Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Derailed Election speeches: ఎన్నికల ప్రచారాలు ప్రజలకు దూరం!

Derailed Election speeches: ఎన్నికల ప్రచారాలు ప్రజలకు దూరం!

అడ్డదిడ్డమైన ప్రసంగాలు..

ఎన్నికలనేవి ప్రజలకు సంబంధించిన వ్యవహారం. తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని తాము ఎంచుకోవడా నికి, ఎన్నుకోవడానికి వారికిది మహత్తర అవకాశం. ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలు, వాటి నాయ కులు, ప్రచార సారథులు తమ ఇష్టారాజ్యంగా మాట్లా డడం లేదా ప్రచారం చేయడం ప్రారంభిస్తే ప్రజాస్వా మ్యంలో మహోన్నత ఆశయాల మీద ప్రజలు దృష్టి పెట్ట డానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రచార సారథుల అవాకులు చవాకుల కింద ప్రజాస్వామ్య విలువ లన్నీ సమాధి అయిపోతున్నాయి. సుమారు 90 కోట్ల మంది ఓటర్ల రాజ్యాంగ బాధ్యతను వీరు చులకన చేయడం జరుగుతోంది. సామరస్యం వృద్ధి చెందాల్సిన సమయం లో విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నాయి.
వాస్తవానికి ఎన్నికల పోరాటం ఉన్నత స్థాయి లోనూ, ఉదాత్త స్థాయిలోనే ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ అనే నినాదంతో బీజేపీ, న్యాయ భారత్‌ అనే నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగా యి. ప్రజలకు అండగా నిలబడే పార్టీ, దేశాన్ని విభజించే పార్టీ అనే అవగాహన కూడా ప్రజలకు కలిగింది. కొద్ది వారాల పాటు ప్రజలను సవ్యంగా, సమర్థవంతంగా పాలించే పార్టీ తమదేనన్నట్టుగా ప్రచారం జరిగింది. తమ పార్టీ కాకుండా ఇతర పార్టీలన్నీ ప్రజాస్వామ్య సం స్థలను భ్రష్టు పట్టిస్తాయన్న ప్రచారం కూడా జరిగింది. 2047 నాటికి భారతదేశం కూడా అగ్ర రాజ్యాల స్థాయి లో అభివృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్టుగా తాము ప్రణాళికలు రూపొందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీయే కాక, బీజేపీ ప్రభుత్వం లోని ప్రతి మంత్రీ, ప్రతి నాయకుడూ గత పదేళ్ల కాలం లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని ఏకరువు పెట్టడం జరిగింది.
నానాటికీ తీసికట్టు
తమ ప్రభుత్వం రోజుకు 35 కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మిస్తోందని, కొత్తగా వంద విమానాశ్రయా లను నిర్మించిందని, మత కలహాలకు, ఉగ్రవాద దాడు లకు అడ్డుకట్ట వేసిందని, జీడీపీ పెరిగిందని, ఇతర దేశాల నుంచి సహాయం పొందే దేశం ఇప్పుడు సహా యం చేసే దేశంగా మారిందని, అంతర్జాతీయంగా ఒక బలమైన, ప్రభావశీల దేశంగా అవతరించిందని ప్రధాని తో సహా బీజేపీ మంత్రులంతా వివరించి చెప్పారు. అంతే కాక, తాము చెప్పిన దాని కన్నా, వాగ్దానం చేసిన దాని కన్నా గత పదేళ్ల కాలంలో ఎక్కువగానే చేసి చూపించా మని బీజేపీ నాయకులు వివరించడం జరిగింది. భవిష్య త్తులో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని, సంక్షేమాన్ని చేసి చూపిస్తామని, దేశాన్ని మరింతగా పురోగతి చెందిస్తా మని కూడా ఆ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది. కాం గ్రెస్‌ పార్టీ కూడా తమ హయాంలో తాము దేశాభివృద్ధికి తీసుకున్న చర్యలను ఏకరువు పెట్టడం జరుగుతోంది. తాము అధికారానికి వచ్చే పక్షంలో ఇంతకంటే ఎక్కువ పురోగతి సాధిస్తామని కూడా చెబుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి, దుష్పరి పాలన, అసమర్థ విధానాల గురించి మోదీ ప్రచారం చేస్తుండగా, బలమైన ప్రజాస్వామిక, పారి శ్రామిక దేశంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి పునాదులు వేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని రాహుల్‌ గాం ధీ తదితర నాయకులు ప్రచారం చేయడం జరుగుతోంది.
