Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Israel-Hamas war: కామన్ మ్యానే ఇక్కడ బాధితుడు

Israel-Hamas war: కామన్ మ్యానే ఇక్కడ బాధితుడు

కుప్పకూలుతున్న ఆమ్ ఆద్మీ

భీకర యుద్ధంలో సమిధలవుతున్న సామాన్య ప్రజానీకం ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలి టెంట్ల దాడి నేపథ్యంలో మధ్య ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. దాడులు, ప్రతి దాడులతో ఇటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌, అటు ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాలు రణ రంగాన్ని తలపిస్తు న్నాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా భారీ సంఖ్యలో క్షతగాత్రులుగా మిగులుతున్నారు. తమ దేశ భూభాగంలోకి చొరబడి హమాస్‌ ఉగ్ర వాదులు పారించిన రక్తపుటేరులపై ఇజ్రాయెల్‌ రగిలిపో తోంది. హమాస్‌ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలోని ముష్కరుల స్థావరాలను శిథిలాల కుప్పగా చేస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతినబూనింది. ఇజ్రాయెల్‌ పట్టణాల్లో రాకెట్‌ దాడులు, తుపాకీ కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్న హమాస్‌ ఉగ్రవాదులు ఆ దేశపౌరులతోపాటు విదేశీయుల్నీ బందీ లుగా పట్టుకున్నారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తు న్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బందీలుగా పట్టుబడినవారిలో థాయ్‌ లాండ్‌, నేపాల్‌కు చెందిన పౌరులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్ల డించింది. హమాస్‌ పూర్తి పేరు హర్కత్‌ హాల్‌ ముఖావమా ఆల్‌ ఇస్లామీయా. ఇది సున్నీ తెగకు చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌. ఇజ్రాయెల్‌ను నాశనం చేసి ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు చేయడానికి 1987లో పుట్టిన సంస్థ. పాలస్తీనా నుండి విదే శాల్లో స్థిరపడ్డ వారు గల్ఫ్‌ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు ఇరాన్‌ తుర్కియే లాంటి దేశాల తో పాటు అనేక దేశాల్లో ముస్లిం ఛాందస వాద గ్రూపులు వ్యక్తులు హామాస్‌ కు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు.1987 నుండి హమాస్‌ ఇప్పటికీ కొన్ని వేల మంది ఇజ్రాయెల్‌ ప్రజలను చంపింది. గాజాలోని 400 మంది ఉగ్రవాదులను ఇప్పటికే మట్టుబెట్టి నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్‌ ముష్కర మూలాల్ని పెకి లించే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ ఇంటలిజెన్స్‌ విభాగం ‘ముసాద్‌’కు ప్రపం చంలోనే అత్యంత శక్తిమంతమైన నిఘా వ్యవస్థగా పేరుం ది. అలాంటి వ్యవస్థ గాజా దాడుల్ని పసిగట్టలేకపోవడానికి కారణమేంటి? తప్పు ఎక్కడ జరిగింది? పాలస్తీనాకు చెం దిన ‘హమాస్‌’ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఎందుకు దాడికి పాల్పడ్డారు? ఇజ్రాయెల్‌ ఎందుకు పాలస్తీనాపై అణిచివేత చర్యలకు పాల్పడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య వివాదం ఎందుకు మొదలైంది..? ఎప్పుడు మొదలైంది? అంటే మనం ఓసారి చరిత్ర మూలాల్లోకి వెళ్ళాలి. మధ్య ఆసియా, తూర్పు యూరప్‌ ప్రాంతాల్లో సుదీ ర్ఘంగా విస్తరించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యం సుమారు 600 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పాలించింది. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఉన్న సౌది అరేబియా, టర్కీ, ఈజిప్ట్‌, లెబనాన్‌, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌ వంటి అనేక దేశాలు ఆనాడు ఒట్టోమన్‌ సామ్రాజ్య పరిధిలోనే ఉండేవి. 