నేటికీ సమాజంలో డ్రైవర్లను కార్మికులుగానే పరిగణిస్తు న్నారు. వారు చేసే పని ఎంతో విలువైనది అయినా వారికి సరైన జీతం, సరైన వసతి, గౌరవం, గుర్తింపు లభించకపోవడం బాధాకరమైన విషయం. డ్రైవర్ వృత్తి ప్రపంచంలో చాలా ప్రధానమైనది. వీరు రాత్రనక, పగలనక అహర్నిశలు శ్రమించిన కష్టానికి ఫలితం అంతంత మాత్రమే. డ్రైవర్ నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ శ్రమను గుర్తించి శ్రమకు తగ్గ గౌరవం ఇస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవనాలు, కార్లు ఉన్నప్పటికీ కొందరికి గౌరవం, కొందరికి డ్రైవింగ్ చేసే ఓపిక లేక, నిత్యం బిజీగా ఉండే రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఎంతోమంది నెలవారీ జీతంతో డ్రైవర్లుగా నియమించు కుంటారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడుగా చూస్తున్నారు తప్ప వారి శ్రమను గుర్తించడం లేదు. డ్రైవర్ అంటే ఒక కూలివాడు అనుకునే వారికీ డ్రైవర్ అనే పదానికి అసలు నిర్వచనం తెలియదని కూడా గమనించాలి. సమయానికి మనందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే దేవుడే నిజమైన డ్రైవర్. డ్రైవర్ కంటి మీద కునుకు లేకుం డా ఎంతో నిబద్దతతో మనల్ని గమ్యస్థానానికి తీసుకెళతాడు. అని వార్యమైన సంఘటన ఏదైనా జరిగిన మన ప్రాణాల కంటే ముందు తన ప్రాణాలను వదలడానికైనా సిద్ధపడి ముందుండి నడుపుతాడు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుం దన్న వాస్తవాన్ని మరిచిపోయి వారిని ఒక కూలీగానే చూడటం శోచనీయం. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు వంటి అనేక డ్రైవర్ సంబంధిత ప్రమాదాలు కనురెప్పపాటులో జరిగిన ఘోర ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మన కుటుంబక్షేమం కోసం డ్రైవర్ తన కుటుంబానికి దూరమై అవసరమైతే మనతో పాటే ప్రాణాలర్పించడానికి వెనుకాడని డ్రైవర్ వృత్తి ఎంత ప్రధానమైనదో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు వారికి సరైన ఆహారం, నిద్ర, సరైన జీతం, అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి. డ్రైవర్ అంటే సొంత తమ్ముడిగా చూడాలి. మనం తినే ఆహారమే తనకు పెట్టాలి. అంతే తప్ప కూలివాడుగా చూడరాదు. బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో మనం నిద్ర పోయిన ప్రశాంతంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మనమంతా క్షేమంగా ప్రయాణించడం గొప్ప విషయం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అంతే కాకుండా అంబులెన్స్ వాహన డ్రైవర్లు కూడా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ చివరకు కూలి డ్రైవర్ గానే చూస్తాం. అంబులెన్స్ డ్రైవర్ అతివేగంతో నడపడంతో తన ప్రా ణాలకు కూడా ప్రమాదమని తెలిసినప్పటికీ మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రతికిస్తాడన్న కృతజ్ఞత భావం కలిగిన వారు అతి తక్కువ మంది ఉంటారు.
డ్రైవర్ పట్ల కృతజ్ఞత భావం తెలిపిన ‘జవేరి పూనావాలా’
కరోనా వాక్సిన్లలో ఒకటైన కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఆధార్ పూనావాలా సోదరుడు జవేరి పూనావాలా దగ్గర కారు డ్రైవర్‌గా 30 సంవత్సరాలు పనిచేసిన గంగాదత్త అంటే జవేరి పూనావాలాకు అమితమైన ప్రేమ ఆయన అతన్ని డ్రైవర్ కాకుండా సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఒకరోజు జవేరి పూనావాలా ముంబై పర్యటనలో ఉండగా పూణేలో గంగాదత్త అకాల మరణం పొందారన్న విషయం తెలిసింది. వెంటనే అన్ని పనులు రద్దు చేసుకొని హుటా హుటిన పూణెకి చేరుకొని అంతిమ యాత్ర జరిగే సమయంలో గంగాదత్త నడిపిన కారును పూలతో అలంకరించి దానిలో పార్థివ దేహాన్నుంచి గంగాదత్త అంతిమ యాత్రను ఆయన నివాసం నుంచి శ్మశానవాటిక వరకు స్వయంగా తాను కారు నడుపుకుంటూ తీసుకెళ్లారు.
ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా ఆయన విషణ్ణ వదనంతో గంగాదత్త నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించారు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్న అని అన్నారు.
అంబులెన్స్ డ్రైవర్ల సేవలు ప్రశంసనీయం
అంబులెన్స్ సేవలు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. అంబులెన్స్ డ్రైవర్ల సేవలకు గుర్తింపు లేకపోవడం విచారకరం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు, వారిని ఆసుపత్రిలో చేర్పించేందుకు అతివేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిసినా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి రోగుల ప్రాణాలు కాపాడేందుకు, ఆసుపత్రికి తరలించడం గొప్ప విషయం. నేటికీ ప్రైవే ట్ అంబులెన్స్ డ్రైవర్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు అందకపోవడం శోచనీయం. అంతేకాదు వారి వాహనాలపై పలు ట్రాఫిక్ చలాన్లు వేస్తూ, లైసెన్స్ సంబంధించిన పత్రా లన్నీ ఉన్నప్పటికీ అధికారులు డబ్బు కోసం వేధించడం బాధాకరం. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అంబులెన్స్ డ్రైవర్ల అందరికీ ఉచిత వైద్యసదుపాయాలందించాలి.
డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
డ్రైవర్లకు సరైన జీతం లేదు, వారానికోసారి సెలవు లేదు, వైద్య బీమా లేదు, ఇఎస్‌ఐ లేదు, పిఎఫ్ లేదు. డ్రైవర్ అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా లేదు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ల శ్రమను గుర్తించి న్యాయమైన వేతనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. ఓలా, ఉబర్, ఇతర క్యాబ్‌లను అనుమతించడం వల్ల చిన్న వాహనాల డ్రైవర్లకు సరైన గిరాకీ లేక ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖలో అవినీతి, వేధింపులు ఇలా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ల అభ్యున్నతికి తగిన చట్టాలు రూపొందించి డ్రైవర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
- కోట దామోదర్
9391480475