Monday, February 16, 2026
Homeఎడిటోరియల్ / బహుళDrug and Cosmetics Act 1940: నకిలీ మందులు.. నిశ్శబ్ద హత్యలు

Drug and Cosmetics Act 1940: నకిలీ మందులు.. నిశ్శబ్ద హత్యలు

Generic Medicines Quality: భారతదేశం నేడు ప్రపంచ ఔషధ రంగంలో ఒక కీలక శక్తిగా నిలిచింది. అమెరికా ఫార్మసీల్లో అమ్ముడ య్యే జనరిక్‌ మందుల నుంచి ఆఫ్రికా గ్రామాల్లో పంపి ణీ అయ్యే జీవన రక్షక మాత్రల వరకు “మేడ్‌ ఇన్‌ ఇం డియా” ముద్ర కనిపిస్తోంది. తక్కువ ధరలో మందులు అందించే దేశంగా, అత్యధిక పరిమాణంలో ఔషధాలు తయారు చేసే కేంద్రంగా భారత్‌కు “ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్​‍” అనే గౌరవ బిరుదు లభించింది.

- Advertisement -

కానీ ఇదే సమ యంలో ఒక అసహ్యకరమైన ప్రశ్న మనల్ని వెంటాడు తోంది. ప్రపంచానికి మందులు పంపుతున్న ఈ దేశంలోనే ఎందుకు లక్షలాది మంది నాసిరకం, నకిలీ మందుల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు? పేద ప్రజలు తమ చివరి ఆస్తిని అమ్ముకుని కొనుగోలు చేసిన మందులు ఎందుకు వారిని కాపాడకుండా మెల్లగా ప్రా ణాలను తీసుకుంటున్నాయి? ఇది యాదృచ్ఛిక ప్రమా దమా, లేక వ్యవస్థాగత వైఫల్యమా?

ఔషధ పరిశ్రమను సాధారణ వ్యాపారంలా చూడ టం భారత సమాజం చేసిన ఘోరమైన పొరపాటు. బట్టలు, వాహనాల్లా మందులనూ మార్కెట్‌ లాజిక్‌తో మాత్రమే చూసినప్పుడు, అది ప్రాణాంతకంగా మారు తుంది. ఒక మాత్ర తయారీ వెనుక ఉన్న శాస్త్రం, నైతి కత, క్రమశిక్షణ అత్యంత కఠినమైనవి. క్రియాశీలక ఔషధ పదార్థం శుద్ధి, మోతాదు ఖచ్చితత్వం, తయారీ సమయంలో సూక్ష్మజీవుల నియంత్రణ, నిల్వ-రవాణా లో భద్రత – ప్రతి దశలో తప్పిదానికి చోటు లేదు. కానీ లాభాల కోసం జరిగే చిన్న రాజీ కూడా మందును మం దుగా కాకుండా విషంగా మార్చగలదు.

గ్లోబలైజేషన్‌ పేరుతో ఉత్పత్తి ఖర్చులు తగ్గించా లన్న ఒత్తిడి పెరిగిన తర్వాత, నియంత్రణలు అనేక చోట్ల కాగితాలకే పరిమితమయ్యాయి. భారతదేశంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఒకవైపు ఎగుమతుల కో సం తయారయ్యే మందులపై అమెరికా, యూరోపి యన్‌ రెగ్యులేటర్లు కఠిన తనిఖీలు చేస్తుంటే, మరోవైపు దేశీయ మార్కెట్‌లో అమ్ముడయ్యే మందులపై పర్యవే క్షణ బలహీనంగా ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణాల స్ప ష్టమైన ప్రతిబింబం. అంతర్జాతీయ కాంట్రాక్టుల విలువ ముందు పేద ప్రజల ప్రాణాల విలువ తగ్గిపోయిన దుర దృష్టకర స్థితి ఇది.

చట్టాల పరంగా చూస్తే లోపం లేదని చెప్పాలి. డ్రగ్స్​‍ అండ్‌ కాస్మెటిక్స్​​‍ యాక్ట్‍-1940, సంబంధిత నిబంధనలు, కేంద్ర-రాష్ట్ర స్థాయి నియంత్రణ సంస్థలు – అన్నీ ఉన్నాయి. కానీ అసలు సమస్య అమలులోనే ఉంది. కేంద్రం అనుమతులు చూస్తే, తయారీ, నిల్వ, విక్రయాలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఈ విభజ నలో సమన్వయం లోపించి, బాధ్యత చెదిరిపోతుంది. తప్పు జరిగితే ఒకరు మరొకరిపై నెపం నెట్టేస్తారు. ఇదే గందరగోళం నాసిరకం మందుల తయారీదారులకు రక్షణ కవచంగా మారింది. నకిలీ మందుల సమస్య కే వలం ఆరోగ్య సమస్య కాదు– అది సామాజిక-ఆర్థిక నేరం.