13వ శతాబ్దం మధ్య నుంచి అంటే 1299 నుంచి 1922 వరకు ఒట్టోమన్‌ సామ్రాజ్యం కొనసాగింది. అయితే ఒట్టోమన్‌ సామ్రాజ్య స్థాపనకు ముందు నుంచి ప్రస్తుతం పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా చెప్పబడుతున్న ప్రాంతాల్లోని ‘జెరూ సలెం’ మూడు ప్రధాన మతాలకు కేంద్రంగా ఉంది. ప్రపం చ చరిత్రలో జెరూసలెం నగరాన్ని అత్యంత పురాతన నగరంగా చెబుతారు. అరబ్బులు, యూదులు, క్రైస్తవులు కూడా జెరూసలెం నగరాన్ని అత్యంత పవిత్రంగా భావి స్తారు. ఈ 3 మతాలకు చెందిన మూలాలు ఇక్కడ ఉండ టంతో పాటు.. వారి పురాతన ప్రార్థనా మందిరాలు సైతం ఇక్కడే ఉన్నాయి. ఇందులో డోమ్‌ ఆఫ్‌ ద రాక్‌, అల్‌ అక్సా మసీదులు ముస్లింలకు చెందినవిగా ఉన్నాయి. వెయిలింగ్‌ వాల్‌ను యూదులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక క్రైస్తవులు హోలీ సపుల్కా చర్చిని క్రీస్తుకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఏనాటి నుంచో ఒట్టోమన్‌ సామ్రాజ్యం లో మెజార్టీ వర్గీయులుగా ఉన్న అరబ్బులు పాలస్తీనా ప్రాం తంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారంతా సమీపంలోని జెరూసలెంతో పాటు పాలస్తీనాను తమ మాతృభూమిగా భావిస్తుంటారు. యూదులు సైతం పాలస్తీ నాను, జెరూసలెంను తమ పూర్వీకుల నివాసంగా చెబు తూ ఉంటారు. ఇటు క్రైస్తవులు సైతం జెరూసలెంను తమ దిగా క్లైమ్‌ చేసుకుంటున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఇలా ఉండగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు.. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ , జెరూ సలెం ప్రాంతాల్లో చిచ్చు రాజేశాయి. ఆనాడు రాజుకున్న అగ్ని కీలలు నేటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నా యి. మొదటి ప్రపంచ యుద్ధ సమయం వరకు పాలస్తీనా ప్రాంతం ఒట్టోమన్‌ ఆధీనంలో ఉండగా ఆనాడు యుద్ధం లో ఒట్టోమన్‌ పాలకులు ఓడిపోవటంతో అక్కడ బ్రిటన్‌ పాలన మొదలైంది. ఆనాటికి పాలస్తీనాలో అరబ్బులు మెజార్టీ వర్గంగానూ, యూదులు మైనార్టీగాను ఉండేవారు. అయితే.. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పాలస్తీనా బ్రిటన్‌ చేతుల్లో ఉండటంతో అక్కడికి యూదుల రాక ఎక్కు వైంది. మరోవైపు జర్మనీ ఆధ్వర్యంలో నాజీలు యూదుల్ని ఊచకోత కోయటంతో ప్రాణ భయంతో వలస వచ్చే యూదులకు పాలస్తీనా ప్రాంతం కేరాఫ్‌ అడ్రస్‌గా మారి పోయింది. 1920 నుంచి 1940 మధ్య ప్రాంతంలో పాల స్తీనాకు యూదుల వలస అనూహ్యంగా పెరిగింది. దీం తో.. ఒకప్పుడు అరబ్బులు ఎక్కువగా ఉండే పాలస్తీనా ప్రాం తం క్రమేపీ యూదుల ఆధిపత్యంలోకి వెళ్లిపోయింది. అక్క డి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న యూదులతో అప్ప టికే స్థిరపడ్డ అరబ్బులకు గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే యూదులు, అరబ్బులకు మధ్య హింసాత్మక ఘటనలు, బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఐక్యరాజ్య సమితి 1947లో జోక్యం చేసు కుంది. పాలస్తీనా ప్రాంతాన్ని రెండుగా విభజించి యూదు లకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంత ర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫా రసు చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపి నప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించ లేక ఆంగ్లేయులు చేతులెత్తేశారు. 