ఇంత వరకూ బాగానే ఉంది. వేసవి వేడిమికి తగ్గట్టే హఠాత్తుగా పాలక, ప్రతిపక్ష నాయకుల వాగ్ధాటిలో కూడా మార్పు వచ్చింది. దేశానికి అత్యంత ప్రధానమైన, అతి ముఖ్యమైన అంశాలను వదిలిపెట్టి ఈ పార్టీల నాయకులు అత్యల్ప విషయాల మీదా, అనవసర విష యాల మీదా దృష్టి పెట్టడం మొదలైంది. ఉన్నత స్థాయి నుంచి అధమ స్థాయికి దిగజారడం ప్రారంభమైంది. మొత్తం లోక్‌ సభ స్థానాల్లో సగం స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే సరికి ప్రకటనలు, ప్రసంగాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలన్నీ విషపూరితంగా మారిపోయాయి. రాజకీయ పార్టీల నాయకులు, కార్య కర్తలే కాకుండా వారికి చెందిన సోషల్‌ మీడియా గ్రూపు లు కూడా కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలను రెచ్చ గొట్టడం మొదలైంది. గౌరవ మర్యాదలు, సిగ్గూ లజ్జా వంటివి కూడా మృగ్యమయ్యాయి. 2024 ఎన్నికలు వ్యక్తిగత కక్షలు, విద్వేషాల స్థాయికి చేరుకున్నాయి.
దారితప్పిన ప్రసంగాలు
ఎన్నికల ప్రచారానికి అనర్హమైంది ఏదీ లేదన్న ట్టుగా, మైనారిటీలు, మందిరాలు, మంగళ సూత్రాలు అన్నీ ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా మోదీ, రాహుల్‌ గాంధీల మధ్య ఇది నువ్వా నేనా అన్న పోరాటంగా మారింది. తనకే కాక, దేశానికి కూడా రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యర్థులేనని మోదీ ప్రకటించారు. ‘అయిదేళ్లుగా రాహుల్‌ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులు ఒకే భజన చేస్తున్నారు. రాఫేల్‌ వ్యవహారంలో పస లేదని తేలిపోవడంతో మరో కొత్త భజన మొదలుపెట్టారు. అయిదుగురు పారిశ్రామిక వేత్తలు, అయిదుగురు పారిశ్రామికవేత్తలు, అయిదు గురు పారిశ్రామికవేత్తలు. ఇదే భజన ఎక్కడికి వెళ్లినా. ఆ తర్వాత అంబానీ, ఆదానీ అంటూ విమర్శలు చేయడం ప్రారంభించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఎన్ని కల ప్రచారం ప్రారంభం అయిన తర్వాత నుంచి రాహు ల్‌ గాంధీ ఇక అంబానీ, ఆదానీల గురించి నోరెత్తడం లేదు. నేనిప్పుడు తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్‌ గాంధీని ఒక ప్రశ్న అడుగుతున్నా. అంబానీ, ఆదానీల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి డబ్బెంత అందింది? ఏ విధమైన ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రి రాహుల్‌ ఎందుకు మాట మార్చేశారు? ఎక్కడో ఏదో జరిగింది’ అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని సైతం ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఆయన రాహుల్‌ గాంధీ మీద విమర్శలు చేయడానికి తెలంగాణను ఎంచుకోవడానికి ఒక కారణముంది. ఇటీ వలి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదానీ గ్రూపుతో రూ.12,500 కోట్ల పెట్టుబడుల మేరకు అనేక ఒప్పందాలు కుదర్చుకుంది.
