Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Children literature: బాలసాహిత్యంలో పురస్కారాలు

Children literature: బాలసాహిత్యంలో పురస్కారాలు

బాలసాహిత్యంలో కృషి చేస్తున్న బాలసాహితీవేత్తలను గుర్తించి ప్రభుత్వ సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.కేంద్ర సాహిత్య అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతియేటా బాలసాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అంద చేస్తుంది. ఇంకా రచయితలే తోటి రచయితలను ప్రోత్సహిస్తూ పురస్కారాలు, బిరుదులు, అవార్డులు,రివార్డులు, సన్మానాలు, సత్కారాలు అందచేయటం మంచి పరిణామం.బాలసాహిత్యపరిషత్, తెలంగాణ సాహిత్య పరిషత్,నారంశెట్టి బాలసాహిత్య పీఠం, డాక్టర్ రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం, పుట్టగుంట సురేష్ కుమార్ ట్రస్ట్,

- Advertisement -

బాలగోకులం, తెలుగు వెలుగు – చెన్నై, సాహితీ మిత్ర మండలి,సింహప్రసాద్ సాహిత్య సమితి, పెందోట బాలసాహిత్య పీఠం, జాతీయ సాహిత్య పరిషత్ , రంగినేని ట్రస్ట్,
తెలుగు బాలల సంఘం వంటి అనేక సంస్దలు బాలసాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్నాయి. 2023లో కూడా అనేక మంది బాలహితీవేత్తలు పలు సంస్ధలచేత గుర్తించబడ్డారు. 2023లో ఇలా సత్కరించ బడిన బాలసాహితీవేత్తలు ఎందరో ఉన్నారు.
డి.కె. చదువుల బాబుగా సుపరిచి తులైన ‘దూదేకుల కాసిం సాహెబ్’, తెలుగు బాల సాహిత్యంలో తాను రాసిన ‘వజ్రాలవాన’ బాలల కథా సంపుటికి, 9 నవంబరు 2023న ఢిల్లీలో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్నారు.వీరి బాలసాహితీసేవలు గుర్తించి అనేక సంస్ధలు 2023లో ఘనంగా సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక పర్యాటక శాఖ ‘సాహిత్య పురస్కారం’,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం ‘సాహిత్య పురస్కారం’,
యోగివేమన విశ్వ విద్యాలయం ‘సాహిత్య పురస్కారం’ వంటి మొత్తం 28 పురస్కారాలు 2023 లో డి. కె.చదువులబాబుని వరించాయి.
బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు చొక్కాపు వెంకటరమణ
తెలుగు భాషా ప్రచారానికి, బాల సాహిత్య ప్రకాశానికి, బాలల వ్యక్తిత్వ వికాసానికి గత 45 ఏళ్లుగా విశేష కృషి చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ‘ యార్లగడ్డ ప్రభావతి – శంభుప్రసాద్ స్మారక పురస్కారం’ ను ప్రపంచ తెలుగు సమాఖ్య, చెన్నై వారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 26 నవంబరు 2023 న అంద చేశారు.
చందమామ కథకులు
మాచిరాజు కామేశ్వరరావు 15 నవంబరు 2023 న “పాపిష్టి డబ్బు” పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. 05 నవంబరు 2023 న వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ,బాల సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ” కథల చందమామ” బిరుదు ప్రదానం చేసింది. 20 నవంబరు 2023 న బాల గోకులం వారి ‘బాల ప్రియ’ అవార్డుల ఫంక్షన్ లో ఘన సత్కారం పొందారు.
ప్రముఖ చందమామ రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దాసరి వెఐకటరమణ చందమామ కథలపై పరిశోధనచేసి జనవరి 2023లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహేచ్.డి పట్టా పొందారు.
బాలసాహిత్య పరిషత్ కోశాధికారి, ప్రముఖ బాలసాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ ప్రచురిఐచిన ‘ బాలసాహితీశిల్పులు’ కె.వి.రమణాచారి (రి.ఐ.ఏ.ఎస్) ఆవిష్కరించి ఘనంగా సత్కరించారు.
ప్రముఖ రచయిత్రి శైలజామిత్ర
“ఆధునిక పంచ్ తంత్ర కథలు ” కి
పెందోట జాతీయ పురస్కారం అందుకున్నారు.
సింహప్రసాద్ సాహిత్య సమితి ప్రతియేట అందచేసే ‘డాక్టర్ వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం ‘ ఈయేడు 14 అక్టోబరు 2023 న గరిపెల్లి అశోక్ అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించే బాలసాహిత్య కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ అందరి మన్ననలు పొందారు.
గద్వాల సోమన్న అనతి కాలంలో (2018నుంచి)46 బాలసాహిత్య పుస్తకాలు రచించినందుకు గాను 2023 లో అనేక బిరుదులు, అవార్డులు, సత్కారాలు పొందారు.
11 జూన్ 2023 న సమతా సాహితీ సంస్థ మరియు బళ్లారి రాఘవ సాహితీ సంస్థ, బళ్లారి (కర్ణాటక) వారిచే ‘ బాలబంథు’ బిరుదు పొందారు.21అక్టోబరు 2023న అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్, విశాఖ వారిచే ‘గురజాడ స్ఫూర్తి రత్న’ అవార్డు అందుకున్నారు.అంతేకాదు,
15 అక్టోబరు 2023 న తెలుగు అభివృద్ధి సమితి మరియు తెలుగు కళా వైభవం ,హైదరాబాద్ వారిచే ‘ తెలుగు బంధువు’ బిరుదు పొందారు. ఇక 11 నవఃబరు 2023 న మహర్షి వాల్మీకి సాంస్కృతిక సాహితీ సంస్థ,హైదరాబాద్ వారిచే ‘ బాలసాహిత్యరత్న’ కూడా అందుకుని తన ప్రతిభ చాటుకున్నారు గద్వాల సోమన్న.
చెన్నైలో స్దిరపడిన సీనియర్ తెలుగు బాలసాహితీవేత్త డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గుంటూరు వారు ఆగస్టు 29 న ‘ గిడుగు’ వారి భాషా,నగదు పురస్కారం అందుకున్నారు. అంతేకాకుండా, కళా మిత్ర మండలి ,తెలుగు లోగిలి ఒంగోలు వారినుండి నవంబర్ 26 న జాతీయ పురస్కారం నగదు స్వీకరించారు.

ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మీ
28 మార్చి 2023 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా అంగలకుదిటి సుందరాచారి
స్మారక కీర్తి పురస్కారం అందుకున్నారు.

ధర్మపురికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త
సంగనభట్ల చిన్నరామకిష్టయ్య
బాల సాహిత్యం లో చేసిన కృషికి గాను తెలుగు వెలుగు సంక్షేమ సంఘం, చెన్నై వారి ‘ తెలుగు వెలుగు ‘ బిరుదు మార్చి 2023లో అందుకున్నారు. 2021 సంవత్సరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి ‘ అంగలకుదిటి సుందరాచారి స్మారక కీర్తి పురస్కారం’ సెప్టెంబర్ 2023 పొందారు.
అలాగే బాల గోకులం బాలల సాహితీ సాంస్కృతిక సంస్థ , హైదరాబాద్ వారి ‘ బాల ప్రియ ‘ బిరుదు నవంబర్ 2023 న వీరిని వరించింది.
సిరిసిల్లకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త
డాక్టర్ కందేపి రాణీప్రసాద్ బాలసాహిత్యంలో ఎంతో కృషి చేశారు. 2023లో జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి ‘ఉత్తమ బాల సాహితీ వేత్త’ గా పురస్కారం జులై 29 న స్థానిక గ్రంథాలయంలో అందుకున్నారు.
బాల సాహిత్యం లో సైన్స్ విషయాల తో సమాజాన్ని చైతన్య పరుస్తున్నoదుకు సాక్షి టీవీ వీరి ఇంటర్వ్యూ ప్రసారం చేసింది.’ డాక్టర్ చెప్పిన కధలు ‘ పుస్తకం ద్వారా రోగులకు పిల్లల పెంపకం గురించి అవగాహన కల్పించి నందుకు IMA జిల్లా శాఖా నుండి, IAP జిల్లా శాఖ నుండి వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులో కి తీసుకు వెళుతున్నం దుకు జూన్ నెలలో వీరిని ఘనంగా సత్కరించారు. ప్రతియేటా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా వీరి తండ్రి అంగలకుదిటి సుందరాచారి స్మారక కీర్తి పురస్కారం బాలసాహిత్యంలో కృషి చేసిన వారికి అంద చేస్తున్నారు.
ముంజులూరి కృష్ణకుమారి 2023లో
మక్కెనరామ సుబ్బయ్య ఫౌండే షన్ ‘బాల సాహిత్య పురస్కారం’ 11 ఆగష్టు 2023, న విశాఖపట్నం లో అందుకున్నారు. అలాగే, ‘పోలవరపు కోటేశ్వరరావు’ బాలసాహిత్య పురస్కారం 16 ఏప్రిల్ 2023న కృష్ణా జిల్లా రచయితల సంఘం వారిచే విజయవాడ లో పొందారు.
కర్నూలు కు చెందిన డాక్టర్ ఎం.హరికిషన్ బాలసాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు.జనవరి 6 న, నంద్యాలలో అజో-విభొ-కందాళం వారు ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట బాలసాహిత్య రచనా పురస్కారం ఇవ్వడంతో పాటు వీరి సాహిత్య కృషిపై తయారైన ‘ ప్రత్యేక సంచిక ‘ ఆవిష్కరించారు.అంతేకాదు,
తెలుగు అభివృద్ధి సమితి వారు 2023 అక్టోబర్ లో ‘తెలుగు బంధువు’ పురస్కారం ప్రకటించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన బాలసాహితీవేత్త పట్రాయుడు కాశీవిశ్వనాథం బాలసాహిత్యంలో చేసిన కృషికి ‘పెందోట బాలసాహిత్య పురస్కారం’ 2023 లో అందుకున్నారు.
సిద్దిపేటకు చెందిన పెందోట బాలసాహిత్య పీఠం ఈ పురస్కారం
అందచేసింది. అంతేకాదు,
‘ గిడుగు రామ్మూర్తి’ జయంతి సందర్భంగా మాతృబాష పరిరక్షణ సమితి విజయనగరం వారిచే ఘనంగా సన్మానం పొందారు.
