Homeఎడిటోరియల్ / బహుళప్రాథమిక హక్కులు వర్తించని దళిత క్రైస్తవులు

ప్రాథమిక హక్కులు వర్తించని దళిత క్రైస్తవులు

చింతాడ ఆనంద్‌ వర్సెస్ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  కేసులో వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు వల్ల  తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సంక్షోభం తలెత్తింది. తీర్పు ఆధారంగా దళితులను లక్ష్యంగా చేసుకొని కొన్ని వర్గా ల వారు క్రీస్తును నమ్మిన దళితుల మీద ఫిర్యాదులు చేస్తుంటే, క్రీస్తు భక్తులు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. 17 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న  ఈ సమస్య గురించి రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. ఐతే, నిన్నటిదాకా హిందూ-ముస్లింలకు మాత్ర మే పరిమితమైన విభేదాలు, ఇప్పుడు హిందూ-దళితుల మధ్య, హిందూ – ఆదివాసుల మధ్య పెద్ద అగాధం ఏర్పర్చే పరిస్థితులు సృష్టిస్తున్నాయి.
ఆదివారం నాడు ప్రార్ధన చేస్తుండగా బయటకు పిలిచి కులం పేరుతో దూషించి, కొట్టి తీవ్రంగా అవమా నించారని చేసిన ఫిర్యాదు పైన పోలీసులు ఎస్సీ /ఎస్టీ కేసు నమోదు చేశారు. చింతాడ ఆనంద్‌ దళితుడు కాదని ఆయన క్రైస్తవుడని, క్రైస్తవులు ఎస్సీ/ఎస్టీ అత్యా చార నిరోధక చట్టం కింద రక్షణ పొందలేరని నింది తులు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పాస్టర్‌ పనితో పాటు పాస్టర్ల సంఘంలో ట్రెజర ర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ క్రైస్తవుడిగా మారిన రోజు నుండి అతని కులం రద్దవుతుందని, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అతను రక్షణ కోరలేడని ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు 30 ఏప్రిల్‌ 2025న తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆనంద్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

- Advertisement -

1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు గాని, మార్చి 24వ తేదీన సుప్రీం కోర్టు విధిస్తున్న ఆంక్షలు గాని పూర్తిగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమైనవి.
ఆర్టికల్‌ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థానాన్ని బట్టి ఏ పౌరుడిపైనా రాజ్యం వివక్ష చూపరాదు. ప్రభుత్వ ఉద్యోగాలు, నియామకాలలో సమాన అవకాశాలు కల్పించాలని ఆర్టికల్‌ 16 తెలి పింది. చట్టం ద్వారా నిర్దేశించిన విధానాలు తప్ప ఎవరి జీవితంలోని వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదు. గౌరవ ప్రదమైన జీవితం సాగించాలని ఆర్టికల్‌ 21 చాలా స్పష్టంగా తెలిపింది. అంటరానితనం ఏ రూపంలో కనిపించినా దానిని రద్దు చేయాలని, అంటరానితనాన్ని ఆర్టికల్‌ 17 నిషేధించింది. రాజ్యాంగం ప్రకారం 1950 లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వు రాజ్యాంగ వ్యతిరేక మైనది. ఈ ఉత్తర్వు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నది. వ్యక్తిగత విషయమైన మతాన్ని బహిరంగం చేస్తూ స్వేచ్ఛను నిరాకరిస్తున్నది.

రాజ్యాంగం అమలులోకి రాకముందు నుండి వుండే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు, అమలులోకి వచ్చిన తరువాత చేసిన చట్టాలు, ఆర్డినెన్స్‍, బై-లా, రూల్స్‍, రెగ్యులేషన్స్‍, నోటిఫికేషన్స్‍, కస్టమ్స్‍ వంటివి వాటంతటవే రద్దు కావాలని ఆర్టికల్‌ 13 బల్ల గుద్ది చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వు అనగా అదొక ఆర్డర్‌. ఈ ఆర్డర్‌ కూడా దానంతట అదే రద్దు కావాలి. రాష్ర ్టపతి ఉత్తర్వులు పార్లమెంటులో చర్చించి ఆమోదం పొందిన తర్వాత చట్టం చేయాలి. గత 76 సంవత్సరాల నుండి నేటి వరకు చట్టం చేయలేదు. ఈ విధంగా చట్టం చేయని ఆర్డర్‌లు ఆరు నెలలు నాలుగు వారాల్లో రద్దయి పోవాలి. ఆర్డర్‌లు జారీ చేయడానికి రాష్ట్రపతికి ఆర్టికల్‌ 123 అధికారం ఇచ్చింది. అదే ఆర్డర్లు రద్దు చెయ్యడా నికి కూడా ఆర్టికల్‌ 123 అధికారం ఇచ్చింది.  రిజర్వే షన్ల అమలుకు మతం మెలిక తొలగించాలని 2007లో జస్టిస్ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ స్పష్టంగా తెలిపింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషను నివేదికను బుట్ట దాఖలు చేసింది.  మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె జి బాలకృష్ణన్‌ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం 2022లో కమిషన్‌ నియమించింది. ఈ కమీషన్‌ సామాజిక న్యాయంతో కూడిన నివేదిక సమర్పిస్తుందని నమ్మకం ప్రజల్లో కలగడం లేదు. ఎందుకంటే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్లు నేరుగా క్రైస్తవత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి.

