Supreme Court Guidelines on Student Suicides: వికసిత భారతంలో దేశ వి ద్యారంగం మరింత సంక్షోభం లోకి వెళ్ళిపోతున్నది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో వ్యవస్థా గత సం స్కరణల అవసరాన్ని ఈ సంక్షోభం చాటి చెబుతున్నది. విశ్వవిద్యా లయ విద్య గురించి ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఈ మాటలను ధ్రువీకరిస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కొనసాగుతున్న ఒక కేసుకు సంబంధించి భారత సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తొమ్మిది ఆదేశాలను జారీ చేసింది.
విద్యార్థులకు బోధనలో నాణ్యమైన పెరుగుదల లేకుండా ప్రైవేటీక రణలో ఉన్నత విద్య విస్తరణకు సంబంధించి ఎటువంటి మేళ్లు జరుగుతాయో గుర్తించిన కోర్టు, ఆర్థిక, సామాజిక అన్యాయం, విద్యా సంబంధిత సమస్యలతో సహా విద్యా ర్థులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను కూడా ప్రస్తావన చేసింది. న్యాయస్థానం చేసిన తొమ్మిది ఆదేశాలలో ఏడు ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించినవే కావడాన్ని మనం గమనించాలి.
విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి రికార్డుల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్‌లో పట్టించుకోకుండా వదిలేసిన దిగువ కులాల విద్యార్థుల నివేదనలు, వాటి పర్యవేక్షణకు సంబంధించినవి. ఇంకొక రెండు ఆదేశాలు విశ్వవిద్యాలయాలలో ఖాళీలకు సంబంధించినవి. అనేక యూనివర్సిటీలలో రిజిస్ట్రా ర్లు వైస్-ఛాన్సలర్ల పోస్టులతో పాటు పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టులు ఖా ళీగా ఉన్నాయని, వాటన్నిటినీ భర్తీ చేయాలనే అంశం మీద ఉన్నాయి.
విద్యార్థుల శ్రేయస్సును ప ట్టించుకోని విశ్వ విద్యాలయాలు, విద్యార్థులు విశ్వవిద్యాలయా లకు రావాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న విషయం ఇక్కడ మనం గుర్తించాలి. ఇలా పల్లె నుం చి ఊరు దాకా, ఊరు నుంచి పట్ట ణం దాకా విద్యారంగంలో గెంటివేత ఎలా ఉంటుందో మనం ఊహిం చుకోవచ్చు.
దేశవ్యాప్తంగా, క్షేత్రస్థాయి నివేదికలు అనేక ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో 50% పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్నాయి. దీనికి మద్రాస్ విశ్వవిద్యాలయా న్ని ఒక ప్రముఖ ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ.
ఉన్నత విద్యలో ప్రవేశాల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. అంతేకాకుండా మహిళా విద్యలో అద్భుతమైన రికార్డు ఉన్న రాష్ట్రం కూడా అదే. ఇటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యా లయం, అనుబంధ కళాశాలల్లో పరీక్షల ద్వారా డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు నాణ్యమైన పరిశోధనకు ప్రసిద్ధి చెందింది. 1970ల చివరలో బోధన విషయంలో దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్‌గా మారింది. కానీ గత దశాబ్దంలో దాని క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది.
కొత్త అధ్యాపక నియామకాలు జరగలేదు. ఒకవేళ అపాయింట్ మెంట్స్ జరిగినా మంజూరైన దానికంటే సగం మాత్రమే నియామకా లు జరిపారు. ఇక విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం నామమా త్రంగా మాత్రమే పని చేస్తుందనే వాదన ఉంది. తత్వశాస్త్రం, వృక్ష శాస్త్రం, గణితం వంటి అధునాతన అధ్యయన కేంద్రాలను కలిగి ఉందని చెప్పుకుంటుంది కానీ అవి వాటి అసలు స్వరూపానికి నీడలా మాత్రమే ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా సామాజిక, మానవీయ, విజ్ఞాన శాస్త్రాలు చదివే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడమే కాదు, అందులో పరిశోధనలు మరింతగా కుచిం చుకుపోయాయి. నిజానికి, ఈ శాస్త్రాలలో అధ్యయనం మెండుగా ఉన్న రోజుల్లోనే సమాజం కాస్త మెరుగుగా ఉంది.
1970 తర్వాత విద్యా విధాన నిర్ణేతలుగా ఉన్నవాళ్ళు ఆ శాస్త్రాల మీద కక్షపూరితంగా వ్యవహరించి, ఆయా కోర్సుల అస్తిత్వం మీద భారీగా దెబ్బ కొట్టారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో మొండి వైఖరితో వ్యవహరించిన గవర్నర్ కారణంగా విశ్వవిద్యాలయాలలో వైస్-ఛాన్సలర్ నియామకాలు నిలిచిపోయాయి. గవర్నర్ అధికారాలపై రాష్ట్రపతి చేసిన ప్రస్తావనపై కోర్టు సృష్టించిన అస్పష్టత అలాగే ఉండగా, వైస్-ఛాన్సలర్ ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి ఎటువంటి సూచనలూ చేయకపోవడం కూడా విచారకరం. అధ్యాపక పోస్టుల భర్తీ కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రక్రియను అనుసరిం చాల్సి ఉంటుంది. దీనికి కనీసం ఆ రు నెలల సమయం పడుతుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ మ ద్దతుతో సహాయపడగల బడ్జెట్ కేటాయింపు అవసరం పడుతుంది.
దీనికి తోడు అధ్యాపకుల నియామ కంలో అవినీతిది ఒక పెద్ద పాత్ర. రాజకీయ-సైద్ధాంతిక నియామకాలు అధ్యాపకులలోని క్వాలిటీని ప్రభావితం చేస్తాయి. ఇది కూడా మరొక పెద్ద సమస్య. ఇటువంటి అనేక గండాలను దాటి ఒక మంచి లెక్చరర్ యూనివర్సిటీ ప్రాంగణం లోకి వస్తాడా లేదా అన్నది మరొక పెద్ద ప్రశ్న. ఇటువంటి అనేక అంశాలలోకి న్యాయస్థానాలు దృష్టి సారించాల్సిన అవసరం, పరిష్క రించాల్సిన అవసరం ఉంది.
కోర్టు నిర్దేశించిన నాలుగు నెలల కాలపరిమితిలో ఇవి సాధ్య మవుతాయా? వికసిత భారత్ సూచించిన లక్ష్యాలను నిజం చేస్తా యా? అసలు ఈ కోరిక కలగడానికి ముందు, పటిష్ట మైన ప్రభుత్వ ఉన్నత విద్యా వ్యవస్థ ఉన్నదా? ప్రజలందరి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఉన్నత విద్యా లక్ష్యాలు ఉన్నాయా? అంటే ఈ ప్రశ్నలకు జవాబు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. వికసిత భారతంలో విద్యారంగం సంక్షోభం ఎటువంటి భవిష్యత్తును వాగ్దానం చేస్తుందో ఊహించుకుంటే భయమేస్తుంది.
డా. నూకతోటి రవికుమార్
(కవి, న్యాయవాది)