దేశీయ మార్కెట్‌లో గణనీయమైన శాతం మందు లు నాసిరకం లేదా నకిలీ అని పలు అధ్యయ నాలు చెబుతున్నాయి. కొన్ని మందుల్లో అసలు ఔషధ పదార్థ మే ఉండదు. కొన్నిటిలో మోతాదు తక్కువగా ఉంటుం ది. మరికొన్నిటిలో విషతుల్య రసాయనాలు ఉంటాయి. ఫలితంగా రోగం తగ్గకపోవడమే కాక, మరింత తీవ్ర మవుతుంది. యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్​‍ లాంటి ప్రమా దకర పరిణామాలు రేపటి ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు గా మారుతున్నాయి.

ఈ మరణాలు ఏ గణాంకంలో లెక్కపెట్టబడుతు న్నాయి? ఏ నివేదికలో ఇవి కనిపిస్తున్నాయి? అధికారి క గణాంకాలు సమస్యను చిన్నదిగా చూపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల తనిఖీలు, కొద్ది కేసులు, కొన్ని నమూనాలే నాసిరకమని గుర్తింపు – ఇవన్నీ మం చుకొండ పైభాగం మాత్రమే. గ్రామీణ ప్రాంతాలు, బస్తీ లు, అంచు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలు అధికా రిక రికార్డులకు అందడం లేదు. 33 జిల్లాలున్న రాష్ట్రం లో కొన్ని వందల తనిఖీలతో సమస్యను కట్టడి చేశామని చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే.

ఔషధ నియంత్రణ అధికారులు ప్రజారోగ్యానికి కాపలాదారులుగా ఉండాలి. కానీ తనిఖీలు తూతూ మంత్రంగా మారడం, లంచాల ఆరోపణలు వినిపించ డం, పెద్ద నగరాలకే పరిమితమైన చర్యలు – ఇవన్నీ వ్యవస్థను మరింత కుళ్లబెడుతున్నాయి. ప్రజల ప్రాణా లు గాలిలో కలుస్తుంటే, బాధ్యులు ఫైళ్లలో గణాంకాలు రాస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

అనుమతి లేని గర్భస్రావ మందులు, మత్తు సిర పుల విక్రయం మరో భయానక కోణం. ఇవి మహిళల ప్రాణాలకు, యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు. అయినా స్పందన మందగించింది. పట్టుబాట్లు జరుగు తున్నా, వ్యవస్థలో మూలపూరిత మార్పు మాత్రం కనిపించడం లేదు.
ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత ప్రభుత్వానికే పరిమితం కాదు. లాభాల కోసం నాణ్యతను తాకట్టు పె ట్టే తయారీదారులు, కమీషన్ల కోసం నిర్దిష్ట కంపెనీల మందులు సూచించే వైద్యులు, ఎక్కువ లాభం ఇచ్చే మందులనే విక్రయించే ఫార్మసీలు – ఇవన్నీ కలిసి ఒక అనైతిక వ్యవస్థను నిర్మిస్తున్నాయి. వైద్య వృత్తి పవిత్ర మని చెప్పుకుంటూ, ఆ పవిత్రతను కాపాడే నైతిక ధైర్యం తగ్గిపోతే ఆ మాటలకు అర్థం ఏముంటుంది?

ప్రజల పాత్ర కూడా కీలకం. అవగాహన లోపం, భయం, పేదరికం ప్రజలను మౌనంగా మారుస్తున్నా యి. కానీ మౌనం కొనసాగితే ఈ నిశ్శబ్ద హత్యలు ఆగవు. బిల్లులు తీసుకోవడం, మందుల వివరాలు తెలు సుకోవడం, అనుమానాస్పద మందులపై ఫిర్యాదు చే యడం, మీడియా ద్వారా గొంతెత్తడం – ఇవన్నీ ప్రజల చేతిలో ఉన్న ఆయుధాలు. కఠినమైన చట్టాలు పుస్తకా లలో ఉండటం సరిపోదు. అవి పటిష్టంగా అమలవ్వా లి. నాసిరకం మందులు తయారు చేసేవారిపై, అనుమ తులు ఇచ్చే అధికారులపై, విక్రయించే వారిపై కఠిన జైలు శిక్షలు, జీవితకాల నిషేధాలు ఉండాలి.

ఔషధ నియంత్రణ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా మారాలి. ట్రాకింగ్‌, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ వంటి సాంకేతిక తలు అమలు చేయాలి. ఫార్మ్‍ డి డాక్టర్లను సమగ్రంగా ఉపయోగించుకో వాలన్న నిపుణుల సూచన కూడా గమనించాల్సినది. 2008లో ప్రవేశపె ట్టిన ఈ కోర్సును దేశంలో పూర్తిగా వినియోగించు కోకపోవడం మరో వైఫల్యం. రాజకీయ నాయకులు ఈ అంశాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా, ప్రజారోగ్య అత్యవ సర సమస్యగా చూడాలి.

చివరికి ప్రశ్న ఒక్కటే- మనం ఎలాంటి సమా జంగా ఉండాలనుకుంటున్నాం? లాభాల కోసం ప్రాణా లను తాకట్టు పెట్టే వ్యవస్థగా మారాలా? లేక ప్రతి పౌరు డి జీవితం విలువైనదని నమ్మే బాధ్యతా యుత ప్రజా స్వామ్యంగా నిలవాలా? ఈ నిర్ణయం నేడు తీసుకోక పోతే, రేపు మన మౌనం మరెన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది.

మన్నారం నాగరాజు
(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News