Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Democratic rule: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మెచ్చిన పాలన - ఏ అంశాల ప్రాతిపదికగా...

Democratic rule: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మెచ్చిన పాలన – ఏ అంశాల ప్రాతిపదికగా జరగాలి?

మద్యపానానికి అలవాటు పడే సగటు వయసు 19 ఏళ్లు

ప్రజాస్వామ్య పరిపాలనకు అనేక అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి. ప్రజాస్వామిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ప్రశ్నించే గొంతులు పౌరహక్కుల సంఘాలు మేధావులు బుద్ధి జీవుల సూచనలు పాటించడం, ప్రతిఘటనను పరిశీలించడం ద్వారా మానవీయ కోణంలో ఆలోచించగలగాలి . ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు, సంపూర్ణంగా అనుభవించగలిగి ప్రజల అవసరాల పునాదిగా ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వమని అంటారు. ప్రజా ప్రభుత్వంలో పెట్టుబడిదారులు భూస్వాములు సంపన్న వర్గాలకు కాకుండా అట్టడుగు వర్గాలు ,ఆదివాసీలు, దళిత గిరిజనులు, బహుజన సమాజానికి పెద్దపీట వేయడం ద్వారా సామాజిక కోణంలో అధికార వాటాను కూడా అనుభవించే విధంగా పాలకులు అంగీకరించగలగాలి. అసమానతలు, అంతరాలు, దోపిడీ, పీడన, వంచన లేనటువంటి తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మానవ సంబంధాలను బలోపేతం చేసే దిశగా పరిపాలన సాగాలంటే పాలకులకు ప్రజాస్వామ్య విలువల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అడుగడుగునా నిర్బంధం, అణచివేత, నియంతృత్వం, నిరంకుశ పద్ధతిలో కొనసాగే పాలన ఏ రకంగా ప్రజల చేతిలో పరాభవం పాలవుతుందో బారాస ప్రభుత్వ పతనాన్ని చూసి ఉన్నాం. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అందుకు భిన్నమైనటువంటి పద్ధతిలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే నిజమైన పాలనయే ప్రజా ప్రభుత్వ పాలన . ఆ వైపుగా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 7 డిసెంబర్ 2023 రోజున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ మాటకు కట్టుబడని రోజున నిలదీయడానికి , హక్కులను సాధించుకోవడానికి, అణచివేతను ప్రశ్నించడానికి ఎంతో అవకాశముంటుంది.!
ప్రజలు పాలనలో భాగస్వాములు కావడమంటే ఏమిటి? ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు: ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక నుండి ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇంత వర కున్న నిర్బంధం ముళ్లకంచెలు ఇకముందు ప్రజా భవన్ ముందు కనిపించవని స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రభుత్వంతో పంచుకోవచ్చునని ఇచ్చిన పిలుపు ద్వారా ప్రజలను ప్రభుత్వానికి సహకరించమని కోరడం జరిగింది . జాగరూకులైన ప్రజావళి ఎంత పెద్ద మొత్తంలో పాలకులతో కలిసిపోతే అదే స్థాయిలో ప్రజలు పాలనలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యున్నత దశ. ఇక ప్రసంగాన్ని లోతుగా గమనించినప్పుడు ప్రజల కోణంలో ఆలోచించగలిగే ప్రజా ప్రభుత్వంగా కొనసాగుతామని, పేద వర్గాలకు అసహయులకు నిస్సహాయులకు అండగా ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రజలు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు అని తేల్చిన విషయాన్ని మనం గమనించాలి. “ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధాని కేంద్రమంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు ఒక వేదిక ద్వారా ప్రకటించిన అంశం చట్టబ ద్ధమని దానిని అమలు చేయకపోతే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందని గతంలో ఢిల్లీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.” అందుకే కీలక ప్రసంగం వేల మాట్లాడిన మాటలు గాలి మేడలు కాకుండా ఆచరణలో చూపగలగాలి అనేది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక పాఠం కావాలి.. “పోరాటాలు అనేక త్యాగాల పునాదుల