వరుస వైఫల్యాలను చవిచూస్తున్న భారత క్రికెట్ జట్టు మళ్లీ పట్టాలెక్కాలన్న పక్షంలో క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బి.సి.సి.ఐ) వెంటనే చర్యలు తీసుకోక తప్పదు. నిజానికి ఈ వైఫల్యాలకు చాలావరకు క్రికెట్ కంట్రోల్ బోర్డే కారణం. సెలక్టర్ల కమిటీకి చాలా నెలలుగా చైర్మన్ ను నియమించకపోవడం వల్ల క్రికెట్ జట్టు ఇప్పటికే దారి తప్పింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకుండా కంపెనీని నిర్వహిస్తున్నట్టుంది. 2013 న ఎంచి ఇంతవరకూ అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు విజయం సాధించిన పాపాన పోలేదు. మూడు సాధారణ విజయాలు, 11 నాక్ అవుట్లు. అంతేకాదు, 50 ఓవర్ల వరల్డ్ కప్ తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ మీద రెండు విజయాలు సాధించడం జరిగింది. అది తప్ప ఈ పదేళ్ల కాలంలో భా రత క్రికెట్ జట్టు నుంచి ఒక్క శుభవార్త కూడా లేదు. జట్టు గురించి ఆలోచించినవారికి జట్టు పరిస్థితి పైన పటారం లోన లొటారంలా కనిపిస్తుంది. ప్రపంచంలోని క్రికెట్ జట్లులన్నిటితోనూ పోల్చి చూస్తే భారత జట్టు అత్యంత సంపన్నమైన జట్టు కింద లెక్క. అంతేకాదు, జట్టు సభ్యులలో ప్రతిభా పాటవాలకేమీ లోటు లేదు. అయినప్పటికీ, ఓవల్ లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పోటీల్లో ఆస్ట్రేలియా చేతుల్లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడం జట్లులోని లోపాలకు అద్దం పడుతోంది.
భారత జట్టు ఈ పోటీల చివరి రోజున 209 పరుగుల తేడాతో ఓడిపోవడం దేశానికి తీరని తలవంపులు తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. ఈ జట్టులో చాలా కాలం క్రితమే మార్పులు, చేర్పులు చేయాల్సింది. జట్టులో ఎక్కువ మంది సభ్యులు 30 ఏళ్ల పైబడినవారు. వీరి స్థానంలో యువ రక్తాన్ని తీసుకు రావడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇంతవరకూ చేసిందేమీ లేదు. చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. పైగా, ఈ పరిస్థితి యథాతథంగా కొనసాగడానికి బోర్డు అవకాశమిచ్చింది. దురదృష్టవశాత్తూ గత కొన్ని నెలలుగా సెలక్టర్ల కమిటీకి చైర్మన్ కూడా లేరు. మరో నాలుగు నెలల కాలంలో స్వదేశంలో మరో వరల్డ్ కప్ జరగబోతున్న పరిస్థితుల్లో చైర్మన్ ఎంపికకు ఇంతవరకూ ప్రయత్నం కూడా ప్రారంభం కాలేదు. అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ సాధించడం వీరి ధ్యేయం అయితే, క్రికెట్ పరిస్థితి తప్పకుండా వేరే విధంగా ఉండేది. సొంత ఇంటిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేసేవారు.
జట్టుకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. క్రికెట్ జట్టుకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ను నియమించడం, రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయడం ఇంతవరకూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. సుమారు 34 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని బట్టి, అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ గెలుచుకునే విషయంలో క్రికెట్ బోర్డు ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఐ.పి.ఎల్ పోటీల కోసం అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయడం జరిగింది. అతను ఐ.సి.సి టైటిల్స్ను చేజిక్కించుకుంటాడని ఆశించడం అత్యాశే అవుతుంది. ఐ.పి.ఎల్ లో అతను అద్భుతాలు చేస్తాడని అంతా ఆశించారు కానీ, చివరికి అటువంటిదేమీ జరగలేదు. తన జూనియర్లతో ఏర్పడిన జట్టుకు ద్రావి్‌డ మార్గదర్శనం చేయగలడని ఆశించారు. కానీ, అతను వారికి సరైన శిక్షణనిచ్చినట్టు కనిపించలేదు. ఆ జూనియర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా రాణించలేదు. అయితే, కొన్ని విషయాల్లో అతని పదవీ కాలం చాలామందికి శాశ్వతంగా గుర్తుండిపోతుంది. టి-20 జట్టుకు కొందరు క్రికెటర్లను ఎంపిక చేసిన ఘనత అతనికే దక్కుతుంది. అతి తక్కువ స్కోరు సాధించిన బ్యాట్స్మన్ లను చేరదీయడం, ఆటగాళ్లను ఆత్మరక్షణలో తీర్చిదిద్దడం, వారు మైదానంలో గాయపడేలా చేయడం వంటివి అతని రికార్డుల్లో కొన్ని.
BCCI: క్రికెట్ వైఫల్యాలకు బీసీసీఐ కారణం?
ప్రపంచంలోని క్రికెట్ జట్లులన్నిటితోనూ పోల్చి చూస్తే భారత జట్టు అత్యంత సంపన్నమైన జట్టు కింద లెక్క