కొన్ని జీవితాలు కాలంతో పాటు ముగిసి పోవు. అవి ఒక చారిత్రక కాలానికి సాక్ష్యాలుగా, తరతరాలకు దారిచూపే వెలుగురేఖలుగా నిలు స్తాయి. నక్సల్బరీ విప్లవ పిలుపుతో మొదలైన ప్రయాణంలో ఐదు దశాబ్దాలకు పైగా విప్లవోద్య మంతో మమేకమైన అరుదైన వ్యక్తిత్వం కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య (శంభూజీ). అణచివేతలు, ఆటు పోట్లు, సంస్థాగత సంక్షోభాలు, రాజకీయ పునర్ని ర్మాణాల మధ్య విప్లవ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న సజీవ చరిత్ర ఆయనది.
నక్సల్బరీ స్ఫూర్తితో మొదలైన ప్రస్థానం
1967 మేలో ఉత్తర బెంగాల్‌లోని నక్సల్బరీలో చెలరేగిన రైతాంగ తిరుగుబాటు భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. భూస్వామ్య దోపిడీకి, సామాజిక అణచివేతకు, అసమాన భూ సంబంధాలకు వ్యతిరేకంగా పేద రైతులు, వ్యవసాయ కార్మికులు సాగించిన పోరాటం దేశవ్యాప్తంగా విప్లవ చైతన్యాన్ని రగిలించింది. అది ఒక ప్రాంతపు తిరుగుబాటుగా మిగిలిపోలేదు. దోపిడీ లేని సమాజం కోసం కొత్త రాజకీయ మార్గాన్ని అన్వేషించిన యువతరానికి స్ఫూర్తినిచ్చింది.
ఆ నిప్పుకణికతో ప్రభావితమైన యువ తలో స్వదేశ్ భట్టాచార్య ఒకరు. 1968లో విద్యార్థిగా ఉన్నప్పుడే నక్సల్బరీ రాజకీయాల పట్ల ఆకర్షితులై విప్లవోద్యమంలోకి అడుగు పెట్టారు. 1969 ఏప్రిల్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ఏర్పడిన తరువాత ఉద్యమ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. నక్సల్బరీ స్ఫూర్తిని విస్తృత ప్రజా ఉద్యమంగా మలచా లన్న ఆకాంక్షతో తన జీవితాన్ని అంకితం చేశారు. వినోద్ మిశ్రా స్మృతిలో 1999 జనవరిలో ఆయన రాసిన వ్యాసం ఆ కాలపు రాజకీయ అనుభవాలకు విలువైన సాక్ష్యం.
సంక్షోభంలో
పార్టీ పునర్నిర్మాణం
1972 నాటికి చారు మజుందార్‌తో పాటు పలువురు నాయకుల హత్యలు, ప్రభుత్వ నిర్బంధం, అంతర్గత రాజకీయ సమస్యలతో పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. ఉద్యమం చెల్లాచెదురవుతున్న పరిస్థి తుల్లో సిద్ధాంత స్పష్టతను, సంస్థాగత ఐక్య తను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో 1974 జూలై 28న పార్టీ కేంద్ర కమిటీని ముగ్గురు సభ్యులతో పునర్వ్యవస్థీకరించారు. జోహార్ ప్రధాన కార్యదర్శిగా, వినోద్ మిశ్రా, రఘు (స్వదేశ్ భట్టాచార్య) సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఆ కమిటీలో ఒకరిగా శంభూజీ పార్టీ పునర్నిర్మాణంలో భాగమయ్యారు.
1975 నవంబర్‌లో భోజ్‌పూర్‌లో జోహార్ అమరత్వం పొందిన తరువాత వినోద్ మిశ్రా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1976 ఫిబ్రవరిలో గయాలో జరిగిన పార్టీ మహాసభ గత అనుభవాలను సమీక్షించి, కొత్త కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది. 1978లో ప్రారం భమైన సరిదిద్దుకునే రాజకీయ ప్రచారం, 1979 జూలైలో భోజ్‌పూర్ ప్రత్యేక సమావేశం తీసుకున్న నిర్ణయాలు పార్టీ దిశలో కీలక మార్పుకు దోహదపడ్డాయి. బహిరంగ ప్రజా కార్యకలాపాలను విస్తరించడం, ప్రజా సంఘాలను నిర్మించడం, ప్రజల నిత్యజీవిత సమస్యలపై పోరాడటం ప్రధాన ప్రాధాన్యతలుగా మారాయి.
