Sunday, December 8, 2024
Homeఓపన్ పేజ్Grama Panchayat development: గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థలో మార్పు వచ్చేదెలా?

Grama Panchayat development: గ్రామ పంచాయతీ పాలన వ్యవస్థలో మార్పు వచ్చేదెలా?

తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీలో ప్రజలందరికీ విప్లవత్మకమైన సుపరిపాలన అందించడానికి ప్రజల అభివృద్ధిలో మార్పు తలసరి ఆదాయాల పెరుగుదల గ్రామంలో ఉన్న వనరులను వ్యూహాత్మకంగా ప్రణాళికలతో ప్రజలకు వివరించి గ్రామపంచాయతీ పరిధిలోని పాలనను నిర్ణయాలను ప్రజలలో చర్చించి గ్రామసభ నిర్వహించి గ్రామంలోని ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామానికి కేంద్రం రాష్ట్ర స్థానిక సంస్థ ప్రభుత్వాల నుండి వివిధ రకాలుగా వచ్చే నిధులు ప్రత్యేక గ్రాంట్లు ప్రజలు చెల్లించే వివిధ రకాల పన్నులను వారి ప్రయోజనాల ఆర్థిక ఆదా య మార్గాలు పెరుగుదల కోసం ప్రతి రూపాయి ఖర్చుని ప్రజల కోసం అనేక రకాల సౌకర్యాలను వారి గ్రామాలలో పారదర్శకత పాటించి పాలనపరమైన ఖర్చుల విషయంలో జవాబుదారితనంతో ప్రజలకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విధానాలను పాలన వ్యవస్థను ప్రతిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో 12,996 గ్రామ పంచాయతీలు, 1,14,620 వార్డులు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ జనాభా 25,172,000 జనాభా ఉంది. అయితే భారత దేశం రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో గ్రామపంచా యతీ జాబితా ఉంది. అందులో 29 అధికారాలు విధులను నిర్వహించేలా పాలనపరమైన అధికారాలను పొందుపరిచారు. 243 ఏ నుండి 243ఓ వరకు ఈ నిబంధనలు పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలు స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 2018 పంచాయతీరాజ్‌ చట్టంలో 18 అధికారులతో పాటు 29 అధికరణలను అమలు చేయాలి. మరి స్థానిక ప్రభుత్వాల పాలన ఎందుకు నిర్వీర్యం అవుతుంది. గ్రామాలలో ప్రజలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు. ఆధునిక గ్రామాలే దేశానికి ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలు, గ్రామ స్వరాజ్‌ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి స్థానిక ప్రజల రాజకీయ ప్రజాస్వామ్యం తప్పనిసరి అంటారు. గ్రామీణ ప్రజల్లో నిరక్షరాస్యత వల్ల ప్రజల భాగస్వామ్యం లేకపోవడం గ్రామీణ వ్యవస్థ నిర్వీ ర్యం అవడం గ్రామసభలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు ప్రజలు చురుగ్గా పాల్గొనకపోవడం వలన స్థానిక ప్రభు త్వాల అధికార విధులు నిధులు సరైన ప్రణాళిక బద్దంగా ఖర్చు చేయక పోవడం అనేక పాలనపరమైన అవగాహన రహితమైన చర్యల, వివిధ రకాల కారణాల వల్ల గ్రామాల అభివృద్ధి చెందడం లేదు. అందువల్లనే భారతదేశం అయినా తెలంగాణ రాష్ట్రం అయినా ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదు. గ్రామీణ ప్రజల ఆదాయాలు ఆర్థిక వనరులను మానవ వనరులను నాణ్యమైన మంచి ప్రమాణాల విద్య, మెరుగైన వైద్య ఆరోగ్యం, ఉపాధి మార్గాలు, పేదరిక నిర్మూలన పథకాలు, రోజువారి పారిశుధ్యం, చెత్త సేకరణ, చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణ, పర్యాటక రంగాల్లో అభివృద్ధి గ్రామీణ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభి వృద్ధి వ్యూహాత్మక కమిటీలు గ్రామీణ వ్యవస్థను పటిష్టమైన సుపరిపాలన అందించినప్పుడు పారదర్శకత పెరిగి ప్రజల్లో అవగాహన మంచి మార్పు వస్తుంది. స్థానిక ప్రభుత్వాలకు పరిపాలనకు రాజ్యాంగం కల్పించిన గ్రామీ ణ అభి వృద్ధి నిధులను ప్రజల ఆదాయ మార్గాలను పెంచ డానికి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల పన్నులను వెచ్చించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేయాలి. గ్రామీణ వర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాలు, వ్యూహాలను అర్థం చేసుకోవడం గ్రామ ప్రజలు మరియు ఐక్యత సమూహ అభివృద్ధి