Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్BJP governance: బీజేపీ పాలన ఎలా ఉండబోతోంది?

BJP governance: బీజేపీ పాలన ఎలా ఉండబోతోంది?

ప్రధానమంత్రిగా మూడవ పర్యాయం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ పాలన తీరు ఈసారి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భారతదేశం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఇటువంటి సమయంలో మోదీ వెనుకటి రెండు పదవీ కాలాలలో మాదిరిగానే పాలన కొనసాగిస్తారా లేక దేశం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు దీటుగా స్పందిస్తారా అన్న కీలక ప్రశ్న దేశ ప్రజలను తొలి చేస్తోంద నడంలో సందేహం లేదు. వెనుకటి పాలనా కాలంలో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? వెనుకటి పాలనకు కొనసాగింపుగా ఉండబోతోందా? ఈసారి బీజేపీ ప్రభుత్వం కాకుండా ఎన్‌.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి నందువల్ల, భాగస్వామ్య పక్షాలను కూడా ఒప్పించాల్సి ఉన్నం దువల్ల పాలన తీరు మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమా ధానాలను కాలమే చెప్పాలి.
ప్రస్తుతం ఆయన తప్పనిసరిగా సంకీర్ణ పక్షాలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈసారి తమ బలాన్ని దాదాపు రెట్టింపు చేసుకున్న ప్రతిపక్షాలను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. ఎన్‌.డి.ఏ ప్రభుత్వాన్ని పనిచేయనివ్వమని, ముందుకు సాగనివ్వ మని, అడుగడుగునా అడ్డుకుంటామని శపథాలు చేస్తున్న ప్రతి పక్షాలను లేదా ఇండీ కూటమిని ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాకపోవచ్చు. కొంత వరకూ రాజీపడి భాగస్వామ్య పక్షాలను తమ దారిలోకి తీసుకు వచ్చిన మోదీ ఇక ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడు తుంది. ఆ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో అనేక పథకాలు చేపట్టడా నికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కోట్లాది రూపా యలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా అనేక విధాలుగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ఒక పక్క, భాగస్వామ్య పక్షాలు ఒక పక్క మోదీ ప్రభుత్వాన్ని ముందుకు సాగనిస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న.
ప్రధాని కొత్త అవతారం
సంకీర్ణ ప్రభుత్వానికి తగ్గట్టుగా ఈ హిందూ హృదయ సామ్రాట్‌ తప్పకుండా మారాల్సి వస్తుంది. ఇక ఒంటి చేత్తో, అంతా తానై పాలన సాగించడం కుదిరే వ్యవహారం కాదు. రాష్ట్ర స్థాయి నాయకు మలతో ఇప్పటికే అనేక విషయాల్లో రాజీపడుతూ వస్తున్న మోదీ భవిష్యత్తులో ఇంతకంటే కంటే కూడా తగ్గే అవకాశం ఉందని మీడియా ప్రతినిధులే కాకుండా, రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కొద్దిగా స్థానాలు తగ్గినప్పటికీ మోదీకి తమ పార్టీలు ప్రాభవం, ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. మెజారిటీ ప్రజల్లో కూడా మోదీ పట్ల అభిమానం తగ్గినట్టు కనిపించడం లేదు. ఏది ఏమైనా, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల కంటే సమర్థవంతమైన పాలనను మోదీ అందించారనే అత్యధిక సంఖ్యాక ప్రజలు భావిం చడం జరుగుతోంది. ఆయన తరహా పాలనకు దేశంలోనే కాక, విదేశాల్లో సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే ఆయన అధ్యక్ష తరహా పాలనను అనుసరించారు. ఇప్పుడు ఏర్ప డిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాకుండా ఎన్‌.డి.ఏ ప్రభుత్వం అయినందువల్ల ఆయన ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనను అందించాల్సిన అవసరం ఉంది. ఆయన సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.
అంటే, కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణి తగ్గి, రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి మరింతగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలోని పలువురు మేధావులు, విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం జరుగుతోంది. నిజానికి, ఒక్క అవినీతి విషయంలో తప్ప ఆయన ప్రభుత్వం ఏనాడూ ఏ రాష్ట్రం ప్రభుత్వం జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. అత్యంత దారుణంగా పాలన సాగిం చిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆయన గమనిస్తూ ఉండి పోయారు తప్ప ఎక్కడా జోక్యం చేసుకున్న ఉదంతాలు లేవు. ఆయన ఏ రాష్ట్ర ప్రభుత్వం పైనా తన ఆధిపత్య ధోరణి ప్రదర్శించ లేదు. మోదీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీదే దాడికి దిగే స్థాయికి దిగాయి. ఇక సంకీర్ణ ధర్మమనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక లాంటిది. అనేక రాజకీయ పార్టీలు, అనేక మతాలు, కులాలు, భాషలు, వర్గాలు ఉన్న భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు చాలా సహజమైనవి.
