Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Bridgeman of India: బ్రిడ్జ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా - గిరీష్‌ భరద్వాజ్‌

Bridgeman of India: బ్రిడ్జ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా – గిరీష్‌ భరద్వాజ్‌

తక్కువ ఖర్చుతో వేలాడే వంతెనలు నిర్మించిన బ్రిడ్జిల రూపశిల్పి

1907లో ఇంగ్లాండ్‌లోని బ్రౌన్‌ సీ ఐలాండ్‌లో స్కౌట్స్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ ఉద్యమ పితామహుడు లార్డ్‌ రాబర్ట్‌ స్టీవెన్సన్‌ బెడెన్‌ పావెల్‌ ఈ ప్రపంచంలో అడుగిడిన నాటికంటే నిష్క్రమించే నాటికి దానిని మరింత మెరుగైనదిగా మార్చడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీ నిష్క్రమణ ఆసన్నమైనప్పుడు మీరు సమయాన్ని వృధా చేయలేదు సరికదా మీ వంతు కృషి చేసారన్న తృప్తితో ఈ లోకాన్ని వీడవచ్చు అన్నారు. బహుశా ఆ మాటలను ఆదర్శంగా తీసుకున్నారో లేదో తెలి యదు కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘బ్రిడ్జ్‌ మ్యాన్‌’గా ప్రసిద్ధి గాంచిన సామాజిక పారిశ్రామికవేత్త, 73 సంవత్సరాల గిరీష్‌ భరద్వాజ్‌ ఆగష్టు 1989 లో ప్రారంభించి గత 34 సంవత్సరాలుగా సుదూర ప్రాంతాలలో, ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ మరియు ఒడిశాలోని వివిధ వాగులు నదుల మీదుగా దాదాపు 147 తక్కువ ఖర్చుతో వేలాడే వంతెనలను నిర్మించడం ద్వారా మారుమూల ప్రాంతాలను సమీప పట్టణాలు, నగరాలతో అనుసంధా నించి గ్రామీణ ప్రజలకు గొప్ప మేలు చేసారు.
గిరీష్‌ భరద్వాజ్‌ నేపథ్యం
మే 12, 1950న బి కృష్ణ భట్‌, లక్ష్మిఅమ్మ దంప తులకు జన్మించిన గిరీష్‌ భరద్వాజ్‌ 1973లో పి ఇ ఎస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మాండ్యా నుండి మెకానికల్‌ ఇంజ నీరింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తరువాత తన తండ్రి సలహా మేరకు ఆగ్రో సర్వీస్‌ సెంటర్‌ను ప్రారంభించి స్థాని క రైతుల వ్యవసాయ పనిముట్ల మరమ్మత్తులు చేసేవాడు. తరువాత 1975లో, అతను సుల్లియాలో తన స్వంత ‘రేష నల్‌ ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌’ని స్థాపించాడు. అది ఇప్పుడు వ్యవసాయ యంత్రాల మరమ్మత్తులతో పాటు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ల నిర్మాణంలో నిమగ్నమై అయాశిల్ప అన్న పేరుతో ప్రాచుర్యం పొందింది. అటవీ అధికారి నారాయణ్‌ సుల్లి యా నుండి కుశాల్‌నగర్‌కు బదిలీ కావడంతో ఆయన గిరీష్‌ భరద్వాజ్‌ను ‘కావేరిలోని ఒక ద్వీపాన్ని (నిసర్గ ధామ్‌) ప్రధాన భూభాగానికి అనుసంధానించ గలరా? అని అడిగాడు. ఇది 50 మీటర్ల విస్తీర్ణంతో రెండు వైపులా పెద్ద చెట్లు కలిగి ఉన్న ప్రాంతం. అందుకు సరేనన్న లక్ష్మణ్‌ జూలాను సందర్శించిన ఒక స్నేహితుడి సహాయంతో, ఎలాంటి డిజైన్‌ లేకుండా కేవలం ఉక్కు కడ్డీలు మరియు తాళ్ళతో చెక్క పలకల మార్గాన్ని సస్పెండర్లుగా వేలాడ దీయడానికి ఏర్పాటు చేశాడు. కొంత సమయం తీసుకుని సస్పెన్షన్‌ ఫుట్‌బ్రిడ్జ్‌ని నిర్మించాలని నిశ్చయించుకున్న ఆయన అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో తీరం, పసిఫిక్‌ మహాసముద్రాన్ని కలిపే ఒక-మైలు-వెడల్పు జలసంధి, గోల్డెన్‌ గేట్‌పై విస్తరించి ఉన్న