Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్AP Elections: నవ వసంతంపై యువసంతకం

AP Elections: నవ వసంతంపై యువసంతకం

రాజకీయ ప్రస్థానంలో అనతి కాలంలోనే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. మహోన్నతమైన నాయకుడికి మనవడిగా, ఉన్నతమైన రాజకీయ విలువలు కలిగిన నాయకుడికి వారసుడిగా, లక్షలాది మంది ప్రజలకు ఆరాధ్యదైవంలా నారా లోకేష్ నిలిచారు. ఆయన బురదలో కమలం వికసించినట్లుగా నేటి రాజకీయాల్లో మచ్చలేని రాజకీయ నాయకుడిగా వెలుగొందుతున్నారు. ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వం, భాష, వేషం మీద దాడి చేసి నష్టపరిచే ప్రయత్నం చేశారు. వారి విమర్శలను సవాళ్లుగా స్వీకరించి తనను తాను తీర్చిదిద్దుకుంటూ రాజకీయ వైకుంఠపాళిలో ఒక్కో మెట్టు ఎగబాకుతున్నారు. అందుకు ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

- Advertisement -

ఉత్తమ: క్లేశవిక్షోభం క్షమ: సోఢుం న హీతర: మణిరేవ మహాశాణఘర్షణం నతు మృత్కణ: అంటే ఉలి దెబ్బలు తట్టుకునేది శిలే కాది మట్టి పెలక కాదని అని చాణిక్య నీతి దర్పనంలో చాణిక్యుడు అంటాడు. నాడు ఆయనన్న వ్యాఖ్యలు నేడు లోకేష్ లాంటి ప్రజానాయకుడికి సరిగ్గా సరిపోల్చవచ్చు.
నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు లు రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, పవిత్రతను చేకూర్చారు. ఇప్పుడదే బాటలో నారా లోకేష్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. పెద్దల సభగా వ్యవహరించే శాసనమండలి లో సభ్యునిగా అరంగేట్రం చేసిన లోకేష్ ఎంతో పరిణితి కనబరిచారు. రాష్ట్రానికి సైతం మంచి భవిష్యత్ ఇవ్వగలరన్న భరోసా ప్రజలకు కలిగించటం లో లోకేష్ సఫలీకృతుల్యారు. టిడిపి బరువును, పరువును తన భుజస్కందాలపై వేసుకొని తెలుగు నేల నలుచెరుగులా కలియ తిరుగుతున్న అలుపెరుగని శ్రామికుడు లోకేష్. అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకనిధిని టీడీపీలో ఏర్పాటుకు ఆధ్యుడు ఆయనే.
మంత్రిగా ఐటి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ఐటి రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా 22,283 కిలోమీటర్ల పొడవున బి.టి. రోడ్లను మెరుగు పరచి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఉద్యోగం లభించే వరకు వారందరికీ నిరుద్యోగ భృతి అందజేశారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షలమంది ఉద్యోగాలు కల్పించారు. రూ.10వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచారు.
అయితే 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టడంలో సఫలీకృతులయ్యారు. అంతేకాకుండా నియంతృత్వ పోకడలతో వున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను దీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన ధీశాలి. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగం తో అణచి వేసే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగి పాదయాత్రను విజయవంతంగా ముగించి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను లోకేష్ మరో శిఖరానికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు.
సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే అది దండయాత్రే అవుతుందని యువగళం సాగించడం 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపింది. అరాచక పాలనపై దండయాత్ర చేసి యువత, మహిళల్లో చైతన్య స్ఫూర్తి రగిల్చి వారిలో నైతిక స్థైర్యం నింపారు. పాదయాత్రకు ముందు లోకేష్.. తర్వాత లోకేష్ ను చూడాలి. పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు. ప్రజలతో మమేకమై వారి అంతరంగాన్ని శోధించారు. తన లక్ష్యాన్ని ఛేదించారు. పాదయాత్రకు పల్లెలకు పల్లెలు ఉప్పెనలా కదిలొచ్చాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే. అడుగు తీసి అడుగువేయలేనతంగా జనం తరలి వచ్చారు. ప్రజా సమస్యలు శ్రద్ధగా వింటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. అరాచకపాలన అంతం యువగళం పంతంగా నినదించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోకవర్గాలు, 230 మండలాలు/మున్సిపాలిటీలు, 2వేల గ్రామాల మీదుగా సాగిన చారిత్రాత్మక యువగళం 3,131 కి.మీ.లు నడిచారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేష్ సుమారు కోటిన్నరమందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిశారు.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. దీంతో ప్రచారరథం, మైకు, సౌండ్ సిస్టమ్, చివరకు స్టూలుతో సహా అన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఎంతగా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా లోకేష్ ఏమాత్రం వెన్నుచూపలేదు. గతంలో మరే నాయకుడూ చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587కి.మీ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి దిశగా పరుగులెత్తాలంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి. దానితో పాటు లోకేష్ లాంటి సమర్ధవంతమైన నాయకులు మళ్లీ చట్టసభలో అడుగుపెడితేనే రాష్ట్రం శోభాయమానంగా వర్ధిల్లుతుందని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది.
గడిచిన 5 ఏళ్లుగా ప్రిజనరీ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారు. కాబట్టి విజనరీ పాలన కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 160కి పైగా స్థానాల్లో గెలవబోతుందంటే అందుకు లోకేషే పడ్డ కష్టానికే ప్రతీకగా చెప్పొచ్చు.
బీసీ జనార్ధన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ నాయకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News