చిలుకలూరిపేట కు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త డాక్టర్ దార్ల బుజ్జిబాబు బాలలకోసం అనేక బుజ్జి కథలు, నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ప్రచురించారు. 12 మార్చి 2023 న చైన్నైలో తెలుగు వెలుగు సాహితి సంస్థ వారి ‘ బాల సాహిత్య రత్న’ బిరుదు, ‘ తెలుగు వెలుగు ‘ పురస్కారం అందుకున్నారు. 17జులై 2023న నల్గగొండ లో సాహితీ మిత్రమండలి వారిచే
బాల సాహితీవేత్త ‘పెండెం జగదీశ్వర్’ స్మారక పురస్కారం అందుకున్నారు. 10 డిసెంబరు 2023న హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో బాలసాహిత్య పరిషత్తు, పుట్టగుంట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ‘ పుట్టగుంట సురేష్ కుమార్ బాల సాహిత్య పురస్కారం’ పొందారు.
ఇదే పురస్కారాన్ని సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు అదే వేదికపై అందుకున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన గుడిపూడి రాధికారాణి బాలసాహిత్యంలో విశేషకృషి చేస్తున్నారు.
శ్రీ గిడుగు వేంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవ వేడుకలు-2023 పురస్కరించుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ గారి ద్వారా 29 ఆగస్ట్ 2023 న బాలసాహిత్య పురస్కారం
అందుకున్నారు.
56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కృష్ణాజిల్లా, మచిలీపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయం ద్వారా 19 నవంబరు 2023 న ఘనంగా సన్మానం పొందారు.
యు.విజయశేఖర రెడ్డి బాలలకోసం అనేక కథలు రాస్తున్నారు. వీరి సాహితీసేవలు గుర్తించి
“తెలుగు వెలుగు” సంక్షేమ సంఘం, చెన్నై ‘తెలుగు వెలుగు’ ఉగాది పురస్కారం 13 మార్చి 2023న చెన్నెలో అందజేశారు. ‘బాలగోకులం’ సంస్థ నిర్వాహకులు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్శి ‘బాల ప్రియ’ పురస్కారాన్ని నవంబరు 2023న రవింద్రభారతిలో అందచేశారు.
తెలుగు వెలుగు సంక్షేమ సంఘం, చెన్నై 2023లో ఉగాది పురస్కారాలను, బాలసాహితీరత్న అవార్డులను
ఉమ్మడి విజయశేఖర్ రెడ్డి, చెన్నూరి సుదర్శన్, సంగనబట్ల చిన్న రామకిష్టయ్య, బెహరా ఉమామహేశ్వరరావు, ఆర్.సి
కృష్ణస్వామి రాజు, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ లకు అందజేశారు.
రంగినేని సుజాతా మోహన్ రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల, రేగులపాటి (రంగినేని) లక్ష్మి ‘జాతీయ బాల సాహిత్య పురస్కారాలను
మాడభూషి లలితాదేవి, ముంజులూరి కృష్ణకుమారి, డాక్టర్ కందేపి రాణీప్రసాద్ లకు ప్రకటించింది.త్వరలో ఈ పురస్కారాలు వీరు అందుకోనున్నారు.
కొత్త ప్రభుత్వాలు బాలసాహితీవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. బాలల అకాడమీని పునరుద్దరించి బాలసాహిత్యంలో గతంలో ప్రచురించిన ‘బాలచంద్రిక’ వంటి పత్రికలు ప్రతి పాఠశాలకూ వెళ్ళేలా చూడాలి.బాలసాహితీవేత్తలను గుర్తించి, ప్రోత్సహించటం వలన 2024 లో మరింత విలువైన బాలసాహిత్యం వెలుగు చూస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.*

— పైడిమర్రి రామకృష్ణ
సెల్ : 92475 64699

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News