పైన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన అణచివేత దోపిడీ ద్వారా అరాచక పాలనకుచిరునామాగా మిగిలిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ అమానవీయ ప్రభుత్వాన్ని గద్దేదించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వేల ఇంతకాలం ప్రగతి భవన్ గా ఉన్న ఆ కార్యాలయం ముందున్న ముల్లకంచెను బద్దలు కొట్టించడం జరిగింది . ఎన్నికైన మేము పాలకులం కాదు ప్రజలకు సేవ చేసే సేవకులం” అని ప్రకటించిన తీరు ఆచరణలోనూ చూపగలగాలి. “ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ పోరాటం నుండి ఈ ప్రభుత్వం ఏర్పడింది . ఇంతకాలం మన హక్కులు హరించి వేయబడిన దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుకున్న మనం మరింతగా ప్రభుత్వానికి చేరువ కావాలని” ప్రజలను కోరడం ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం వర్ణన కోసమో, మెప్పుకోసమో చెప్పే మాటలు కావు. అంబేద్కర్ ఆశించిన, అందించిన ఓటు హక్కు ద్వారా ప్రజలను ప్రభువులుగా, నాయకులుగా, యజమానులుగా చేయగలిగిన ప్రజాస్వామ్యం యొక్క గొప్ప శక్తిని తెలియపరచడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
ఇక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ ఈ గెలుపు అమరవీరులకే అంకితం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన…. గతంలో అనేకసార్లు కేసీఆర్ కూడా ప్రజలు గెలవాలి అమరవీరుల ఆకాంక్షల కోసమే మా పాలన అంటూ చేసిన ప్రసంగాన్ని జ్ఞాప్తికి చేసినప్పటికీ కొత్త ప్రభుత్వ పాలన కెసిఆర్ పాలన లాగా నీటి మూట కాకూడదు. కాదు అని ఆశిద్దాం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అమరవీరుల ఆశయాలను ఆకాంక్షలను, విద్యార్థులు నిరుద్యోగుల యొక్క హక్కులను, రైతుల జీవితాలను, ఉద్యమకారుల యొక్క పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఆ వర్గాల సమస్యలను పరిష్కరించడా నికి కృషి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజలు ఆశించడం మాట వరసకే కాదు చేతల్లో చూపగలగాలి. భవిష్యత్తులో ఆ నిజాన్ని మనమందరం చూడాలి.
ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలు ఇతర పథకాలన్నీ కూడా అల్పాదాయ వర్గాలకు వర్తింప చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి అసమాన తలను మరింత నివారించడానికి దోహదపడాలి. ఇదే సందర్భంలో” రాష్ట్రంలోని గత పాలన బ్రష్టు పట్టిపోయిన వేళ మంత్రులందరికీ కూడా ఆయా రంగాలపైన పట్టు సాధించినప్పుడే సుపరిపాలన సాధ్యమని రాబోయే ఐదేళ్లలో మంత్రివర్గ సహచరుల ప్రోత్సాహం సహకారంతో ఆశించిన స్థాయికి మించి రాష్ట్ర పరిస్థితులను మెరుగైన స్థితిలో మార్పు చేసి చూపిస్తామని ప్రజల కోణంలో పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రజాభిమానాన్ని చూరగొంటామని” ముఖ్యమంత్రి చేసిన విస్పష్ట ప్రకటన. ప్రభుత్వ అస్తిత్వానికి, నిబద్ధతకు, పోరాట స్ఫూర్తికి సంబంధించిన అంశం. వైరి వర్గం కాంగ్రెస్ పార్టీ మీద కల్పించిన వ్యతిరేక ఆలోచనలను తిప్పి కొట్టే విధంగా అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు నియంతృత్వానికి స్థానం లేని ప్రజా పాలన కొనసాగితేమేధావుల కృషికి, ప్రజల ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి, కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత నాయకత్వానికి అర్థం ఉంటుంది. క్రమంగా ఉచిత పథకాలను అట్టడుగు వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తూ పాలన అభివృద్ధి దిశగా సాగాలంటే విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేసి రెండింటినీ ఉచితంగా అందించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని భారీగా పెంచాలి . లక్షలాది ప్రజానీకం చదువు వైద్యం పేరున కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేదవాళ్లుగా మారిపోతుంటే ఈ లోపాన్ని ప్రభుత్వం సవరిస్తే ప్రజలు ఆనందిస్తారు . నిజమైన ప్రభుత్వమని కలకాలం ఙ్ఞప్తికి ఉంచుకుంటారు.
