ఇంజినీరింగ్ అనే పదం తప్పా ఆ చదువేల ఉంటాడో తెలియదు మా అబ్బాయిని ఆ చదువే చదివించాలి అన్న తపన తప్ప వేరే ఏ ఆలోచన లేదు అయితే ఇదే అదునుగా భావించిన ఏజెంట్స్ తన వద్దకు వచ్చి హైదరబాద్‌లో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో మీ వాడికి సీట్ ఇప్పిస్తా అంటే నమ్మేశాము కానీ అబ్బాయి అనుభవిస్తున్న బాధను పోయి చుస్తే తప్ప తెలియలేదు అరకొర వసతులు తరగతి గదులు లేకపోవువటం పూర్వ విద్యార్థులు చేదు అనుభవం ప్రయోగశాలలు లేకపోవడం అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేక నాణ్యమైన విద్యకు దూరమవుతున్నాడని అప్పుడే తెలుకున్నాము.. ఓ తల్లి ఆవేదన.
ఎక్కడో పోయి చదివే కంటే ఇక్కడే మన కళ్ళముందే మనకు దగ్గర్లో ఉన్న కాలేజీలో చేర్పిస్తే మంచిదనుకొని దగ్గర్లో ఉన్న కాలేజీని కలిసాము. ఇదే అదునుగా భావిం చిన కళాశాల యాజమాన్యం లాప్ టాప్ ఆఫర్‌తో అడ్మిషన్ ఇచ్చారు. తీరా తరగతులు మొదలయ్యాక అర్థమైంది అసలు ఆ కాలేజీలో లెక్చరర్ లే లెరని ఎమన్నా అంటే లాప్ టాప్ ఇచ్చాముగా అని దబాయింపు ప్రయోగశాలలు సరిగా లేక అసలు పరికరాలు లేకుండానే అరువుకు తెచ్చిన కంప్యూటర్స్‌తో తనిఖీలు కానిచ్చారని తరువాత తెలిసినది. అసలు ఆ కాలేజీకి ఇప్పటివరకు ఏ విదార్థికి ప్లేస్‌మెంట్ రాలేదని తెలిసి బిత్తరపోయాం. ఓ తండ్రి ఆవేదన
టాప్ టెన్ కాలేజీలో చదివిపిద్దామని కార్పొరేట్ కాలే జీల్లో చదివించిన పేరెంట్స్ లక్షల్లో డొనేషన్స్ కట్టలేక వెను దిరుగుతున్నారు. అప్పో సప్పో చేసి కాలేజీ ఫి కట్టి చదివి పిద్దామంటే చదువు మధ్యలో బాదుడే. ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యామండలికి మొరపెట్టుకున్నా ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు అనుమతి లేని యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ చేసుకొన్న విద్యార్థుల భవిష్యత్తు గందర గోలంగ మారింది. ఈ చేదు అనుభవాలతో మెరిట్ విద్యార్థులు చాల వరకు ఇతర రాష్ట్రా లకు తరలి పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకున్న ఇంజనీరింగ్ విద్య ఇప్పుడు వ్యాపారంగా మారిందనడంలో సందేహం లేదు. నాణ్యమైన విద్య దేవు డెరుగు అసలు సాంకేతిక విద్యను అంగడి సరుకుగ మార్చిన విద్య అధికారులేరి బ్రాండెడ్ పేరుతో ఇష్ట మొచ్చి నట్లు సీట్లమ్ముకునే అధికారమెవ్వరిచారు అని పేరెంట్ సంఘాలు నిలదీస్తున్నాయి.
చదువులందు ఇంజనీరింగ్ చదవు వేరు. అందు లోనూ కంప్యూటర్ సైన్స్ ఇంకా వేరు. బీటెక్ అంటే చాలు అందరి చూపు కంప్యూటర్ సైన్స్ వైపే. అంత క్రేజ్ మరి. తాజాగా తెలంగాణ పాలిటెక్నిక్‌లో కూడా ఇదే ప్రూవ్ అయ్యింది. సీఎస్‌ఈగా పిలిచే కంప్యూటర్ సైన్స్ ఇంజి నీరింగ్‌కు ఇప్పుడు ఉన్న క్రేజ్ అదీ మరి.ఇదే అదునుగా భావించిన విద్యాసంస్థలు సాధారణ కోర్సలను రద్దు చేసి కంప్యూటర్ సైన్స్ స్పెషల్ లైసెడ్ కోర్స్‌లతో కాలేజీ మొత్తన్ని రన్ చేసే ముర్కత్వానికి దిగారు. ప్రపంచ గమనంలో ఇప్పు డున్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు అన్నిటికీ మంచి మార్కెట్ ఉంది ఇందుకు మంచి ఉదాహరణ ఐఐటి లే అందులో సాంప్రదాయ కోర్సుల్లో చదివే విద్యార్థులకు కోర్ కంపెనీ ల్లో లక్షల్లో ప్యాకెజీస్ ఉన్నాయి. ఇందులో పేరెంట్ ధోరణి కూడా మారాలి అందరూ పోయే దారిలో కాకుండా అరు దుగా ఉన్న కోర్సుల్లో చేరితే వారికి మంచి భవిష్యత్తు ఉం టుందని అనుభవజ్ఞులైన ప్రొఫెస్సర్స్‌ల మాట.
