Homeఎడిటోరియల్ / బహుళBanks: బ్యాంకులు ‘బడాబాబుల’ కోసమేనా?

Banks: బ్యాంకులు ‘బడాబాబుల’ కోసమేనా?

మన దేశంలో సామా­న్యుడి నడ్డి విరుస్తూ సంప­న్నుల పల్లకి మోస్తున్న ప్రభు­త్వ­రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ. బ్యాంకుల జాతీ­య­క­రణ లక్ష్యాన్ని సమూ­లంగా దెబ్బ­తీసి, వాటిని బడా­బా­బుల జేబు సంస్థ­లుగా మార్చిన ప్రభు­త్వాలు. నిజం­గానే బ్యాంకు లు, వాటిని నిర్వ­హి­స్తున్న ప్రభు­త్వాలు అలా చేస్తు­న్నాయా? అందుకు నిద­ర్శ­నంగా ఇక్కడ ఒక చితి­కి­పో­యిన రైతు బిడ్డ కథను వివ­రి­స్తాను!

- Advertisement -

ముప్పై ఏండ్ల కిందట జరి­గిన ఒక యాదార్థ సంఘ­టన ఇది. తెలం­గా­ణకు చెందిన ఒక రైతు కుటుం­బంలో పుట్టిన ఉన్నత విద్యా­వం­తు­డైన యువ­కుడు తన కాళ్లపై తాను నిల­బ­డా­ల­ను­కు­న్నాడు. ఔరం­గా­బా­ద్‌లో సుమారు రూ.30 లక్షల పెట్టు­బ­డితో ఒక హ్యాచరీ ప్రారం­భిం­చాడు. అందు­కోసం రంగా­రెడ్డి జిల్లా­లోని తన రెండు ఎక­రాల భూమితో పాటు, నల్గొండ జిల్లా­లోని తన అత్త­గా­రికి చెందిన పది ఎక­రాల భూమిని మార్టి­గేజ్‌ చేశాడు. వ్యాపారo విఫ­ల­మైంది. తాకట్టు ఆస్తులు వేలా­నికి వెళ్లాయి. బ్యాంకు తన రుణం వసూలు చేసు­కుంది. చివ­రికి రూ.30 లక్షల రుణం కోసం కోట్ల విలు­వైన ఆస్తిని కోల్పో­యాడు. కుటుంబం రోడ్డున పడింది. ఇది ఒక్క కుటుంబం కథ కాదు. ఈ దేశంలో రైతులు, చిన్న వ్యాపా­రులు, మధ్య­త­ర­గతి కుటుం­బాలు రుణం చెల్లిం­చ­లేక ఆస్తులు కోల్పో­యిన ఉదా­హ­ర­ణలు ఎన్నో ఉన్నాయి. సామా­న్యుడి రుణం విష­యంలో బ్యాంకులు ఇంత కఠి­నం గా ఉంటే వేల కోట్ల రుణాలు తీసు­కున్న పెద్ద పారి­శ్రా­మి­క­వే­త్తల విష­యంలో ఆ వ్యవస్థ ఎందుకు భిన్నంగా కని­పి­స్తుంది? విభి­న్నం గా వ్యవ­హా­రి­స్తుంది? ఈ కథ గురించి ఆలో­చించే ముందు అసలు బ్యాంకుల జాతీ­య­క­రణ ఎందు­కోసం, ఎవరి కోసం జరి­గింది? ఆ వివ­రా­ల్లోకి వెళదాం!