1948లో బ్రిటిష్‌ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తరువాత యూదులు ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్‌ దేశాల నుం చి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షల మంది పాలస్తీని యన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పారి పోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమికొట్టారు. మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్‌ చాలా మటుకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్‌ బ్యాంక్‌ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్‌, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్‌ ఆక్రమించుకున్నాయి. జెరూ సలెంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయెల్‌ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్‌ దళాలు పంచుకు న్నాయి. అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరు నిందించుకుంటూనే ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలెంను కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. అంతే కాకుండా, సిరియన్‌ గోలన్‌ హైట్స్‌, గాజా, ఈజిప్షియన్‌ సినాయ్‌ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌, జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌లలో పాలస్తీనియన్‌ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించట్లేదు. వీళ్లు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ అంటోంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు వెనక్కు తగ్గినప్పటికీ.. వెస్ట్‌ బ్యాంక్‌ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ ఆధీనంలోనే ఉంది. జెరూ సలెం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయెల్‌ ప్రకటించు కుంది. కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవి ష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొంటున్నారు. తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్‌ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్‌కు మధ్య నిత్యం వివాదాలు చెలరేగుతుంటాయి. గాజా నుంచి పాలస్తీనా పౌరులు బయటకు రాకుండా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం భారీ రక్షణ గోడను నిర్మించింది. ఇనుప ముళ్ళ కంచెలతో సరిహద్దు ప్రాంతాల్ని సీజ్‌ చేసింది. ఇటు గాజా, అటు వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాలపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్న అనేక రాజకీయ సంస్థలతో పాటు హమాస్‌ అనే మిలిటెంట్‌ ఆర్గనైజేషన్‌ కూడా యాక్టివ్‌ రోల్‌ తీసుకుంది. గతంలో ఓ సారి పాలస్తీనా పాలనా పగ్గాలు చేపట్టిన హమాస్‌.. ఆ తరువాత అనేక అంతర్జాతీయ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థల సహకారంతో ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతోంది. పురాతన చరిత్రలో అరబ్బుల ఆవాసంగా ఉన్న పాలస్తీ నాను ఇజ్రాయెల్‌ చెరపట్టిందని.. పాలస్తీనా పౌరులు అం టున్నారు. 1948లో మాత్రమే ఏర్పడ్డ ఇజ్రాయెల్‌ దేశానికి, ఎక్కడి నుంచో వలస వచ్చిన యూదులకు అసలు ఇక్కడ ఉనికే లేదనేది పాలస్తీనా ప్రజల వాదన. అయితే.. తమ పూర్వికులు మూలాలు ఇక్కడే ఉన్నందున.. ఈ ప్రాంతం తమదే అని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్న చారిత్రక, భౌగోళిక వివాదానికి ఇటు ఐక్యరాజ్య సమితి గానీ, అటు అంతర్జాతీయ సమా జం గానీ సరైన పరిష్కారం చూపకపోవటంతో ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్య దశాబ్దాలుగా రగులుతోంది. మధ్య ఆసియాలో అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్‌ సొంతం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఎల్లప్పుడూ.. ఓ వైపు అంత ర్గత నిఘా వ్యవస్థ ‘షిన్‌ బెట్‌’, గూఢచార వ్యవస్థ ‘మొసాద్‌’ తో పాటు.. ఆ దేశ రక్షణ వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో సన్నద్దతో ఉంటాయి. ఇజ్రయెల్‌ సరిహద్దు దేశాలైన సిరి యా ఇంకా లెబనాన్‌తో పాటు.. పాలస్తీనాలోని మిలిటెంట్ల గ్రూపుల్లో ఆ దేశానికి చెందిన ఏజెంట్లు ఉంటారనేది బహిరంగ రహస్యం. అందుకే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్‌లోని వ్యవ స్థలు పనిచేస్తుంటాయి. కానీ నిన్నటి హమాస్‌ దాడిని పసిగట్టకపోవడంతో అన్ని వేళ్లూ.. ఇజ్రాయెల్‌ ఇంటలీజెన్స్‌ వైపే చూపిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్‌ ఇంటలీజెన్స్‌ వ్యవస్థలు ఎక్కడ విఫలమయ్యాయి..? హమాస్‌ మిలిటెంట్లు విరుచుకుపడ్డ సమయంలో ఎటూ పాలుపోని స్థితిలో ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన స్టేట్‌ మెంట్‌ ఏంటంటే ‘ఇదెలా జరిగిందో మాకూ తెలియడం లేదు’ అని. అసలు పాలస్తీనా మిలిటెంట్లు ఏ విధంగా విరు చుకుపడుతాయని కాదు. కనీసం దాడి చేయొచ్చనే కనీస సమాచారం కూడా వారి దగ్గర లేదని తేలిపోయింది. అంటే హమాస్‌ దాడిని ఏ మాత్రం పసిగట్టలేకపోయింది. ఎందుకంటే పదుల సంఖ్యలో మిలిటెంట్లు గాజా, ఇజ్రా యెల్‌ మధ్య ఉన్న రక్షణ కంచెను బుల్డోజర్లతో కూల గొట్టారు. అదే సమయంలో వేలాది రాకెట్లతో విరుచుకు పడ్డారు. ఇంకోవైపు సముద్రం నుంచి దాడికి పాల్పడ్డారు. ఇలా భూమి, ఆకాశం, సముద్రం గుండా మిలిటెంట్లు ఊహించని విధంగా దాడికి దిగడంతో ఇజ్రాయెల్‌ షాక్‌కు గురైంది. ఇజ్రాయెల్‌లో బలమైన మిలిటరీ, సరిహద్దు భద్రత, షిన్‌ బెట్‌ మరియు మొసాద్‌ సిబ్బంది, అత్యాధునిక థర్మల్‌ ఇమేజింగ్‌, మోషన్‌ సెన్సార్లు మరియు అధునాతన సరిహద్దు ఫెన్సింగ్‌లు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడమే.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇంత భారీ ఎత్తున దాడి జరగడాన్ని గమనిస్తే.. హమాస్‌ దగ్గర భారీ నెట్‌ వర్క్‌ లేదా మిలిటరీ వ్యవస్థ ఉందనే అభి ప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు మార్గాల గుండా ఇజ్రాయెల్‌పై దాడి కోసం పక్కా ప్రణాళికను రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. ఇజ్రా యెల్‌ ఇటీవలే హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ సమయాన్ని హమాస్‌ మిలిటెంట్లు యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నారు. ఆయుధా లతో పాటు.. దాడికి సంబంధించిన ప్రణాళికను రెడీ చేసు కుని యాక్షన్‌లోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఇజ్రాయెల్‌ ఇంటలీజెన్స్‌ ఏం చేస్తుంది..? అంటే.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఫోకస్‌ అంతా ఇరాన్‌ వైపు మళ్లించినట్లు జెరూసలెం పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ యొక్క అణు కార్యక్రమాన్ని విఫలం చేసే ప్రయత్నాలలో మునిగి పోయిందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన హమాస్‌ మిలిటెంట్లు.. ఊహించని దాడి చేశారు. అయితే ప్రస్తుతం హమాస్‌పై ఇజ్రాయెల్‌ యాక్షన్‌ లోకి దిగింది. ప్రతిదాడి చేస్తోంది. ప్రస్తుతం హమాస్‌ మిలి టెంట్ల చేతుల్లో బందీగా ఉన్న తమ పౌరులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా హమా స్‌పై సీరియస్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ముం దుగా వారికి ఆయుధాలు చేరకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ భీకర యుద్ధం ఎన్ని వేల ప్రాణాలను బలిగొంటుందో చూడాలి. భారత్‌ లాంటి శాంతి కాముక దేశాలు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి.

- Advertisement -

– పిన్నింటి బాలాజీ రావు

9866776286

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News