భారత దేశంలో సంపద లేకపోవడానికి కారణం కులం. సంపద ఉండటానికి కారణం కులమే. రాజ్యాంగం కులాన్ని గుర్తించింది. కానీ, రాజ్యం, కోర్టులు కులా న్ని గుర్తించడానికి ఇష్టపడవు. అయినా కులాలను గుర్తిం చినట్టుగా నటిస్తోంది. మనదేశంలో సామాజిక పేదరి కాన్ని అంచనా వేయడానికి తీసుకున్న ప్రాతిపదికను కులానికి సంబంధం లేకుండా కేవలం ఆర్థిక ప్రాతిపదికన అంచనా వేసింది.
ఇదే అంశం మీద ఎన్ని నివేదికలు సమర్పించినా దారిద్రరేఖకు దిగువన ఉన్నవారందరూ నిరుపేద కులాల వారనేది నిజం. తినే ఆహారం, నివాసగృహం, వేసుకునే బట్టలు తాగే నీరు, పీల్చే గాలి అన్నింటినీ కులమే శాసిస్తుంది. కనీసం ఒక పూట కడుపునిండా ఆహారం కూడా కరువు అవుతుంది.. దొరికిన తిండిలో ఏ మేరకు పోషకాలు లభిస్తున్నాయి.. నిరుపేద పిల్లలకు, వృద్ధులకు వారి ఆరోగ్యం పట్ల, వారి భోజనం పట్ల ఎవరు బాధ్యతలు తీసుకుంటున్నారు.. నిజానికి వారి బాగోగులు ఆయా ప్రభుత్వాలు తీసుకోవలసి ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో తల్లి తండ్రుల ఆదరణ లేని పిల్లలు, వయోవృద్ధుల బాధ్యత అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. దేశ సంపద అంతా ఎక్కడికి వెళుతుంది, దేశం నిజంగానే ఆర్థికంగా వెనుకబడి ఉందా అంటే అది కాదు. 40% సంపద ఒక శాతం సంపన్నుల చేతుల్లో పోగుపడి ఉంది. మరోవైపు సగం మంది జనాభా దగ్గర ఉన్న సంపద మూడోవంతు కూడా లేదు. ‘ఆక్స్‍ఫామ్ ఇంటర్నేషనల్ అనే ఎన్‌జీఓ సంస్థ వారి వార్షిక నివేదికలో తెలిపిన వాస్తవాలు, సమర్పించిన నిజ నిర్ధారణలు ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా వసూలు చేయబడుతున్న పన్నులలో 50% వరకు మధ్యతరగతి ఆదాయ వర్గాల నుండి అందుతున్నవే. టాప్ టెన్‌లో ఉన్న సంపన్నుల నుండి మూడు శాతం మాత్రమే పన్నులు వసూలు అవుతున్నా యి. 90 శాతం సంపద వాళ్ల దగ్గరనే కేంద్రీకృతమై ఉంది. ప్రపంచంలోని రెండు వందల కోట్ల మంది పేదల బతుకులు బాగుపడా లంటే సంపన్నుల జాబితాలోని ప్రపంచ స్థాయి కుబేరులపై ఐదు శాతం పన్ను విధించాలని ఆర్థిక నిపుణుల డిమాండ్‌గా ఉన్నది. వీరినుండి పన్నులు వసూలు చేయ గలిగితే ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల సంపద పోగుపడుతుందని ఆక్స్- ఫామ్ సంస్థ వెల్లడించింది.
మనదేశంలో అణగారిన కులాలు లేదా వర్గాలుగా ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, ఇతర మైనారిటీలు, మహిళలు, అసంఘటిత కార్మికులు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత చితికిపోయి ఉన్నారు. ఉదయం లేవడంతో మొదలు రాత్రి నిద్రపోయే వరకు అన్ని రకాల వస్తు వినియోగ పన్నులు చెల్లిస్తున్నారు. నిత్యావసరాల సేవల పన్నులు సంపన్నుల కన్నా ఎక్కువ శాతం టాక్స్‍లు వీరే కడుతున్నారు. పేదరికం కేవలం కింది కులా ల్లోనే ఉందనేది వాస్తవం. పేదరికాన్ని అంచనా వేయడానికి 1951 నుండి ఇప్పటివరకు 78 సార్లు శాంపుల్ సర్వేలు జరిగాయి. పేదరికం కొలిచేం దుకు అవసరమైన అన్ని రకాల వివరాలను సేకరిస్తూనే ఉన్నారు. అయిన ప్పటికీ 75 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వము పేదరికా న్ని నిర్వచించలేకపోయింది. సంవత్సర ఆదాయ పరిమితిని నిర్ణయించింది. వారి జీవన ప్రమాణాలను కొలమానంగా తీసుకొని ఇంతమంది లేదా ఇంత శాతం పేదలు ఉన్నారని అధికారికంగా ప్రకటించ లేకపోయింది.
