Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Economy: ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం

Economy: ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. 2025 మే నెలలో ఎన్నికలు జరగబోతున్నందువల్ల వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఆమెకు చివరి బడ్జెట్‌ అవుతుంది. కాగా, ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుండడం, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతుండడం తదితర పరిణామాల నేపధ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్‌ వరుసగా మూడుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. ఇప్పుడు సమర్పించబోతున్నది నాలగవసారి. అయితే, కరోనా కారణంగానూ, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగానూ ఈ బడ్జెట్ల ఫలాలు ప్ర జలకు దక్కకుండాపోయాయి. అయితే, ఈ రకమైన అవరోధాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ భారతదేశం తన సూక్ష్మ ఆర్థిక పరామితులను నియంత్రణలో ఉంచగలగడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్థికాభివృ ద్ధికి అనువుగా కేంద్ర ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకుంటూ, పన్నుల వసూళ్లను పెంచుకుంటూ, సానుకూల ఫలాలను స్థిరీకరించుకోవాల్సి ఉంటుంది.
వాస్తవానికి, గత బడ్జెట్‌ లక్ష్యాల కంటే ఈ ఏడాది స్థూల పన్ను వసూళ్లు మరిం తగా పెరగాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ద్రవ్యోల్బణం పెరగడంతో 2022-23లో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) 15.4 శాతం కంటే మించి పెరిగే అవకాశం లేదని భావించారు. కనీసం 11.4 శాతం వరకైనా జీడీపీ పెరుగుతుందని గత బడ్జెట్లో అంచనా వేశారు. అయితే, యూరప్‌ యుద్ధం కారణంగా కొన్ని అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తానికి వీటన్నిటి ఫలితంగా 27.4 లక్షల కోట్ల రూపాయల అంచనా లున్న బడ్జెట్‌ 2022-23లో గురి తప్పింది. అంతేకాదు, దీనివల్ల ఆర్థిక లోటు, బడ్జెట్‌ అంచనాల నిష్పత్తి 6.4 శాతానికే పరిమితం అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉండడంతో భారతదేశ లోటు, బడ్జెట్‌ అంచనాల నిష్పత్తి బాగా పెరిగిపోతోంది. దాంతో జీడీపీలో ప్రభుత్వ రుణాల శాతం కూడా 80 శాతానికి మించిపోయింది. ప్రభుత్వ వ్యయంలో అత్యధిక పెద్ద భాగంగా ఉన్న వడ్డీ చెల్లింపులు కూడా 16 శాతం అంటే సుమారు 9.48 లక్షల కోట్ల రూపా యలు పెరిగిపోయే అవకాశం ఉంది.
జీడీపీ, రుణ నిష్పత్తి స్థిరంగా కొనసాగాలన్న పక్షంలో, ఆర్థిక అంశాల స్థిరీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. దీనివల్ల వడ్డీల మీద ఖర్చు పెట్టాల్సిన మొత్తం తగ్గుతూపోతుంది. ఫలితంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాల మీదా, సంక్షేమం మీదా ఖర్చు చేయడానికి ఖజానాలో నిధులు ఉంటాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో మూలధన వ్యయాన్ని బాగా పెంచడం వల్ల అభివృద్ధి సాధ్యమ వుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సగటున భారతదేశ వార్షిక పెట్టుబడిలో దాదాపు 11 శాతం నిధులను అందివ్వగలుగుతున్నాయి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉన్నందువల్ల ప్రభుత్వం, ప్రజలే ఎక్కువ నిధులను పెట్టుబడిగా సమ కూర్చవలసి ఉంటుంది. మూలధన వ్యయాన్ని పెంచడం వల్ల ఆర్థికాభివృద్ధితో పాటు పన్నుల వసూళ్లు పెరగడానికి కూడా వీలవుతుంది.
ప్రభుత్వ పన్నుల వసూళ్లు పెరగడానికి సంబంధించినంత వరకూ ప్రభుత్వం. ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెవెన్యూ వసూళ్లను స్థిరపరచడా నికి ఇంధన సుంకాల వంటి పరోక్ష పన్నుల వసూళ్లను పెంచాల్సి ఉంటుంది. ఇది తప్పని వ్యవహారం. ఇక ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో ఒకటి రెండు మార్పులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. జి.ఎస్‌.టిని స్థిరీకరించడానికి సృష్టించుకున్న సమాచార వ్యవస్థను ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను విస్తరించుకోవడానికి కూడా ఉపయోగించుకో వాల్సి ఉంటుంది. పన్నులు పెంచడం కంటే పన్నుల వ్యవస్థను విస్తరించడం వల్లే దేశానికి ఉపయోగం ఉంటుంది. వ్యక్తులు, సంస్థలకిస్తున్నట్టే ఉద్యోగులకు కూడా వెసు లుబాటు కల్పించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తమ మీద కూడా పన్నుల భారా న్ని తగ్గించాలని ఉద్యోగులు కోరుకోవడంలో తప్పేమీ లేదు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News