లక్ష్యం వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వివిధ రకాల వ్యూహాలను కమిటీలను వేసుకొని ఆ గ్రామంలో ఉన్న ఆర్థిక వనరులను, మానవ వనరులను, ప్రకృతి వనరులను అందుబాటులోకి తీసుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలి గ్రామీణ సమాజంలో అభివృద్ధి చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మంచి ప్రమాణాల విద్య, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతితో కూడిన వ్యవసాయం, సూపరిపాలన, గ్రామసభల నిర్వ హణ, రైతు వేదికలను రైతులను తాము వారు పండించే పంటల గురించి, సేంద్రియ వ్యవసాయం, రోజువారి వాడే బయోగ్యాస్‌ ఎరువులు వ్యర్థ పదార్థాల ద్వారా ఎరువుల వినియోగం లాంటి అంశాలను వ్యవ సాయ విస్తరణ అధికారులతో సలహాలు సూచనలు చేసి, మద్దతు ధర కలిగిన పంటలను వేసేలా గ్రామ రైతు వేదిక లో రైతుల సమస్యలపైన వ్యవసాయంపైన చర్చలు జరపాలి. ప్రజలందరికీ సౌకర్యమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య, పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాలలో మెరుగుదలలు జరిగినప్పుడు గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు పొందగలుగుతారు. మహాత్మ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల ఉపాధి పనులను ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడం ఇంకా ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ఏజెన్సీలచే విధానాలు, వ్యూహాలు రూపొందించబడినప్పుడు గ్రామీణ ప్రజలలో అవగాహన పెంపొందించడం, ఈ చర్యలు, విధానాలు ప్రయోజనాలను సముచిత పద్ధతిలో పొందడంలో వారికి సహాయం చేయడం, అవగాహన కల్పించడం చాలా అవసరం. గ్రా మీణ సమాజాల సమగ్ర అభివృద్ధి ఇది బహుళ డైమెన్షనల్‌ నివేదికను తయారు చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలి. ప్రజల పనులను అభివృద్ధికి వినియోగించాలి మరియు సమగ్రమైన సహజ వనరుల మానవ వనరులు ఆర్థిక వనరులను ప్రణాళిక బద్ధమైన భావన అనేక అం శాలు పరిగణలోకి తీసుకుంటూ వీటిలో వ్యవసాయం మరియు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతో వ్యవసాయాన్ని అధిక దిగుబడును ఇచ్చే పంటలను పం డించడం వల్ల ఆదాయ మార్గాలు పెరిగి గ్రామాల్లో ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి, వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే కార్యకలాపాలు గ్రామ మరియు కుటీర పరిశ్రమ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విద్యా విధానం శిక్షణ కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య సౌకర్యాలు, పర్యావరణ పరిస్థితులు వివిధ రకాల చెట్లును పెంచే విధానాలు, పక్కా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ శిక్షణ, కంప్యూటర్‌ శిక్షణ నైపుణ్యాల ద్వారా అభివృద్ధి అవకాశాలు. వ్యక్తులు పరిపాలన, నిర్వహణ పద్ధతులు ఉపాధి అవకాశాలు, మానవ వనరులు అభివృద్ధి వ్యక్తులు ప్రోత్సహించే అంశాలపై పరి శోధనలు చేయాలి. గ్రామీణ వర్గాల వెనుకబాటుతను అయినప్పుడు వారిని పరిగణలకు తీసుకోవడం చాలా అవసరంపైన పేర్కొన్న అన్ని అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలు, విధానాలు, కార్యక్రమాల అంశాలను గ్రామీణ సమాజాలలో వ్యక్తుల పేదరికం యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా వరకు నిరక్షరాస్యత, నిరుద్యోగం ఉన్నందు వల్ల ఈ చర్యలు, విధానాలు కూడా అవసరం. ఈ సమస్యలపై ఉపశమనంపై దృష్టి పెట్టాలి. స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ పెట్టి ఉపాధి కల్పన చేయాలి. వృత్తి నైపుణ్యాలు మెరుగుదలకు ఉపాధి మార్కులు చూస్తాయి. గ్రామీణ అభివృద్ధి లక్ష్యాల ప్రాంతాలు గ్రామీణాభివృద్ధి విధానాలు వ్యూహాలపై అవగాహన పొందినప్పుడే అందులో ఉన్న గ్రామీణ వర్గాల్లోని ప్రాంతాలపై సమర్థవంతమైన అవగాహనను పొందడం చాలా అవసరం. వెనుకబడిన, అభివృద్ధి చెందిన రాష్ట్రంలో దీనిని మెరుగుపరచాలి. వ్యక్తులు ఉన్నప్పుడు వ్యూహాలు విధానాలు అమలులో పాల్గొంటారు.