క్రైస్తవంలో కులం లేకపోతే భారత దేశమంతటా కులం ఉన్న సంగతి విస్మరించింది. కులం పుట్టుక ద్వారా వారసత్వంగా లభిస్తుంది. మతం మనిషి అభీష్టం మేర కు స్వీకరించబడుతుంది. ఎన్నిసార్లయినా మతం మా ర్చుకునే సౌకర్యం ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఈ డబ్ల్యుఎస్ అనే వర్గాలకు వారి కేటగిరి గుర్తింపుకు మతపరమైన నిబంధన లేదు. మతం మారిన షెడ్యూల్డ్‍ కులం వారిని ఎస్సీ కన్వర్ట్స్‍ క్రిస్టియన్‌ అనే పేరుతో బీసీ (సి) కేటగిరి లోకి చేర్చబడుతున్నారు. వీరిని షెడ్యూల్డ్‍ కులం నుంచి వచ్చిన క్రైస్తవులు అంటున్నారు తప్ప కొత్తగా దక్కిన కిరీటం ఏమీ లేదు. మతం మారినా మారక పోయినా కులం వారి వెంటే వుంటుందని రుజువుచేయబడింది. వేలాది సంవత్సరాలుగా వెంటబడుతున్న కులం, మతం మారగానే కేవలం దళితులకు మాత్రమే మాయమవు తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం వాస్తవ విరుద్ధం.

హిందూ విదేశీయులు పెట్టిన పేరని గోల్వాల్కర్‌ ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‍’లో పేర్కొన్నారు. పర్షియన్లు సింధు పదం పలకలేక  “సి” అక్షరాన్ని “హి’’ అని పిలిచారు. దీనివలన సింధు కాస్త హిందూగా మారిపోయిందని చరిత్రకారులు స్పష్టం చేసారు. హిందూ అంటే దౌర్భా గ్యుడంటారని హిందూ మత పెద్ద చిన్నజీయర్‌ స్వామి ప్రవచించారు. హిందూ అనేది మతం అని ఏ పురాణం, ఇతిహాసం తెలుపలేదు. అలాంటి పదాన్ని మతం అని ప్రకటించి ఆ హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను విశ్వసిస్తే వారిని షెడ్యూల్డ్‍ కులం వారిగా పరిగణించనని రాష్ట్రపతి ఆర్డర్‌ జారీ చేశారు. మతం కాని పదంలో ఏ దేవుణ్ణి పూజిస్తే దళితులు హిందువుల వుతారో ఏ కోర్టు చెప్పడం లేదు.

ఎస్సీ వారు ఎస్సీ లు గా కొనసాగాలంటే మూడు పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలని కఠినమైన నిబం ధన విధించారు. 1) 1950 షెడ్యూల్డ్‍ కులాల రాష్టపతి ఉత్తర్వు ప్రకారం రూపొందించబడిన జాబితాలోని  కులానికి చెందిన వాడని స్పష్టమైన సాక్ష్యం ఉండాలి. 2) అతని తల్లిదండ్రులు వారి పూర్వీకులు అది నుంచి అనుసరిస్తున్న స్వంత మతంలోకి మళ్లీ తిరిగి చేరినట్టు (పునర్మత ప్రవేశం) నిరూపించాలి. 3) సంబంధిత కులం వారు వారిని తమ కులంలోకి చేర్చుకుని తమ వారేనని అంగీకరించినట్టు తెలిపే సాక్ష్యం ఉండాలి. ఈ తీర్పు కుల వ్యవస్థను పటిష్ట పరుస్తూ, శాశ్వతం చేయాలనే దురుద్దేశం గోచరిస్తున్నది. ఇప్పటి నుండి దళితుడు దళితుడనని నిరూపించుకోవాలంటే హిందు పూజారులు ధృవీకరించాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసే తహసీల్దారు కార్యాలయం నుండి  హిందూ మతపెద్దల చేతుల్లోకి అధికార బదలాయింపు జరుగు తుంది. ఒకసారి కులం పేరుతో ఎస్సీగా ఉద్యోగం సంపాదించుకుంటే జీవిత కాలం మతం మారకూడదనే కఠినమైన అమానవీయమైన నిబంధ నలు విధించారు. దళితుడు మతం మారితే కులం ద్వారా సంక్రమించే అన్ని అవకాశాలు రద్దవుతాయి. ఎప్పుడో సంపాదిం చుకున్న ఉద్యోగం మతం మారడం వల్ల ఏ రోజైనా రద్దైపోతుంది. ఇంతకు మించిన మాన సిక హింస మరొకటి ఉంటుందా?

పులుగుజ్జు సురేష్‌
సామాజిక విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News