కాగా, హోం మంత్రి అమిత్‌ షా ఈ ఎన్నికలకు కొత్త భాష్యం చెప్పారు. ఈ ఎన్నికలు పూర్తిగా మోదీ, రాహుల్‌ మధ్యేనని ఆయన ప్రకటించారు. ‘ఈ 2024 ఎన్నికలు మోదీ, రాహుల్‌ గాంధీ మధ్యనే జరుగుతు న్నాయి. జిహాద్‌కు ఓటు వేయాలో, వికాస్‌కు ఓటు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవలసి ఉంది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆయన అంతటితో ఆగలేదు. మోదీ చేసే భారతీయ గ్యారంటీలు, రాహుల్‌ చేసే చైనా గ్యారంటీల మధ్య ఎవరికి ఓటు వేయాలన్నది ఓటర్లే నిర్ణయించుకుంటారని కూడా ఆయన అన్నారు. ఆయన ఇటీవల తెలంగాణలో పర్యటించి నప్పుడు ఎక్కువగా హిందుత్వ భావజాలాన్నే ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌, బి.ఆర్‌.ఎస్‌, మజ్లిస్‌ పార్టీలకు ఒకరినొకరు బుజ్జగించుకోవడంతోనే సరిపోతోందని, అవి తెలం గాణను షరియా ప్రకారం, ఖురాన్‌ ప్రకారం పాలించాలనుకుంటున్నాయని కూడా అమిత్‌ షా వ్యాఖ్యానించారు.
మారుతున్న తీరుతెన్నులు
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ నవనీత్‌ రాణా హైదరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థి మాధవీ లత తరఫున ప్రచారం చేస్తూ, 2013లో మజ్లిస్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. “ఇక్కడ 15 నిమిషాల పాటు పోలీసుల్ని కనబడకుండా చేయం డి. మా సంగతేమిటో చెప్తాం’ అని అప్పట్లో అక్బ రుద్దీన్‌ ప్రకటించారు. అందుకు సమాధానంగా నవనీత్‌ రాణా, ‘మీకు 15 నిమిషాలు కావాలి. మాకైతే 15 సెకన్లు చాలు’ అంటూ సవాలు విసిరారు. హైదరాబాద్‌ మరో పాకిస్థాన్‌ కాకుండా మాధవీలత కాపాడగలరని కూడా ఆమె స్పష్టం చేశారు. పైగా కాంగ్రెస్‌ పార్టీకి, మజ్లిస్‌ పార్టీకి ఓటు వేయడమంటే పాకిస్థాన్‌ కు ఓటు వేయడమేనని కూడా ఆమె అన్నారు.
అయితే, కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో వెనుకబడి లేదు. ఉద్ధవ్‌ థాకరేకు చెందిన శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఇటీవల నరేంద్ర మోదీని ఔరంగజేబుతో పోల్చారు. ఔరంగజేబుకు ఎటువంటి గతి పట్టిందో మోదీకి కూడా అటువంటి గతి పడుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులంతా దోపిడీ దొంగలని, పశ్చిమ బెంగాల్‌ను దోచుకోవాలసి చూస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మనుషుల్ని చంపడానికే మోదీ పుట్టారని కూడా ఆమె వ్యాఖ్యా నించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు సాగిస్తున్న ప్రచారం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 2014, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ అవినీతి నిర్మూలనను ఎన్నికల నినాదంగా చేసుకుని ఎన్నికల్లో విజ యాలు సాధించారు. ఇప్పుడు కూడా అభివృద్ధినే నినాదంగా చేసుకున్నారు.
గత ఎన్నికల్లో చౌకీదార్‌ చోర్‌ హై అంటూ రాహుల్‌ గాంధీ నినాదాలు చేసినప్పటికీ వాటి ఫలి తాలు ఎక్కడా కనిపించలేదు. ప్రజాస్వామ్య దేశం లో అసలు సిసలు చౌకీదార్లు ప్రజలే. తమకు పాల కులెవరన్నది నిర్ణయించడానికి ప్రజలు విల్లాల నుంచి, బంగళాల నుంచి, అపార్ట్‌ మెంట్ల నుంచి, గుడిసెల నుంచి బయటికి వస్తున్నారు. దేశ భవిష్య త్తంతా వారి చేతుల్లోనే ఉంది. వారికి సమర్థమైన పాలన మాత్రమే కావాలి. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొద్ది రోజుల ముందు విన్‌ స్టన్‌ చర్చిల్‌ ఎంతో అహంకారంతో ఒక మాటన్నారు. ‘భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారం మూర్ఖులు, క్రూరులు, అసమర్థుల చేతుల్లోకి వెళ్లి పోతుంది. అధికారం కోసం వారు ఒకరితో ఒకరు తలపడడం తప్పకుండా జరుగుతుంది. ఇటువంటి రాజకీయ కలహాల కారణంగా దేశం సర్వనాశనం అయిపోతుంది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం కాకూడదని ఓటర్లు మనసా వాచా కర్మణా కోరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

  • వి.వి. రంగారావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News