Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Government schools lack infra: అసౌకర్యాలతో సర్కారు బడులు

Government schools lack infra: అసౌకర్యాలతో సర్కారు బడులు

‘నచ్చడం’ బాల్యాన్ని ప్రభావితం చేసే పదం. తెల్ల కాగితం లాంటి వారి మనస్సుకు నచ్చే ప్రతి వస్తువు, ప్రతి పదార్థంను పిల్లలు ఇష్టపడుతారు, కంటికి ఇంపుగా, నాలుకకు రుచిగా ఉండేవాటిని లేలేత చేతులతో సృశించి అడుకోవడం, నోట్లో పెట్టకోవడంపై ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటారు. అభిరుచి, అలవాటు పెరిగి అంగనవాడీలోకి ప్రవేశించే అర్హతను సాధిస్తారు. ఇక్కడ ఆటలు, అక్షరాలు లేలేత వయస్సును తికమక పెట్టిన్పటికీ ఆకర్షితులవుతుంటారు. ప్రాథమిక పాఠశాలకు వచ్చే వయస్సు నాటికి వారికంటూ ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి. ఈ ఇష్టాలకను గుణంగా పాఠశాల ఆవరణ, సౌకర్యాలు, తోటి పిల్లలు, విద్య కొనసాగినప్పుడే ‘చదువు’ సాఫీగా సాగుతుంటుంది. లేదంటే పాఠశాలకు చేరే పిల్లల సంఖ్య క్రమక్రమంగా తగ్గి పోతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తగా పాఠశాలలు ఏమేరకు పిల్లలను ఆకట్టుకుంటున్నాయని చెప్పడం కష్టంగా మారింది. అరకొర సౌకర్యాలు, శిథిలావస్థలో భవనాలు, తగిన సంఖ్యలో లేని టీచర్లు తదితరమైనవి పిల్లలను ఆకర్షించలేక పోతున్నాయి. బడికి వెళ్లినట్లే వెళ్లి, ఇంటికి పరిమితమవుతున్నారు.
కొత్త పుస్తకాలు, దుస్తులు, కొత్త ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడుగుపెడుతున్న చిన్నారులకు అసౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. చదువుకునేందుకు, బోధించేందుకు అనువైన వాతావరణం ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని పరామితులను నిర్ణయించాయి. అందులో ప్రధానమైనవి గాలి, వెలుతురు వచ్చే తరగతి గదులు, సరిపడా శౌచాలయాలు, తాగునీటి సౌకర్యం, భద్రతకు ప్రహరీ, కూర్చోవడానికి సరిషూ బెంచీలు, పాఠ్యపుస్తకాలు, ఏక రూప దుస్తులు తదితరమైనవి. ఈ సౌకర్యాలు చాలా బడుల్లో కొరవడడంతో చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా 14.89 లక్షల సర్కారు బడుల్లో 26.52 కోట్లమంది చిన్నారులు చదువుకుంటున్నారు. 14 శాతం ఐదులకు ప్రహరీ గోడలు లేవని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి (ఎన్సీపీసీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఇందువల్ల విద్యార్థులు ఆటలు ఆడుకునే సమయంలో బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘట నలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక 22 శాతం పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. 34 శాతం ఐడుల్లో తరగతులకు సరిపడా గదులు లేవు. 44 శాతం బడుల్లో భద్రతా ధ్రువపత్రాలు లేవు. కేవలం 14 శాతం బడుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నాయి. ఇవి లేని బడుల వద్ద విద్యార్థులు తరుచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు, మౌలిక వసతలు, బోధన నాణ్యత, అభ్య సన సామర్థ్యాలు, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి తది తరాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యాశాఖ ఒకటి నుంచి వెయ్యి పాయింట్లను కేటాయించగా, 479.9 పాయింట్లతో మన తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో గ్రేడ్కు పరి మితమయ్యింది. దీన్ని అధిగమించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి నామమాత్రంగానే ఉంటోంది. దీంతో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అధికంగా ఉంటోంది. అదే సమయంలో ప్రైవేట్‌ బడుల్లో వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఇతర అంశాలను విద్యాశాఖకు సంబంధించిన నివేదిక వెల్లడించింది. 2021-22లో విద్యాశాఖతో పాటు ఇతర శాఖల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు 20, 004 ఉండగా, వీటిలో 11.19 లక్షల మంది విద్యార్థులు చదివారు. 2023-24లో వారి సంఖ్య 8.15 లక్షలకు పడిపోయింది. ఏకంగా 3.04 లక్షలు తగ్గింది. 2021 – 22లో ప్రాథమికోన్నత పాఠశాలలు (1-8 తరగతులు) 3,371 ఉండగా, వాటిలో 3.26 లక్షల మంది విద్యార్థులు చదివారు. వారి సంఖ్య గత విద్యా సంవత్సరం (2023-24)లో 2.33 లక్షలకు పడిపోయింది. అంటే 93 వేలు తగ్గింది. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలు ఆవాసాలకు దూరంగా ఉంటే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈమేరకు 2022-23లో 37,103 మంది, 2023-24లో 30,395 మంది అర్హులుగా ఉన్నా, ఒక్కరికి కూడా చెల్లించలేదు. ప్రస్తుతం వారి సంఖ్య 13,219కి తగ్గింది. ఈ సారైనా ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,270 కంప్యూటర్‌ ల్యాబ్లు, 3,317 స్మార్ట్‌ తరగతి గదులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుడు 640 ల్యాబ్‌ లు, 697 స్మార్ట్‌ తరగతులకు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఒక్కటీ నెరవేరలేదు. విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ప్రధానమైనది. చాలా పాఠశాలలకు క్రీడా స్థలాలు లేవు. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు అరకొరగానే ఉన్నాయి. పట్ట ణాలు, నగరాల్లో చాలా ఐడులు ప్రధాన రహదారుల పక్కన, నిత్యం రణగొణ ధ్వనుల మధ్య కొనసాగుతున్నాయి. దాని వల్ల విద్యార్థులు పాఠాలను సక్రమంగా ఆకళింపు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, ఇతర లోపాలపై జాతీయ విద్యావిధానం-2020 దృష్టి సారించినప్పటికీ, ఆశించిన ఫలితాలు అందడం లేవు. కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేయడానికి ‘ఐడి బాట’ కార్యక్రమం తీసుకున్నా పిల్లలు వచ్చినట్లే చేజారిపోతున్నారు. ఉచిత పాఠపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్నన భోజనం పూర్తిస్థాయిలో సమకూర్చడంలో విఫలమవడం ఇందుకు కారణంగా తోస్తుంది. గతేడాది తెలంగాణ విద్యా దినోత్సవంను పురస్కరించుకుని ఒకేరోజు పది వేల పాఠశాలల్లో ప్రభుత్వం గ్రంథాలయాలు, రీడింగ్‌ కార్నర్లు, పదహారు వందల స్మార్ట్‌ తరగతి గదులను ప్రారంభించింది. అయినప్పటికీ వాటి పనితీరు అరకొరగా ఉన్నాయి. పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నోసార్లు ఆదేశించాయి. అయినా పాలకుల్లో చలనం లేదు. కనీస సౌకర్యాలు కరువై ఇబ్బందుల మధ్యే విద్యార్థులు కష్టంగా చదువులు కొనసాగిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా అన్ని పాఠశాలలనూ మేటిగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన బడులు మేలిమి మానవ వనరులను రూపొందించే కార్ఖానాలుగా తయారవుతాయి.

  • కోడం పవన్‌కుమార్‌
    9848992825
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News