Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Global Warming: మరింత వేడిగా ఈ వేసవి

Global Warming: మరింత వేడిగా ఈ వేసవి

గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతున్నందున వేసవి మరింత తీవ్రంగా ఉండబోతుంది. వేసవి తీవ్రత ఎంత ఉన్న సరే, ఇప్పటినుండి శరీర ఉష్ణాన్ని అదుపులో ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా, పిల్లలు ఎవరైతే వేసవి శెలవల కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్న వేళలో విరామం లేకుండా ఆటలు ఆడుతూ ఉంటారో అలాంటి వారిని అనునయించి మధ్యాహ్నం నిద్ర పోయేలా చెయ్యాలి.
ముఖ్యంగా వేసవి లో అధిక స్వేదం వలన మన శరీరం లోని నీటి శాతం త్వరగా కోల్పోతాము. నీరు దాహం తీర్చే ముఖ్యమైన వనరు అయినప్పటికీ, వేడి గాలులు, భరించలేని వేడి, అంతులేని మధ్యాహ్నాలను చల్లని ఇంకా ఆహ్లాదకర పానీయాలతో ఆనందించవచ్చును.
అదృష్టవశాత్తు వేసవి అప్పుడు దక్షిణ భారతదేశం లో అద్భుతమైన ఆహరం లభిస్తుంది. అవి వేసవి లో సహజమైన నివారణలు ఉపయోగపడతాయి. ఎండను ఆరోగ్యకరంగా ఎదుర్కొనేందుకు – అమ్మమ్మలు, అమ్మలు అనాదిగా పరీక్షించి చూసిన అనేక సమ్మర్ డ్రింక్స్ లో అత్యుత్తమమైనవి ఇంట్లో తయారు చేసుకునే సులభమైన ఆహ్లాదకరమైన పానీయములు కొన్ని కాగా మనం ప్రయాణిస్తుంటే కూడా పనికొచ్చేవి.
కొబ్బరి నీరుని మించినది లేదు. కొబ్బరి నీటిలోని యాంటిఆక్సిడెంట్స్, ఔషధ గుణములు వేసవిలో శరీర ఉష్ణాన్ని అదుపులో ఉంచుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. సాదా లేక సుగంధ పదార్ధాలతో లేక కాలానుగుణ పండ్లతో కలిపి తీసుకోవటం అనేది ఎప్పటికి మంచిది.​చెరుకు రసం: ప్రజలు వేల సంవత్సరాల నుంచి అనేక సమస్యలను పరిష్కరించటానికి చెరుకు రసాన్ని ఉపయోగిస్తున్నారు. ఖనిజాలు,పోషకాల యొక్క గొప్ప మూలం అయిన చెరుకు రోగ నిరోధకశక్తిని పెంపొందించటానికి, నిమ్మకాయలు,అల్లం చెరుకు రసంలో కలిపితే మంచి రుచి లభిస్తుంది,ఈ వేసవి లో చల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
పుచ్చకాయ రసం: వేసవి లో విరివిగా పుచ్చకాయల రసం వలన దాహం తీర్చుకోవచ్చు.
నిమ్మ రసం: ఈ వేసవి లో అత్యంత మధురమైన పానీయాన్ని తీసుకోవటం మరిచిపోవద్దు. శరీర ఉష్ణాన్ని పరిపూర్ణంగా అదుపులో పెట్టుకోవటానికి చల్లటి నీరు లేదా ఐస్ లో కొంచెం పంచదార,నిమ్మకాయ,చిటికెడు ఉప్పువేసి చక్కని నిమ్మరసాన్ని తయారుచేసుకోవచ్చు.
జల్జీరా: వేయించిన జీలకర్ర పొడి,నీరు,నల్లఉప్పు తో తయారు చేస్తారు;జల్ జీరా ముఖ్యంగా వేసవిలో జీర్ణ సమస్యల వల్ల బాధపడేవారికి ఎంతో ఉపయోగం.
కంజి: భారతీయ ప్రోబైయటిక్ గా పిలవబడే కాంజి నీరు, నల్ల క్యారెట్,బీట్రూట్,ఆవాలు,ఇంగువ తో చేసినటువంటి పానీయం. అది ఉపయోగించటానికి కొంత సమయం పట్టినప్పటికీ వేసవి లో ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
జిగర్తాండ: జిగర్తాండ దక్షిణ భారతదేశంలోని మధురై వీధులలో అమ్మబడే ఒక మధురమైన పానీయం. ఐస్ క్రీం, కండెన్స్డ్ పాలు, ఫలూద తో చేయబడిన ఈ పానీయం స్థానికుల అభిమానాన్ని పొందింది.
నన్నారి షర్బత్: నన్నారి వేళ్లతో చేయబడే నన్నారి షర్బత్ అనేక కేరళ కుటుంబాలలో ప్రధానమైనది. చక్కర వేర్లను,నీటిని, కొంచెం సున్నాన్నిబాగా మరిగించటం ద్వారా ఈ పానీయము తయారవుతుంది, కేరళలో నఱునీండి షర్బత్ అని కూడా పిలవబడే ఈ పానీయం పిండితో చేయబడిన ఐస్ తో తీసుకోవడం వలన వేసవిలోని వేడిని తట్టుకోవటంలో చాలా ఉపయోగపడుతుంది.
మజ్జిగ: ఆరోగ్యకరమైన ఇతర కార్బోనేటేడ్ పానీయాలకంటే పెరుగు తో చేయబడిన ఈ మజ్జిగ నిస్సందేహం గా భారతీయులకు ఇష్టమైన పానీయం. అద్భుతమైన జీర్ణప్రక్రియకు, అణచిపెట్టుకున్న దాహానికి సహజసిద్ధమైన మజ్జిగ జీరా,అల్లం,మిరప తో రుచికరమైనది ప్రయాణం చేసేటప్పుడు మనతో ఉంచుకోవాలి. తరువాత అవి దొరుకుతాయో లేదో అనుకుంటే ముందే వాటిని నిల్వ చేసుకోవడం మంచిది.
రాగి మజ్జిగ: మజ్జిగను రాగిపిండి, చిటికెడు ఉప్పుకలిపితే ఆరోగ్యకరమైన పోషకాహారం అలాగే ఆహ్లాదకరమైన వేసవి పానీయం పొందుతాము. జీరా, స్పైసి (అల్లం, మిరప) రుచులతో మజ్జిగ తీసుకోవాలి.
లస్సి: వేసవిలో లభించే సహజసిద్ధమైన లస్సిని మించినది ఏది లేదు. తీపి, మామిడి రుచులలో లభిస్తుంది.
ఫ్లేవర్డ్ పాలు: మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు చల్లని ఫ్లేవర్డ్ పాలను మించినది ఏది ఉండదు. కేసర్, బాదం మరియు ఖర్జూర రుచులలో ఫ్లేవర్డ్ పాలు లభిస్తాయి.
థిక్ షేక్: 100% స్వచ్ఛమైన పాలతో చేసే ఈ థిక్ షేక్ ఈ వేసవికి ఈ పానీయం ఇష్టంగా త్రాగవచ్చు. స్నాక్స్ సమయంలో నూనె పదార్థాలు తీసుకోకుండా ఈ లాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి రక్షించుకోవడమే కాకుండా ఆరోగ్యం కూడా రక్షించుకోవచ్చు.
ఆళవందార్ వేణు మాధవ్
8686051752, హైదరాబాద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News