ఇంత జరుగుతున్న సామాన్యునికి దూరమవుతున్న ఈ సాంకేతిక విద్యను తిరిగి గదిలో పెట్టాలిసిన బాధ్యత ప్రభుత్వ యంత్రంగానిదె తెలంగాన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం కొరడా జులిపించి ఎన్నో కాలిజిల్ని ఏరివేసింది మల్లి అదే ధోరణి కొనసాగుతుంటే కళ్లప్పగించి చూడకూడదనేది అనుభవజ్ఞుల మాట. ప్రభుత్వాలే సిక్‌లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను ప్రతి రెవెన్యూ డివిజన్‌కి ఒకటో రెండో కాలేజి ఎర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు ఏంటో మేలు చేస్తుంది మోసాల గోల తప్పుతుంది పైసల గోస వీడుతుంది అంతెందుకు విద్యను వైద్యాన్ని ప్రభు త్వపరం చేస్తే ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ గోల ఉండదు ప్రభు త్వాని బదనాం చేసే యవ్వారం ఉండదు అని ఓ పేరెంట్ ఆవేదన. ఇందుకు ప్రభుత్వాలు పథకాలెందుకు వేయధో అర్థం కావట్లేదు సింగరేణి, కేటీపీపీ లాంటి పారిశ్రమలు ఉండి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇక్కడి విద్యార్థులు సాంకేతిక విద్యను నోచుకోవడం లేదు. ప్రభు త్వ కళాశాలలు దేవుడెరుగు.. కొన్ని జిల్లాల్లో కనీసం ప్రైవేటు కాలేజీ కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగాల కల్పన విద్యార్థులకు వసతుల కల్పనా జరుగుతుంది.
ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ చదువుకునేందుకు ఇంజినీరింగ్ విద్య అందుబాటులో లేకపోవటంతో విద్యా ర్థుల్లో నైరాశ్యం నెలకొంది. పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని యజమాణ్యాల కుట్ర వల్ల పారిశ్రామిక ప్రాంతంలో ఎందుకు కాలేజీని ఏర్పాటు చేయటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం ప్రైవేటు కాలేజీలు కూడా జిల్లాలో లేకపోవటం ఇంజనీరింగ్ విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులకు ఆ చదువు అందని ద్రాక్షల తయారయ్యింది.
ఇది ఇలా ఉండగానే ఇక.. రెండో విడత కౌన్సెలింగ్ జులై 21 నుంచి ప్రారంభమవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ.. జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రి య మొదలు పెడతారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పి స్తారు. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయిం పు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేం దుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు గుడ్డిగా నమ్మకూండా అన్ని వివరాలు తెలుసో కోనే ఆయా కాలేజీలను ఎన్నుకోవాలి ఫీజ్ విష్యంలో చాల జాగారతాళ్లు వహించాలి ఒక్కసారి పెద్దకాలేజీల్లో ఇరుక్కు పోతే తిమింగలాలుగా చెప్పే ఫీజులకు మధ్యలో చదువా పేసిన విద్యార్థులు ఎంఎందరో తయహతుకు తగ్గ కాలేజీ లను ఎన్నుకోవాలి ఏవేవరో చెప్పిన డి కాకుండా స్వతహా గా ఇంటరెస్ట్ ఉన్న బ్రాంచ్‌లో జైన్ అవ్వాలి
నాణ్యత విషయంలో మన కాలేజీలకు అంత విలువ లేదని ఈ మధ్య వెలువరించిన ఎన్‌ఐఆర్ ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్) సర్వేలో కేంద్ర ప్రభు త్వము నివేదికలో బహిర్గతమయ్యింది రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్‌లో అత్యుత్తమ విద్యా సంస్థలుగా నిలువ కపోవటం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలికి సిగ్గు చేటు కేం ద్ర ప్రభుత్వం నివేదించిన నివేదికలోని టాప్ టెన్ ఇంస్టి ట్యూషన్స్ మన విద్య సంస్థలు కాసుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిచి క్వాలిటీ పైన ద్రుష్టి మరల్చితే రాష్ట్రానికి విద్యార్ధి లోకానికి మేలు చేసిన వారవుతారని ప్రజల నాడి చెప్తున్నా మాట ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతల్లో ఉన్న అన్ని విద్య సమస్థ లని బలోపేతాహం చేసి ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వా యంత్రంగానికి మరియు రాష్ట్ర సర్కార్ కి మంచిక్వాలిటీ ఉన్న విద్యార్థులని దేశనికి అందించి ప్రపంచాన్ని సాధించగల సత్త మన బిడ్డలకు ఉందని ఇప్పటికే రుజువయ్యింది తదనుగుణంగా తక్షణ మే తగు చర్యలు ప్రారంభించాలని మేధావుల సలహా.
డాక్టర్ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్ & ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
- 9705890045