Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Crime & women: మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి

Crime & women: మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మా త, శయనేషు రంభ అన్నది ఆర్యోక్తి. అందుకే మహాత్మ గాంధీ మహిళల గూర్చి చెప్తు ఒక మహిళ విద్యా వంతురాలు ఐతే మూడు తరాలను విద్యావంతులను చేస్తుంది అని అంటే మహిళల యొక్క గొప్పతనం వారి దూరదృష్టి ఎలాంటిదో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇతిహాసాలలో, చరిత్రలో నమోదుకాబడిన కొద్దిమంది మహిళల ఔన్నత్వము గూర్చి వారి స్ఫూర్తివంతమైన పోరా ట పటిమ గూర్చి కొంత తెల్సుకున్న తర్వాత నేటి మహిళల ఆలోచన విధానం ఏంటో తెల్సుకుందాం.
ఔదార్యము, ఉదాత్తమైన స్వభావము కల ఒక స్త్రీ కుటుంబంలో అనేక పాత్రలు పోషించగలదు, ఇన్ని పాత్ర లు పోషించాలంటే చాలా ఓర్పు అవసరం, రామాయణం లో సీత, కైకేయి రెండు పాత్రలు స్త్రీలవే కాని వాటి స్వభా వం వేరు అనే విషయం ఇక్కడ గమనించాలి, ఒక పాత్ర భర్తతో పాటు రాజభోగాలను వదిలి, అడవులకు పయన మైతే, మరొక పాత్ర, కన్న కొడుకును సింహాసనంపై కూర్చోబెట్టాలనే స్వార్ధం ప్రదర్శిస్తుంది. మొదటిది ఉదాత్త మైనది, రెండోది స్వార్ధపూరితమైనది, ఇక మహాభారతం విషయానికి వద్దాం. భర్త చనిపోయిన తర్వాత చిన్న పిల్లల్ని తీసుకొని హస్తినాపురం పంచనజేరి భీష్ముడి సంరక్షణలో గురుద్రోణాచార్యుడి వద్ద విలు విద్యలు నేర్పించి అత్యుత్తమ క్షత్రీయవీరులుగా పాండవులను తీర్చిదిద్దుతుంది తల్లి కుంతిదేవి. తండ్రి లేని లోటును పిల్లల దరిచేరకుండా అన్నీ తానై పిల్లల్ని పోషిస్తుంది. నేటి సమాజంపై బలమైన ముద్ర వేయగలిగే పాత్ర అది. అలాగే, కురుసభలో మహామహుల సమక్షంలో జరిగిన అవమానం, కురుక్షేత్ర యుద్ధంలో ఉప పాండవులను, తండ్రిని, సోదరుడిని సైతం కోల్పోయి మనో ధైర్యం కోల్పోకుండ పాండవులలో ధైర్యాన్ని నిం పుతూ అద్బుతమైన పాత్ర పోషిస్తుంది ద్రౌపది. ఇక సతీ సావిత్రి కథ అందరికి తెలిసే వుంటుంది భర్త ప్రాణాలను కాపాడుకోవటం కోసం ఏకంగా యమధర్మరాజు వెంట వెళ్లి ఒక్కొక్క వరాన్నిపొంది చివరికి యముడిని సైతం మెప్పించి భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకుంటుంది. ఇం దులో కూడా సావిత్రి గొప్ప ప్రతిభను ప్రదర్శిస్తుంది. ఇక మరొక గొప్ప కథ నలదమయంతుల స్వయంవరం. ఒకరి కొకరు ప్రత్యక్షంగా చూసుకోకుండానే ప్రేమలో పడటం అనంతరం జరిగిన స్వయంవరంలో దమయంతిని నల మహారాజు పొందటం, ఇందులో కూడా దమయంతిలోని మలినం లేని ప్రేమను చూడవచ్చును.
