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు కొందరికి బెయిల్ వచ్చింది. కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కెసిరెడ్డి)కి మాత్రం బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అతడితో పాటు ప్రస్తుతం పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసి న ముప్పిడి అవినాష్ రెడ్డికి కూడా కోర్టులో చుక్కెదురైంది.
అయితే.. సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ రావడంతో వైసీపీ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉంది. అసలు చేయని నేరానికి అక్రమంగా ఇరికించారని, అందుకే కోర్టు బెయిల్ ఇచ్చిం దని ఆ పార్టీ నేతలు, వాళ్లకు సంబంధించిన పత్రికలో చెప్పుకొం టున్నారు. ఈ తరహా వైట్ కాలర్ నేరాలు రుజువు కావాలంటే అంత సులభం కాదు. ఈ విషయాన్ని పట్టుకుని రెండు పక్షాలూ తెగ కొట్టుకుంటున్నాయి. బయటి నుంచి చూసేవారికి ఇది వినోదంలా కనిపిం చవచ్చు గానీ, సామాన్య ప్రజలకు మాత్రం ఇదంతా చూసి ఎక్కడలేని విరక్తి కలుగుతోంది.
సిట్ నే నిలదీస్తున్న సర్కారు!
తిరుమల లడ్డూలకు వాడిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఛార్జిషీటు దాఖలు చేసింది. అసలు పాలు, వెన్న సేకరించకుండా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి కల్తీ నెయ్యి తయారు చేశారని, ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు చేయడానికి, కల్తీ నెయ్యి వాసనలు వచ్చేలా చేయటా నికి ఈ రసాయనాలు కలిపారని ఛార్జిషీటులో చెప్పా రు.
ఈ నమూనాల్లో బుట్యరిక్ యాసిడ్ తక్కువగా ఉందని, కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతు వుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. అది సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). ఆ నివేదికను కూడా కూటమి ప్రభుత్వ నేతలు, వారి అనుకూల పత్రికల యాజమాన్యాలు అంగీకరించ లేకపోతున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు గతంలో నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లు ఉన్నాయని, ఇప్పుడు సిట్ ఇలా చెప్పడమేంటని సిట్ నిష్పాక్షి కతనే నిలదీస్తున్నారు. ఇదంతా ఎందుకయ్యా అంటే… గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ వంటి నాయకులు జంతు కొవ్వు కలిపారని ఆరోపించారు.
దాంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తీరా ఇప్పుడు సిట్ దాఖలు చేసిన తుది అనుబంధ ఛార్జిషీటుతో ఆ ఆరోపణలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. ‘‘పాలు, వెన్న వంటివి సేకరించకుండా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు చేయటానికి, కల్తీ నెయ్యి వాసనలు వచ్చేలా చేయటానికి ఈ రసాయనాలు కలిపారు’’ అని సిట్ తన ఛార్జిషీటులో కుండ బద్ద లుకొట్టి మరీ చెప్పింది. దాంతో ఇప్పుడు కూటమి నేతలకు, వారు చెప్పిన మాటలు పట్టుకుని సంచలనాన్ని సృష్టించడానికి, శ్రీవారి భక్తుల్లో భయాలు సృష్టించడానికి వార్తా కథనాలు వండి వడ్డించిన పత్రికల యాజమాన్యాలకు కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడి నట్లయింది.
అందుకే సిట్ నివేదిక అంతా ఉత్త డొల్లేనని, గతంలో ఎన్‌డీడీబీ కాఫ్ ఇచ్చిన నివేదిక మాత్రమే శిరోధార్యమని చెప్పుకొ స్తున్నారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ కూటమి వర్గాల మధ్య ఇదో పెద్ద యుద్ధంగా మారిపోయింది. చంద్రబాబు అండ్ కో చేసిన జంతు కొవ్వు ఆరోపణలు అవాస్తవమని, కల్తీ అన్నది వాళ్లు సృష్టించిన పదమే తప్ప మరేమీ కాదని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు నెయ్యి అన్నదే లేకుండా వేర్వేరు రసాయనాలతో నెయ్యి రూపం వచ్చేలా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడం, వాటి ని వైసీపీ నేతలు చించేయడం లాంటి ఘటనలు కూడా చోటుచే సుకున్నాయి.