సస్పెన్షన్‌ వంతెన గోల్డెన్‌ గేట్‌ వంతెన, జపాన్‌కు చెందిన అకాషి కైక్యో సాంకేతికతలను అధ్యయనం చేయడం ద్వారా ప్రేరణ పొందారు. తక్కువ ఖర్చుతో వంతెనను నిర్మించడానికి ఆయన గ్రామస్తుల నుండి విరాళాలు సేకరించారు. నిర్మాణ సమయంలో 40 మంది గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయనకు సహాయ పడగా స్థానిక మహిళలు తమ వంతు సహకారం అందిం చారు. ఆయన కృషి ఫలించి ఆగస్టు 1989లో, మూడు అడుగుల వెడల్పుతో స్వీయ-రూపకల్పనతో తయారైన మొట్ట మొదటి సస్పెన్షన్‌ ఫుట్‌బ్రిడ్జ్‌ అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఆయన ఒక హీరో అయ్యాడు. అంతేకాక గిరీష్‌ కన్నడ మాధ్యమంలో నాణ్యమైన ప్రాథ మిక విద్యను అందించే స్నేహ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆఫ్‌ సుల్లియా వ్యవస్థాపక-కార్యదర్శి. సామాజిక సేవతో పాటు ఆయన మంచి ఈతగాడు కూడా. పిన్న వయసులోనే అల లకు ఎదురుగా ఈదడం నేర్చుకున్న ఆయన 1972లో కళాశాల ఛాంపియన్‌గా అవార్డు సాధించారు.
ఆలోచనకు నాంది ఆరంబూర్‌ గ్రామం
మంగళూరు సమీపంలో గల సుల్లియా తాలూకాలోని గిరీష్‌ స్వగ్రామమైన ఆరంబూర్‌ ప్రజలు పయస్విని నదిని దాటడానికి ఒక దేశీయ పడవపై ఆధారపడే వారు. అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా దేశీయ పడవపై నది దాటలేక ఉపాధి కోల్పోయేవారు. కానీ ఒకే ఒక్క పడవ అడుగున రంధ్రం ఏర్పడినప్పుడల్లా, డానికి మరమ్మత్తు చేసే వరకు లేదా కొత్త పడవ నిర్మించే వరకు గ్రామస్తుల జీవనం స్తంభించిపోయేది. దీంతో విసు గు చెందిన గ్రామస్థులు 1989లో తమ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. అం దుకు విరుగుడు వంతెన నిర్మాణమని తెలిసినప్పటికీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే మెకానికల్‌ ఇంజ నీర్‌గా సమస్యకు ఏదైనా పరిష్కారం చూపగాలడేమో అన్న ఆశతో వారు ఆయన వైపు చూడడంతో, వారి ఆశలను వమ్ము చేయలేకపోయిన ఆయన తన మిత్రుల సహాయం తో కేవలం మూడు నెలల్లో లక్ష రూపాయల వ్యయంతో 97 మీటర్ల సస్పెన్షన్‌ ఫుట్‌ బ్రిడ్జిని నిర్మించి అసాధ్యమ నుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపారు. ఆగష్టు 1989 ప్రారంభమైన ఆయన ప్రస్థానం అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పటివరకు ఆయన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 32 నదుల మీదుగా 147 అలాంటి వంతెనలను నిర్మించి గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు తనదైన శైలిలో సేవ చేస్తున్నారు. ఈ సేవా దృక్పధమే ఆయనకు బ్రిడ్జి మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా లేదా సేతుబంధు అనే పేరును ఆర్జించి పెట్టింది. తన స్వగ్రామం ఆరంబూర్‌ ప్రజల కష్టాలే తనలో దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలో సస్పె న్షన్‌ ఫుట్‌ బ్రిడ్జిలు నిర్మించాలన్న ఆలోచనకు నాంది పలి కింది అంటారాయన. ఈ నిర్మాణాలను సంప్రదాయక బ్రిడ్జిల నిర్మాణ వ్యయంలో కేవలం పదో వంతుతో మూడు నెలల సమయంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయడం అయన ప్రత్యేకత. ఆయన చేపట్టే అత్యధిక శాతం వంతెనలు ప్రభుత్వ ప్రాయోజితమైనవి అయితే, కొన్ని గ్రామస్థుల సొంత నిధులతో నిర్మించబడ్డాయి. అటు వంటి ప్రాజెక్ట్‌ల కోసం, అతను తన సేవలను ఉచితంగా అందిస్తాడు. కొన్ని సందర్భాల్లో నిధుల కొరతతో ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆయన తన సొంత డబ్బు ఖర్చు చేసి ప్రాజెక్టు పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పురస్కారాలు, విజయాలు
గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఆయన చేస్తున్న నిరుపమాన సేవలకు గాను ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. అందులో కర్ణాటక అత్యుత్తమ యువ కుడు 1988 పురస్కారం, హోంగార్డ్‌ లో రెండు బంగారు పతకాలు, సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు, 2011లో దక్షిణ కన్నడ జిల్లా రాజ్యోత్సవ అవార్డు, సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఛానెల్‌ ద్వారా బిది చేంజ్‌ సి జె అవార్డు, రోటరీ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ద్వారా పీస్‌ త్రూ సర్వీసెస్‌ అవార్డు, సువర్ణ మీడియా నెట్‌వర్క్‌ ద్వారా ‘అసామాన్య కన్నడిగ’ అవార్డు, 2017 లో కేంద్ర ప్రభుత్వం ద్వారా సామాజిక సేవ విభాగంలో భాగంగా అందించే అత్యుత్తమ పౌర పురస్కారం పద్మశ్రీ, 2021లో డాక్టర్‌ శివరామ కారం త్‌ హుటూర పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సమయంలో మానవత్వం కంటే విలువైన సేవ ఏదీ లేదు. జీవితంలో అత్యంత ముఖ్యమైనది మానవత్వం మరియు ప్రేమ అనడం ఆయన సేవా నిరతికి నిదర్శనం. దురదృష్టవశాత్తు, మన దేశం లోని గ్రామీణ ప్రాంతాలలోని ఎందరో ప్రతిభావంతులు గుర్తింపుకు నోచుకోరు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. 1980వ దశకంలో మా వోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తన అనుభవాన్ని గుర్తు చేసు కుంటూ జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయత ద్వారా సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు అని అన్నారు.
2007లో వరంగల్‌ జిల్లా లక్నవరం గ్రామంలో ఒక పెద్ద సరస్సు మీదుగా సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణ సమయంలో సంభవించిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన సమాజంలో ఎవరినీ అంటరానివారిగా పరిగణించ కూడదు అంటారు. ఆ సమయంలో పూర్తిగా నక్సలైట్ల ఆధి పత్యంలో ఉన్న ఆ ప్రాంతంలో తన ప్రణాళికను విరమించు కోవలసిందిగా గిరీష్‌ను వారు హెచ్చరించినప్పటికీ, వారి బెదిరింపులకు లొంగక ఆయన కేవలం 4 నెలల కంటే తక్కువ వ్యవధిలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి విజయం సాధిం చాడు. ఆయన చిత్తశుద్ధితో చేపట్టిన ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి చేకూరిన లబ్దిని చూసి ఆశ్చర్యచకితులైన స్థాని క ప్రజలతో పాటు నక్సలైట్లు సైతం చెమర్చిన కళ్ళతో గిరీష్‌ కాళ్లపై పడి తమ కృతజ్ఞతలు తెలిపారు. స్నేహం, ప్రేమ మరియు పరస్పర గౌరవం ద్వారా ‘సమాజానికి ముప్పుగా భావించే సాయుధ తీవ్రవాదుల’ హృదయాలను గెలుచు కోవడం జీవితంలో తాను సాధించిన గొప్ప విజయాలలో ఒకటి అంటారు గిరీష్‌. సమాజాభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న వారి ఆలోచనలను తన కృషితో ప్రభావితం చేసి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం శ్లాఘనీయం.