మరొక పాత్రలో పార్వతి శివుడిని భర్తగా పొందటం కోసం ఘోరమైన తపస్సుచేసి శివుడిని మెప్పించి భర్తగా పొందటం కూడా అందరికి తెలిసిన విషయమే, అలానే సత్యహరిశ్చంద్రుని భార్య చంద్రమతి గొప్పతనం, శకుం తల పడిన కష్టాలు, ఇవి ఇతిహాసలలోని పాత్రలు, ఇక వేదకాలంలో పురుషాదిక్య సమాజాన్ని ఎదిరించి విద్యను పొందిన గార్గేయి, మైత్రేయి, అనంతరం మరాఠయోధుడు చత్రపతి శివాజీ తల్లి జిజియా బాయి కుమారుడిని తీర్చి దిద్దిన విధానం, ఝాన్సిలక్ష్మి బాయి పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వైనం, రాణిరుద్రమ దేవి పోరాట పటిమ, సావిత్రి బాయి పూలే మహిళలకు నేర్పిన విద్యా బుద్దులు, జాతీయోద్యమంలో మహాత్మ గాంధీ వెంట నడిచిన, అరుణ అసఫ్‌ అలీ, సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, మదర్‌ థెరిస్సా, కల్పనా చావ్లా, సునితా విలి యమ్స్‌, ఇటీవలే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రవాస భారతీయురాలు కమలా హారిస్‌ మొదలైన వారం త ఈ కాలం మహిళలకు స్ఫూర్తిదాతలు మరియు సమా జానికి గొప్ప మార్గదర్శకులు అని చెప్పడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు.
పరిస్థితులు మారాయి ఆచారాలు పద్ధతులు మారి పోయాయి, సంకుచితపు భావజాలం క్రమంగా మేధో వికాసం పొందింది, మనిషి కాలంతో పాటు వేగంగా వస్తు న్న మార్పులను అందిపుచ్చుకొని శాస్త్ర సాంకేతిక రంగా లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతు న్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచీకరణ పైత్యం ప్రతి గడప గడపకు వేగంగా విస్తరించింది. పెరిగిన సాంకేతిక పరి జ్ఞానము, మారిన జీవన విధానం, మానవ సంబంధాలలో డబ్బు ఆధిపత్యము పెరగటం ఫలితంగా మనుషుల ప్రవ ర్తనలో మార్పురావటం మొదలైనది. దీనికి స్త్రీలు మినహా యింపేమి కాదు, స్త్రీని దేవతగా పూజించిన సంస్కృతి మనది, మాతృస్వామిక వ్యవస్థలో కూడా స్త్రీలు తమ పాత్రను సమర్ధవంతంగా పోషించారని ఎన్నో చారిత్రిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. పాశ్చ్యాత్యుల జీవన విధా నంతో పోల్చుకుంటే మనదేశంలో స్త్రీలకు వున్న విలువ ఆదరణ, ఆరాధనా భావం ప్రపంచంలోని ఏ స్త్రీకి లేదన్నది బహిరంగ సత్యమే అంతెందుకు మన వివాహ వ్యవస్థను ప్రాశ్చాత్యుల వివాహ వ్యవస్థతో పోల్చుకుంటే వారికి మనకు తేడా ఏంటో యిట్టే అర్ధమైపోతుంది.
ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో స్త్రీల ప్రవర్తన విధానంలో వచ్చిన కొన్ని మార్పులను గమనిద్దాం. ఆరు నెలల క్రితం విశాఖపట్నంలో ఓ ప్రొఫెసర్‌ భార్య ఓ యువ కుడితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా వున్నా డన్న నెపంతో చంపి పెట్రోల్‌ పోసి తగులబెట్టిన సంఘటన ఎవరు మర్చిపోలేనిది, కరీంనగర్‌ జిల్లాలో గత సంవత్సరం చివరి నెలలో (డిసెంబర్‌లో) సింగరేణిలో పనిచేస్తున్న భర్తను స్వచ్చంద పదవీవిరమణ తీసుకోవాలని వేధిస్తున్న కుమారులు మరియు అతని భార్య, ఆ వేధింపులు తాళలేక వేరుగా ఉంటున్న భర్తను చంపడానికి సుపారి ఇచ్చి నిద్రి స్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి ఇంటికి నిప్పుంటించగా ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమైన విష యం అందరిని ఆలోచింపజేసింది. ఈ రకమైన నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగడం ఆందోళన కల్గించే విషయం. సమాజంలో స్త్రీలు మొదటి నుండి బాధితులు గానే వున్నారు. వారిపై జరుగుతున్న అత్యాచారాలు గాని, లైంగిక హింసగాని, హత్యలు గాని ఇవి నేటికి కొనసాగటం బాధ కల్గించే విషయమే. అందుకే మహిళల హక్కులకు, మహిళల రక్షణకు అనేక చట్టాలు (నిర్భయ చట్టం 2013 మార్చి19, గృహహింస చట్టం 2005, అత్యాచార నిరోధక చట్టం మొదలైనవన్ని) మహిళల రక్షణ కొరకు ఏర్పాటు చేయబడినవే. ఐనప్పటికి మహిళలపై నేరాలు తగ్గుతు న్నాయా అంటే అదీ లేదు. కాని ఆశ్చర్యకరంగా మహిళలు హింసాత్మక ఆలోచనలు చేయటం, నేరపూరితమైన ప్రవ ర్తన ద్వారా పలు రకాల హింసలకు పాల్పడటం బాధ కల్గించే అంశం మరియు ఆలోచించాల్సిన విషయం కూడా. నా ఉద్దేశ్యంలో నేరం ఎవరు చేసినా శిక్షాస్మృతి ప్రకారం నేరం నిర్ధారణ జరిగితే విధింపబడే శిక్ష సమానం అది స్త్రీకి ఐన పురుషుడికైన, పురుషులు అనేక రకాల అల వాట్లకు బానిసలుగా మారి హింసాత్మక ఆలోచనలకు గురై మానసిక ఉద్వేగాల నియంత్రణ కోల్పోయి హింసకు పాల్ప డే అవకాశం ఉందనేది మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం. కాని స్త్రీలకు అటువంటి అలవాట్లు లేకపోగా వేరే వ్యక్తుల ప్రోద్భలంతో క్షణికమైన ఆవేశానికి పాల్పడి సమాజం దృష్టిలో నేరస్థులుగా ముద్రపడటం ఆలోచించా ల్సిన విషయమే. సంవత్సరం క్రితం మహబూబ్‌ నగర్‌లో సొంత మేనబావను చంపిన స్వాతిరెడ్డి అనే మహిళను తల్లిదండ్రులు కూడా బహిష్కరించిన విషయం మనందరికి తెలిసిన విషయమే, అనంతరం జరిగిన పరిణామాల్లో పిల్లలు అటు తండ్రిని కోల్పోయి ఇటు తల్లి జైలుకి, వెరసి వారి పరిస్థితి దిక్కులేని పక్షుల మాదిరి అన్నట్లుగా తయారైంది.
ఇక ఈ మధ్యనే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌1, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంలో ఓ మహిళ క్రియాశీలక పాత్ర పోషించిన విషయం మనందరికి తెలిసినదే.
ఇటీవలే జరిగిన మరొక సంఘటన నల్లగొండలోని మహాత్మ గాంధీ యూనివర్సిటీలో బీ.టెక్‌ చదువుతున్న నవీన్‌ అనే విద్యార్ధిని హరిహర కృష్ణ అనే తనతోటి బాల్య స్నేహితుడు అత్యంత దారుణంగా హత్యాచేసిన విషయం రాష్ట్రంలో సంచలనం కల్గించింది, అత్యంత భయం గొల్పే హత్య కూడా అది. నిందితుడు అత్యంత దారుణంగా చంపి శరీర భాగాలను వేరు చేసిన విధానం అందరిని విస్మయా నికి మరియు జుగుప్సను కల్గించింది ఆ సంఘటన. ఈ కేసులో మరో నిందితురాలిగా వున్న వ్యక్తి విద్యార్థిని కావ డం విశేషం. సదరు విద్యార్థిని పట్ల ఇద్దరు ఆకర్షితులు కావటం, నవీన్‌తో గతంలో సన్నిహితంగా మెలిగి, అనం తరం నవీన్‌ స్నేహితుడు హరిహర కృష్ణకు దగ్గర కావటం వెరసి నవీన్‌ను హరిహర కృష్ణ చంపటం, ఈ సంఘటన మొత్తం ఒక అమ్మాయి కోసం జరిగిన హత్యగానే భావిం చాల్సి వుంటుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ అమ్మాయి (విద్యార్థిని) కూడా జైలుకి వెళ్ళటం, అందరికి తెలిసిన విషయమే, వీటన్నింటి వెనుకవున్న కారణాలు పరిశీలిస్తే అనాలోచితమైన అపరిపక్వమైన ప్రవర్తనా విధా నం, మానసిక నియంత్రణ కోల్పోవటం వల్ల జరిగినవే. నేరం చేస్తే వాటి ద్వారా కలిగే పర్యవసానాలు ఆలోచించ లేకపోవటం కూడా ఒక కారణంగానే చెప్పాలి.