కొద్ది రోజుల క్రితం మన రాష్ట్రంలో గ్రామీణులు అయితే కొన్ని రకాల ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేం దుకు వార్షిక ఆదాయం రూ.1,50,000/- పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారిని దారిద్రరేఖకు దిగువన ఉన్న జనా భాగా గుర్తించబడింది. నెలకు గ్రామాలలో రూపాయలు 1,060/- నగరా లలో రూపాయలు 1,286/- ఖర్చు చేయగల స్తోమత లేని కుటుంబాలను దారిద్ర రేఖకు దిగువన ఉన్నట్లు నిర్ధారించారు. గతంలో ప్రణాళికా సంఘం ఇప్పుడు నీతి ఆయోగ్‌గా నామకరణం చేశారు. వీరి ఆలోచన దారిద్రరేఖ విషయంలో కొన్ని నిర్ధారణలకు వచ్చింది. ఇందులో ఆహార వినియోగాన్ని పరిగణనలోకి తీసుకునింది. రోజుకు పట్టణాలలో 2100 కిలో క్యాలరీలు, పల్లెలలో 2,400 కిలో క్యాలరీల రూపంలో తిండి దొరకని వారిని దారిద్రరేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణించాలని ప్రతిపాదించింది. ఈ మధ్యకాలంలో అంటే జూన్ 2014 (పదేళ్ళ క్రితం) ఇచ్చిన నివేదిక ప్రకా రంగా పల్లెల్లో నెలకు రూపాయలు 11,664/- పట్టణాల్లో 16,884/-లు ఖర్చు చేయగలిగే పరిస్థితి లేని వారిని దారిద్రరేఖకు దిగువగా ఉన్న వారిగా పరిగణించాలని ఉంది. అంతేకాదు, ఆ వ్యక్తుల వయస్సు, లింగం, చేసే పనిని బట్టి ఎంత మొత్తంలో కిలో క్యాలరీలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాట్స్ తీసుకోవాలి అనేది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధనా సంస్థ) చెప్పిన ప్రకారంగా పై ఆదాయ పరిమితులను కమిటీ నిర్ణయించింది. అదే నిజమైతే గ్రామాలలో ఇప్పటివరకు రెండువేల ఒక వంద కిలో క్యాలరీలు, పట్టణాల్లో అయితే 2090 కిలో క్యాలరీలు ప్రతి వ్యక్తికి అవసరమవుతాయని వెల్లడించింది. ఈ రుగ్మతలు అన్ని అనుక్షణం అనుభవిస్తున్నది దేశంలోని దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, ఇతర మైనారిటీలు, అసంఘ టిత కార్మికులు. వీరికి సరిపడా ఆహారం లేకపోవడం, శ్రమకు తగిన ఆహారం దొరకకపోవడం, శారీరకంగా బలహీనంగా ఉండటం కనపడుతుంది.
————————————————————
ALSO READ:
ప్రజల నుంచి దూరమైన విప్లవవాదులు
ఔషధ భద్రత, నియంత్రణ- – ప్రజారోగ్య పరిరక్షణ
గద్దరే తెలంగాణ జాతిపిత: తెల్లాపూర్ డిక్లరేషన్
————————————————————
పౌష్టికాహార లోపంతో ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ప్రపం చంలోని 117 దేశాల ఆకలి సూచిలో భాగంగా మన దేశం 107 స్థానంలో నిలిచింది. కోవిడ్ 19 తర్వాత మరింత దిగజారిందని నివేదికలు చెబుతు న్నాయి. 1993లో ఏర్పాటు చేసిన లక్డావాలా కమిటీ రిపోర్టు ప్రకారంగా నెలసరి ఆదాయం లెక్కించింది. అలగ్ కమిటీ తన రిపోర్ట్ చెప్పిన కాలరీలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తలసరి కొనుగోలు శక్తిని బట్టి బీపీఎల్ స్థాయిని నిర్వహించింది. తదనంతర కమిటీలు టెండూల్కర్, రంగరాజన్ రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. చివరగా అరవింద్ పనగారియా లాంటి వారు రంగరాజన్ సిఫారసులపై విమర్శలు చేశారు. పై నివేదికలు ఏవి అమలు కాలేదు. అలాగే ఉండిపోయాయి. రంగరాజన్ రిపోర్ట్ కొంత మెరుగైనదని భావిస్తారు. చివరికి దాన్ని మరో కమిటికి పంపడం ఎంత వరకు సమంజసం? ఎవరి కొరకు ఈ కమిటీల సిఫారసులు, వీరు సమర్పిం చిన నివేదికలు? నిజమైన బాధితులకు ఏ రకంగానూ సహాయకారిగా నిలబడలేదు. కింది కులాలు, వర్గాలు ఏ ప్రయోజనాలు పొందిన దాఖలా లు లేవు. 33 కోట్ల భారతీయులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వాళ్ళంద రూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. ప్రపంచంలోని 150 సభ్య దేశాల్లో ఏ రంగంలో చూసిన మన ర్యాంకు వందకు అటు ఇటుగానే ఉన్నా ము. ఏమాత్రం ముందుకు అడుగు వేయలేకపోతున్నాము. మన ఆకలి సూచి గమనంలోకి తీసుకుంటే మన పక్కనే ఉన్న చిన్న దేశాలు అంటే మ యన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి దేశాలు కూడా మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. మనమే అధ్వాన్న దశలో ఉన్నాము. మన పాలకులు పనికిరాని ప్రగల్భాలు మానేసి పేదల పక్షాన నిలబడాలని కోరుకుందాం.
సచార్ కమిటీ నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తికి సంబంధించిన సమా చారాన్ని సేకరించి, దానికి ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలి. అందులో కులం, మతం ఆర్థిక అంశానికి సంబంధించిన వివరాలు ఉండాలి. దాని ప్రకారంగానే నీతి ఆయోగ్ ప్రణాళికను రూపొందించాలి.
వి బాలరాజు
తహసిల్దార్ రిటైర్డ్

