సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర 18వ సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామిక వ్యవస్థలోని ఒక గుణాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు! భారతదేశంలో 2014 నుండి 2024 వరకు పది సంవత్సరాలు అధికారంలో కొనసాగిన బిజెపి కూటమి, 2024లో బిజెపి కూటమిగా( ఎన్డీఏ గా) ఎన్నికలలో పోటీ చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమిగా ) పోటీ చేసిన దాఖలాలు మన ముందు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సర్వసాధారణమే అయినప్పటికీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వీటిని రక్షించడానికి నేడు రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం మనకు అందుబాటులో లేదని చెప్పాలి.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొదటి, రెండు తరాలు రాజకీయాలలో విలువలు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తో కూడుకున్న రాజకీయాలు ఉన్నాయి.2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన రాజకీయ పార్టీల రాజకీయ వ్యవస్థ విధానం ప్రజాస్వామ్యబద్ధంగా లేదనే చెప్పాలి. నిరంకుశ, నిర్బంధ రాజకీయ వ్యవస్థను కొనసాగించారని చెప్పాలి. ముఖ్యంగా మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగిందని, ప్రశ్నించే వారిని నిర్బంధించే విధానం ఈ పది సంవత్సరాల్లో కొనసాగిందని చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి రాజకీయ వ్యవస్థను 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు భిన్నమైన తీర్పును ఇచ్చినారు అని చెప్పాలి. దేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా ఎన్డీఏ, ఇండియా కూటమిగా విడిపోయి ఎన్నికలలో పోటీ చేసినాయని చెప్పవచ్చు. ఉత్తర భారత దేశంలో, దక్షిణ భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాలలో రాజకీయ వ్యవస్థను ఒక్కసారి పరిశీలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగ వ్యవస్థను సవరించడానికి అవకాశం ఉంటుందని కాబట్టి ప్రజలు ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఇవ్వాలని 18 లోకసభ ఎన్నికలు ఏప్రిల్ 19 మొదలై జూన్ రెండవ తారీకు వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ ఏకంగా పరిశీలిస్తే ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికలలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిన విషయం మనం ఒకసారి గమనించాలి. అయితే గతంలో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఈసారి 9 సీట్లు గెలుచుకొని తన సత్తాను చాటుకున్నది. అదే ధోరణిలో పార్లమెంటే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి 8 సీట్లను కట్టబెట్టింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయి గల వ్యక్తి 20 సార్లు బహిరంగ సభలో ప్రసంగించిన సంగతి గమనించవచ్చు. అదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఊపుతో కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసి 8 సీట్లు సాధించగలిగింది. ముఖ్యంగా 2.ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన ఎన్నికలుగా, ఫలితాలుగా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, ముఖ్యంగా విద్య వైద్య రంగాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చినప్పటికీ అక్కడి ప్రజలు వినూత్న రీతిలో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసిన కూటమికి పట్టం కట్టారు. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అధికార బలంతో ప్రతిపక్షాలపై నిరంతరం దాడులు చేయడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాలలో మొట్టమొదటిది అమరావతి రాజధాని రద్దుచేసి మూడు రాజధానులు అని విడదీయడం వల్ల అక్కడ కూడింది వైయస్సార్సీపి రాజకీయ దిగజారుడు వ్యవస్థా అని చెప్పవచ్చు. రాజధానిని మార్చడం పై వేలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అమరావతి ప్రాంత ప్రజలు సుమారు రెండు మూడు సంవత్సరాలు నిరంతరాయంగా చేసిన ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా ఖలించి వేసిందని చెప్పవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సామాన్య ప్రజలకు మేలు కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఉపాధి కల్పన కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి వైయస్సార్సీపి తన గోయి తాను తవ్వుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పరిపాలన వ్యవహారాలు సమర్థనీయంగా ఉన్నప్పటికీ. ఒకటే ఒకటి టర్నింగ్ పాయింట్ అమరావతి రాజధాని మార్చడం పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణమైనప్పటికీ ప్రస్తుత అధికారంలోనికి వచ్చిన టిడిపి కూటమి ప్రజల మన్నలను పొంది అధికారం ని చేపట్టి పోతుందని చెప్పవచ్చు.
