Sunday, July 13, 2025
Homeఓపన్ పేజ్Anti Drug Day: మత్తు వదలరా.. సినీ ఇండస్ట్రీపై డ్రగ్స్ భూతం

Anti Drug Day: మత్తు వదలరా.. సినీ ఇండస్ట్రీపై డ్రగ్స్ భూతం

Anti Drug Day: మత్తు… ఎంత గమ్మత్తుగా ఉన్నా మనిషి జీవితాన్ని ఎంత చిత్తు చేస్తుందో ఊహించడానికే భయం వేస్తుంది. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల దాకా మత్తులో జోగుతున్న వాళ్లే నేడు అధికం. విదేశాలు, ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి అధికారుల కళ్లుకప్పి నగరాన్ని మత్తులో ముంచుతోంది. గల్లీల నుంచి సినీ ప్రముఖులను సైతం డ్రగ్స్ భూతం వెంటాడుతోంది. ఒకప్పుడు బాధ వస్తేనో, సంతోషం కలిగితేనో మద్యం సేవించి తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆస్థాయి దాటి గంజాయి, హెరాయిన్, ఓపియం, కొకైన్, వికోడిన్, ఎఫిడ్రిన్‌ వంటి మత్తు పదార్థాలకు బానిసలై, మానవ మృగాలుగా మారి తమ బంగారు జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే డ్రగ్స్‌లో మాయలో సెలెబ్రిటీలు జోగుతూ తమ ఉనికి కోల్పోయే ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. నేడు జూన్ 26 యాంటీ డ్రగ్ డే సందర్భంగా కథనం.

తన గొంతుతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ సింగర్ మంగ్లీపై డ్రగ్స్ మచ్చ పడింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో ఇటీవల సింగర్ మంగ్లీ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో సింగర్ ఇంద్రావతి, రచ్చరవి, దివి, కాసర్ల శ్యామ్ తదితరులు ఉన్నారు. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంతో మంగ్లీపై కేసు నమోదు చేశారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, గంజాయిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


‘రోజా పూలు’తో తెలుగు, తమిళ అభిమానులను సంపాదించుకున్న హీరో శ్రీరామ్ కొకైన్ కేసులో ఇరుక్కున్నాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ను ఇటీవల డ్రగ్స్ కేసులో చెన్నైలోని నుంగంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ నుంచి కొకైన్ కొన్నట్లు శ్రీరామ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల్లో నటించాలనే కోరికతో చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.


మలయాళ సినీ ఇండస్ట్రీలోనూ కొన్ని రోజులుగా డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్‌ టామ్‌ చాకోను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు దర్శకులు ఖలీద్‌ రెహమాన్‌, అష్రఫ్ హంజాతో పాటు వారి స్నేహితుడు షలీఫ్‌ను ఎక్సైజ్​ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరు కొన్నేళ్ల నుంచి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మలయాళంలో ఇటీవల విడుదలై హిట్ తెచ్చుకున్న ‘జింఖానా’ సినిమాకు ఖలీద్‌ రెహమాన్‌ డైరెక్టర్. ఇక అష్రఫ్ హంజా ‘తమాషా’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

- Advertisement -


ALSO READ: https://teluguprabha.net/telangana-news/hyderabad-bonalu-jathara-2025-begin-today-significance-of-bonalu-festival/

2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. ఒక డ్రగ్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకుంటే.. వారు ఎవరెవరికీ సప్లయి చేస్తున్నారనే అన్నీ విచారణలో వెలుగు చూశాయి. నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, రవితేజ, హీరోయిన్ చార్మి, ముమైత్‌ ఖాన్‌ బుల్లి బుల్లి తారల పేర్లు చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. సుమారు 40 మంది పేర్లు అనధికారికంగా బయటకు రాగా, చివరకు 12 మందిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన వారంతో రాజకీయ అండదండలతో కేసు నుంచి బయట పడిన విషయం తెలిసిందే. అలాగే, బెంగళూరు రేవు పార్టీలో నటి హేమతో పాటు సుమారు తెలుగువారు 80 మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది.


రాష్ర్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతూ విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. గతేడాది సీఎం రేవంత్ సైతం మాదక ద్రవ్య రహిత తెలంగాణకు అందరూ కృషి చేయాలని, డ్రగ్స్ అరికట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మరో వైపు కేంద్రం నషా ముక్త్ భారత్ అభియాన్ పేరుతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తోంది. 500 స్వచ్ఛంద సంస్థలలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ NGOలు డ్రగ్-ఫ్రీ ఇండియా ప్రచారం అమలులో చురుకుగా పాల్గొంటున్నాయి. దేశంలో డ్రగ్స్ ప్రభావం అధికంగా ఉన్న సుమారు 250కి పైగా జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తోంది.


ALSO READ:https://teluguprabha.net/telangana-news/heavy-rains-across-in-telangana-state/

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరించారు. యూత్ డ్రగ్స్ బారిన పడొద్దని డీజీపీ జితేందర్ సూచించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలీసులు కృతనిశ్చయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ అవేర్నెస్ వీక్‌ ప్రోగ్రాం ప్రారంభోత్సవం సందర్భంగా డీజీపీ ఈ సూచనలు చేశారు. నల్లగొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ పేరుతో జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


కాగా, గతేడాది తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 1,892 మాదకద్రవ్యాల కేసులు నమోదు అయ్యాయి. 3,792 మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేసి రూ.179 కోట్ల విలువైన అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB) 5 కేసుల్లో రూ.47.16 కోట్ల విలువైన డ్రగ్ వ్యాపారుల ఆస్తులను జప్తు చేసింది. 679 కేసుల్లో రూ.102.4 కోట్ల విలువైన 42,190 కిలోల డ్రగ్స్‌ను యాంటీ నార్కోటిక్స్ బ్యూర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News