Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Hello happy new year: హలో..హ్యాపీ న్యూ ఇయర్

Hello happy new year: హలో..హ్యాపీ న్యూ ఇయర్

జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే

      కొత్త కొత్త ఆశలతో  కొత్త సంవత్సరం నిండుగా  తమ కోరికలు పండాలని అందరి కళ్ళు వేచి చూసే సందర్భం రానే వచ్చింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనటువంటి హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో జరుపుకోవడం సర్వసాధారణమైంది. తెల్లవారితే కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన  ప్రారంభమవుతుందనుకుంటున్న డిసెంబర్ 31చివరి రోజు నుండి ప్రధానంగా యువతతో పాటు అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసినదే… నూతన సంవత్సర పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యతగా  ఇది గతానికి మరియు భవిష్యత్తుకు మధ్య వారధిగా పనిచేస్తుందని  ఒక భావన. మనం అనుభవించిన జ్ఞాపకాలను, మనం నేర్చుకున్న పాఠాలను మరియు మనం పొందిన అభివృద్ధికీ ప్రతిబింబించేలా ఆహ్వానిస్తుందని, పాతదానికి వీడ్కోలు పలికి, కొత్త వాటిని హృదయపూర్వకంగా స్వీకరించే రోజు ఇది.
      నూతన సంవత్సర వేడుకల గురించి  ప్రామాణికంగా పరిశీలించినట్లయితే  వేడుక గా జరుపుకునే  సంప్రదాయం చరిత్రలో వివిధ సంస్కృతులు మరియు నాగరికతలను విస్తరించియున్నది. పురాతన నాగరికతలు ఖగోళ పరిశీలనలు మరియు కాలానుగుణ మార్పులు రోజు రోజుకి పరిస్థితులలో చెందుతున్న మానవీయ కోణం విజ్ఞాన, వైజ్ఞాన, ఆధునికరణ  ద్వారా కాలక్రమేణా పెను మార్పుల ఫలితంగా ప్రస్తుత తరుణంలో  నేడు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము. నాడు బాబిలోనియన్లు నూతన సంవత్సరాన్ని  పదకొండు రోజుల పండుగతో జరుపుకున్నారు, అయితే రోమన్లు వాస్తవానికి మార్చి నెల సంవత్సరం ప్రారంభంలో గుర్తించారు.

- Advertisement -

భారతదేశం జాతీయ క్యాలెండర్ విషయానికొస్తే  వాస్తవానికి గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తోంది. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తున్నారు. అమ‌రావ‌తి కేంద్రంగా పాలించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి ప‌ట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహ‌న శ‌కం ప్రారంభం అయ్యిందని భావిస్తుంటారు. తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠీ ప్ర‌జ‌లు ఈ కేలండర్ వాడ‌తారు. ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 78 నుంచి మొదలవుతుంది.శాలివాహన శకం క్యాలెండర్‌లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరం అయితే మార్చి 21వ తేదీన వస్తుంది. భారత ప్రభుత్వం 1957 మార్చి 22వ తేదీ నుంచి ఈ శాలివాహన శకం క్యాలెండర్‌ను అధికారికంగా పాటిస్తోంది. అప్పటి నుండి జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం  ప్రారంభంగా ప్రామాణీకరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యంలో  మనం చూసే గొప్ప వేడుకలకు దారితీసింది. నూతన సంవత్సర వేడుకల చారిత్రక పరిణామం, కొత్త ప్రారంభ అవకాశాలను స్వీకరించాలనే ఒక ఉత్సాహవంతమైన,  సహజమైన కోరికను ప్రతిబింబిస్తుంది.

      మన భారతదేశంతో పాటుగా వివిధ దేశాలలో ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రముఖంగా జరుపుకుంటారు. వివిధ దేశాలలో కొన్ని విషయాలను మనం గమనిస్తే …
        స్పెయిన్‌లో, రాబోయే పన్నెండు నెలలకు అదృష్టాన్ని తీసుకురావడానికి అర్ధరాత్రి సమయంలో 12 ద్రాక్షపండ్లను తినడం ఆచారం. బ్రెజిల్‌లో, తెల్లని దుస్తులు ధరించడం అనేది శాంతి మరియు పునరుద్ధరణకు ప్రతీకగా అక్కడ ఒక సాధారణ సంప్రదాయం.

        జపాన్‌లో, నూతన సంవత్సరాన్ని “జోయానోకనే” ఆచారంతో జరుపుకుంటారు, ఇక్కడ బౌద్ధ దేవాలయాలు గత సంవత్సరం పాపాలను శుద్ధి చేయడానికి 108 సార్లు తమ గంటలను మోగిస్తారు. అదే సమయంలో, ఆస్ట్రేలియాలో, సిడ్నీ హార్బర్ అత్యంత అద్భుతమైన బాణాసంచా ప్రదర్శనలను నిర్వహిస్తారు.