బ్యాంకుల జాతీ­యీ­క­రణ లక్ష్యం
అప్పటి ప్రధా­న­మంత్రి ఇంది­రా­గాంధీ ప్రభుత్వం 14 ప్రధాన వాణిజ్య బ్యాంకు­లను జాతీయo చేసింది. బ్యాంకుల జాతీ­యీ­క­రణ లక్ష్యం కేవలం యాజ­మా­న్యాన్ని మార్చడం కాదు. బ్యాంకింగ్‌ వన­రులు కొద్ది­మంది పెద్ద వ్యాపార వర్గా­లకే పరి­మితం కాకుండా రైతు­లకు, చిన్న పరి­శ్ర­మ­లకు, చిన్న వ్యాపా­రు­లకు, గ్రామీణ ప్రాంతా­లకు, సామాన్య ప్రజ­లకు రుణాలు అందిం­చ­డమే దాని ప్రధాన ఉద్దే­శాల్లో ఒకటి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ల శాఖలు విస్త­రిం­చాయి. వ్యవ­సాయం, చిన్న పరి­శ్ర­మ­లకు సంస్థా­గత రుణాలు పెరి­గాయి. అంటే బ్యాంకులు కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కాదు.

కానీ 57 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం అడ­గా­ల్సిన ప్రశ్న ఇదే! ఆ లక్ష్యం ఎక్క­డుంది? ఒక­వైపు మాల్యా మరో­వైపు నీరవ్‌ మోడీ! విజయ్‌ మాల్యా వ్యవ­హారం..వేల కోట్ల కార్పొ­రేట్‌ రుణాలు ఎంత టి సంక్షో­భంగా మార­గ­లవో దేశా­నికి రుచి చూపిం­చింది. కింగ్‌­ఫి­ష­ర్‌కు సంబం­ధిం­చిన భారీ బ్యాంకు బకా­యిలు, ఆ తర్వాత దేశం విడిచి వెళ్లడం, ఆస్తుల స్వాధీనం, రిక­వరీ చర్యలు ఇవన్నీ ప్రజల కళ్ళ ముందే జరి­గాయి. అలాగే నీరవ్‌ మోడీ వ్యవ­హారం మరింత తీవ్ర­మై­నది. ఇక్కడ వ్యాపార వైఫ­ల్యంతో పాటు బ్యాంకింగ్‌ మోసం ఆరో­ప­ణలు, దర్యా­ప్తులు, ఆస్తుల అటా­చ్‌­మెంట్లు చోటు­చే­సు­కు­న్నాయి. ఈ రెండు కేసులూ ఒకే రక­మై­నవి కావు. కానీ ఒక ప్రశ్న మాత్రం రెండింటి నుంచీ వస్తుంది. వేల కోట్ల రుణాలు ఇచ్చే సమ­యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ తన బాధ్య­తను ఎంత సమ­ర్థంగా నిర్వ­ర్తిం­చింది?

అనిల్‌ అంబానీ మరో పరీక్ష!
అనిల్‌ అంబా­నీకి సంబం­ధిం­చిన “పర్స­నల్‌ గ్యారెం­టర్‌ ఇన్‌ సాల్‌ వెన్సీ” ప్రక్రియ కూడా పెద్ద రుణాల విష­యంలో వ్యవస్థ ఎలా పని­చే­స్తుం­దనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. పర్స­నల్‌ గ్యారెం­టర్‌ అంటే కంపెనీ తీసు­కున్న రుణాన్ని కంపెనీ చెల్లిం­చ­క­పోతే తాను బాధ్యత వహి­స్తా­నని వ్యక్తి­గ­తంగా హామీ ఇచ్చిన వ్యక్తి. ఇక్కడ కూడా “రుణ­మాఫీ” అని తేల్చడం సరి­కాదు. ఇది చట్ట­బ­ద్ధ­మైన దివాళా పరి­ష్కార ప్రక్రియ. అయితే సామా­న్యుడి ప్రశ్న మాత్రం సూటిగా ఉంటుంది. పెద్ద వ్యాపార సామ్రాజ్యం కూలి­పో­యి­న­ప్పు డు రుణ­భారం పరి­ష్క­రిం­చ­డా­నికి ఎన్నో చట్ట­బ­ద్ధ­మైన దొడ్డి దారు లు, పరి­ష్కారం మార్గాలు ఉన్న­ప్పుడు చిన్న రుణ­గ్ర­హీ­తకు కూడా అదే స్థాయి పున­రా­వాస అవ­కాశం ఎందుకు కని­పిం­చదు?

సుభాష్‌ చంద్ర కేసు ఎందుకు సంచ­లనం?
ఇటీ­వల జీ గ్రూప్‌ వ్యవ­స్థా­ప­కుడు సుభాష్‌ చంద్రకు సంబం­ధిం­చిన “పర్స­నల్‌ గ్యారెం­టర్‌ ఇన్‌ సాల్‌ వెన్సీ” కేసులో ఎన్‌. సి. ఎల్‌. టి ( ఇది దివాళా కంపె­నీల రుణ పరి­ష్కార కేసు­లను విచా­రించే ప్రత్యేక న్యాయ సంస్థ) ఆమో­దిం­చిన రుణ చెల్లిం­పుల పథకం మరో­సారి ఈ ప్రశ్నను ముందుకు తెచ్చింది. రూ.22,006.57 కోట్ల రుణ మాఫీకి గాను రు.6.25 కోట్ల రీపే­మెంట్‌ , మరో రు.25 లక్షల ఇన్‌ సాల్‌ వెన్సీ ప్రాసెస్ ఖర్చులు మొత్తం రూ.6.50 కోట్లు అనే రుణ మాఫీ ప్రణా­ళిక ఆమోదం పొందింది. కానీ, ప్రస్తు­తా­నికి ఆ రుణ­మా­ఫీని కోర్టు అడ్డు­కుం­ద­ను­కొండి..అది వేరే విషయం.

ఇది “ప్రభుత్వం రూ.22 వేల కోట్లు మాఫీ చేసింది” అని చెప్పడం కాదు. దివాలా , దివాలా పరి­ష్కార కోడ్‌ (ఐబీసీ) అప్పులు చెల్లిం­చ­లేని వ్యక్తులు, సంస్థల రుణ సమ­స్య­లను చట్ట­బ­ద్ధంగా పరి­ష్క­రించే దివాళా చట్టం) కింద జరి­గిన ప్రక్రియ. అయినా సామా­న్యుడి మన­సులో ప్రశ్న రావడం సహజం..“రూ.22 వేల కోట్ల క్లెయిమ్స్​‍ ఉన్న వ్యవ­హా­రంలో కేవలం కొన్ని కోట్లతో పరి­ష్కారం సాధ్య­మైతే రూ.5 లక్షలు, రూ.10 లక్షల రుణం తీసు­కున్న సామా­న్యు­డికి ఎందుకు ఇంత కఠి­న­మైన వసూళ్లు?”

అసలు విషయం ఇది ఎవరి సొమ్ము?
ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. బ్యాంకు డబ్బు ప్రధా­న­మంత్రి సొమ్ము కాదు. రాష్ట్ర­పతి సొమ్ము కాదు. ఏ రాజ­కీయ పార్టీ సొమ్ము కాదు. అది ప్రజల సొమ్ము. రైతు దాచిన డబ్బు. ఉద్యోగి జీతం నుంచి మిగి­ల్చిన డబ్బు. మధ్య­త­ర­గతి కుటుంబం కూడ­బె­ట్టిన డబ్బు. చిన్న వ్యాపారి బ్యాంకులో జమ చేసిన డబ్బు. అదే డబ్బును బ్యాంకులు రుణా­లుగా ఇస్తాయి. అందుకే భారీ రుణాలు విఫ­ల­మై­న­ప్పుడు ప్రశ్న కేవలం ఒక కంపెనీ గురించో, ఒక పారి­శ్రా­మి­క­వేత్త గురించో కాదు. ప్రజల డబ్బును నిర్వ­హిం­చిన వ్యవస్థ బాధ్యత గురించీ. సామా­న్యు­డికి ఒక న్యాయం సంప­న్ను­డికి మరో న్యాయమా? సామా­న్యుడు బ్యాంకు రుణం తీసుకుంటే భూమి తాకట్టు. కిస్తీ ఆగితే నోటీసు. రుణం చెల్లిం­చ­లే­క­పోతే ఆస్తి వేలం.

