Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Be carefull: మన గుండె జర భద్రంగా ఉంచుకోవాలి

Be carefull: మన గుండె జర భద్రంగా ఉంచుకోవాలి

ఈ మధ్య భారతదేశంలో ఎక్కువ మందికి హార్ట్‌ ఎటాక్స్‌ వస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యుక్త వయస్సులో వారికి కూడ గుండె పోటు రావడం చూస్తున్నాము. ముఖ్యంగా కంప్యూటర్‌ ముందు పని చేసేవారికి, రాత్రి పూట పని చేసేవారికి తరచుగా గుండె సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. శరీరానికి శ్రమ లేకపోవడం, గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవడం, జంక్‌ ఫుడ్‌ అధికంగా సేవించడం, పబ్‌, క్లబ్‌ లలో లేట్‌ నైట్‌ పార్టీలతో కాలం గడపటం, ధూమపానం, మద్య పానం ఎక్కువ మోతాదులో తీసికోవడంతో గుండెకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం గుండె సరిగా పని చేయకపోవడంతో ఆకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా సరైన ఆహారం తినకపోవడం అని తేలుతోంది. కొలెస్ట్రాల్‌ తయారయ్యే ఆహారం తినేవారికి హార్ట్‌ ఎటాక్‌ లేదా కార్డియాక్‌ అరెస్ట్‌ జరుగుతోంది. హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారు బతికే అవకాశాలు ఎక్కువ. కార్డియాక్‌ అరెస్ట్‌ అయితే వెంటనే చనిపోతారు.
హార్ట్‌ ఎటాక్‌కీ సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌కీ చిన్న చిన్న తేడాలున్నాయి. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్ర త్తలు తీసుకుంటే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ నుంచి తప్పించు కోవచ్చు. మన శరీరం బయట ఉండే అవయవాలకు ఏదైనా తేడా వస్తే మనం ఇట్టే కనిపెట్టి జాగ్రత్తలు తీసు కుంటాం, కానీ శరీరం లోపల ఉండే అవయవాలకు ఏమ వుతుందో, ఎలా ఉన్నాయో తెలియదు. వాటికి ఏమైనా అయితే.. లక్షల రూపాయలు వదిలిపోతాయి. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చనా ప్రాణాలు దక్కవు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే.. మనం మంచి ఆహారం తీసుకోవాలి. మైదా, పామాయిల్‌, మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే… ఆరోగ్య అవగాహన పెంచుకోవాలి. తద్వారా గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. సినిమాల్లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చినప్పుడు ఆ వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే.. ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చూపిస్తారు. గుండెకు రక్త సరఫరాలో తేడా వస్తే.. అది హార్ట్‌ ఎటాక్‌ అవుతుంది. అలా జరిగినప్పుడు 6 గంటలపాటూ బతికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా డైరెక్టుగా గుండెలోనే తేడా వస్తే వెంటనే చనిపోతారు. దీన్ని కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. ఇది వస్తున్న విషయం కూడా తెలియదు. వచ్చిన ఒకట్రెండు సెకండ్లకే చనిపోతారు. ఇవి రెండూ కాకుండా మరొకటి ఉంది. అదే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌. అసలైన హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న హార్ట్‌ ఎటాక్స్‌లో 45 శాతం వాటికి ముందుగా సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వస్తోంది. స్త్రీల కంటే పురుషులకే ఇది ఎక్కువగా వస్తోంది.
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌ని మెడికల్‌ భాషలో సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇన్ఫ్రాక్షన్‌ అంటారు. ఈ సైలెంట్‌ హార్ట్‌ సమస్య ఏదో ఒక సమయంలో వస్తుంది. ఛాతీ దగ్గర నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది. అది తాత్కాలికంగా వచ్చి పోతుంది. దాంతో ఏం కాదులే అనుకుంటారు చాలా మంది. దాన్ని నిర్లక్ష్యం చేయడంతో… ఆ తర్వాత ఏదో ఒక రోజు అసలైన హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోతుంటారు. సగం కేసుల్లో ఇలాగే జరుగుతోంది. సరైన సమయానికి గుండెను పట్టించుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
సైలెంట్‌ హార్ట్‌ లక్షణాలు
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చినప్పుడు చెస్ట్‌ దగ్గర భారీగా నొప్పి రాదు. చిన్నగా వస్తుంది. చెయ్యి, మెడ, దవడ దగ్గర చిన్నగా నొప్పి వస్తుంది. కళ్లు మసకబారతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ కావచ్చు. చాలా మంది ఈ లక్షణాలు… గుండె సంబంధిత సమస్యవి అని గుర్తించలేరు. తెలియక నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల కొన్నాళ్లకు అసలైన గుండె నొప్పి వచ్చి చనిపోతుంటారు. మీకు సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందా లేదా అనేది ఈ లక్షణాలతో గుర్తించవచ్చు. రొమ్ము దగ్గర చిన్నగా నొప్పి వస్తుంది. ఎవరో అక్కడ నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఎవరో మీ చెస్టును నిమ్మకాయ పిండినట్లు పిండుతున్నట్లుగా అనిపిస్తుంది. గుండె మండుతున్నట్లు వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అసౌకర్యంగా ఉంటుంది. రాబోయే హార్ట్‌ ఎటాక్‌ లక్షణాలు శరీరంలోని కొన్ని అవయవాలపై కనిపిస్తాయి. రొమ్ము దగ్గర నొప్పితో పాటూ… చేతులు, వెన్నె ముక, మెడ, దవడ, పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కాబట్టి గుర్తించడం అంత తేలిక కాదు. ఎక్కువ మందికి బ్యాక్‌ పెయిన్‌ వస్తుంది. శరీరం చుట్టూ తాడు కట్టినట్లు ఫీలవుతారు. కొంత మందికి ఊపిరి ఆడదు. జనరల్‌గా పరుగెడితే ఊపిరి ఆడదు. మెట్లు ఎక్కినప్పుడు అలసట వస్తుంది. ఇలా ఎందుకంటే… బాడీకి కావాల్సిన ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండె సరిపడా సరఫరా చెయ్యలేనప్పుడు ఇలా అవుతుంది. రొమ్ము దగ్గర అసౌకర్యంగా ఉన్నప్పుడు ఊపిరి సరిగా అందకపోవడం సాధారణ సమస్య. ఐతే ఇది సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ లక్షణం కూడా అవ్వగలదు. అలాగే కళ్లు మసకబారతాయి. ఎదురుగా ఉన్నవి సరిగా కనిపిం చవు. జిడ్డుగా అవుతాయి. ఇలా అయినప్పుడు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి రోజువారీ పనులు చేసుకోలేరు. వాకింగ్‌కి వెళ్లడం, బట్టలు ఉతకడం కూడా కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితి వస్తే… సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వచ్చినట్లే అనుకోవచ్చు. కొంత మందికి వికా రంగా ఉంటుంది. ఉక్కగా లేకపోయినా చెమటలు పడుతుంటాయి. అలా జరిగితే వారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెంటనే డాక్టర్‌ని కలిసి సలహాలు, సూచనలూ పాటించాలి. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలంటే… తరచూ గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ ఎంత ఉన్నాయో పరీక్ష చేసుకోవాలి రోజూ కనీసం 3 కిలోమీటర్లు వేగంగా నడవాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
ఆళవందార్‌ వేణు మాధవ్‌
8686051752.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News