మారుతున్న జీవనశైలి, నట్టింట్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, మనిషి మనిషికి మధ్య పెరుగుతున్న అంత రాలు, సమూహంలో ఉండటానికి ఇష్టపడక స్వేచ్ఛగా ఉండాలనుకోవటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోవడం, చట్టాలపట్ల అవగాహన లేకేపోవటం, క్షణికమైన ఆవేశంతో నేరాలకు పాల్పడటం, అనంతరం కుటుంబాలు ఛిన్నాభిన్నం చేసుకోవటం, ఇటు కుటుంబం అటు సమా జం వెలివేస్తున్నట్లుగా చూడటం వల్ల మానసిక నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు, కాబట్టి తప్పు ఎవరు చేసినా అది స్త్రీ అయినా పురుషుడైనా నేరాన్ని బట్టి దాని మీద జరిగిన విచారణ మరియు దొరికిన ఆధారాలు, మోపబడ్డ శిక్షను బట్టి శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమాజంలో మొదటి నుండి వివక్షకు మరియు లైంగికపరమైన హింసకు గురైన స్త్రీలు మొదటి నుండి బాధి తుల, వంచితుల జాబితాలోనే ఉన్నారు. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిందితులుగా మారటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. హక్కుల కోసం పోరాడిన మహిళలు వాటిని సాదించుకొని నేడు చేతులకు సంకెళ్ళు వేసుకోవటం అనేది బాధకల్గించే విషయం, గడప దాటాలంటే కుటుంబం అనుమతి తీసుకునే పరిస్థితుల నుండి స్వేచ్ఛగా దేశాలు తిరిగే అవకాశం పొందటం గొప్ప విషయం కాకపోతే ఏమిటి? అలా అని వారి స్వేచ్చను స్వాతంత్య్రాన్ని నియంత్రించాలని కాదు. ప్రముఖ స్త్రీ వాద రచయిత చలం గారు స్త్రీకి కూడా శరీరం వుంది దానికి వ్యాయామం కావాలి ఆమెకు మెదడు వుంది దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి, స్త్రీని స్వేచ్ఛగా ఒదలడమొక్కటే పురుషుడామెకు చేయగల సహాయం అంటారు. స్త్రీ స్వేచ్ఛతో కలిగే సాధి కారక ప్రయోజనం అందులో దాగివుంది.
నాగరికతా నిర్మాణంలో స్త్రీల పాత్ర లేదంటారా? వారి ప్రమేయం లేకుండానే ఇంతసుదీర్ఘమైన ప్రయాణం పురుషుడు ఒక్కడే చేశాడంటే నేను నమ్మను ఇద్దరి భాగ స్వామ్యంతోనే ఇంత ప్రగతి సాధ్యమైందనేది నా అభి ప్రాయం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి పాత్ర ఖచ్చి తంగా వుంటుంది. ఇది ఎవరు కాదనలేరు కూడా. ఆడది నదిలా ఉండాలి ఎక్కడో పుట్టి ఎటో ప్రవహించి ఎన్నో కష్టాలకోర్చుకొని తానుకోరుకున్న సముద్రాన్ని చేరుతుంది. అలాగే ఆడది కూడా అదే ఆదర్శం, అదే గమ్యం అదే ఓర్పుతో అగ్ని పర్వతాన్ని కూడా గుండెల్లో దాచుకొని అం దరికి ఆనందాన్ని పంచగల్గినప్పుడే స్త్రీ జన్మసార్ధకత అవు తుంది అంటాడు ఓ కవి. ప్రతీ జీవితానికి ఎన్నో మలు పులు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాటిని అధిగమిం చినప్పుడే పరిపక్వత వైపు పయనించగలం.
