Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్communal violence: మహారాష్ట్రలో మత కలహాలు

communal violence: మహారాష్ట్రలో మత కలహాలు

గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో చెదురు మదురుగా జరుగుతున్న మత సంబంధమైన హింసావిధ్వంసకాండలు రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం సాగుతున్న ఏకీకరణ ప్రయత్నాలకు అద్దం పడుతున్నాయి

మహారాష్ట్రలో మత సంబంధమైన ఏకీకరణ జోరందుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అక్కడక్కడా చోటు చేసుకుంటున్న మత కలహాలు ఇందుకుప్రబల నిదర్శనంగా కనిపిస్తున్నాయి. చినికి చినికి గాలి వానగా మారినట్టు ఈ చిన్నస్థాయి మత కలహాలు ఒక తుపానుగా మారి బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. గత కొద్ది రోజులుగా కొల్హాపూర్‌లో కొనసాగుతున్న మత కలహాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అంతేకాదు, గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో చెదురు మదురుగా జరుగుతున్న మత సంబంధమైన హింసావిధ్వంసకాండలు రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం సాగుతున్న ఏకీకరణ ప్రయత్నాలకు అద్దం పడుతున్నాయి. నిజానికి ఇవన్నీ చిన్న సంఘటనలే అయినప్పటికీ, స్వల్ప కారణాల మీదే ఇవి జరుగుతున్నప్పటికీ ఇవి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు, 18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌లను కీర్తిస్తూ సోషల్‌ మీడియాలో మెసేజెస్‌ రావడంపై ఇరు వర్గాల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా 40ని అరెస్టు చేసిఈ నెల 19 వరకూ నిషేధాజ్ఞలు విధించడం జరిగింది.
గత మార్చి 17న కొల్హాపూర్‌లో కూడా ఇదే విధంగా మత కలహాలు చోటుచేసుకున్నాయి.బీడ్‌లో కూడా గత జూన్‌ 9న మత కలహాలు పేట్రేగడం జరిగింది.ఇక రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఔరంగాబాద్‌ అనే పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చడంతో తాజాగా మత కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల కారణంగా గత మార్చి 30న ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది.మొత్తం మీద ఈ కలహాలకు ఏదో ఒక కారణం కనిపిస్తోంది. మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ముంబైలోని మాలాడ్‌లో పెద్ద శబ్దంతో పాటలు పెడుతున్నప్పుడు హిందువులు, ముస్లింల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. మార్చి 28న జల్గామ్‌లో ఒక మసీదు ముందు పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ పెట్టినందుకు ప్రతిగా ఈ వ్యవహారం చోటు చేసుకుంది.సోషల్‌ మీడియాలో ప్రవక్త మహమ్మద్‌కు సంబంధించి ఒక రెచ్చగొట్టే పోస్టర్‌ను పోస్ట్‌ చేయడంతోగత మే13న అకోలాలో ఘర్షణలు చెలరేగి, ఒక వ్యక్తి మరణానికి దారితీసింది. ఈ కలహాలు హింసా విధ్వంసకాండలతో పాటు దుకాణాలు, వాహనాల దగ్ఢానికి కూడా కారణమయ్యాయి. ఈ సంఘటనల్లో ఇద్దరు పోలీసులు గాయపడడంతో మొత్తం 300 మందిని అరెస్టు చేశారు.అదే రోజున నాసిక్‌లోని త్రయంబకేశ్వరంలో ముస్లింలు నమాజు చేస్తున్న సమయంలో ఒక మసీదు వద్ద ఘర్షణలు తలెత్తాయి. ఆ మరునాడు అహ్మద్‌నగర్‌ జిల్లాలోని శివగావ్‌ ప్రాంతంలో ఛత్రపతి శంభాజీ స్మారక ఊరేగింపు జరుగుతుండగా కలహాలు రేగాయి. ఈ సంఘటనల్లో చాలామంది గాయపడ్డారు. చాలామందిఅరెస్టు అయ్యారు కూడా. పోలీసులు నిషేధాజ్ఞలు విధించడం, చివరికి ఇంటర్నెట్‌ సర్వీసులను కూడా ఆపేయడంజరిగింది. ప్రజా జీవితం స్తంభించిపోయింది.
మొత్తం మీద ఈ హింసా విధ్వంసకాండల కారణంగా, వీటి వెనుక జరుగుతున్న మతపరమైన ఏకీకరణలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014లో లోక్‌సభ ఎన్నికలు జరగడానికి ముందు, 2017లో ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందు ఇదే విధంగా మతపరమైన ఏకీకరణలు చోటు చేసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కూడా దాదాపు ఇదే పద్ధతిలో ఏకీకరణలు జరిగాయి. మహారాష్ట్రలో అప్పట్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు కలిసి బీజేపీపై పోటీ చేయడం జరిగింది. ఈసందర్భంగా వివిధ పార్టీలతో పాటు, కొన్ని ముస్లిం వర్గాలు, హిందూ సంఘాలు ఈ ఏకీకరణలకు వీలైనంతగా తోడ్పడ్డాయి. ఏకీకరణ జరగడమనేది తేలికే. అయితే, దీన్ని తగ్గించడం లేదా పరిహరించడం చాలా కష్టం. మహారాష్ట్రలోని పాలక పక్షం ఈ కుట్రలు, కుతంత్రాల విషయంలో నిర్ణయాత్మకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సమస్యలు సృష్టిస్తున్నవారు ఎవరైనప్పటికీ, వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News