Friday, March 13, 2026
Homeఎడిటోరియల్ / బహుళIndian Constitution Article 25: విద్వేష భారతం... విపరీత పరిణామం

Indian Constitution Article 25: విద్వేష భారతం… విపరీత పరిణామం

Religious Freedom India: వ్యతిరేకత ద్వేషంగా, ద్వేషం కసిగా, కసి పగగా మారుతుంది. గడిచిన పదేళ్లలో ఈ విద్వేషాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటి దాకా దేశంలో కులాలు, మతాలే ఉండేవి. ఇప్పుడు ద్వేషాలు, అసహ నాలుగా మారాయి. మనది సెక్యులర్‌ దేశం. ఈ విష యం అందరికీ తెలుసు. ఒప్పుకోం అనే వాళ్లు కొంద రు. ఎవరో కొందరు ఒప్పుకోనంత మాత్రన చరిత్ర మాసిపోదని ఇంకొందరు. అసలు సమస్యల్లా మత మైనారిటీల పట్ల ఇటీవల ఈ విద్వేషం పెచ్చరిల్లి పోతోంది. కుట్రపూరితంగా క్రైస్తవులు, ముస్లింల మనసులను గాయపరుస్తున్నారు.

- Advertisement -

భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం వన పర్తి జిల్లాలో దళిత క్రైస్తవుల మీద హిందుత్వవాదులు దాడి చేశారు. హిందుత్వ వాదులకు ఈ రకమైన ద్వేషాన్ని నూరిపోస్తున్నదెవరు? అన్య మతస్తుల మీద దాడులు చేసి, భయపెట్టి బూతులు తిడితే ఆ క్షణానికి వారికి రాక్షసానందం కలుగవ చ్చు. కానీ, ఆ తరువాత పరిస్థితి ఏమిటి? దేశంలో శాంతిభద్రతల సమ స్యకు దారి తీయదా? నిత్యం అశాంతి అల్లర్లు రగలించడం వల్ల సాధించేది ఏముంది?

టార్గెట్‌ క్రైస్తవులా?!

ఔను, ఇప్పుడు హిందుత్వ, సంఘపరివార్‌ శక్తులకు టార్గెట్‌ క్రైస్తవులే. క్రైస్తవుల మీద విపరీతమైన అకారణ ద్వేషాన్ని హిందువుల్లో నింపుతున్నారు. వారు దళితులన్న చిన్నచూపు కూడా కారణం కావచ్చు. దీంతో అమాయక హిందువులు ఆ ట్రాప్‌లో పడుతున్నారు. తమ మ తాన్ని తాము ఆరాధించుకుంటే ఎవరికీ ఏ సమస్యా లేదు. కానీ, ఈ అన్య మతస్తులను దోషులను చేసి దాడులు చేసి గాయపరచడమే ఇప్పుడు అస లు సమస్య. ఇంతకాలం ముస్లింల మీద దాడులకు తెగపడ్డ సంఘ్‌ పరి వార్‌ శక్తులు, ఇప్పుడు క్రైస్తవుల మీద పడుతున్నారు.

ఆ తరువాత ఎవరనే ది కూడా స్పష్టమే. అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టుల మీద కూడా ఏకకాలం లో సోషల్‌ మీడియాలో విషం చిమ్మడం నిత్యకృత్యమైంది. వీలైనంతగా విద్వేషం చిమ్ముతూ తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ దేశం లో పుట్టి పరాయి మతాన్ని పాటించడం మహా పాపంలా భావిస్తున్నారు. అందుకు క్రైస్తవుల తల్లుల్ని, అక్క చెల్లెల్ని ఎట్లా పడితే అట్లా దూషిస్తు న్నారు. అంతగా పగ ఎందుకు పెరిగిపోతున్నది అన్నది సభ్య సమాజం ఆలోచించాల్సిన విషయం.

క్రైస్తవులు ఎందుకు టార్గెట్‌?

దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు 27.8 మిలియన్ల మంది ఉన్నారు. వీరంతా ఇటీవల క్రైస్తవం స్వీకరించినవాళ్లు కాదు. వీరి లో చాలామంది తాతల కాలం నుండి క్రైస్తవులుగానే ఉన్నవాళ్లు. బ్రిటీష్‌ వారి కాలంలోనే ఆ మతంలోకి పోయినవారే సింహభాగం. ఇట్లా వెళ్లిన వారు తమదే ఒక లోకంగా బ్రతుకుతుంటారు. వీరిలో కూడా దళిత క్రైస్త వులే మేజర్‌గా ఉన్నారు. ఇక అగ్రవర్ణాల నుండి, బీసీల నుండి కూడా క్రైస్తవ్యం స్వీకరించిన వారూ లేకపోలేదు. మోడీ అధికారంలోకి వచ్చాక అన్యమతస్తుల మీద దాడుల పర్వం పెరిగిపోయింది. అధికారంలో తమ పార్టే ఉండే సరికి ఈ దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. బీజేపీ అండ అనేది వీరందరిని ఇట్లా తయారుచేస్తున్నది.