       యునైటెడ్ కింగ్‌డమ్‌లో, లండన్ యొక్క ప్రసిద్ధ బిగ్ బెన్ గడియారం అర్ధరాత్రి మోగుతుంది, ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాత్రిపూట ఆకాశం బాణసంచాతో వెలుగులమయం అవుతుంది.
మరియు వీధులు నవ్వులు మరియు ఆనందాల ధ్వనితో వేడుకలు జరుపుకొంటారు


నూతన సంవత్సరం తో పాటుగా జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే గా కూడా జరుపుకుంటారు.ఇది శాంతి మరియు భాగస్వామ్య దినంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ప్రతిఒక్కరికీ నివసించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడానికి భూమి ఒక గ్లోబల్ ఫ్యామిలీ అనే ఆలోచనను పరిగణించడం మరియు ప్రచారం చేయడం ద్వారా ఐక్యత మరియు శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడమే  లక్ష్యం.

లిండా గ్రోవర్ పాత్ర కీలకం

గ్లోబల్ ఫ్యామిలీ డే ఈ ఈరోజును 1997  సంవత్సరంలో  పిల్లలకు సంబంధించిన ఒక పుస్తకం నుండి వచ్చింది, అది శాంతిని వ్యక్తపరచడము  మాత్రమే మరియు యుద్ధం లేని రోజును ఒక కోణంలో  వర్ణించబడినది. ‘వన్ డే ఇన్ పీస్-జనవరి 1, 2000’ అనేది పుస్తకం యొక్క శీర్షిక. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1998లో ‘ప్రపంచంలోని పిల్లలలో శాంతి మరియు అహింసను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమం అంతర్జాతీయ దశాబ్దాన్ని’ ప్రామాణికంగా ఆమోదించబడినది. ఆ తర్వాత, దశాబ్దం మొదటి రోజున, గ్లోబల్ ఫ్యామిలీ డే స్థాపించబడింది. 
శాంతి కార్యకర్త అయిన లిండా గ్రోవర్ ఈ రోజును ప్రపంచం మొత్తం దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 1999లో, ఐక్యరాజ్యసమితి సభ్యులకు సంవత్సరంలో మొదటి రోజును గ్లోబల్ ఫ్యామిలీ డేగా అధికారికంగా జరుపుకోవడానికి ఆహ్వానం అందింది. 


                   కొంగ్రొత్త ఉత్సాహం.. అన్నీ శుభాలు జరగాలన్న కోరిక.. సమస్యలన్నీ తొలిగిపోతాయన్న విశ్వాసం.. మంచి జరుగుతుందనే  నమ్మకం.. అదృష్టం వరిస్తుందేమోనన్న ఆశ.. లక్ష్యాలు చేరుతామన్న ధీమా..  ప్రతి మనిషికీ ఇలా ఏదో ఒక రూపంలో ఆకాంక్షలు ఉండటం సహజమే.. గడిచిన ఏడాదిలోని తప్పులను నెమరేసుకుని, నూతన సంవత్సరానికి కొత్త ప్రణాళికలను వేసుకోవడం గత సంవత్సరం మనకు  విద్యార్థులకు తల్లిదండ్రులు కొత్త సంవత్సరం వచ్చే ముందు ఈ సంవత్సరంలో నువ్వు ఈ కార్యక్రమం చేస్తే నీకు   ఈ గిఫ్ట్ ఇస్తాను అని చెబుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం విద్యా పరంగా చూసినట్లైతే విద్యార్థులు అప్పట్లో కరోనా కారణంగా  కొంత వరకు నష్టపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకనగా  ఆన్లైన్ క్లాసులతోనే  ఆ సమయంలో గడిచిన  ఎక్కువ రోజులు  ఇప్పుడిప్పుడే ఒక దారిలో విద్యార్థులు  ముందుకు సాగుతున్నారనుకోవచ్చు.
     మరి అదే సమయంలో వ్యాపార రంగాల విషయానికి వస్తే ప్రతి వ్యాపారంలో కూడా ఎన్నో కష్టాలను అప్పట్లో ( కరోనా సమయంలో లాక్ డౌన్ పరిస్థితులు  ) ఎదుర్కొన్న   కారణంగా రకరకాలుగా వ్యాపార మార్కెట్ లు అన్నీ స్తంభించి పోవడం తర్వాత మెల్లి మెల్లిగా ఒక స్థాయికి
ప్రణాళికాబద్ధంగా  ముందుకు యధాస్థితిలోకి రావడం  సాగుతున్న ప్రయత్నాలు  మనందరికీ తెలిసినదే…. ఆశల మానవ జీవితంలో ఇంద్రధనస్సు లాంటి కోరికలు కలలు కంటున్న మానవాళికి రంగుల హరివిల్లులా  మారాలని కోరుకుందాం.


-డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రముఖ రచయిత, విమర్శకులు 
సెల్.9490841284

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News