- Advertisement -

1. ఆర్థిక సామర్థ్యాలు మెరుగుదల.

2 మానవ సామర్ధ్యాల మెరుగుదల

3. రక్షణ సామర్ధ్యాల మెరుగుదల

4. రాజకీయ సామర్థ్యాల మెరుగుదలో

5. స్థానిక ప్రభుత్వాల పరిపాలన సామర్ధ్యాలు మెరుగుదల.
గ్రామీణ అభివృద్ధి విధానాల భాగాలు ఆధునిక సాంకేతికత గ్రామీణ అభివృద్ధిలో సాంకేతికతను ఉపయోగించుకోవడం గ్రామీణ ప్రజలు సాంకేతికత ప్రాముఖ్యతను గుర్తించారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవడం ద్వారా వారి పనులు, కార్యకలాపాలను నిర్వహించేలా చేస్తుంది. ప్రస్తుతం ఉనికి వారి వ్యవసాయ రంగాలలో సేంద్రియ వ్యవసాయం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయ సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వస్తువుల ఉత్పత్తి మరియు తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించ డంతో పాటు పనులు కార్యకలాపాల అమలు వ్యక్తులు కూడా దాని రూపంలో ఉపయోగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు వారి జ్ఞానం, సమాచారాన్ని పెంపొందించుకోవడానికి పెద్దలు వ్యక్తులు, గృహ నిర్మాతలు సాధారణంగా విశ్రాంతి, వినోద ప్రయోజనాల కోసం దీనిని ఉప యోగిస్తున్నారు. అవస్థాపన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అందరు భాగం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్ల రవాణా కమ్యూనికేషన్లు విద్యుత్‌ సరఫరా మంచినీటి తాగు నీటి సరఫరా ప్రజా సేవలు ప్రసారం, కమ్యూనికేషన్స్‌ గ్రామీణ గృహా లలో వ్యక్తుల కొరతను అనుభవిస్తున్నారు. విద్యుత్‌ సర ఫరా, నీటి సరఫరా వారి బావిలో లేదా నీటి నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది స్మశాన వాటికలో నిర్వహణ స్నానానికి అవసరమైన నీటి సదుపాయాలు ఏర్పాటు వార సంతలు ఏర్పాటు సంతలో ఘనంగా నిర్వహించడం, అనేక రకాల వస్తువుల అమ్మకాలు కొనుగోలుకు సౌకర్యాలను ప్రజలకు కల్పించడం, గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం, రవాణా విధానాలు పరిస్థితులు బాగా లేవు కావున వీటిని ప్రజల సమూహంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలి. విద్య పునాది వేసే ప్రధాన సాధనంగా పరిగణించబడుతుంది ప్రజలకు అన్ని రంగాలలో పురోగతికి దారి తీయడానికి వారి మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి గ్రామీణ సమాజాలు విద్యా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన స్థితిలో లేదు. పాఠశాలలో బోధనా భ్యాసాల పద్ధతులు నూతన ఆధునిక బోధన వ్యూహాలు ప్రతిభవంతంగా ఆచరణలో లేవు. మౌలిక సదుపాయాలు సౌకర్యాలు ఇతర సౌకర్యాల కొరత మరియు అర్హత కొరత ఉంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వీధిలో మెరుగులు దిద్దే చర్యలు రూపొందించాలి ఈ అంశాలు పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరుగుదలను ఉంటుంది. వారి విద్య విద్యార్థులలో నైపుణ్యం, సామర్ధ్యాలను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది తద్వారా వారి జీవన పరిస్థితులు సమూచితమైన పద్ధతిలో కొనసాగించడానికి పనులు, కార్యకలాపాలు అమలు చేయాలి. గ్రామీణ ప్రాంత ప్రజలలో విధానాలలో మార్పు లు మరియు పరివర్తనలో మార్పులు ప్రజల జీవితాలలో ఇంక్లూజివ్‌ గ్రోత్‌ రావడం ప్రజల ఆలోచనలను మార్చడంలో సమర్థవంతమైన సహకారాన్ని అందించడం. ముఖ్యమైన రంగాలలో విద్య శిక్షణ కార్యక్రమాలు ఆధునిక, వినూత్న పద్ధతిలో నిర్వహణ, పరిపాలన, గృహ ఈ విధానాల అమలులోకి వచ్చినప్పుడు అది కూడా అవసరం. అవి వేగవంతమైన పద్ధతిలో కావాల్సిన ఫలితాలను ఉత్పత్తి చేసేలా వృద్ధి వేగవంతం చేస్తాయి. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలంటే ఆ గ్రామంలో ప్రజలందరినీ వివిధ కమిటీలలో ప్రజల సమక్షంలో భాగస్వామ్యం చేయాలి. గ్రామంలో ఉన్న ప్రజల వివాదాలు పరిష్కరించడానికి రోజువారి పాలనలో ప్రధాన పాత్ర పోషించాలి. ప్రతి గ్రామంలో ప్రతి కమిటీలు 10 నుంచి 15 మంది గ్రామస్తులను కమిటీలలో ఏర్పాటు చేయాలి. వారికి ఉన్న అవగాహన అంశంపైన కమిటీలో చేర్పించాలి.
గ్రామీణ అభివృద్ధి కమిటీలు విధులు

