Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Govt colleges admissions decreasing: ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల్లో అడ్మిషన్లు ఎందుకు తగ్గుతున్నాయి?

Govt colleges admissions decreasing: ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల్లో అడ్మిషన్లు ఎందుకు తగ్గుతున్నాయి?

విద్యార్థుల ఉత్తీర్ణతకు బోధకులే పూర్తి బాధ్యత

1990 దశకంలో ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో సీటు దొరకాలంటే కష్టంగా ఉండేది, పదో తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా మూడు విడ తలుగా సీట్లు భర్తీ చేసేవారు తక్కువ మార్కులు వచ్చిన వారికి సైన్స్‌ గ్రూపుల్లో సీటు దొరికేది కాదు, సప్లమెంట రీలో పదవ తరగతి పాస్‌ అయితే ఆర్ట్స్‌ గ్రూపే శరణ్యం అన్న విధంగా ఉండేది, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు సైతం ఇంటర్‌లో సీటు కోసం సిఫార్సు చేసే పరిస్థితులు, ఆనాడు అంతటి డిమాండ్‌కు గల కారణాలను ఒక్కసారి తెలుసుకుందాం!!
ఆ రోజుల్లో డివిజన్‌కు ఒకటి రెండు, కళాశాలలు మాత్రమే ఉండేవి అందున అవి కూడా కొన్ని ఉన్నత పాఠ శాలలో కలిసి షిఫ్ట్‌ విధానంలో నిర్వహించబడేవి, ఇక ఉప న్యాసకులు కూడా ఆరకొరగా ఉండేవారు, అర్హులైన ప్రభు త్వ ఉపాధ్యాయులే పార్ట్‌ టైంగా పాఠాలు చెప్పేవారు, పక్కాభవనాలు కానీ వసతులు గాని లేని ఆ కొద్ది కళాశా లలోని నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు ఇంటర్‌ చదు వులు సాగించేవారు పదవ తరగతి ఇంటర్‌ పరీక్షల ఫలి తాలు కూడా సాధారణ స్థాయిలోనే ఉండేవి విద్యార్థులు చదువులకు ఫలితాలకు విద్యార్థులే బాధ్యత వహించే రోజు లు అవి, అటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వ కళాశాల ల్లోనే చదవడానికి విద్యార్థులు పోటీలు పడేవారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2002 నుంచి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పూర్తి వసతులు, ప్రత్యేక పక్కా భవనాలు, సంపూర్ణ స్థాయిలో బోధకులు వీటన్నిటికీ తోడు విద్యార్థుల ఉత్తీర్ణతకు బోధకులే పూర్తి బాధ్యత. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం తెలంగాణలో మొదటి సంవత్సరం అడ్మిషన్ల లక్ష్యం 90,000కు గాను ఇప్పటికీ 47,000 మందే చేరడం జరిగింది.
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్న కొత్త అడ్మిషన్లు పెరగలేదు దానికి కూడా ఉపన్యాస కులదే బాధ్యత అనే ‘అశాస్త్రీయ విశ్లేషకులు’ దానికి గల పూర్వపరాలు, కారణాలు కూడా గమనిస్తే బాగుంటుంది.
2000 సంవత్సరం నుంచి ప్రామాణిక విద్యను అం దించే ప్రభుత్వ కళాశాలకు ప్రైవేటు కళాశాల ఎదురుదాడి ప్రారంభమై 2019 కరోనా కాలం వరకు విస్తృతంగా వ్యాపించింది. అనేక ఆకర్షణలతో గ్రామీణ విద్యార్థుల సైతం ప్రైవేటు కళాశాల వైపు తిప్పుకుంది. దరిమెల ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయినా 2000 సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యా వ్యవస్థలో ఏర్పాటు చేసిన కాంట్రాక్టు ఉపన్యాసకుల వ్యవస్థతో ప్రభుత్వ కళాశాలలో విద్యా విధానం అన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రైవేట్‌ కళాశాలకు దీటుగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ కళాశాలలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి నిస్వార్థ విద్యా సేవకుల సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సంబంధిత ఉపన్యాసకులను క్రమబద్ధీకరించి వారి బాధ్యతను మరింత పెంచింది. వారు కూడా నిండైన కృతజ్ఞతా భావంతో వారి మనుగడకు కారణమైన ప్రభుత్వ కళాశాలలను కాపాడుకోవడానికి గతం కన్నా మించిన ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. అయినా ప్రభుత్వ కళాశా లల్లో ప్రవేశాల సంఖ్య ఎందుకు పెరగటం లేదు? అన్నదే అందరి ప్రశ్న.