వీడియోల వార్
ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లాంటి వాళ్ల వ్యవహారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఉద్యోగిని హర్ష వీణ మధ్య వీడియోల వార్ జరుగుతోంది. డబ్బులు ఇవ్వకపోవడంతోనే వీణ మీడియా ముం దుకొచ్చిందని ఎమ్మెల్యే కుటుంబ సభ్యు లు ఆరోపిస్తుంటే.. ఎమ్మెల్యే తనను లో బరుచుకుని కామాంధుడిలా ఇబ్బందులు పెట్టారంటూ వీణ, ఆమె తరపు మద్దతు దారులు చెబుతున్నారు.
మీమర్స్‌కు ఫుల్ సరుకు
రైల్వేకోడూరులో ఉద్యోగం చేస్తున్న వీణకు.. సోషల్ మీడియా ద్వారా జనసే న ఎమ్మెల్యే మెసేజ్‌లు చేసి దగ్గరయ్యార ని, తనకు ఇష్టం లేకపోయినా తనపై బ లాత్కారం చేశాడని వీణ ఆరోపిస్తున్నారు. తన ఇంటికి ఎమ్మెల్యే ఒక్కడే కారు వేసుకుని వచ్చి ఇష్టం లేకపోయినా కొట్టి బలాత్కారం చేసి వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఆమెతో ఎమ్మెల్యే చేశారని చెబుతున్న చాటింగ్ , వీడియో కాల్, వాయిస్ కాల్స్ వివరాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతలో అసెంబ్లీలో ఉండగానే ఒక మహిళతో అరవ శ్రీధర్ వీడియో చాటింగ్ చేశాడంటూ తాజా గా మరో విషయం బయటకొచ్చింది. అందులోని నిజానిజాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ.. అదే నిజమైతే జనసేన అగ్రనేతలు ఇంకా వేచి చూడడం కంటే బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు. ప్రస్తుతానికి రైల్వేకోడురు ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో జరుగు తున్న ప్రచారం, మహిళ చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ జరప డానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని వేసింది. వారం రోజుల్లో అరవ శ్రీధర్ తన పొరపాటు లేదని ఆధారాలతో కూడిన ప్రత్యక్ష వివరణ ఇవ్వాలని, పార్టీ నిజానిజాలు పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండా లని జనసేన నోటీసు జారీచేసింది. అయితే.. అధినేత పవన్ కల్యాణ్ అడుగుజాడల్లోనే తాను నడుస్తానని అరవ శ్రీధర్ చెప్పడంతో మీమర్స్‌కు కావల్సినంత సరుకు దొరికేసింది.
గీతం గొడవ
ఇప్పటికే పలు పరిశ్రమలకు భూసంతర్పణ చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. బాలకృష్ణ చిన్న ల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్శిటీ అధినే త, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభు త్వ భూమిని కట్టబెట్టేందుకు లేదా అక్రమ కబ్జాను క్రమబద్ధీకరించ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బయటపడడం సంచలనం రేపింది. 54.79 ఎకరాల ఆక్రమణ భూమిని వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు.
ఇప్పుడు విశాఖ చివరి కౌన్సిల్ సమావేశాల్లో క్రమబద్ధీకరించడానికి వీలుగా మీటింగ్ ఎజెండాలో చేర్చేశారు. ఇలా అత్యంత విలువైన భూమిని గీతంకు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమేనని మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి 82 ఏళ్ల ఈఏఎస్ శర్మ అంటున్నారు. ఈ భూమి విలువ దాదాపు రూ.5వేల కోట్ల వరకు ఉంటుంది. 2011నాటి జగపాల్ సింగ్ కేసులో స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు కేటా యించకూడదని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్నీ ఆదేశిం చింది.
ప్రభుత్వ భూముల్ని కారు చవకగా ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు అప్పగిస్తే ఆయా సంస్థలు పేదలకు తమ సేవల్లో 25 శాతం వరకు ఉచితంగా ఇవ్వాలని కూడా గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఆదేశించింది. వీటన్నింటినీ తుంగలో తొ క్కి.. తమపార్టీ నేతలకు ఇలా అప్పనంగా ప్రభుత్వ భూములను కట్ట బెట్టడం ఏ రకమైన అభివృద్ధో కూటమి ప్రభుత్వాధినేతలకే తెలియా లి. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇలాంటి విషయాల్లో తన వైఖరి ఏంటన్నది స్పష్టంగా తెలియజేయాలి. లేనిపక్షంలో టీడీపీ నాయకులు తీసుకునే వివాదాస్పద నిర్ణయాలకు గంగిరెద్దు లా తలాడించడం తప్ప మరేమీ చేయలేరన్న విమర్శలను ఆయన మూటగట్టుకునే ప్రమాదం ఉంది.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ
సమయం