నైతికత, అనైతిక అనేది మన మనస్తత్వంపైనే ఆధార పడి ఉంటుంది కరుడుగట్టిన నేరస్థుడికి నైతికత ఉంటుందా అనేది ప్రశ్న? మనుషులుగా ఆలోచించాలనేది నా ప్రశ్న. ధర్మాధర్మాలు, విచక్షణ, ఏం చేస్తున్నాం అనేది మన అంత రాత్మ, మనస్సు వెంటనే స్పందిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎలా స్పందిస్తున్నామో అంచనా వేసు కోవచ్చు. హింసతోనో దానికి ప్రతిహింసతోనో సాధించేది ఏమి ఉండదని చరిత్రలో ఎన్ని సంఘటనలు రుజువు చేశాయి. అలాంటి నేరస్వభావం, నేర చరిత్ర వున్నవారు చరిత్రలో ఎంత చెడ్డవారిగా ముద్ర వేయించుకొని కాల గర్భంలో కలిశారో చదువుకున్నాం. అంతిమంగా మనం ఎంత మంచి వారమనేది మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్న ప్పుడు తప్పుడు మార్గాలవైపు మనిషి ఎందుకు వెళ్తున్నాడ నేది ఆలోచించాల్సిన అంశం. శాంతియుత సమాజం వైపు మనిషి వెళ్ళాలనుకున్నప్పుడు హింస వైపు హింసాపూరిత ఆలోచనలు చేయకుండా ఎవరికీ వారు ఆ రకమైన ఆలోచ నలను నియంత్రించుకుంటే ప్రస్తుతం ఈ సమాజంలో ఇంత సంఘర్షణ ఉంటుందా? స్వేచ్ఛ, సామరస్యాలు ఫరిడవిల్లవా, ప్రపంచంలోని ఏడువందల యాబైకోట్ల మంది శాంతియుతంగా ఆలోచిస్తే ప్రపంచం ఎంత అం దంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఇకనైన మనం మన వంతుగా అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి ఇప్పుడే దీక్ష బూనుదాం.
సమాజము అనే బండికి స్త్రీ/పురుషుడు జోడేండ్ల లాంటివారు, ఇందులో ఏ ఒక్కటి అదుపు తప్పిన సమాజ స్థితిగతులు, మానవ సంబంధాలు గతి తప్పే ప్రమాదం వుంది. బండి సజావుగా నడవాలంటే రెండు సమంగా, సమానంగా బాధ్యతాయుతంగా మెలగాల్సి వుంటుంది, కాబట్టి అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మన కార్తవ్యాలను గుర్తెరిగి మసలుకుందాం.
‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అనేది ఒకప్పటి మాట నేడు స్త్రీలు ప్రవేశించని రంగం లేదు అంతరిక్షానికి వెళ్ళగల్గుతు న్నారు మహిళలు. వారికి అవకాశాలు ఇద్దాం, సమాజం లో వారిపట్ల జరుగుతున్న నేరాలు, ఘోరాలు నియం త్రించే బాధ్యత పురుషుల పైన కూడా వుంది, స్త్రీ లేనిది పురుషుడు లేదు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. మనస్సులో కలిగే హింసాత్మక ఆలోచనల్ని నేరపూరితమైన బీజాల్ని అదుపు చేసుకునే శక్తిని కూడ పెట్టుకొని మానవ సంబం ధాలు ఆరోగ్యకరంగా వుండే విధంగా మానవంతు ప్రయ త్నం అందరం చేద్దాం లోకా సమస్త సుఖినోభవంతు.
డా॥మహ్మద్‌ హసన్‌

  • 9908059234
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News