  1. విద్యా కమిటీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళా శాల నిర్వహణ చూసుకుంటుంది మాజీ టీచర్లు మేధా వులు విద్యావేత్తలు సామాజిక వేత్తలు అవగాహన కలిగిన వ్యక్తులు కమిటీలు ఉండాలి. ప్రతిరోజు స్కూల్లో కాలేజీల్లో విద్యార్థులపై పరివేక్షణ చేయడం, విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు సలహాలు చేయరు.
  2. ఆరోగ్య కమిటీ ఆరోగ్య సిబ్బంది ద్వారా అవగా హన తరచూ నిర్వహించడం ఆరోగ్య పరిరక్షణ సీజనల్‌ వ్యాధులు నివారణ, కుటుంబనియంత్రణ గురించి ప్రజ లకి అవగాహన కల్పించడం ఈ కమిటీ మదర్స్‌ కమిటీ.
  3. స్థానిక అంగన్‌ వాడీ కార్యకర్తలు తరచు గ్రామా న్ని సందర్శించి గ్రామంలోని పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మహిళ లకు వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్యం తనిఖీలు చేయడం ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పని చేయడం మరియు తల్లుల సంరక్షణను చర్యలు తీసుకుంటుంది.
  4. వ్యవసాయ కమిటీ వ్యవసాయ రంగంలో ముఖ్య మైన సలహాలు సూచనలు చేయడం. రైతు వేదికలను చర్చలు జరపడం అధిక దిగుబడి నిచ్చే పంటల పట్ల రైతులకు అవగాహన కల్పించడం పండ్ల చెట్లు, పూల తోటలను పెంచేలా చర్యలు చేపట్టడం, రైతులకు సమస్యలను పరిష్కారం చేయడం.
  5. రుణ రికవరీ కమిటీ రైతులకు ప్రభుత్వం బ్యాంకుల రుణాలు సహకార సకాలంలో చెల్లించాలని మళ్ళీ బ్యాంకులకు చెల్లించేలా చూడాలి.
  6. డ్రింకింగ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ నీటి కుళాయిలు చుట్టూ నీటి సరఫరా పరిశుభ్రత మరియు గురించి నీటి పరిశుభ్రత గురించి జాగ్రత్త వహించడం.
  7. మద్యపానం నిషేధ కమిటీ గ్రామంలో అక్రమ మద్య విక్రయాల అరికట్టడంతో పాటు ఇతర గ్రామాల నుండి గ్రామాల్లోకి మధ్య అక్రమ రవాణాను జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం.
  8. గ్రంథాలయ కమిటీ గ్రామంలో ఉన్న విద్యార్థులు ఉద్యోగులు మేధావులకు వివిధ రకాల పుస్తకాల విజ్ఞా నాన్ని అందించడం. గ్రామంలోని ప్రజలందరినీ అక్షరాస్య తను అందించే కార్యక్రమాలు గ్రంధాలయ వినియోగం పుస్తకాల సేకరణ చేయాలి. గ్రామంలోని అందరినీ విజ్ఞాన వంతులుగా చేయడం గ్రంథాలయంలో ఫ్రీ వైఫై ఇంటర్నెట్‌ సదుపాయాలు ఆన్లైన్‌ క్లాసెస్‌ ద్వారా నిరుద్యోగులకి, సీని యర్‌ సిటిజన్స్‌కి గ్రంథాలయం అన్ని మౌలిక సదుపాలతో అందుబాటులో ఉంచడం.
  9. గ్రామంలో వివిధ రకాల చెట్ల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసి వివిధ రకాల చెట్లను పెంచడం పూల చెట్లను పండ్ల చెట్లను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మరియు పర్యావరణ కమిటీ ద్వారా గ్రామంలో చెట్టు నాటడం, పర్యాటక రంగంలో పచ్చదనం ఉండేలా చేయడం.
