బండి సంజయ్ కుమారుడి దురాగతంతో తెలం గాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణే కాదు, యావత్ దేశమే ఇటువైపు చూసే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం కేంద్ర సహాయమంత్రి కుమారుడు చేసిన బరితెగింపు భాగోతం. ఒక మైనర్ బాలికను లొంగదీసుకుని వాడుకుని, పలుమార్లు అత్యాచారం చేయడం చర్చానీయాంశంగా మారింది. పైగా అధికార గర్వంతో ఏ కోర్టులు, చట్టాలు ఏమీ చేయలేవనే ధీమా తో తండ్రీ కొడుకులు చెలరేగిపోయారు. ఆఖరికి బాధి తుల గట్టి పట్టుదలతో పోలీసులు బండి భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టక తప్పలేదు. ఈ సంఘటన ద్వారా అధికార దురహంకారం ఎంతకైనా తెగిస్తుందని మరో సారి నిరూపితమయ్యింది. ఏం జరిగినా మా తండ్రి చూసుకుంటాడని కొడుకు, మేం ఏం చేసినా కేంద్రంలో మా పార్టే అధికారంలో ఉన్నదని బండి సంజయ్ అనుకోవచ్చు. కానీ, చట్టం ముందు అందరూ సమా నులే అన్నది మరిచిపోయారు. అన్నిసార్లు తప్పించుకో లేరనే నిజాన్ని అంగీకరించి తీరాలి.
దేశంలో బీజేపీ వచ్చాక పెరిగిన రేప్‌లు
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీ పవర్‌ను చేజిక్కిం చుకుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రథం బలహీను లపైకి మళ్లింది. ఛోటా మోటా దందాలు చేసే వాళ్లంతా బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. కొందరైతే ఎలాంటి అర్హతలు లేకపోయినా మంత్రులు కూడా అయ్యారు. వారు గట్టిగా మాట్లాడితే ఒక గల్లీకి కూడా పనికి రారు. అలాంటి వారిని ఢిల్లీ స్థాయి నేత లను చేసింది బీజేపీ. వారికి సూడో దేశభక్తిని నూరి పోసింది. హిందూ ఓట్లను పోలరైజ్ చేయడం కోసం నిత్యం కాంట్రవర్సీలను ఆశ్రయించేలా తీర్చిదిద్దింది. ఇది బయటికి కనపడే ముఖం. మరోవైపు ఇదే నాయ కులు అధికారం ఉంది కదా అని చెలరేగిపోయారు. హత్యలు, అత్యాచారాలకు వెనకాడ లేదు. అట్లా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం వల్ల హిందు త్వ శక్తుల ఆగడాలకు పట్టాపగ్గాలు లేకుండాపో యాయి. ఏం జరిగినా పవర్‌లో ఉన్నది మనమే. మనకు మోడీ ఉన్నాడనే భరోసాతో అఘాయిత్యాలకు పాల్ప డ్డారు. దీంతో క్రైం రేటు క్రమంగా విపరీతంగా పెరి గింది. ఈ పన్నెండేండ్ల పాలనలో వేల సంఖ్యలో రేప్‌లు జరిగాయని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చెప్తు న్నాయి.
పోక్సో కేసుల్లో అత్యధికంగా భాజాపా నేతలే!
2012లో బాలికల సంరక్షణ కోసం తీసుకొచ్చిందే పోక్సో చట్టం. ఈ చట్టం పరిధిలో 18 యేండ్ల లోపు పిల్లలపై ఎలాంటి లైంగిక దాడి జరిగినా కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. బెయిల్‌కి కూడా అవకాశం ఉండొద్దని చట్టంలో పేర్కొన్నారు. ఈ శిక్ష అత్యధికంగా జీవితకాలం లేదా మరిణించేవరకు అమలు చేయబడు తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు బుక్కయిన నేతల జాబితా చూస్తే, అందులో కూడా భారతీయ జనతా పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. 2014లో ఉత్తర ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా దుద్ది నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్దులర్ గోండ్ అనే ఆయన మైనర్ బాలికపై రేప్ చేశాడని నిరూపితమైంది. పోక్సో కేస్ నమోదు కావడం వల్ల 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఆ తరువాత అదే ఉత్తరప్రదేశ్‌లో కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే, 2018లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. కేసు బుక్ అయినప్పటికీ సీఎం యోగి తది తర నేతల సహకారంతో బెయిల్‌పై బయటికి వచ్చి స్వే చ్ఛగా తిరుగుతున్నాడు.