- ప్రస్తుతం 18వ లోకసభ సార్వత్రిక ఎన్నికలు దేశంలో ఏ కూటమికి సుమారు 250 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు, అదేవిధంగా ఇండియా కూటమి కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. భారతీయ జనతా పార్టీ( బిజెపి) వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో రామ జన్మభూమి స్థానంలో తిరిగి రాముని విగ్రహాన్ని ప్రతిష్టింబన చేయడం మొత్తానికి భారతదేశవ్యాప్తంగా రామనామం జపం చేయడం జరిగింది. 2014 నుండి 2024 వరకు పది సంవత్సరాల పరిపాలన కాలంలో భారతీయ జనతా పార్టీ తన అధికార రాజకీయ సుస్థిరతను నెలకొల్పుకోవడానికి చేపట్టిన చర్యల్లో ముఖ్యంగా ఆర్టికల్ 360 రద్దు, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకతను రద్దు చేయడం, త్రిపుల్ తలాక్, వంటి మేజర్ కార్యక్రమాలను చేపట్టడం గమనించదగ్గ విషయం. అయితే భారతదేశ అంతర్జాతీయ సంబంధాలలో గతంలో ఎన్నడు లేని విధంగా మోడీ దాదాపు అగ్ర రాజ్యాలతో నెలకొల్పిన దౌత్య సంబంధాలు ప్రపంచ దేశాలను ఆకర్షించేయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించదగ్గ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కుంభకోణాలను తీవ్రంగా ప్రచారం చేయడంలో బిజెపి సఫలమైందని చెప్పాలి. భారతదేశంలో ఆర్థిక సుస్థిర సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను బిజెపి పార్టీ బలోపేతం చేసినట్లు ప్రసారం చేసుకోవడంలో సఫలీకృతమైనట్లు చెప్పవచ్చు. అధికంగా అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం కూడా అయితే స్థానంలో ఉందని ప్రసారం చేయడంలో ఎన్డీఏ కూటమి సఫలి అయిందని చెప్పాలి. ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) వ్యవస్థలో సమర్థవంతమైన నాయకత్వం లేదని ప్రచారం చేయడంలో బిజెపి తన ఎన్నికల ప్రసారాలలో సబ్క వికాస్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి! ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ గెలుచుకున్న స్థానాలను బట్టి చూస్తే రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర దేశ్ కి బచావో అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే భారతదేశం అంటే 80% ఉన్న హిందువుల దేశంగా ప్రచారం చేయడంలో బిజెపి విజయం సాధించిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం అన్నట్లుగా తన ప్రచార కార్యక్రమాన్ని( సెక్యులర్) నినాదంతో ముందుకు సాగింది. ఏది ఏమైనా భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గెలుపు ఓటములు ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని చెప్పాలి. గడిచిన 75 సంవత్సరాలుగా దేశంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రస్తుతం ఆధునిక శాస్త్ర సాంకేతిక కాలంలో కూడా అదేవిధంగానే కొనసాగుతుంది. మోచేతికి బెల్లం పెట్టి నాకించే విధంగా నేడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానం గమనించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించడం సర్వ సాధారణమైన విషయమే అయినప్పటికీ దేశం సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి, రాజకీయ వ్యవస్థ నేడు మనకు అందుబాటులో లేదనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు చరిత్ర నుండి నేర్పిన పాఠాలు అయినప్పటికీ చరిత్ర పునర్వృత్తాంతం అవుతుందని చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని బంబు చేసిన వాడు చరిత్ర ఈనుడు కాక తప్పదు. కాబట్టి 202418వ లోకసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశ ప్రజా జీవన వ్యవస్థలో తీవ్రమైన మార్పులు తీసుకువస్తాయన్న నమ్మకం లేదు. ఎప్పటి లాగానే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమర లో ఆశ్రమిస్తాడు. సామాజిక వ్యవస్థలలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. భూమిని నమ్ముకున్న రైతుకు పొద్దున్నే లేచి మట్టిలో పనిచేయాల్సిందే! కష్టాన్ని నమ్ముకున్న కూలీకి సదిమూట సమాధానం చెబుతుంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ గెలిచిన, ఏ రాజకీయ నాయకుడు అధికారంలోనికి వచ్చిన ప్రజా జీవితములో పెద్ద మార్పు ఉండదని చెప్పాలి. అయితే ఈసారి ఇచ్చిన తీర్పు దేశంలో మేధావి వర్గాన్ని ఆలోచింపజేశగా ఉన్నాయని చెప్పాలి.
డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం