Homeఎడిటోరియల్ / బహుళHindu Pluralism: హిందూ బహుళత్వాన్ని బీజేపీ అంగీకరించదా?

Hindu Pluralism: హిందూ బహుళత్వాన్ని బీజేపీ అంగీకరించదా?

Religion is regarded by the common people as true, by the wise as false, and by rulers as useful.

        – Lucius Annaeus Seneca
           Roman philosopher
దేవుడు సత్యం అని సామాన్య ప్రజలు విశ్వసిస్తారు. ఆలోచనాపరులు అసత్యం అని చెప్తారు. పాలకులు దాన్ని తమ ప్రయోజనం కోసం వాడుతారు. ప్రజలు సత్యం అని నమ్మడం వల్ల దేవుడి పేరుతో లేదా మతం పేరుతో రాజకీయ నాయకులు ప్రయోజనం పొందడా నికి శతవిధాలా ప్రయత్నించడం మనం చూస్తూనే వున్నాం. అత్యధిక సంఖ్యాకులైన ప్రజలను హిందూత్వం పేరుతో, హిందూ జాతి పేరుతో, జాతీయవాదం పేరుతో బీజేపీ రాజకీ యాలు నడుపుతూ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే దిశగా పయనిస్తున్న విషయం అనుభవంలోకి వస్తున్నదే.
ఈ పరిస్థితిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీకి చిన్న ఝలక్‌ ఇచ్చారు. శైవ, వైష్ణవులకు మధ్య తేడాను చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాలను వేరు చూపించారు. ఇటువంటి వ్యాఖ్య వస్తుందని బహుశా బీజేపీ  నాయకులు ఊహించి వుండరు. దేవుడి పేరు మీద ప్రజలను లేదా హిందువులను విభజించే ప్రయత్నం చేస్తున్నారని, తన రాజకీయా లకు మతాన్ని వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రేవంత్‌ రెడ్డిని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కించపరిచేలా వున్నాయని మరో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. శివుడు వేరు, విష్ణువు వేరు అని విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
రేవంత్‌ రెడ్డి మాటలతో బీజేపీ నాయకులకు చురుకు తగిలిందనే విషయాన్ని వారిద్దరి విమర్శలు తెలియజేస్తున్నాయి. నిజానికి హిందూ సమాజం అనేది బహుళత్వంతో కూడినది. ఎవరి దేవుళ్లు వారికి, ఎవరి మతాచారాలు వారికి వున్నాయి. హిందూ మతం అనేది ప్రత్యేకంగా ఏదీ లేదు. దానికి నిబంధనలు, కట్టు బాట్లు పొందుపరిచి లేవు. అందుకే సనాతన ధర్మం అనే మాట ఇటీవలి కాలంలో ఎక్కువగా పలుకుతున్నారు. సనాతన ధర్మం అనేది ఏం చెబుతుందనే విషయం చాలామందికి తెలుసు. హిందూ సమాజంలో అసమానతలకు అది నిలువెత్తు నిదర్శనం. ఆ సనాతన ధర్మానికి అటు బీజేపీ నాయకులు గానీ ఆర్‌ఎస్ఎస్ నాయకులు గానీ కట్టుబడి లేరనేది కఠిన వాస్తవం. ఇతర మతాలను వ్యతిరే కించడానికి హిందూ సమాజం, సనాతన ధర్మం అనే మాటలను రాజకీయాలు ప్రయోగిస్తున్నాయి. వాటిని రాజకీయాలకు పని ముట్లుగా వాడుతున్నాయి.
ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య కొన్ని అంతరాలు వున్న మాట వాస్తవమే. రాజకీ యాల్లో  ఉత్తర భారతీయులు ఆధిక్యత ప్రద ర్శిస్తున్నారనే విమర్శ తరుచుగా వినిపిస్తు న్నదే. భాషా పరంగా కూడా రెండూ ఒక్కటి కావు. సంస్కృతంబు ఎల్ల భాషలకు మాతృక అనే మాట అలంకార ప్రాయమేనని భాషా శాస్త్రవేత్తల విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషలకు తల్లి భాష మూల ద్రావిడమని వారు తేల్చారు. భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషా శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని నిర్ధారిం చారు. ఉత్తర భారతదేశం భాషలు ఆర్య కుటుంబానికి చెందినవని అన్నారు.
ఇక దేవుళ్ల విషయానికి వస్తే, కుల దైవాలు, కుటుంబ దైవాలు వున్నాయి. పలు వురు గ్రామ దేవతలు కూడా వున్నారు. హిందూ సమాజంలోని ఆధిపత్య వర్గాలు సామాన్య ప్రజలను గెలుచుకోవడానికి వారి దేవుళ్లను కూడా వాడుకుంటూ వచ్చారు. ఆ దేవుళ్లను వారి సంస్కృతికి అనుగుణంగా తమలో కలుపుకుంటూ వెళ్లారు. అందువల్లనే హిందువుల్లో బహుళత్వం చోటు చేసుకుంది. కోటాను కోట్ల దేవుళ్లు ఆరాధ్యులుగా మారారు. నిజానికి, శైవులకు, వైష్ణువులకు మధ్య చెల రేగిన మత విద్వేషాల వల్లనే దేశం అన్యుల వశం అయిందని సురవరం ప్రతాప రెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంథంలో రాశారు. ఈ వైరాన్ని ఆయన తప్పు పట్టారు.
ప్రస్తుతం దక్షిణ, ఉత్తర భారత దేశాల మధ్య వున్న అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి ఏమీ చేరలేదు. దేశ ఐక్యతకు భంగం వాటిల్లే స్థాయికి ఏమీ చేరుకోలేదు. అది చేరుకుంటుందని కూడా భావించలేం. కానీ, బీజేపీ మత ప్రాతిపదికన ప్రజలను విభజించే ప్రక్రియ ఆగకపోతే మాత్రం దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునే ప్రమాదం వుంది. మత ప్రాతిపదికపై జాతీయతను నిర్వచిం చడం, మత ప్రాతిపదికపై సార్వభౌమత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నించడం సానుకూల రాజకీయ దృక్పథం మాత్రం కాదు. అనేక దేవుళ్లను పూజించే, అనేక కులాలతో కూడిన  హిందూ సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్నది. రాజకీయంగా ఆధిపత్య కులాలను ఢీకొట్టడానికి కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది సానుకూల పరిణామమే. కానీ ఇతర మతాల ప్రజలను శత్రువులుగా చూపించి హిందూ సమాజం మద్దతు పొందాలనే రాజకీయాలు దేశ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమైంది.
దేశ విభజన సమయంలోనే మనం అటువంటి గీత గీసుకుని వుంటే పరిస్థితి ఎలా వుండేదని పాకిస్తాన్‌ వంటి దేశాల పరిస్థితు లను చూస్తే  అర్థమవుతుంది. కానీ అన్ని మతాలకు చెందినవారు దేశ పౌరులు అనే సూత్రబద్దత మీద మన దేశం నిలబడి వుంది. దాని వల్లనే పలువురు ముస్లింలు కూడా పాకిస్తాన్‌ నుంచి వచ్చి మనదేశంలో స్థిరపడ్డారు. అటువంటి వారి విశ్వాసాన్ని దెబ్బ తీసే చర్యలు సరైనవి కావు.
మన గ్రామాల్లో ప్రజలు ముస్లింలను కూడా ఒక ప్రత్యేకమైన కులంగానే ఆచరణలో పరిగణించారు. కానీ ఆ పరిస్థితి గ్రామాల్లో కూడా మారిపోతున్నది. బీజేపీ ప్రచారం అంత లోతుల్లోకి వెళ్లిపోయింది.
ముస్లిం వ్యతిరేకత అనేదే దాని ప్రధాన ఆయుధంగా మారింది. అయితే, దాని వల్లనే బీజేపీ విజయం సాధిస్తున్నదా, ఎన్నికల కమిషన్‌ కూడా దానికి తోడైందా అనే ఆనుమానాలు తలెత్తు తున్నాయి. ఈసీపై వ్యక్తమవుతున్న అను మానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది.
మతమూ దేవుడు వ్యక్తిగతం మాత్రమే కావాలి. అది ఒక్క హిందూ మతానికి మాత్రమే కాదు, అన్ని మతా లకు వర్తించాలి. అది రాజకీయాలకు అస్త్రం కాకూ డదు. నిజానికి, దేవుడు అనేవాడు ప్రజల భయం నుంచి పుట్టాడు. ప్రజలు అగ్ని, గాలి వంటివాటిని పూజిస్తు న్నారని, భయం కారణంగానే ఆ పూజలు చేస్తున్నారని ప్రముఖ రచయిత బోయ జంగయ్య చాలా స్పష్టంగా ‘జాతర’ నవలలో చెప్పారు.
దళితులకు మాత్రమే కాదు, అశేష ప్రజానీ కానికి శాస్త్రీయత అవసరమని ఆయన చెప్పారు. ఇది అసలైన బుద్ధి జీవుల ఆలోచనగా చెప్పవచ్చు. ఈ ఆలో చనతో దేశ ప్రజలు ముందుకు సాగాల్సిన తక్షణ అవసరం వుంది.
కాసుల ప్రతాపరెడ్డి
రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News