  10. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు మహిళలకు ఆర్థిక సహాయంగా పొదుపు కార్యక్రమాలను సహకారాన్ని మహిళా సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రుణాలు అందించి నైపు ణ్యత శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టి వారికి ఆర్థికంగా ఆదాయ మార్గాలను చూపించడం యూత్‌ అభివృద్ధి కమిటీ, చిల్డ్రన్స్‌ అభివృద్ధి కమిటీ
  11. గ్రామ పరిశుభ్రత కమిటీ గ్రామంలో ప్రజల్లో ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం పట్ల అవగా హన పెంపొందించాలి పరిశుద్ధ కమిటీ ఏర్పాటు చేసి గృహ పరిశుద్ధ్యం వ్యక్తిగత పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్మాణం మరియు వినియోగం క్లోరినేషన్‌ జరిపి నీటి వాడకం వంటి అంశాలు ప్రచారం చేసి ప్రజలు వాటిని పాటించే విధంగా చేయాలి. మురికి నీరును రోడ్ల పైన వదులుటపై నిషేధిం చడం, దోమలను నిర్మించడానికి క్రిమి సంహారక మందు లను పిచికారి చేయించడం.
  12. దేవాదాయ అభివృద్ధి కమిటీ గ్రామంలో ఉన్న దేవాలయాలను ధూపదీప నైవేద్యాలను దేవాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆధ్యాత్మికత అని భావనను కల్పిం చి దేవాలయాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిం చడం.
  13. గ్రామం అభివృద్ధిలోకి తెచ్చి ఆధునిక గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే కమిటీ
  14. మహిళ సాధికారిత కమిటీ గ్రామంలోని మహిళలందరూ స్వయం సమృద్ధిని పెంపొందించుకునే ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలి మహిళా సాధి కారత కోసం కావాల్సిన చర్చలను మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సమృద్ధిని సాధించాలి.
  15. ఆధునిక గ్రామంగా అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామంలో అవస్థాపన సౌకర్యాలను సిసి రోడ్డు నిర్మాణం విద్యుత్‌ నీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసి వివిధ మార్గాల ద్వారా అదాయాలను పొందే విధంగా మౌలిక సదు పాయాల సూచన కమిటీ ఏర్పాటు చేయాలి.
  16. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విధానాల గురించి సమాచారాన్ని తెలియజేసే కమిటీ
  17. గ్రామ పంచాయతీ సుపరిపాలన పర్యవేక్షణ కమిటీ పైన గ్రామ ప్రజలను ఈ కమిటీలలో చేర్పించడం ద్వారా ముఖ్యమైన సమస్యల పైన పరిష్కార మార్గాలను చూపించి ప్రజలందరికీ సుపరిపాలన అందించడం సులభతరం అవుతుంది, నిధుల వినియోగం జరిగి అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీల మారుతాయి.
  • తాళ్ల పెళ్లి కుమారస్వామి
    7702348954
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News