2.రోగ నిరోధక శక్తిని క్షీణింప చేసి ..కాలేయము, క్లోమము, మెదడు, నాడీ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతున్న మద్యపానం పైన ప్రజల్లోనూ పాలకుల్లోనూ ఇప్పటికీ సోయి రాకపోవడం పరిణామాలను గుర్తించకపోవడం నిజంగా బాధ్యతలను విస్మరించడమే. గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతున్న మద్యపానం వలన దానికి బానిసలు అయిన వారు సమాజంలో అవమానించబడుతున్నా క్షణిక మానసిక ఉల్లాసం తృప్తి కోసం మద్యపానాన్ని అలవాటుగా చట్టబద్ధమైన హక్కుగా భావించే జనం ఇప్పటికీ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.
దీనివల్ల ఒనగూరుతున్న అనేక అనర్థాలు శారీరక మానసిక ఆరోగ్యాలను దెబ్బతీయడమే కాకుండా ప్రజా జీవితానికి సంబంధించిన ఇతర వ్యవస్థలకు కూడా సవాలుగా నిలుస్తున్న వేళ రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, గృహహింస, కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో పాటు యజమాని దాని కాటుకు బలి కావడంతో అనేక కుటుంబాలు వీధిన పడ్డ దౌర్భాగ్య పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అయినప్పటికీ ప్రజలలో మార్పు రాలేదు సమాజ పరిణామాన్ని ఘటనలను ప్రజల సామాజిక జీవించే హక్కును బంగపరుస్తున్న మద్యపానం పట్ల ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించక బరితెగించి ఆదాయం కోసం పనిచేస్తున్న కారణంగా ఈ పరిణామాలు మరింతగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గణాంకాలను , రెచ్చగొడుతున్న కారణాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా మద్యానికి బానిసైన ప్రజా జీవితాన్ని పరిశీలించినప్పుడు 15 నుండి 19 ఏళ్ల మధ్య 27 శాతం యువత మద్యం కోరల్లో చిక్కి శల్యం అయిపోతున్నట్లు అవగతం అవుతున్నది. ప్రపంచ మద్యం మార్కెట్లో భారతదేశ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంటే 2019 కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 10 నుండి 70 ఏళ్ల మధ్య వయసులో ప్రతి ఏడుగురులో ఒకరు మద్యాన్ని సేవిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక మందు తాగే అలవాటున్న ప్రతి అయిదుగురు పురుషుల్లో ఒకరు పూర్తిగా మత్తుకు బానిసగా మారిపోయినట్లు వింటే ఆందోళనకరమే కదా ! ఇక మద్యానికి బానిస కావడానికి గల కారణాలను పరిశీలించినప్పుడు కొంత ఆర్థికంగా బలపడడం, జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, అనుకరణ, నాగరికత సంస్కృతి ముసుగులో కొట్టుమిట్టాడుతున్న వింత పోకడలు, నగరీకరణ, సామాజిక మాధ్యమాలు, వ్యాపార ప్రకటనలు కూడా మరింతగా మద్యపానం వైపు ప్రజలను బానిసలుగా చేయడానికి కారణం అవుతున్నాయి.