మార్పులు, చేర్పులు సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో నిర్ణయం తీసుకునే పరి స్థితి ఉండదు. సంస్కరణలకు అవకాశం ఉండదు. దేశ ప్రయోజనా లకు పాటుబడడం కూడా ఉండదు. అయితే, ఒకరి చేతుల్లోనే అధి కార మంతా కేంద్రీకృతం కావడం కూడా సానుకూల ఫలితాలను మాత్రమే ఇస్తుందని చెప్పలేం. భారతదేశం వంటి బహుళ సంస్కృ తుల దేశంలో ఒక పార్టీతో మరో పార్టీకి పొసగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పరస్పర గౌరవం ఉండదు. ఏకాభిప్రాయం ఒక పట్టాన సాధ్యం కాదు. అందరి ప్రయోజనాలనూ కలుపుకుని ముందుకు సాగడం కూడా సాధ్యం కాదు. ఏతావాతా, దేశ ప్రగతి స్తంభించిపోతుంది. గత ప్రభుత్వాల కాలంలో ఇదే జరిగింది. బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి తగ్గట్టుగా వ్యవహరించడమన్నది అత్యంత కష్టంగానే ఉంటుంది. ప్రత్యర్థుల విషయంలో చెయ్యి మెలిపెట్టే తీరులో వ్యవహరిస్తారని, బెదరించడం, అణచివేయడం వంటి విధానాలను అనుసరి స్తారని పేరున్న మోదీ ఈ పర్యాయం దీన్ని ఎలా ముందుకు తీసుకు వెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏది ఏమైనా, గత రెండు పర్యాయాల పాలనలో మాదిరిగా ఆయన ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుం డా, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపకుండా సమాజం లోని మేధావి వర్గాలను లెక్క చేయకుండా బిల్లులను రూపొందించే అవకాశం లేదు. భారీ మెజారిటీ ఉన్న సమయంలోనే ఎదురు తన్నిన ఇటువంటి ధోరణి ఇప్పుడు మరింతగా ఆయనను దెబ్బ తీసే అవకాశం ఉంది. దేశంలోని ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థకూ ఇంతకుముందు కంటే ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉం టుంది. ఎంత సంకీర్ణ పాలన అయినప్పటికీ, విదేశీ వ్యవహారాలు మాత్రం ఇప్పటి మాదిరిగానే కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యవహారాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడానికి విదేశాంగ విధా నాలు ఎంత గానో తోడ్పడుతున్నాయి. అమెరికా, రష్యా, చైనాలతో సత్సంబంధాలను మరింత మెరుగుపరచు కోవడంతో పాటు, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది.
సంకీర్ణ ధర్మం
ఇంతకూ వీటన్నిటికీ తగ్గట్టుగా మోదీలో మార్పు వస్తుందా అన్నది ఇక్కడ చర్చనీయాంశం. సంకీర్ణ ధర్మం ప్రకారం నడుచు కోవడం అనేది తప్పనిసరి అవుతుంది. అయితే, కాంగ్రెస్‌, తృణ మూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు పాటించే కుహానా లౌకిక వాదాన్ని, బుజ్జగింపు ధోరణులను మోదీ కూడా పాటించడమనేది అసంభవమైన విషయమనడంతో సందేహం లేదు. పాలన విష యంలో భాగస్వామ్య పక్షాలతోనూ, ప్రతిపక్షాలతోనూ సంప్రదిం పులకు అవకాశం ఉంటుంది కానీ ఆయన ఈ రకమైన బుజ్జగింపు ధోరణులకు, దేశానికి నష్టం కలిగించే బూటకపు లౌకికవాదాలకు కట్టుబడి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం మీద కొన్ని అంశాల్లో ఆయన రాజీపడగలరు కానీ, అన్ని విషయాల్లోనూ రాజీపడడమనేది ఆయన నిఘంటువులో లేని విషయం. ప్రతిపక్షా లైనా, భాగస్వామ్య పక్షాలైనా మోదీ ప్రాధాన్యాలను అర్థం చేసుకో వడం మంచిది. భాగస్వామ్య పక్షాలకు ఆయన సిద్ధాంతాలు, ఆశ యాలు, లక్ష్యాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే తాము కూడా వ్యవహరిస్తామని, వాటికి తాము కూడా కట్టుబడి ఉన్నామని అవి చెప్పకనే చెప్పాయి. ఇక రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌ వంటి నాయకుల అభిప్రాయా లకు తగ్గట్టుగా నడుచుకోవడం అన్నది దేశాన్ని తిరోగమన పథంలో నడిపిస్తుందనడంలో సందేహం లేదు. మోదీ ధోరణే కాదు, ప్రతిపక్షాల ధోరణిలో కూడా మార్పు రావాల్సి ఉంది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు ఇదే పాఠాన్ని పార్టీలన్నిటికీ నేర్పాయి.

– కె.వి. గిరిధర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News