Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్European Union: దిక్కుతోచని స్థితిలో ఐరోపా దేశాలు

European Union: దిక్కుతోచని స్థితిలో ఐరోపా దేశాలు

ప్రస్తుతం అనేక ఐరోపా దేశాలు దిక్కుతోచని పరిస్థితి లో ఉన్నాయి. తమ దేశాల్లో వేళ్లు పాదుకుపోతున్న ఇస్లా మిక్‌ తీవ్రవాద ధోరణుల నుంచి ఎలా బయటపడాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ తీవ్రవాదులు కారణంగా అనేక ఐరోపా దేశాలు అస్తిత్వానికి సంబంధిం చిన సమస్యలు, సవాళ్లతో అవస్థలు పడుతున్నాయి. ఇందులో కూడా బ్రిటన్‌ మరింత తీవ్ర స్థాయి సమస్యలతో బెంబెలెత్తిపోతోంది. తమ దేశంలో ప్రజాస్వామ్యం పురోగ మిస్తోందా, తిరోగమిస్తోందా అన్నది అర్థం కాక బ్రిటిష్‌ పాలకులు తలలు బాదుకుంటున్నారు. బ్రిటన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 650 పార్లమెంట్‌ స్థానాలకు లేబర్‌ పార్టీ 411 స్థానాలు గెలుచుకోవడం సహజమైన విషయమే కానీ, ఈసారి ముస్లిం సభ్యుల సంఖ్య 19 నుంచి 25కి పెర గడం పాలక పక్షానికి ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగి స్తోంది. ఫ్రాన్స్‌లో ఇస్లామ్‌ వ్యతిరేక, జాతీయవాద అను కూల, వలసవాదుల వ్యతిరేక పార్టీ ఘోర పరాజయం పాలై, వామపక్షాలు సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో దేశవ్యాప్తంగా దోపిడీలు, దహనాలు, ఇంకా ఇతర హింసా విధ్వంస కాండలు ఒక్కసారిగా పేట్రేగిపోయాయి. సమస్య వామపక్షాలతో కాదు. తమ దేశంలో తీవ్రవాద ఇస్లామి స్టులు విజృంభించడం, విస్తరించడం ఇందుకు ప్రధాన కార ణంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా స్విట్జర్లాండ్ ఇటలీ, ఫిన్లాండ స్లొవేకియా, క్రోషియా, హంగరీ, చెకొస్లవేకియా తదితర దేశాలు ఇంతవరకూ తాము నిష్ఠగా ఆచరిస్తూ వస్తున్న ఉదార వాదం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. స్వీడెన్‌ లో జాతీయవాద డెమోక్రాటిక్‌ పార్టీ రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది. నెదర్లాండ్స్‌లో ఇస్లామ్‌ వ్యతిరేక గ్రీట్‌ వైల్డెర్స్‌ నాయకత్వంలోని పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ అధికారం లోకి వచ్చింది. నాలుగు పార్టీల సంకీర్ణంలో ఇదే అతి పెద్ద పార్టీ. ఇటలీలో జార్జ్‌ మలోనీ వంటి జాతీయవాద, మిత వాద నాయకులు తమ దేశ ప్రజల్లో షరియా వ్యతిరేకతను నూరిపోసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఫ్రాన్స్‌లో మేరియా లే పెన్‌ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, తమ ఇస్లామ్‌ మత వ్యతిరేకతను చాటి చెబుతూనే ఉన్నారు. ‘మా విజ యం వాయిదా పడింది. అంతే’ అని ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యాఖ్యానించారు. అంటే, ఆయన ఈసారి అధికారంలోకి వస్తే, వలసల మీద నిషేధం విధించడం, తమ దేశంలో తిష్ఠవేసి ఉన్న ఇస్లామిక్‌ తీవ్రవాదులను ఏరి వేయడం ప్రారంభం అవుతుందన్న మాట. మధ్య యుగాల్లో ముస్లిం రాజుల మీద అప్పటి ఐరోపా రాజులు విజయాలు సాధించారు కానీ, ఇప్పుడు మధ్య యుగం నాటి పరిస్థితులు మరో రూపంలో ఐరోపా దేశాల్లో ప్రవేశిస్తున్నా యని పెన్‌ స్పష్టం చేశారు.