ఇక 2020లో పశ్చిమ బెంగా ల్లోని బుర్దాన్‌లో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మైనర్ బాలికపై రేప్ చేసి దొరికిపోయాడు. అలాగే 2022లో త్రిపురలో బీజేపీ మినిస్టర్ భగవాన్‌దాస్ కుమారుడు 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. ఇతడిపై కూడా పోక్సో కేసు నమోదు అయ్యింది. ఇక 2024లో కర్ణాటకలో సామాజిక కార్తకర్తను రేప్ చేశాడు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం. ప్రస్తుతం ఈయన కూడా జైలు లోనే ఉన్నాడు. అలాగే గత యేడాది అంటే 2025 ఉత్తరాఖండ్ హరిద్వారలో బీజేపీ జిల్లా నాయకుడు 13 ఏళ్ల బాలికపై తల్లి ముందు గ్యాంగ్ రేప్ చేశాడు. ఇట్లా ఇవి మచ్చుకు కొన్ని మాత్ర మే. మీడియా వెలుగులోకి రానివి అనేకం ఉన్నాయి. ఇక్కడే బీజేపీ సానుభూ తిపరులు ఒక విమర్శ చేస్తు న్నారు. కాంగ్రెస్ పాలనలో రేప్‌లు జరగలేదా? అని. అప్పుడు జరిగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లన్నీ బీజేపీతో సహా రొడ్డె క్కాయి. అప్పుడు జరిగాయి కాబట్టి ఇప్పుడూ జరు పుతాం అంటే అది వితండవాదం అవుతుంది. ఆ గ్యాంగ్ రేప్‌ల విషాదం తమ సొంతవాళ్లకు అయితే తప్ప దాని తీవ్రత అర్థం కాదు.
అధికారం ఉంటే భరితెగించడమేనా?
ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది తమను రేప్‌లు చేయమని కాదు. తమను పాలించి, తమ సమ స్యల్ని పరిష్కరించమని. ఆ విషయాన్ని మరిచిపోయి చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొని ఆడబిడ్డలపై అత్యా చారాలకు పాల్పడతం అంటే చరిత్ర మరిచిపోదు. బీజేపీ నేతలు అధికారం కోసం బయటికి హిందువులం-బంధువులం అనే నీతులు చెప్తున్నారు. తెర వెనక మాత్రం ఇట్లా గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతున్నారు. బేటీ బచావో అంటూనే ఇట్లా భక్షిస్తున్నారు. తమ బేటాలను మాత్రం రక్షించుకుంటున్నారు. బండి భగీరథ్ పాఠ శాల విద్యార్థిగా ఉన్న రోజుల నుండి ఇదే తీరుగా ప్రవర్తించాడని అతడి పాత వీడియోలు తెలియజేస్తు న్నాయి. తన తండ్రి అధికారంలో ఉంటే ఎవ్వరినైనా కొట్టొచ్చా? ఏ ఆడపిల్లనైనా చెరచొచ్చా? పైగా బాధితు రాలి మీదనే కౌంటర్ కేసులు పెట్టి విషయాన్ని తప్పు దోవ పట్టించడం సిగ్గుచేటు! పైగా ఎల్లో మీడియా కూడా దీనిని హనీ ట్రాప్ కేస్గా ప్రచారం చేయడం ఈ దశా బ్దపు విషాదం. జర్నలిజానికి మాయని మచ్చ. బాధితుల పట్ల గొంతు విప్పాల్సిన మీడియా ఇట్లా అమ్మాయినే దోషిని చేయడం మన తెలుగు మీడియాకే చెల్లింది.
పౌర సమాజం మేల్కోవాలి!
తమ అధికారం కోసం ‘జై శ్రీరామ్’ అనే భాజపా నేతలను ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. తన కొడుకును పట్టించుకోకపోవడం వల్లనే అట్లా తయార య్యాడు అన్నాడు బండి సంజయ్. తన కొడుకునే పట్టించుకోలేనివాడు ప్రజలను ఏం పట్టించుకుంటాడు? నిత్యం శ్రీరంగ నీతులు చెబుతూ పిల్లి నన్ను ఎవ్వరూ చూడడం లేదని పాలు తాగినట్టు ఇంతకాలం మభ్యపె ట్టాడు బండి. ఇవాళ మాత్రం పాపం పండి తన కొడుకు దుర్మార్గాలు బయటపడ్డాయి. అధికారం ఉంది కదా అని ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న రూలింగ్ పార్టీ నేతల దుశ్చర్యల గురించి జనం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో నీతులు చెబుతూ ఆడబిడ్డల మాన ప్రాణాలకు గోతులు తవ్వుతున్నారనే చేదు నిజాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. శ్రీ రాముడి జపం చేస్తూ గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతున్న నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభు త్వం కూడా ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుం డా కొరడా ఝుళిపించాలి. కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా సినిమాల్లోనే పొలిటీషయన్ల కొడుకులు గ్యాంగ్ రేప్‌లు చేస్తారని చూశాం. ఇప్పుడు మాత్రం ఈ కాలపు రాజకీయ నాయకులు మనకు లైవ్‌లో చేసి చూపిస్తున్నారు. ఇది మన రాష్ట్రానికే తలవంపు. ఇలాంటి నేతల నుండి తెలంగాణను కాపాడుకోవడం ప్రతీ తెలంగాణ పౌరుడి బాధ్యత!
–
కాలమ్ : మార్జినల్ వాయిస్
డా. పసునూరి రవీందర్
రచయిత, సామాజిక విశ్లేషకులు