వీరు చేస్తున్న దాడులన్నింటికీ రకరకాల కుంటిసాకులు చెప్పడం కూడా పరిపాటిగా మారింది. అందులో ప్రధానమైంది దళితులు క్రైస్తవం స్వీకరించినా కూడా ఎస్సీ కులం సర్టిఫికెట్‌ ఎట్లా తీసుకుంటారు? అనేది వారి ప్రధాన ఆరో పణ. ఈ ఆరోపణలో దళితుల మీద ప్రేమ ఉం దా? లేక రిజర్వేషన్లను పరిరక్షించే బృహత్తర బాధ్యత తీసుకుంటున్నారా? అనేది వారికే స్పష్టత లేని విషయం. వారికి ఈ పేరుతో క్రైస్తవు లను అమ్మనా బూతులు తిట్టొచ్చనేది ఎత్తుగడ. నిజానికి క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్‌ ఎవరు ఇస్తారు? మరి ఆ ప్రభుత్వ ఎమ్మార్వో, తహ సీల్దార్‌ ఎందుకు సరిగా పరీక్ష చేయడం లేదు. అది వారి తప్పు కాదా?! మరి ఈ నేరాన్ని కేవ లం క్రైస్తవుల మీద వేసి ఇట్లా వారిని దొంగలను చేసి ఏ రకమైన తృప్తి పొందుతున్నారు అనేది వారికే తెలియాలి. ఇక వారు మోపే మరొక దుర్మార్గమైన నింద కూడా ఉంది.

ఈ దేశంలో పుట్టి పరాయి దేశానికి చెందిన దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తారు? అని. ఇది లౌకిక దృక్పథానికే గొడ్డలిపెట్టు. ఈ దేశంలో పుట్టినవాళ్లు ఈ దేశపు దేవుడినే ఆరాధించాలని రాజ్యాంగంలో రాసి ఉందా? అనేది వీరు ఆలోచించరు. మతం, దైవారాధన అనేది వ్యక్తం గతం. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు అని మన ఆర్టికల్‌ 25-28లలో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 25(1): మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని స్వీకరించే హక్కు, నైతికత, ఆరోగ్యం, ప్రజా క్రమానికి లోబడి ఉంటుంది. మత ప్రచారం: నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడులకు అవకాశం లేదు. ఆర్టికల్‌ 26: మత సంస్థ లను స్థాపించుకునే మరియు నిర్వహించుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఆర్టి కల్‌ 27: మత ప్రచారం కోసం పన్నులు విధించరాదు. ఆర్టికల్‌ 28: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన బోధనలను నిషేధిస్తుంది. ఈ ఆర్టికల్స్​‍ తెలియని మూర్ఖులు భౌతిక దాడులకు తెగపడుతున్నారు.

ఎందుకు క్రైస్తవులుగా మారారు?

దళితులు ఎందుకు క్రైస్తవులుగా మారారన్నది హిందుత్వవాదులు మరిచిపోతున్నారు. ఈ దేశంలో కులవ్యవస్థ పేరు మీద దళితులను అంటరాని వాళ్లను చేసింది మనువాదం. గుడికి, బడికే కాదు ఊరికి సైతం దూరం చేసి, కనీస హక్కులు లేకుండా చేసింది. అట్లా మూడువేల యేం డ్లుగా మనుషులుగా చూడలేదు. దీంతో దళితులకు ఆత్మగౌరవం అనేది దక్కకుండా చేశారు. మనిషిని మనిషిగా చూడని దుర్మార్గం యేండ్లకు యేండ్లు బాధించింది. ఈ బాధ నుండి ఒక ఉపశమనంగా వారికి క్రైస్తవం కనిపించింది. వారు చదువు చెప్పి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపిం చడమే కాదు మనిషిగా గుర్తించారు. దళితులకు ఇంతకంటే ఏం కావాలి? అట్లా క్రైస్తవంలోకి వెళ్లిన దళితులే చదువులోకి, ఉద్యోగాల్లోకి వచ్చారు. ఫలితంగా అభివృద్ధి మార్గం పట్టగలిగారు.