పెరుగుతున్న పట్టుదలలు
అయితే, మధ్య యుగపు రాజులు ఎలా వ్యవహరించిన ప్పటికీ, ప్రస్తుత తీవ్రవాద ఇస్లామిక్‌ వర్గాలకు మాత్రం ప్రజా స్వామ్య వ్యవస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అత్యుత్తమ మార్గంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లోనూ, బలహీన నాగరికతలు, సంస్కృతులు ఉన్న దేశాల్లోనూ ఇవి పాగా వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు సరైన ఉదాహరణ బ్రిటన్‌. పాశ్చాత్య దేశాల్లో ముస్లింలకు అత్యంత మైత్రీపూర్వక దేశం బ్రిటనేనని గ్లోబల్‌ ముస్లిం ట్రావెల్‌ ఇండెక్స్‌ (2024) నివేదిక తెలియజేస్తోంది. అయితే, ప్రతి ఎన్నికల్లోనూ 40 శాతం మంది ముస్లింలు దేశంలో షరియా అమలుకు పట్టుబట్టడం జరుగు తోంది. ఆందోళనకర విషయమే మిటంటే, ఫ్రాన్స్‌లో తీవ్రవాద ఇస్లామిస్టులకు ఉన్నంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇతర వర్గాలకు లేవని, పాట కచ్చేరీలకు వెళ్లేవారి నుంచి జర్నలిస్టుల వరకు రాత్రి వేళల్లో బయటికి వెళ్లడానికే భయపడుతున్నారని ఇటీవల ఫ్రాన్స్‌ సర్వేలలో బయటపడింది. దేశంలో చర్చిల సంఖ్యను అధిగమించ డానికి మసీదులు పోటీపడుతున్నాయని కూడా అవి తెలియ జేశాయి. తమ సంస్కృతికే కాక, తమ వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతోందని అత్యధిక సంఖ్యాక ఫ్రాన్స్‌ ప్రజలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఫ్రాన్స్‌ లోనే కాదు, ఐరోపా దేశాల్లో ఎక్కడా వీధులు, బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా కనిపించడం లేదు.
అనేక ఐరోపా దేశాల్లో ఏ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా, ఏ సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఏ సాంస్కృతిక కార్యక్రమా నికి వెళ్లినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. రాత్రి వేళల్లోనే కాదు, పగటి వేళల్లో కూడా జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రాజకీయ పార్టీలు పార్లమెంటులో సైతం వెల్ల డించడం జరుగుతోంది. జర్మనీలో 2014లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ సర్వే నిర్వహిం చినప్పుడు, 51 మంది జర్మన్లు తమ దేశా నికి ఇస్లామిస్ట్‌ తీవ్రవాద వర్గాల వల్ల ముప్పు ఉన్నట్టు చెప్పారు. పాశ్చాత్య దేశాల సంస్కృతికి, ఇస్లామిక్‌ సంస్కృతికి ఏమాత్రం పొసగదని 61 శాతం ప్రజలు వ్యాఖ్యానించారు. “ఇస్లాం కారణంగా మా దేశంలో మేము ఆగంతుకులుగా బతుకుతున్నాం” అని 40 శాతం ప్రజలు వెల్లడించారు. జర్మనీలోకి ముస్లిం మతస్థులు వలస రాకుండా చేయాలని కూడా 24 మంది ప్రజలు ప్రభు త్వాన్ని కోరారు. ఇంగ్లండ్‌లో 2012లో ‘యూగవ్‌’ సర్వే జరిగిన ప్పుడు 69 శాతం మంది బ్రిటిషర్లు బ్రిటిష్‌ సంస్కృతికి, ముస్లిం సంస్కృతికి పొంతన కుదరదని స్పష్టం చేశారు. ఇదే కారణంగా ప్రస్తుతం బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ విజయం సాధించడం జరిగింది.
ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యం
బ్రిటన్‌కు వలస వస్తున్న ముస్లింలలో ఎక్కువ మంది తీవ్ర వాద భావజాలం కలిగినవారేనని ఇక్కడి జాతీయవాద పార్టీలు పేర్కొన్నాయి. నిజానికి అధిక సంఖ్యాక ముస్లింలు స్థానికులతో కలిసిపోయి, దేశాభివృద్ధికి తమ వంతు సహాయ సహాకారాలు అందజేస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా తీవ్రవాద వర్గాలు బ్రిటన్‌లో కాలుపెట్టడం ఎక్కువైందని అవి తెలిపాయి. విచిత్రంగా బ్రిటన్‌లో కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ముస్లింలలో తీవ్రవాద భావాలు పేట్రేగుతున్నాయని అక్కడి అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. ముస్లింల వలసల విషయంలో చూసీ చూడ నట్టు వ్యవహరించినందుకే రుషి సునాక్‌ పార్టీ ఓడిపో యిందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, తమ మత సంబంధమైన ఉనికిని చాటుకోవడానికి, తమకు గుర్తింపు సంపాదించుకోవడానికి ముస్లిం తీవ్రవాదులు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. దేశ జనాభాల్లో 2011లో 27 లక్షలున్న ముస్లిం జనాభా 2021 నాటికి 39 లక్షలకు పెరిగినట్టు జనాభా గణాంక వివరాలు తెలి యజేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో మసీదుల సంఖ్య దాదాపు రెట్టింపయింది.
ఇది కాకుండా, బ్రిటన్‌లో ఏటా 5,200 మందిని ఇస్లాం మతంలోకి మారుస్తున్నట్టు కూడా వెల్లడైంది. ఫ్రాన్స్‌ లో గత 25 ఏళ్ల కాలంలో స్థానికులను ఇస్లాం మతంలోకి మార్చడం రెట్టింపయింది. గెస్‌ మేట్‌ పరిశోధన ప్రకారం, ఫ్రాన్స్‌ లో ఉన్న 60 లక్షల మంది ముస్లింలలో లక్ష మంది మతం మారినవారే. 2024లో ఎకనామిస్ట్‌ అనే అంతర్జా తీయ పత్రిక ఐరోపా దేశాల్లో తీవ్రవాద ముస్లింల పురోగతి గురించి ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, యూరోపియన్‌ యూనియన్‌ లోని 28 సభ్య దేశాల్లో రెండున్నర కోట్ల మంది ముస్లింలు నివసిస్తు న్నారు. ఐరోపా వ్యాప్తంగా ముస్లింల జనాభా అయిదు కోట్ల పైచిలుకే ఉంటుంది. వీరంతా ముస్లిం దేశాల నుంచి చిన్నపాటి ఉద్యోగాల కోసం వలస వచ్చినవారే. మొరాకో, పాకిస్థాన్‌, టర్కీ తదితర ముస్లిం దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలసి వచ్చి, ఇక్కడ స్థిరపడిన తర్వాత వారు తమ దేశాల గురించి చెప్పుకోవడం మానేసి, ముస్లింలుగానే గుర్తింపు తెచ్చుకోవడం ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా వారు ఐరోపాలో ఆయా దేశాల స్థానిక సంస్కృతులు, నాగరికతల మీద దాడి చేస్తుండడంతో ప్రభుత్వాలు, ప్రజ ల్లో పునరాలోచనలు మొదలయ్యాయి.
సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని కొన్ని తీవ్రవాద వర్గాలు తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు ప్రారంభిం చడంతో పాటు, స్థానికుల మీదా, స్థానిక వ్యాపార సంస్థల మీదా దాడులు జరపడం, హింసా విధ్వంసకాండలకు కూడా పాల్పడడం, అనేక దేశాలను తీవ్రంగా కలవరపరు స్తోంది. దీంతో, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌ స్వీడెన్‌ తదితర దేశాలు ముస్లిం వలసల మీద ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేపట్టాయి. మిత వాద, ఉదారవాద పార్టీల అనైక్యత వల్ల ఈ ప్రక్రియ కొద్ది గా ఆలస్యం అవుతోందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి వ్యా ఖ్యానించడం గమనార్హం. అమెరికాలో జంట టవర్ల మీద ముస్లిం ఉగ్రవాదుల దాడులు జరిగిన తర్వాత తీవ్రవాద ధోరణులను నిషేధించడం జరిగింది. బ్రిటన్‌తో సహా ఐరోపా దేశాలన్నీ ఇతర దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోవడం వల్ల పెనుప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

  • కె. కృష్ణమూర్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News