Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Gunturu Seshendra Sarma: యుగానికొక్కడు

Gunturu Seshendra Sarma: యుగానికొక్కడు

గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగరమే!
గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగ రమే!
అన్నట్లు శేషేంద్రకు సాటి శేషేంద్రే! మరి యొకరు సరికారు. అతడొక యుగకవి! యుగద్రష్ట! అం దువల్ల అతని గురించి కానీ అతని సాహిత్యం గురించి కానీ, ముఖ్యంగా వారి ’కవిసేనఫెస్టో’ గురించికానీ మాట్లా డం ఒక సాహసమే అవుతుంది. ఇక శేషేంద్రను లోకానికి పరిచయం చేయడమన్నా అంతే! ఒక చిట్టి దీపం వెలుగు ల్లో సూర్యుని చూపినట్లూ, ఒక గజం బద్దతో సముద్రాన్ని కొలువ జూచినట్లా అవుతుందది.
అందువల్ల శేషేంద్ర మాటల్లోనే చెప్పాలంటే- ‘వేదం మొదటి కవిత్వం’ ‘ఉపనిషత్తులు వచన కవితలు. ఇతిహాస పురాణాదులు బుర్రకథల్లాంటి లోక ప్రియకవితలు’ ‘ప్రాచీ న కవిత్వం శోకంలోనుంచి వస్తే, ఆధునిక కవిత్వం క్రోధం లో నుంచి వస్తుంది’. ‘అక్షరాల ఇసుకతో కవిత కట్టలేరు. జీవన మధూళితో తడపాలి ‘కవి ఒక్కడే మానవ సమాజా నికి ఏకైక నాయకుడు’ అన్న వాక్యాలు మామూలు మాట లు కావు. ఏ దివ్యలోకాల్లోంచో దిగివచ్చిన తేజఃపుంజాల్లా కనిపిస్తాయే తప్ప, ఏ మానవ మాత్రుడో గండూషించిన పడికట్టు మాటల్లా ఉండవు.
ఇవి శేషేంద్ర ‘కవిసేన మేనిఫెస్టో’లోనివని ప్రత్యేకం గా చెప్పనక్కరలేదనుకుంటాను. అందుకే, ఇవి ఒక మహ ర్షి తన సమాధి స్థితిలో దర్శించుకొన్న దర్శనాల్లా ఉంటా యి. అత్యద్భుతంగా ఉంటాయి. సాహితీసాగర మథనం లోంచి ఉద్భవించిన అమృతకలశంలోంచి నాల్కపై జారి పడే మధుబిందువుల్లా ఉంటాయి. నిజమే! కవిసేన మేని ఫెస్టో మనపాలిటి అమృతకలశమే.
ఇలాంటి మాటలు ’కవిసేనమేనిఫెస్టో’లో కోకొల్లలు. కవిసేన నిర్మాతా ‘కవిసేన మేనిఫెస్టో’ని ఒక్కరే! అది కవీం ద్రులు శేషేంద్రులే! కాలక్రమంలో ‘కవిసేన’ చెల్లాచెదరై పోయింది. నిజానికిప్పుడు శేషేంద్ర అభిమానులంతా కవి సేన సభ్యులే! మబ్బుల్లో పిడుగుల్ని దాచుకొన్న వీరులే! అందువల్ల దానికి క్షతిలేదు; దినదినాభివృద్ధితప్ప. ఒక రామసేతువులా నేడు కవిసేన మేనిఫెస్టో నిలిచిపోయింది, సరిహద్దుల్ని చెరిపేస్తూ! కాలానికి ఎదురీదుతూ!….. ‘నైష ధం’ వలె నేటి కవి పండితులకిది ఒక దివ్వౌషధం!
స్వయంగా కవే ప్రకటించినట్లు, ఇదొక వైజ్ఞానిక ఉద్య మం. ఒక ఆధునిక కావ్యశాస్త్రమే. ఇలా, ఒక కవియే కావ్యశాస్త్రం రచించడం అత్యంత విశేషం. దీంతో ఇతడు అమరుడై, కవిపండితుల తలల్లో, ఆలంకారికుల తలల్లో ఒక అలంకారమైపోయాడు. ఒక్క మాటలో ఇలాంటి పుస్తకం ‘న భూతో న భవిష్యతి’.