గతంలో మద్యపానానికి అలవాటు పడే సగటు వయసు 19 ఏళ్లు ఉంటే ప్రస్తుతం 13 ఏళ్ల వయస్సు వాడే మద్యానికి అలవాటు పడి చిన్న వయస్సులోనే వృద్దు లైనవారిని చూసినప్పుడు పాలకుల యొక్క బాధ్యత రాహిత్యం మనకు అర్థం అవుతున్నది. బహుళ జాతి సంస్థల వ్యాపార ప్రకటనలు, సినిమా హీరోలు ఇతర క్రీడాకారులతోని ప్రకటనలు, మరింతగా రెచ్చగొడుతున్న విషయాన్ని కాదనలేము. అదే సందర్భంలో గ్రామీణ పేదరికం కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా మద్యానికి అలవాటు పడినవారు ఆర్థిక పరిస్థితి సహకరించని సందర్భంలో నకిలీ, కల్తీ మద్యాలకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా మనం ఎక్కువగా చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా భావించే వాణిజ్య ధోరణి కారణంగా కూడా దీని నిషేధానికి అనేక అవాంతరాలు ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆదాయం 10,000 కోట్లు కాగా పదేళ్ల తర్వాత ప్రస్తుతము 45 వేల కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తుంటే ఆదాయం పెరగవచ్చు కానీ ఆ ముసుగులో చిక్కిపోయిన జీవితాలు, వీధిపాలైన కుటుంబాలు, అనారోగ్యం పేరు న చేసిన ఖర్చు ఇప్పటికీ ప్రజలను ఆలోచింప చేయకపోతే ఎలా? బుద్ధి జీవులు, మేధావులు, సామాజిక రంగ నిపుణులు, బాధ్యతగల వారు మద్యపానం యొక్క ప్రభావాన్ని విస్తృతంగా అవగాహన చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
1960 ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో తొలిసారిగా మధ్య నిషేధాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత మూడు నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో అంతటా కూడా మద్యం ఏరులై పారుతున్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం కానీ ఏనాడు కూడా మధ్య నిషేధం ఆలోచన , మద్యం యొక్క పరిణామాలు, సామాజిక బాధ్యతను గుర్తించని కారణంగా కుటుంబాలు రోజురోజుకు పేదరికంలోకి నెట్టివేయబడుతూ వీధిపాలవుతున్న పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండించాల్సిన అవసరం బాధ్యతగల సమాజం పైన ఎంతగానో ఉన్నది. ప్రధాని రాష్ట్రమైన గుజరాత్లో తొలిసారిగా నిషేధం విధించినప్పటికీ దానిని ఆదర్శంగా చూపి దేశవ్యాప్తంగా నిషేధానికి కృషి జరిగినట్లయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పరచి సమాలోచన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానికి లేదా? కొన్ని రాష్ట్రాలలో నిషేధించి మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న కారణంగా అక్రమ రవాణా వల్ల చోటు చేసుకుంటున్నా పరిణామాలను ప్రేక్షకులుగా చూ డవలసి వస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి- పౌర సమాజం బాధ్యత పాలకుల కర్తవ్యాలు,మద్యం విక్రయములో భాగంగా రోజురోజుకు అధికంగా దుకాణాలను పెంచడంతోపాటు బెల్టు షాపులను అపరిమితంగా అనుమతించడంతో వివిధ పనులలో నిమగ్నమయ్యేవారు పలు వృత్తులను కూడా విస్మరించి తాగుడుకు బానిసలై ఉత్పత్తికి కూడా ద్రోహం చేస్తున్నారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలను అంతో ఇంతో ఆలోచించినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010లో ప్రపంచ దేశాలకు సూచన చేస్తూ మద్యపాన మహమ్మారిని నియంత్రించాలని ప్రతి వ్యక్తికి ఆరోగ్య సామాజిక భద్రత కలిగించే లక్ష్యంతో ఆయా దేశాలు పనిచేయాలని దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలిపిచ్చి నంత మాత్రాన ఆయా దేశాల పాలకులకు సోయి ఉంటే కదా అమలు జరిగేది . 13 సంవత్సరాల తర్వాత 2023 మేలో నెలలో నిర్వహించిన సదస్సులో గత 13 ఏళ్ల అనుభవాన్ని సమీక్షించిన తర్వాత అనివార్యమైన పరిస్థితిలో రాబోయే ఏడేళ్లను కలుపుకొని 2030 నాటికి కట్టడి చేయాలని కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తున్నది . సమాజానికి జరుగుతున్న నష్టం, వివిధ సంస్థలపై ప్రభావం, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా దేశాల యొక్క ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకొని మద్యం అమ్మకాలను క్రమబద్ధీకరించాలని క్రమంగా నిషేధం వైపు కొనసాగాలని కట్టుదిట్టంగా తీర్మానం చేసినట్టు తెలుస్తుంది .