ముఖ్యంగా మనుషులుగా గుర్తించబడ్డారు. అదే హిందూమతంలో కులవ్యవస్థ అంటరానితనం పేర దళితులను అమానుషంగా చూసింది. చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. పాలించే పాలకులుగా మారేందుకు వీలు లేకుండా చేసింది. పోని కష్టపడి సంపాదించి ఆస్తులు కూడబెట్టుకోవడానికి కూడా అడ్డుపడ్డది. ఇన్ని రకాలుగా ఒక జాతి జాతి మొత్తాన్ని సమూలంగా అభి వృద్ధికి, అవకాశాలకు దూరం చేసింది హిందూమతం. అదే హిందూ మతం దళితులను గౌరవించి మనుషులుగా చూసి ఉంటే వారు క్రైస్త వంలోకో మరో మతంలోకో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది అనేదా నికి సమాధానం లేదు. మరి తమ మతం దగ్గర తప్పు పెట్టుకుని ఈ రకమైన దాడులు చేయడం దౌర్జన్యమే అవుతుంది.

దళితులు ఈ దేశస్తులు కాదా?!

ఇటీవల బీజేపీ సంఘపరివార్‌ కార్యకర్తలు మరో కొత్త వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. అదే దళితులు ఈ దేశస్తులు కాదు, వారంతా క్రైస్తవంలోకి పోయిన దేవుని బిడ్డలు అని గంపగుత్తగా 20 కోట్ల మంది అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఏసుక్రీస్తును ఆరాధిం చినంత మాత్రాన ఈ దేశం వారు కాకుండా పోతారా? ఇతర దేశాల పౌరసత్వం పొందుతారా? అన్నది వారి అజ్ఞానానికే వదిలేయాలి. ఈ దేశంలో దళితులు తమ రెక్కల కష్టంతో జాతిసంపదను పెంచారు. సిం ధూలోయ నాగరికత కంటే ముందు నుండి దళితులు ఈ దేశ మూల వాసులు. బయటి దేశాల నుండి వచ్చిన బ్రాహ్మణ, బనియాలు వారి అస్తిత్వం కోసం డబ్బుపెట్టి హిందుత్వాన్ని పెంచి పోషిస్తూ బహుజనుల మధ్య చిచ్చు పెడుతున్నారు. తద్వారా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తు న్నారు. ఈ ప్రమాదాన్ని బహుజనులు అర్థం చేసుకోవాలి. లేకుంటే ఈ దాడుల పరంపర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

క్రైస్తవులు చేస్తున్న తప్పు?

మరోవైపు బాధితులుగా ఉన్న క్రైస్తవులు, ఇంత జరుగుతున్నా ఏకం కాకుండా చోద్యం చూస్తున్నారు. ఒక చెంప కొడితే, మరో చెంప చూపించే శాంతిమంత్రం వారిని ఎంత మాత్రమూ కాపాడలేదు. అమెరికాలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ చర్చిల కేంద్రంగా హక్కుల ఉద్యమం నిర్మించారు. తద్వారా నల్లజాతి ప్రజలకు హక్కులు సాధించారు. భారతదేశంలో మాత్రం క్రైస్తవ మత పెద్దలు ఎంతసేపు పరలోక ధ్యాసలో తప్ప, రాజ్యాంగాన్ని, అది ప్రసాదించిన హక్కులను కాపాడుకుందాం అనే సోయిలో లేకపోవడం విచారకరం. దీనివల్లనే ఒరిస్సాలో 1999 జనవరి లో గ్రహమ్‌ స్టెయిన్స్​‍ను అతడి ఇద్దరి కుమారులను సంఘపరివార్‌ శక్తు లు దారుణంగా సజీవ దహనం చేశారు.

అలాగే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో క్రైస్తవ నన్స్​‍ను చెరిచారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా సరే క్రైస్తవ సమాజానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. ఇప్పటికైనా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మార్గంలో చర్చిల్లో భారత రాజ్యాం గాన్ని పంచి పెట్టాలి. సరికొత్త చైతన్యాన్ని ప్రసాదించాలి. ఇప్పటికే ముస్లిం లు మసీదుల్లో భారత రాజ్యాంగాన్ని పంచి పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేశారు. క్రైస్తవులు సైతం తమ మద్దతుదారులైన సెక్యులరిస్టులతో కూట మిగా తయారవ్వాలి. ఈ దాడులు పెరుగకుండా లా అండ్‌ ఆర్డర్‌ ద్వారా మరింత ఒత్తిడి తేవాలి. లేకుంటే రేపు క్రైస్తవుల మీద పెరిగే దాడులు లెక్కకు మించుతాయి. బైబిల్లో పేర్కొన్నట్టు ప్రార్థన చేయు వారు ప్రార్థన చేయాలి. యుద్ధం చేయువారు యుద్ధం చేయాలి.

డా. పసునూరి రవీందర్‌
(రచయిత, సామాజిక విశ్లేషకులు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News