ఈ కావ్యశాస్త్రాన్ని చదవకుండా, కవితా రచనకి పూనుకోవడం ఒక దుస్సాహసమే అవుతుంది. ఇతి 1977 ఆగష్టులో ప్రథమ ముద్రణకు నోచుకొంది. ఆపై హిందీ లోకి, ఆంగ్లంలోకి అనువదించబడి ప్రపంచవ్యాప్తమై పోయింది.
ఇది ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్రమనీ, ఇది అపూర్వ చైతన్య వ్యాప్తికోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవి ర్భవించిందనీ, ఇది ప్రాచీన ప్రాక్‌, పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్య తత్త్వచింతన, మార్క్పిస్టు కావ్య తత్త్వ చింతన అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీ లించి, వాటిల్లోని అభిన్నతనూ, ఐకమత్యాన్నీ ప్రతిపాది స్తుందనీ ఈ పుస్తకం అట్టచివర (‘వైజ్ఞానిక ఉద్యమం కవిసేన’) ప్రకటించారు.
ఏదికవిత్వమో, ఏదికాదో విడమరచి చెబుతూ, ప్రతిభా, వ్యుత్పన్నతా, శిల్పం, సాహిత్య సాంఘిక స్పృ హలూ, సాహిత్య ప్రయోజనం, కమిట్మెంటూ, కవిబాధ్యత మొదలైన అనేకానేక విషయాలను కూలంకషంగా చర్చిం చి, నిగ్గుదేల్చుతుందిది. ఒక్కమాటలో చమత్కారమే కవిత్వ మని తేల్చిచెబుతుందిది.
ఈయన భారతీయ ఋషుల్నీ ప్రాక్‌, పశ్చిమ తత్త్వ వేత్తల్నీ, ఆలంకారికుల్నీ కలిపి, ఒకేవేదికపై కూర్చోబెడ తాడు. వాళ్ళని వాగ్వివాదంలోకి దింపుతాడు. తాను మహేంద్రునిలా సాహిత్య వజ్రాయుధపాణియై వాళ్ళ ఆలోచనల సారమైన సోమరసాన్ని దోసిళ్ళతో గ్రోలుతాడు. మనకీ వడ్డిస్తాడు. అవును అంతటి ఘటికుడీతడు. కవిత్వా నికి వీరిచ్చిన అపూర్వమైన నిర్వచనాన్ని చూడండి! ‘తక్షణ మరణాన్ని, పునర్జన్మనీ ‘ప్రసాదించేదే కవిత్వం’!
ఇలాంటి ఆలోచనాత్మకమైన, శక్తివంతమైన నిర్వ చనం మరోచోట మనకెక్కడా కనిపించదు; పుస్తకాల గుట్ట ల్లో తలముంచితీసినా!. కవిత్వనామక కళోపాసనలో ఋషి కవి. దేవత జగత్తు. బీజము బాధ, శక్తి రసము, కీలకం వైచిత్రి. వినియోగం విశ్వశ్రేయస్సు అన్న విశ్లేషణకూడా! దీంతో కవిత్వాన్ని వేదమంత్రాల ప్రక్కన, ఉన్నతాసనంపై కూర్చోబెట్టడమయింది. అంతేకాదు. కవితారచనా ప్రక్రి య ఒక పవిత్ర యజ్ఞసమమైపోయింది.
అందుకేనేమో- ‘పద్యం ఒక దేవాలయం! అందులోకి ప్రవేశించాలంటే శబ్దాలూ, భావాలూ, చివరకు దేవుడు కూడా, శుభ్రంగా స్నానంచేసి, మడికట్టుకొని ప్రవేశించాలి’ ఆనంటాడు. అనగా ఒక్క శరీరాన్నే కాదు, దశేంద్రియాల్నీ, అత్మనీ పరిశుభ్రపరచుకోవాలన్నది దీని అర్థం.
ఇక కవి గురించీ, కవిత్వం గురించీ వీరు చెప్పిన విష యాల్ని సంక్షిప్తంగా చెప్పాలంటే- ‘కవిత్వమంటే అర్థవై చిత్రి. భావవైచిత్రి. కవిత్వం ఒక జీవన విధానమేకానీ, బ్రతుకు తెరువుకాదు. కవి నడుస్తున్న వర్తమాన మనవతా సంక్షిప్త శబ్దచిత్రం. వర్తమాన కవులు కవిత్వపు కల్తీలేని స్వచ్ఛమైన వచనం రాస్తున్నారు’. అన్న వాక్యాల్ని ఉటం కించాల్సి వస్తుంది.