ప్రజా ఉద్యమాల నిర్మాణం.. సంస్థాగత బాధ్యతలు
1982లో ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్) ఆవిర్భవించింది. అదే ఏడాది డిసెంబర్లో గిరిడీలో జరిగిన మూడో పార్టీ మహాసభ పార్టీ కార్యక్రమం, వ్యవసాయ కార్యక్రమం, రాజ్యాంగాన్ని ఆమోదించి పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. 1988 జనవరిలో హజారీబాగ్‌లో జరిగిన నాలుగో మహాసభలో శంభూజీ కేంద్ర నియంత్రణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం, క్రమ శిక్షణ, సంస్థాగత సమగ్రతను కాపాడే బాధ్యతను నిర్వర్తించారు.
సోవియట్ యూనియన్ పతనం, తూర్పు యూరప్ పరిణామాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్య మం ముందు కొత్త ప్రశ్నలను ఉంచాయి. 1990 జూలైలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక అఖిల భారత సమావేశం ఈ మార్పు లను సమీక్షించింది. ఆ తరువాత కూడా శంభూజీ పార్టీతో కొన సాగుతూ సంస్థాగత బాధ్యతలు నిర్వహించారు. 1998 డిసెంబర్లో వినోద్ మిశ్రా మరణం తరువాత దీపాంకర్ భట్టాచార్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2002 పాట్నా పార్టీ మహాసభ లోనూ శంభూజీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు.
నక్సల్బరీ వారసత్వానికి.. సజీవ సాక్ష్యం
2012 జూలై 28న ఢిల్లీలో చారు భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా చారు మజుందార్ విగ్రహాన్ని శంభూజీ ఆవిష్క రించారు. 1974లో పునర్వ్యవస్థీకరించిన ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీలో అప్పటికి జీవించి ఉన్న ఏకైక సభ్యుడు ఆయనే. ఆ సందర్భం నక్సల్బరీ నుంచి సాగిన సుదీర్ఘ విప్లవ ప్రస్థానానికి ఒక చారిత్రక గుర్తుగా నిలిచింది.
వర్తమాన పోరాటాలకు నక్సల్బరీ స్ఫూర్తి
శంభూజీ జీవితాన్ని గత చరిత్రగా మాత్రమే చూడలేం. నేటికీ భూమి సమస్య పరిష్కారం కాలేదు. వ్యవసాయ సంక్షోభం రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. కార్పొరేట్ శక్తులు భూములు, సహజ వనరులను కబళిస్తున్నాయి. కుల వివక్ష, మహిళలపై అణచివేత కొనసాగుతు న్నాయి. మత విద్వేష రాజకీయాలు ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. కార్మి కుల హక్కులు, ప్రజాస్వామిక స్వేచ్ఛలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నక్సల్బరీ లేవనెత్తిన భూమి, భుక్తి, విముక్తి ప్రశ్నలు ఇప్పటికీ ప్రాసం గికంగానే ఉన్నాయి. ఒక తరం చేసిన త్యాగాలను మరో తరం కేవలం జ్ఞాపకం చేసుకోవడం సరిపోదు. ఆ ఆశయాలను వర్తమాన ప్రజా పోరాటాలతో అనుసంధానించాలి. మారుతున్న పరిస్థి తులను అర్థం చేసుకుంటూ ప్రజల మధ్య పనిచేయాలి. ఐదు దశా బ్దాలకు పైగా విప్లవోద్యమంతో మమేకమై, సంక్షోభాల మధ్య విశ్వా సాన్ని నిలబెట్టుకున్న కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య జీవితం ఈ తరానికి ఒక సజీవ పాఠం. వ్యక్తులు, తరాలు మారినా దోపిడీ, అన్యాయాలపై పోరాటం కొనసాగాలి. నక్సల్బరీ నిప్పుకణికను గుండెల్లో దాచుకుని విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన శంభూజీకి విప్లవ జోహార్లు!
అక్టోబర్ 30న తుదిశ్వాస విడిచిన
కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్యకు నివాళిగా..
మామిండ్ల రమేష్ రాజా
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్

