బీర్ పూర్ మండలలోని మంగేల గ్రామంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కళాబృందం వారితో గంజాయి, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సమాజంలో జరుగుతున్న నేరాలపై మరింత అవగాహనా కల్పించాలని, అలాగే ప్రజలను ఈ అవగాహన కార్యాక్రమంలో భాగ్యసాములుగా చేస్తు చైతన్యవంతులుగా చేయాలని, నేరం జరగక ముందే నేరం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, సమాజంలో పేరుకుపోతున్న మూడనమ్మకాలు, యువకులలో పెరిగిపోతున్న చెడు అలవాట్లు, రోడ్డుప్రమాదాల నివారణ, వాటిగురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, సమాజంలో తల్లిదండ్రుల ప్రాధాన్యత, వారి విలువల గురించి, స్త్రీల రక్షణలో భాగంగా పోలీసుల షీ టీం పనితీరు, సెల్ ఫోన్ ను ఎక్కువగా వాడటం వలన, టీవీ ఎక్కువగా చూడటం వలన కలిగే దుష్పరిణామాలు, విద్యా వికాసం పై అవగాహన , అపరిచితుల మాటల వలన, వారి స్నేహం వలన కలిగే నష్టాలు, గుట్క పాన్ మసాలా తినడం వలన కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై, బాల్య వివాహలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను పాటల ద్వార , మాటల ద్వారా మ్యాజిక్ రూపకంగా చైతన్య పరుస్తూ పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువలో అయ్యే విధంగా కృషిచేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో డి.ఎస్.పి. రాఘ చందర్, బీర్ పూర్ మండల ఎస్సై కే. కుమారస్వామి,పోలీస్ సిబ్బంది, కళా బృందం సభ్యులు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.