ఇంకాస్త వివరించాలంటే-
‘గత వెయ్యేళ్ళ తెలుగుకవిత్వం వాచ్యార్థ ప్రధానమైన ఛందోబద్ధ వచన యుగం, ‘ఇంగ్లీషులో సమస్త ఆధునిక కాలమూ ఉంది. సంస్కృతంలో సమస్త ప్రాచీన కాలమూ ఉంది. ఈ రెంటినీ కలిపి, దేశకాల అవిచ్ఛిన్న మానవ సర్వస్వాన్ని దర్శించుకోవాలి జ్ఞాని అయిన కవి.
కవికి ప్రతిభావ్యుత్పత్తులు కావాలి. కమిట్మెంటు కావాలి. అతడు జీవితమంతా ఒక తపస్సు చేయాలి. సమా ధి స్థితిలో దర్శించి లిఖించాలి అనంటాడు.
‘ప్రతిభ యనగా సర్వజీవరాసుల్లో ఉన్న చైతన్యమనీ
’వ్యుత్పత్తి’ యనగా ఛందస్సు, వ్యాకరణం, చతుష్షష్టి కళలు, లోకజ్ఞత, న్యాయవైశేషికాది పదార్థశాస్త్ర విజ్ఞా నమూ, వీటి మూలకణాంగా సిద్ధించిన యుక్తాయుక్త వివే కరూప ఔచిత్యస్పృహా ఇవన్నీ కలిసి వ్యుత్పత్తి అవుతుందనీ, ‘కమిట్మెంటు’ అంటే లోకం కోసం శోకం అనీ, అంటే’ అధర్మ వ్యతిరేకత యనీ ‘తపస్సు’ ఒక ఆత్మదండనమనీ అంటాడు.
ఆపై వర్గచైతన్యం సామాజిక చైతన్యం అభ్యుదయ దృక్పథం, ఆత్మాశ్రయ కవిత్వం. మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తూ-
ధర్మాధర్మ పక్ష విచక్షణా జ్ఞానమే వర్గచైతన్యమనీ సామాజిక చైతన్యం కన్నా సాహిత్య చైతన్యం గొప్పదనీ, సాహిత్య స్పృహలేని వాడొక న్యూస్‌ పేపర్‌ బాయ్‌ అనీ సాహిత్య చైతన్యం ఒక విరాట్‌ స్వరూపమైతే, రాజకీయ చైతన్యం దాని వెంట్రుక ముక్కనీ, శ్రమించే రంగాల్లో, రమించే రంగాల్లో సర్వతా స్త్రీపురుషులు సమానంగా స్థానం పంచుకోవాలన్నదే నిజమైన అభ్యుదయ సమాజం దృక్పథమనీ, పరాశ్రయాన్ని ఆత్మాశ్రయం చేసుకోవడంలో నుంచే కవిత పుడుతుందనీ, సబ్జెట్లో ఆబ్జెట్‌ లీనం కావడంలోనుంచే కవితపుడుతుందనీ, ఇదే ఆత్మ జగత్తులో, జగత్తు ఆత్మలో ఐక్యం కావడమనీ వివరిస్తాడు. భావాలన్నీ ఆత్మాశ్రయాలే కనక కవిత్వమంతా ఆత్మాశ్రయమేననీ, ఆత్మాశ్రయం కాకపోతే కవిత్వమే కాదు. కాబట్టి ఆత్మా శ్రయ కవిత్వమన్న మాట పునరుక్తి దోషభూయిష్టమనీ సెలవిస్తాడు.
ఇలాంటి అనేకానేక కావ్వ మర్మాల్ని అందించే మహాత్తర గ్రంథరాజమిది. వాటన్నిటినీ ఉటంకిస్తే ఇది మరియొక ఉద్గ్రంథమవుతుంది.
‘కవిసేన మేనిఫెస్టోపై వచ్చిన కొన్ని విమర్శలు.