అయితే తాగేవారికి అటు పాలకులకు ఉమ్మడిగా ఉండాల్సిన బాధ్యత ఇది . చిన్న వయస్సులో దాని బారిన పడ్డ కుటుంబాలు అనేకం .పరిమితం చేయడం ద్వారా, పి న్న వయస్కులకు నియంత్రించి అమ్మకాలను క్రమబద్ధీకరించడం ద్వారా, చట్టాలను కఠినంగా అమలుపరిచి అందుబాటును తగ్గించాలి. అంతేకాదు క్లబ్బులు పబ్బులు, ధాబాలు పేరుతో ఎల్లవేళలా అందుబాటులో ఉండే అవకాశాలను రద్దుచేసి కేవలం దుకాణాలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా ప్రజల్లో మద్యపానం పట్ల క్రమంగా వ్యతిరేక భావాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక మద్యపానం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధపడే పాలకులు తమ బాధ్యతను గుర్తించి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ఆదాయ మార్గాలను సంపద సృష్టించే వైపు దృష్టి సారించాలి. మద్యం ప్రకటనలో వివిధ రంగాల వారికి అవకాశం లేకుండా నిషేధించి దానివల్ల వనగూరే పరిణామాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా కౌన్సిలింగ్ కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి దానికి బదులుగా ప్రత్యామ్నాయ పోషకాహార కేంద్రాలు ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయడం ద్వారా ప్రజల నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. పేదరికం, నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యలు, దోపిడీలు, పీడన, వంచన, అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి సకల సమస్యలను పరిష్కరించాలంటే సమాజంలో మద్యపాన పరిణామాలను విపత్తులను లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వివిధ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, టీవీ ప్రసారాలు సినిమాలలో మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తాగుతున్నట్లు చూపే సన్నివేశాలను వెంటనే నిషేధించి పలు మీడియాల ద్వారా అనర్థాలను ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ఈ అనర్థాల నుండి కొంతవరకు రక్షించుకునే అవకాశం ఉంది. “తను తెగనిజే కత్తి తెగ దు” అన్నట్లు పాలకులు సామాజిక బాధ్యతగా ఆరోగ్య భారతాన్ని, సంపన్న దేశాన్ని, ప్రజలను బుద్ధి జీవులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మద్యపానాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేయడానికి క్రమంగా నిషేదానికి అస్కారం ఉంటుంది.
3..మానసిక ఒత్తిడికి గురవుతున్న యువత:
కొన్ని మంచి పనులు, మంచి విషయాలు వింటే మనసు, హృదయం ప్రపుల్ల మవుతుంది. తనకు ఇష్టమైన సంఘటన లభించగానే పారవశ్యం కలుగుతుంది. సంబరాన్ని కలిగించే బంధువుల రాక ప్రమో దానికి కారణమవుతుంది. ఇవన్నీ మనసుకు సంబంధించిన అనుభూతులు కొందరు ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు వికసించి ఉంటుంది. అలాంటి వారితో సాన్నిత్యం ఆనంద ప్రధానంగా ఉంటుంది.
ఆధునిక ప్రపంచంలో డిజిటల్ ఈ కరుణ, యాంత్రీకరణ కృత్రిమ మేధ, విజృంభణతో ఉద్యోగ విపణిలో మార్పులు శరవేగంతో సాగుతున్నాయి. కొన్ని కొలువులకు క్రమేణా నూకలు చల్లి పోతున్నాయి. వ్యక్తిగత సృజనాత్మక శక్తులను పరీక్ష పెట్టే నవీన ఉపాధి అవకాశాలు ఎన్నో నేడు నవతరం తలుపు తడుతున్నాయి. వాటిని అందిపుచ్చుకొని నైపుణ్యాలను నోచుకోని సగటు భారతీయ విద్యార్థి జీవితంలో ఎదిగేందుకు ప్రస్తుతం తనకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయో కూడా తెలియడం లేదు. వేల రకాల ఉద్యోగాలు ఉన్నాయి కానీ దేశవ్యాప్తంగా 93 శాతం విద్యార్థులకు తెలిసినవి వృత్తిపరమైన ప్రత్యామ్నాయ విద్యా విధానం ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి వి ఒక సర్వేలో తేలింది. మెరుగైన జీవనోపాధికి వేటలో భారతీయ యువతను వెనక్కి లాగుతుంది విద్యా వ్యవస్థలోని లోపాలు ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదిక స్పష్టం చేసింది.! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది వెంటనే చికిత్స అవసరమైన మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్వో) అధికారికంగా ప్రకటించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 25 శాతాన్ని స్వల్ప స్థాయినుంచి తీవ్రమైన మానసిక సమస్యలు వేధిస్తున్నారని వెల్లడి చేసింది. మానసిక ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో డబ్ల్యూహెచ్వో ఏటా అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది. అందరికీ మానసిక ఆరోగ్యం ప్రపంచ ప్రాధాన్యం అనే అంశాన్ని ఏటి నినాదంగా ప్రకటించింది.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువత తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు పలు సంస్థలు జరిపిన సర్వేల ద్వారా వెల్లడవుతుంది. ముఖ్యంగా అభద్రతా భావం గల వ్యవస్థలో నేటి యువతరం నిలదొక్కుకోవడం సులభతరం కావడం లేదు. భారతదేశం వంటి సాంప్రదాయక దేశాలలో కూడా మానసిక ఆందోళన యువతులు నెలకొన్నది. ముఖ్యంగా సమాజంలో రోజు రోజుకూ దిగజారి పోతున్న విలువలు, మానసిక ఆందోళనకు కారణం కూడా అవుతుంది. ముఖ్యంగా ప్రపంచం సామాజిక సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ముఖ్యమని వ్యవహరించే వ్యవస్థలు నేడు మనకు కనబడుతున్నాయి. కుటుంబంలో నెలకొన్న మానవీయ విలువలు కొరవడడం ముఖ్యంగా భారతదేశంలోని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల యువతలో నిరాశ అధికంగా ఉన్నట్లు మానసిక నిపుణులు, సామాజిక నిపుణులు అంటున్నారు. సమాజంలో నీతి నియమాలు ధర్మం పట్ల ఏమాత్రం భయ భక్తులు లేకపోవడం సమాజంలో మానసిక రోగులు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. భారతదేశ జనాభాలో 7.5 శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత దిగజారి పోయిందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది“. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే” 2016 ప్రకారంగా భారతదేశంలో 13 నుంచి 17 ఏళ్ల బాలల్లో 7.3 శాతం మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మధ్య వయస్సు వారు అల్పాదాయ వర్గాల లో మానసిక సమస్యలు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటింటికి మట్టి పోయి అన్నట్లుగా, సమాజంలోని ప్రతి ఇంటిలో మానసిక సమస్యల తో ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ కొంతమందికి ఇంటి సమస్యలను చిన్న సమస్యలుగా పేర్కొని పరిష్కరించుకుంటారు. వీరిలో మానసిక సమస్యలు కొంత వరకు తక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాలలో కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలతో యువత, మధ్య వయస్సు వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. భారత్లో బలంగా పాతుకుపోయిన మూఢనమ్మకాలు సైతం ఎన్నో వర్గాల ప్రజలను ఆధునిక మానసిక చికిత్స వైపు వెళ్లకుండా చేస్తున్నాయి ఇప్పటికీ మన సమాజంలో చికిత్స కోసం వైద్యులను నిపుణులను కాకుండా భూత వైద్యులను సంప్రదించే వారు ఉన్నారు. ప్రతి అమావాస్య నాడు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాలలో నేడు నాలుగు బాట (చౌరస్తా) వద్ద కొబ్బరికాయ, కోడిగుడ్లు ,నిమ్మకాయలు, నల్ల కోడి పిల్ల పెట్టుకోవడం జరుగుతుంది. ప్రపంచం 21వ శతాబ్దంలో ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంటిలో మానసిక ఆందోళన కలిగిందంటే ఇందుకు ప్రధానమైన కారణం ఏదో శక్తి తనను ఆవరించి ఉందని భావించేవారు ఉన్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వారు, విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసేవారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా మూఢాచారాలు కొనసాగిస్తున్న విషయాలు మనందరికీ తెలిసిందే.
