Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Domicile: భూమి పుత్రుడు రైతన్న

Domicile: భూమి పుత్రుడు రైతన్న

నేడు జాతీయ రైతు దినోత్సవం

నాటి పురాతన భారతదేశ చరిత్ర నుంచి నేటి సాంకేతిక భారతదేశ చరిత్ర మనం పరిశీ లిస్తే భారతదేశ చరి త్ర సంస్కృతి సాంప్రదాయము మొత్తం కూడా వ్యవ సాయ రంగం మీదే ఆధారపడి ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వ్యవసాయం లేకుండా భారతదేశాన్ని మనం ఆర్థికంగా రాజకీయంగా చరిత్ర సంస్కృతి పరంగా సాంప్రదాయపరంగాఏ విధంగానూ ఊహించలేము.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయ రం గం మీద ఆధారపడి ఉంది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను ముక వ్యవసాయ రంగం అయితే వ్యవసాయానికి వెన్ను ముక రైతన్న. వృత్తులన్నిటిలోకల్లా అత్యున్నతమైనటు వంటి వృత్తి వ్యవసాయ వృత్తి. భారతదేశ ఆత్మ గౌర వాన్ని ప్రకటించే పవిత్రమైనటువంటి వృత్తి. ఈ వ్యవ సాయ రంగం మీదే భారతదేశ వ్యాపార రంగం కూడా ఆధారపడి ఉండటం గమనార్హం. రైతు లేకుండా వ్యవసా యాన్ని వ్యవసాయం లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఊహించటం మన తరం కాదు. ఇలాంటి వ్యవసాయ రంగంలో రైతు పడుతున్నటువంటి కష్టము చేస్తున్నటు వంటి కృషిని దేశంలో ఉన్నటువంటి ప్రజలు పాలక వర్గంలో ఉన్న అధికారులు గుర్తించాల్సినటువంటి అవస రము ఆవశ్యకత ఎంతైనా ఉందని విషయం మనకు నేడు జాతీయ రైతు దినోత్సవం గుర్తు చేస్తుంది.
ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 23న భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు న, భారతీయ రైతుల కృషి, విలువను గుర్తించి వారిని గౌరవిస్తారు. 1965లో భారత ప్రభుత్వం భారతదేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మ దినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక మహాన్‌ రైతు నాయకుడు. ఆయ న రైతుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. జమీందారీ వ్యవస్థ రద్దులో ఆయన కీలక పాత్ర పోషిం చి. కౌలుదారి చట్టాలను అమలు చేయడం జరిగింది.
రైతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది. వారు తమ కష్టపడే పని ద్వారా దేశానికి ఆహారం, ఆర్థిక భద్ర తను అందిస్తారు. రైతులు 24 గంటలు పనిచేస్తూ, వాతా వరణ పరిస్థితులను లెక్కించకుండా, తమ పంటలను పండిస్తారు. వారు తమ పంటలను కనీస మద్ధతు ధరకు విక్రయించడానికి పోరాడుతూనే ఉంటారు.
రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. టిల్లో మరి ముఖ్యంగా రుణభారం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు సరైన సమయంలో చెల్లించలేకపోతున్నారు దానికి కారణం వాతావరణ పరి స్థితులు అనుకూలించకపోవడం ఊహించని రీతిలో వర్షాలు వరదలు కరువులు రావటం వల్ల రైతులు నిరం తరము కష్టపడుతూనే రైతు పండించినటువంటి పొలా లు నీతమునగటం వల్ల వాటికి సరైన ధర లేకపోవడం వల్ల రైతుల తీసుకున్నటువంటి అప్పుడు తిరిగి చెల్లించ డంలో అనేక రకాలైన ఇబ్బందులను పడుతున్నారు ఈ విషయం ప్రభుత్వం గుర్తించి వారికి కావలసినటువంటి రుణాలను తక్కువ వడ్డీకి లేదా పూర్తి పెట్టుబడి అవసర మైన అన్ని రకాలైన వ్యవసాయ విత్తనాలు పురుగు మం దులను రైతులకు అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
రైతులు పండించేటటువంటి పంటలకు సరైన గిట్టు బాటు ధర ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉం ది ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ రైతులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు సరైన మద్దతు ధరను ప్రభుత్వాలు ప్రకటించలేకపోతున్నాయి. రైతులు వ్యవసాయ రంగా నికి ఉపయోగించే యంత్రాలు ధరలు అధికంగా ఉండ టం ఒక కారణంగా చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగానికి అత్యంత ముఖ్యమైనటువంటి యంత్రము ట్రాక్టర్‌ వరి కోత యంత్రం వివిధ రకాల యంత్రాలు లక్షల ధరలు ఉండటం రైతు పంటలకు ఇచ్చేటటువంటి గిట్టుబాటు ధర మాత్రమే వందల రూపాయల్లో ఉండటం దీనివల్ల రైతు అధికంగా నష్టపోతున్నారు రైతులకు కావాల్సినటు వంటి వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీ ద్వా రా ఇంకా ఎక్కువ మంది రైతులకు అందించాల్సినటు వంటి అవసరము అవశ్యకత ఎంతైనా ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ రైతు బంధు పథకం కావచ్చు రైతు బీమా పథకం కావ చ్చు వీటిల్లో ఎక్కువ అవినీతి జరగటం వల్ల నిజమైనటు వంటి రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందక పోవటమే కాకుండా రాజకీయ నాయకుల అవినీతి కుం భకోణాలు ప్రభావం కూడా రైతుల మీద పడుతుంది.
రైతులు కొనే విత్తనాలలో కల్తీ వస్తుంది రైతులు పొలానికి చల్లే మందులలో కల్తీ వస్తుంది దీనివల్ల రైతు బ్రతుకు కన్నీరు అయిపోతుంది దీని ప్రభావము దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా అధికంగా ఉందన్న విష యాన్ని నేటి రాజకీయ నాయకులు గమనించకపోవడం దురదృష్టకరం.
పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వము బ్యాం కుల ద్వారా లక్షల కోట్ల రుణాలు ఇప్పించి వారు రుణా లు చెల్లించకుండా విదేశాలలో విలాసాలలో గడుపు తుంటే. రైతులకు ఇచ్చిన రుణాలు మాత్రం ప్రభుత్వం ముప్పి పిండి వసూలు చేస్తుంది వాళ్ళని అనేక రకాలైన టువంటి ఇబ్బందులకు గురి చేస్తున్న బ్యాంకులు ప్రభు త్వాలు రైతు గురించి ఆలోచించనంత కాలం రైతు అభి వృద్ధికి సహకరించినంత కాలం దేశ అభివృద్ధిని ఊహిం చటం కూడా కష్టతరమే. అంతేకాకుండా నేటి ఆధునిక సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టు కొని భారతదేశంలో ప్రతి రైతుకి కావాల్సిన నూతన వ్యవసాయ పరమైన సమాచారాన్ని అందించాల్సిన అవ సరము అవశ్యకత ప్రభుత్వానికి ఉంది. రైతును ఎప్పటి కప్పుడు చైతన్యపరిచి వారికి కావలసినటువంటి వ్యవ సాయపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను రూ పొందించాల్సిన అవసరం కూడా నేటి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలకు ఉంది. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడు పైన ఉంది.
రైతును ఉద్దేశించి ప్రముఖ తెలుగు కవి శ్రీ దువ్వూ రి రామ్‌ రెడ్డి గారు కృషివలుడు అనే కావ్యం రాసి అం దులో రైతు యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా వివ రించారు.
సైరికా, నీవు భరత క్ష్మతలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శురమణివి!
దారుణీపతి పాలనదండ మెపుడు
నీ హలంబు కన్నను బ్రార్థనీయమగునే?
రాజు చేతిలో ధర్మ దండం కన్నా రైతు చేతిలో నాగలి గొప్పది రాజు దండంలో దండించే గుణం ఉంటే రైతు హలంలో పండించే గుణం ఉందని రైతు గురించి చాలా గొప్పగా వివరించారు.
కాన జీవనసంగ్రామ కార్యమందు
విజయ వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,
సత్యసంధత, యాత్మ విశ్వాస మనేడు
నాయుధంబుల విడవకు హలికవర్య.
ఓ రైతన్న జీవితమనే యుద్ధంలో విజయం పొంద టానికి శక్తి చదువు తెలివి సత్యం నీపై నీకు నమ్మకం అనే ఆయుధాలను ధరించి ముందుకు నడువు. అంటూ ప్రజ లు ప్రభుత్వాలు పట్టించుకున్న పట్టించుకోకపోయినా నీ యొక్క జీవన గమనము గమ్యము నీకోసమే మాత్రమే కాదు ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం అని గుర్తుపెట్టు కుని దేశానికి సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న రైతన్నకు ఎవరు ఎంత సేవ చేసినా తక్కువే అని మనకు అర్థమవు తుంది. ముఖ్యంగా మన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని రైతులను అభివృద్ధి పదంలో నడిపించాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని మనకు అర్థమవుతుంది.

  • పూసపాటి వేదాద్రి
    కవి సాహితీ విశ్లేషకులు
    9912197694
    (నేడు జాతీయ రైతు దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News