గిరీష్‌ 1984 నుండి 2008 వరకు రాష్ట్ర హోంగార్డ్‌ శాఖలో పని చేసారు. ఈ సమయంలో ఆ శాఖ లోని సిబ్బం ది, అధికారులకు ప్రథమ చికిత్స, ఇతర శిక్షణా కార్యక్ర మాలను నిర్వహించేవారు. ఈ రెండు విభాగాలలో ఆయన ప్రదర్శించిన అద్వితీయమైన ప్రతిభకు గుర్తింపుగా ఆయన రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఢిల్లీలో అగ్నిమాపక దళంలో శిక్షణ పొంది ఆ వి భాగాధిపతిగా పదోన్నతి పొందారు. పుత్తూర్‌ ఇండస్ట్రియల్‌ యూనియన్‌ డైరెక్టర్‌ గా, స్మాల్‌ ఇండస్ట్రీస్‌ బ్యాంక్‌, స్నేహ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్స్టిట్యూషన్స్‌, వివేకానంద ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్‌ లకు కూడా ఆయన సేవలందించారు. అంతే కాక ఆయన రోటరీ క్లబ్‌ తో కూడా మూడు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం కొనసాగించారు. పేద గ్రామ స్థులకు సాధికారత కల్పించేందుకు, వారిని అవకాశాల ప్రపంచానికి అనుసంధానం చేసేందుకు తాను చేపట్టిన ‘సేతు బంధు’ కార్యక్రమాన్ని గుర్తించి స్వచ్ఛ భారత్‌ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వ్యక్తిగత లేఖ అందుకోవడం తనకు అత్యంత ఆనందా నిచ్చిందని భరద్వాజ్‌ అంటారు. గిరీష్‌ భరద్వాజ్‌ సాధిం చిన విజయాలను తెలుసుకున్న స్విట్జర్ల్యాండ్‌ దేశస్థుడు టోనీ తో సహా శ్రీలంక లోని కొందరు ఆయనను తమ దేశంలో కూడా మన దేశంలో నిమిన్చినటువంటి సస్పెన్షన్‌ ఫుట్‌ బ్రిడ్జి లను నిర్మించవలసిందిగా ఆహ్వానించారు. వీరే కాకుండా ఇతర దేశాలలోని మరి కొందరు కూడా గిరీష్‌ ప్రాజెక్టులపై తమ ఆసక్తిని కనబర్చడం గమనార్హం. ‘పేద దేశాల్లో సస్పెన్షన్‌ బ్రిడ్జిలు నిర్మించే స్విట్జర్లాండ్‌కు చెందిన టోనీ, గిరీష్‌ పనులను ప్రత్యక్షంగా చూసి అతని కృషిని మెచ్చుకుని బ్రిడ్జ్‌ బ్రదర్‌ అని పిలుస్తాడు. మానవత్వాన్ని తమ మతంగా చేసుకుని మంచిని సమాజోద్ధారణ కోసం పరిశ్రమించే గిరీష్‌ భరద్వాజ్‌ లాంటి వ్యక్తులను గౌరవించు కోవడం సమాజం యొక్క విధి.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

- Advertisement -

-8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News