నేటి ఆధునిక ప్రపంచంలో, సమాచార ప్రసార యుగంలో సామాజిక మాధ్యమాలు సైతం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని హరించడంలో భాగం తున్నాయి. కొన్ని ముఠాలు పనిగట్టుకొని అవాస్తవాలను ఉద్రిక్తతలు తలెత్తి సమాచారాలను ప్రసార మాధ్యమాలలో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా యువత తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ఒత్తిడి కి గురవుతున్నారు. యువత ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు దీని ద్వారా తాగుడుకు బానిస కావడం, దొంగతనాలు, అత్యాచారాలు వంటి సంఘటనలు సామాజిక మాధ్యమాలలో చూస్తూ నేర్చుకోవడం, సంఘటనలకు పాల్పడడం జరుగుతుంది. ముఖ్యంగా యువతలో కొరవడిన కష్టపడే తత్వం కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన పొందడం ఎలా అన్న ఆలోచనతో సమాజంలో యువత పయనిస్తుంది. సాంకేతిక సాధనాలను ఇప్పుడే పుట్టిన బిడ్డ సైతం స్మార్ట్ ఫోన్ వినియోగం కోసం ఆరాటపడుతున్నారు. దేశంలో ఇటీవల సంవత్సరాలలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల మానసిక చికిత్స అవసరాల కోసం 24 గంటలు పనిచేసే ఏరోప్లేన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి అవి విస్తారంగా సేవలందిస్తున్నాయి ప్రస్తుతం మానసిక ఆరోగ్య సంరక్షణకు పెద్ద మొత్తంలో మొబైల్ యాప్ లు రంగ ప్రవేశం చేశాయి అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైగా మొబైల్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ ఇటీవల జరిగిన సర్వే ద్వారా వెల్లడైనట్లు ధ్రువీకరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి లక్ష జనాభాకు పదిహేను మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. భారత్లో మాత్రం ప్రతి లక్ష జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నట్లు చెప్పవచ్చు. గ్రామస్థాయి, పట్టణ స్థాయి, మెట్రోపాలిటన్ సిటీలో, ఆధునిక హంగులతో, జీవనం గడిపే, దేశంలోనే అత్యంత సంపన్నులైన వర్గాలలో కూడా మానసిక ఆందోళనలు నెలకొన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా సమాజంలో నీతి, నియమాలు, ధర్మం వీడిన వ్యక్తులలో ఇది మరింతగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బుద్ధుడు బోధించినట్లు ఉన్నదానితో తృప్తి పడడం సమాజంలో శాంతికి, మానవ శరీరానికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు. ఇతరుల సొమ్ము కు ఆశపడకుండా తనకున్న దానితో సంతోషంగా ఉన్నవారిలో మానసిక ఆందోళన ఉండదని చెప్పవచ్చు. కుటుంబంలో తరతరాలకు సరిపోను ఆస్తులను కూడబెట్టిన విషయంలో నీతి నియమాలు ధర్మం విడనాడినా వారు దేశంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు రుజువులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు సమాజంలో అశాంతికి ఎక్కువగా కారకులవుతారు ఎందుకంటే తాను కూడా పెట్టే ధనాన్ని, ఆస్తిని చూసి, పక్కింటి వారు కూడా ఆ స్థాయిలో ఎదగాలని ఆశపడడంనై ప్రధానమైన కారణం. ఏది ఏమైనా మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే సమాజం అనేక ఆందోళనకు గురవుతుంది ముఖ్యంగా యువతులు నెలకొన్న అనైక్యత భావం రోజురోజుకు పెరిగి పోవడం, నలుగురితో కలిసి ఉండకపోవడం నేటి ఆధునిక సాంకేతిక ఉద్యోగాలు కేవలం నాలుగు గోడల మధ్య నిర్వహించడం యువతకు ప్రపంచం అంటే తెలవకుండా ముఖ్యంగా సామాజిక అంశాలపై అవగాహన లేకపోవడం, ఉద్యోగరీత్యా ఎదురవుతున్న సమస్యలకు, కుటుంబ భారం అధికం కావడం వల్ల మానసిక సమస్యలకు ప్రధాన కారణమని, అయితే పైన పేర్కొన్నట్లుగా మానవ సమాజంలో నెలకొన్న “ఆశ” తగ్గించుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుంది, మానసిక ఆందోళనలు తగ్గుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా యువత ఒత్తిడి నుండి బయట పడుటకు కొంత సామాజిక అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, కేయూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News