తెలంగాణ రాష్ట్రంలో 406 ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలు ఉండగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కులాల వారీగా ఏర్పాటు చేసి గురుకుల విద్యాలయాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. వీటికి తోడు కస్తూ రిబా గాంధీ బాలికల విద్యాలయాలు వచ్చాయి. వృత్తి నైపుణ్యాన్ని పెంచే విధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం చాలా ఉన్నతమైనది, కానీ అమల్లో ప్రస్తుతం చాలా వెనుకబడి ఉంది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సంఖ్య నిష్పత్తి శాస్త్రీయంగా ఉన్న ప్రభుత్వ పాఠ శాలల్లో చదివిన పదవ తరగతి విద్యార్థులంతా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే ఇంటర్‌ చదివే పరిస్థితి లేదు.
దీనికి తోడు సాధారణ ఇంటర్‌ కోర్సుల కన్నా వృత్తి విద్యా కోర్సులకు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, వంటి వృత్తి విద్యల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పూర్వం విద్య విజ్ఞానం కోసం అనుకునేవారు, ప్రస్తు తం విద్య అంటే కేవలం ఉపాధి, సంపాదనే, అన్న లక్ష్యం గా ఉంది. పదో తరగతి పాస్‌ అయిన వాళ్లంతా ఇంటర్‌ చదవ డం లేదు, ఇంటర్‌ పాస్‌ అయిన వాళ్లంతా డిగ్రీ చేయడం లేదు, డిగ్రీలు పూర్తి చేసిన వారంతా పీజీలు రెగ్యులర్‌ గా చేసే పద్ధతి నేడు లేదు. అందుకే ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలతో పాటు డిగ్రీ కళాశాలల్లో అలాగే విశ్వవిద్యాల యాల సాంప్రదాయ తరగతి గదులు విద్యార్థులు చేరక వెలవెలబోతున్నాయి.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ప్రైవేటు, వృత్తి విద్య, గురుకుల కళాశాలలు అడ్మిషన్లకు ప్రతిబంధకాలు కాగా, డిగ్రీకి ఇంజనీరింగ్‌ వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయా లకు సార్వత్రిక విధానాలు, అడ్మిషన్లకు ఆటంకాలుగా ఉన్నాయి. అనే విషయం సంబంధిత అధికారులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ కళాశాలల్లో భోజన వసతి, రవాణా సౌకర్యాలు లేమి కూడా అడ్మిషన్ల కొరతకు ఒక కారణంగా భావించాలి. కులాల వారి గురు కుల విద్యాలయాలు, కస్తూరిభాగాంధి విద్యాలయాల్లో గల విలువైన భోజన, వసతి, సౌకర్యాలు దృష్ట్యా గ్రామీణ విద్యార్థులంతా అటుగా మొగ్గు చూపుతున్నారు.
ఇటీవల విద్యార్థుల ప్రతిభా బహుమతుల ప్రధానో త్సవ సభలో ఒక ఐఏఎస్‌ అధికారి అన్నట్టు ‘విద్యా వ్యవ స్థలో స్థానాలు సంఖ్యలు తాత్కాలికం, విలువలతో కూడిన ప్రామాణిక విద్య అత్యవసరం’ అన్న విషయాన్ని ఈ సంద ర్భంగా ఆచరణలోకి తీసుకోవాలి. కొన్నాళ్లుగా విద్యార్థుల ఫలితాలకు ఉపన్యాసకులను బాధ్యులను చేసి తద్వారా విద్యార్థులను బాధ్యతా రహితు లుగా తయారుచేయడం వల్ల పరీక్షా ఫలితాల్లో డోల్ల తనానికి అంకురార్పణ జరిగింది అనే వాదనలో కూడా నిజం లేకపోలేదు.
విద్యార్థులు ఉపన్యాసకుల నిష్పత్తి ప్రకారంగా విద్యా లయాల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగడం ఆరోగ్య దాయకం, కానీ విద్యార్థుల సంఖ్య కన్నా ఉపన్యాసకుల సంఖ్య అధికంగాగల కళాశాల గురించి వాటి మనుగడ గురించి తీవ్రంగానే ఆలోచించాలి. ఎన్ని విధాల ఆలోచించినా పదోతరగతి ఉత్తీర్లైన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో గల అన్ని విధాల కళాశాల సంఖ్య ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో అడ్మిషన్ల లక్ష్యాలు ఉండాలి, తప్ప కళాశాలల సంఖ్య తక్కువగా గల కాలం నాటి అడ్మిషన్‌ లక్ష్యాలనే కొనసాగించడం సమంజసం కాదు. గ్రామీణ ప్రాంత కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నాలు విద్యార్థుల వసతులు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ‘అడ్మిషన్ల డ్రైవ్‌” జరగ టం అత్యవసరం ఆ దిశగా అధికారులు తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుందాం.

  • డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు
    సీనియర్‌ ఉపన్యాసకుడు.
    విద్యా విశ్లేషకులు, రచయిత.
    7729883223
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News