- Advertisement -
  1. దీంట్లో చారిత్రక దృక్పథం లేదన్నాట్ట ఓ విర్శకుడు, ఐతే, ఇది చరిత్ర కాదుకదా? ఆపై కథకాదు, నవల కూడా కాదు. చివరకి కవిత్వమూ కాదు. అందువల్ల చారిత్రక దృక్పథం అక్కర్లేదు.
  2. ఇది ’కవిసేన’ కాదు – ’కపిసేన’ అన్నారట మరొకరు! ఇవన్నీ పడికట్టు మాటలే! నిజానికి ’కవిసేన’ శబ్దకల్పనకి మూలం లేదా ప్రేరణ రామాయణంలోని ’కపిసేన’ శబ్దమే కాదనలేం కానీ, ’కపి’యంటే కోతి. ఇది పై పొరలోని అర్థం. ఒక సామాన్యుడి అవగాహన ’కపి’ యంటే సూర్యుడు. ఇది లోపలిపొరలోని అర్థం. అందువల్ల ‘కవిసేన’ యనగా సూర్యుని సైన్యం. అనగా సూర్యకిర ణాలే! వాల్మీకి రామాయణంలోని ఈ సూర్యకిరణాలే (చీకటి వెలుగుల మధ్య) ఒక సేతువును నిర్మించాయి. రామయణం భారతాదులన్నీ ప్రతీకాత్మక కావ్యాలేకదా?… ఇలా శబ్దార్ధం, ప్రతీకాత్మకతా తెలియకుండా మాట్లాడితే మన అజ్ఞానమే బయలుపడుతుంది సుమా!
    ‘ఇది హైందవం. ఛాందనం విప్లవ ప్రతిఘాతకం’ అన్నది మరో విమర్శ. ఆ అన్నది కవియో, విమర్శకుడో, ఆస్తికుడో, నాస్తికుడో తెలీదు.
    ఈ కావ్యశాస్త్రం హైందవమెలా ఆపుతుంది? ఐనా అన్ని శాస్త్రాలకీ, కళలకీ మూలం మన హిందూ (సింధూ) దేశమేనన్నది మనం మరువకూడదు. ఐనా, శేషేంద్ర ఒక్క భారతీయ కార్యశాస్త్రాల్నే ఆధారం చేసుకొని వ్రాయలేదు కదా? మార్క్పిస్టు సాహిత్య శాస్త్రగ్రంథాలనీ, ప్రాచ్య, పాశ్చా త్య, కావ్యశాస్త్రాలలనీ శోధించి వ్రాశాడు. చివరి పుటల్లో ఇచ్చిన ’సంప్రదించిన గ్రంథాలజాబితా’ను వీరు బహుశా చూచి ఉండరు. చూస్తే అలా మాటాడి ఉండరు. ముక్తా యింపు: మనకు ’కవిసేనమేనిఫెస్టో’ని చదివే ఓపికా అర్థం చేసుకొనే ఓపికా, ఆచరించే ఔన్నత్యమూ లేవు. అందుకే మేకపోతు గాంభీర్యం’తో, అలా రాళ్ళని విసురుతూ పోతుంటాం!
    బురద చల్లుతూ పోతుంటాం! అంతే! రామాయణం భారత భాగవతాదులపై వేదాలపై రాళ్ళేసిన మహా మహులు దీని పై వేయరూ? మళ్లీ చెబుతున్నాను ఇలాంటి ఆధునిక కావ్యశాస్త్రం ‘నభూతో నభవిష్యతి’ శేషేంద్ర స్వ యంగా ఒక కవి. విమర్శకుడు. ఆపై పరిశోధకుడు. అంతే కాదు ఆధునిక కవిత్వానికి ఒక మార్గదర్శకుడు.
    అందువల్ల ఈర్ష్యాద్వేషాన్ని ప్రక్కనెట్టి ఈ పుస్తకం ద్వారా కావ్యమర్మాన్ని తెలుసుకుందాం! ఆచరిద్దాం! మన ల్ని మనం సరిదిద్దుకొందాం! ఒక నవ్య సాహిత్య జగత్తును నిర్మిద్దాం.
    గన్ను కృష్ణమూర్తి
    విద్వత్‌ కవి, సాహితీమూర్తులు

(30 శేషేంద్ర శర్మ 17వ వర్ధంతి )

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News