కానీ పెద్ద రుణ­గ్ర­హీత దగ్గ­రకు వెళ్లే­స­రికి దివాలా పరిష్కారం అంటే రుణ­భా­రంలో ఉన్న సంస్థను మూసి­వే­య­కుండా కొత్త యాజ­మాన్యం లేదా చెల్లింపు ప్రణా­ళిక ద్వారా నిలబెట్టే ప్రక్రియ.

“హెయిర్‌ కట్‌“.. అంటే రావా­ల్సిన మొత్తాన్ని కాకుండా, దానిలో కొంత మాత్రమే స్వీక­రిం­చ­డా­నికి రుణ­దాత అంగీ­క­రిం­చడం. రైట్‌ ఆఫ్‌ .. బ్యాంకు తన లెక్కల్లో వసూలు కాని రుణాన్ని తొల­గిం­చడం; ఇది రుణ­గ్ర­హీ­తకు చట్ట­ప­ర­మైన పూర్తి మాఫీ అని మాత్రం కాదు. ఇవి చట్ట­బ­ద్ధ­మైన ప్రక్రి­యలే కావచ్చు. వ్యాపారం విఫ­ల­మ­వడం నేరం కాదు. కానీ మోసం, ఉద్దే­శ­పూ­ర్వక రుణ ఎగ­వేత జరి­గితే మాత్రం బాధ్యత తప్పక ఉండాలి. చిన్న­వా­డి­కైనా పెద్ద­వా­డి­కైనా తప్ప­కుండా శిక్ష పడాలి. ఈ విష­యంలో బ్యాంకు అధి­కా­రుల బాధ్యత కూడా ఉంటుంది కనుక వారు కూడా శిక్షా­ర్హులే!

57 ఏళ్ల తర్వాత ప్రజల ప్రశ్న!
1969లో బ్యాంకుల జాతీ­యీ­క­రణ లక్ష్యం ప్రజల ఆర్థిక సాధి­కా­రత. 2026లో 57 సంవ­త్స­రాల తర్వాత మనం అడు­గు­తున్న ప్రశ్న: “ప్రజల కోసం జాతీ­య­క­రణం చేసిన బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రజ­లనే భయపెట్టే వ్యవ­స్థగా, పెద్ద రుణ­గ్ర­హీ­త­లకు మాత్రం పరి­ష్కార మార్గాలు చూపించే వ్యవ­స్థగా మారిందా?” ఇది కాంగ్రె­స్ను వెన­కే­సు­కొచ్చే ప్రశ్న కాదు. బీజే­పీని నిందించే ప్రశ్న కూడా కాదు.

అధి­కా­రంలో ఎవరు ఉన్నా ప్రజా­ధ­నా­నికి ఒకే ప్రమాణం ఉండా­లనే ప్రశ్న.వెనక నుంచి వేల కోట్ల రుణాల ఏను­గుల మంద కదు­లుతుంటే, ముందున్న చిన్న రుణ­గ్ర­హీ­తల బొద్దిం­క­లనే పట్టు­కుంటూ ఉంటే ఆ వ్యవస్థ మీద ప్రజ­లకు అను­మానం రావడం తప్పా? చివ­రికి గుర్తుం­చు­కో­వా­ల్సింది ఒక్కటే.ప్రజల సొమ్ముకు కాప­లాగా ఉండా­ల్సిన బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రజల అభి­వృ­ద్ధికి పునా­దిగా నిల­వాలి; సంప­న్నుల రుణ­భా­రాన్ని మోసే పల్ల­కీగా కాదు!!

వీరేంద్ర కాపర్తి
సీని­యర్‌ జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News