Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Britain: కొత్త రాజు కొత్త సవాళ్లు

Britain: కొత్త రాజు కొత్త సవాళ్లు

సుమారు 70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి పట్టాభిషేకం ఇది. వంద దేశాల అధిపతులతో సహా 2300 మంది అతిధులతో అట్టహాసంగా చార్లెస్‌-3కు బ్రిటిష్‌ రాజుగా పట్టాభి షేక మహోత్సవం జరిగింది. చార్లెస్‌ తల్లి ఎలిజబెత్‌-2 గత సెప్టెంబర్‌లో కాలధర్మం చెందిన నాటి నుంచి ఇం దుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి, ఆమె ఏడు దశాబ్దాల పాలనా కాలంలో వలస రాజ్యాలన్నీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకున్నాయి. కొన్ని దేశాలైతే, కామన్వెల్త్న సవాలు చేయడం కూడా జరిగింది. విచిత్రమేమిటంటే, స్వదేశంలో కూడా రాజరిక వ్యవస్థ పట్ల కొద్దిగా వ్యతిరేకత ఉండేది కానీ, అది క్రమంగా కనుమరుగైంది. రాణి, రాజులు, యువరాజులంతా క్రమంగా పరోపకార కార్యకలాపాలలోకి దిగి, బ్రిటన్‌ సమాజానికి దగ్గరవడంతో ప్రజల దృక్పథంలో గణనీయమైన మార్పు వచ్చింది. చాలా ఏళ్లపాటు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ పేరుతో వ్యవహరించిన చార్లెస్‌-3 కూడా బ్రిటన్‌ సమాజంతో పాటు, అంతర్జాతీయంగా చోటు చేసు కుంటున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడం ప్రారంభిం చారు. చివరికి వాతావరణ మార్పులు, పర్యావరణం మార్పులను కూడా ఒంట బట్టించుకున్నారు. మొదటి నుంచి ఆయనకు పర్యావరణ వ్యవస్థల మీదా, వాస్తుశిల్ప కళ మీద మక్కువ ఎక్కువ. అంతేకాక, సేంద్రియ పద్ధతుల్లో మొక్క లను పెంచడం, పార్కులను అభివృద్ధి చేయడం, సహజ వనరులను సంరక్షిం చడం వంటి అంశాలను కూడా ఆయన అభిమానించి ఆదరించేవారు. బ్రిటన్‌ లోని నిస్సహాయ, అవకాశరహిత యువజనుల అభ్యున్నతి కోసం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రిన్స్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయన 2020 వరకు పది లక్షల మందికి పైగా యువజనులను ఆదుకోవడం జరిగింది.
ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలకు అంకితమైన చార్లెస్‌ ప్రస్తుతం సొంత ఇంటిని కూడా చక్కబెట్టుకోవాల్సి ఉంది. రాజ కుటుం బంలోని విభేదాలు, వివాదాలను పరిష్కరించి, అందరినీ ఒక్క తాటి మీద నడిపించడం కాకుండా, స్కాట్లాండ్‌లో పెరిగి పెద్దదవుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని ఎదుర్కో వాల్సి ఉంటుంది. అంతకన్నా పెద్ద సమస్య ఏమిటంటే, తమకు కామన్వెల్త్‌ అధినేతగా బ్రిటన్‌ రాజు వ్యవ హరించడాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలను దారిలోకి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇక రాజ కుటుంబం విష యానికి వస్తే, చార్లెస్‌ సోదరుడు ప్రిన్స్‌ హారీ ఒక అమెరికన్‌ మహిళ మేఘన్‌ మార్కెల్ను పెళ్లాడి కాలిఫోర్నియా వెళ్లిపోవడమే కాకుండా, తనకు బ్రిటిష్‌ సింహాసనాన్ని అధిష్ఠించడం మీద ఆసక్తి లేదని ప్రకటించడం జరిగింది. ఆయన తన ‘స్పేర్‌’ అనే గ్రంథంలో బ్రిటిష్‌ రాజరిక వ్యవస్థ గురించి, ఇందులోని లుకలుకల గు రించి చేసిన వివమర్శలు ఆయనలో ఈ వ్యవస్థ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను బయట పెట్టింది. చార్లెస్‌ ఇప్పుడు ప్రిన్స్‌ హారీతో విభేదాలను చక్కదిద్దుకోవడమే కాకుండా, తన రెండవ కుమారుడితో కూడా రాజీపడాల్సిన అవసరం ఉంది,
ఇక స్కాట్లాండ్లో స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ అధిపతిగా నికొలా స్టర్జన్‌ స్థానంలో హంజా యూసఫ్‌ పగ్గాలు చేపట్టారు. నికొలా స్టర్జన్‌ అనేక సంవత్సరాలుగా ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ పార్టీలో అంతర్గతంగా అనేక సమస్య లున్న మాట నిజమే కానీ, ఈ పార్టీ మళ్లీ తీవ్రస్థాయిలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇది గనుక ప్రారంభం అయితే, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ఎం తో సమస్యగా మారుతుందనడంలో సందేహం లేదు. తమ అధినేతలను తామే నియమించుకోవాలని ఉవ్వీళ్లూరుతున్న ఆం టిగ్వా, బర్బూడా, ఆస్ట్రేలియా, బహ్మాస్‌, బెలీజ్‌, గ్రెనెడా, జమైకా, సెయింట్‌ కిట్స్‌, నెవీస్‌ వంటి కామన్వెల్త్‌ దేశాలను చార్లెస్‌ దారిలోకి తీసుకు రావాల్సి ఉంటుంది. ఈ సవాళ్లనన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న పక్షంలో చార్లెస్‌ ఒక పక్క సంప్రదాయ రాజరిక వ్యవస్థకు కట్టుబడి ఉంటూనే, ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడాన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News