Thursday, March 12, 2026
Homeఎడిటోరియల్ / బహుళDravidian Movement: రాబోతున్నది ద్రావిడ సాహిత్యోద్యమం

Dravidian Movement: రాబోతున్నది ద్రావిడ సాహిత్యోద్యమం

Democratic Women Writers Forum: రాబోతున్నదా అంటే ఇప్పుడే కచ్చితమైన సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ ఇప్పటికే అవగాహన, అవసరమైతే మొదలైందని చెప్పవచ్చు. ఇది ఎంత ఉధృతంగా మారబోతుందో అని ఇప్పుడే అంచనా వేయలేమనిపిస్తుంది. ద్రావిడ సాహిత్యోద్యమ చరిత్ర విస్తృతమైనది.

- Advertisement -

కేవలం ద్రవిడ భాషల ఉమ్మడితనం గురించే కాదు, నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ అస్తిత్వం గు రించి, మరీ ముఖ్యంగా ఈ నాలుగు ప్రధాన భాషలతో పాటు ద్రావిడ మైనర్‌ భాషలు- తుళు, కొడగు, తొడ, కోట, బడగ, ఇరుళ, కురుంబ; అలాగే మధ్య ద్రావిడ మైనర్‌ భాషలు- గోండి, కొలామి, పార్జి, పెంగో, ఓల్లారి, కొండ/కువి, కొందేకోర్‌ గడబ భాషల రక్షణ గురించి ఈ ఉద్యమం మాట్లాడుతుంది, మాట్లాడాలి.

ఒరిస్సా, ఉత్తరాంధ్ర బోర్డర్‌ ప్రాంతంలో నివసించే రెల్లి వారు అనర్గళంగా తెలుగు మాట్లా డగలిగినా వాళ్ళ మాతృభాష రెల్లి. కానీ అది పూర్తిగా దక్షిణ భాష అని చెప్పలేక పోయినా లిపికి ఇటు ఆంధ్రవారు తెలుగును అటు ఒరిస్సా వారు ఒరియాను వాడుతున్నారు. ఇటీవలే రెల్లి – తెలుగు నిఘంటువు కూడా వచ్చింది.

ఇటువంటి భాషలపై చర్చను ఆహ్వానించేదే ద్రావిడ సాహిత్యోద్యమం అని నమ్ముతున్నాను.
ఈ ఉద్యమం పుట్టింది తమిళనాడులో అయినా ఇప్పుడు యావత్తు దక్షిణ భారతదేశం ద్రావిడతత్వం వైపు ఒక ఆర్యేతర సమానత్వం కోసం, సమాధానం కోసం చూస్తోంది. అసలు ఈ ఉద్యమ ఉద్దేశం మొదలుపెట్టడమే ‘ప్రపంచంలోని భాషలన్నిటికీ సంస్కృతమే మూల భాష, అమ్మ భాష’ అనే ఒక వాదనను శాస్త్రీయంగా తిప్పికొడుతుంది అనిపిస్తుంది.

భారత ప్రభుత్వం ఇప్పటివరకు పదకొండు భాషలకు క్లాసికల్‌ భాష హోదాను ఇచ్చింది. అందులో మొట్టమొదట తమిళానికే 2004లో లభించింది. తెలుగు, కన్నడలకి 2008లో వస్తే మలయాళంకి 2013లో వచ్చింది. 2008లో మా తోటి మలయాళీ క్లాస్మేట్స్​‍, టీచర్స్​‍ ఈ విషయంపై చాలా నిరాశ చెందడం ఇంకా గుర్తుంది. భాషకు ఉన్న వేల ఏళ్ల ప్రాచీనత, సాహిత్య సంపదను బట్టి ఈ హోదాను ఇస్తుంది ప్రభుత్వం.

దీనివల్ల ఆయా భాషల అభివృద్ధికి పెద్ద మొత్తాలలో సహాయంతో పాటు గుర్తింపు జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు ఇప్పుడు ద్రావిడ మైనర్‌ భాషలకు, ఆ ప్రాంతీయులకు రావాలనేదాన్ని ఒక కొత్త వాదంగా చూడాల్సిన అత్యవసరం ఎంతో ఉంది.

ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలను రద్దు చేస్తున్నామనే ఊహాగానం మొదలైనందుకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తమ రాష్ట్రం నుంచే జాతీయ సాహితీ పుర స్కారాలు, 5 లక్షల నగదు బహుమతితో ఇస్తామని ప్రకటించడం ఒక ద్రావిడ భాష, సాహిత్య ఉద్యమం ఊతంతోనే అని చూస్తాను.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘ద్రావిడ సమాజ సాహిత్యాలు’ అనే అంశంపై చేస్తున్న రెండు రోజుల సదస్సు ఫిబ్రవరి 7, 8 తేదీలలో కెవిఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, క్లస్టర్‌ యూనివర్సిటీ, కర్నూలులో నిర్వహించనుంది. అక్కడ మరిన్ని లోతైన విషయాలపై చర్చ జరగ బోతుండడం ఒక ముఖ్యమైన అవసరం.

మానస ఎండ్లూరి
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
కార్యదర్శి, జాతీయ శాఖ, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News