Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్History under correction: దేశ చరిత్రకు దిద్దుబాట్లు

History under correction: దేశ చరిత్రకు దిద్దుబాట్లు

దేశ చరిత్రను వీలైనంతగా వక్రీకరించడం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడమన్నది అసాధ్యాల్లోకెల్లా అసాధ్యంగా మారిపోయింది. చరిత్ర గ్రంథాలనే కాకుండా, పాఠ్యపుస్తకాలలోని చరిత్రకు సంబంధిం చిన అంశాలను కూడా మార్చేయడం జరిగింది. ముఖ్యంగా మొఘలులు, దేశ స్వాతంత్య్ర పోరాటా నికి సంబంధించి కాంగ్రెస్‌ పాలకులు తమకు అనుకూలమైన విధంగా చరిత్రను మార్చేసిన సంగతి అందరి కీ తెలిసిన విషయమే. మన దేశ చరిత్రను మన పాలకులు వక్రీకరించి రాయించారు కానీ, చివరికి బ్రిటన్‌, ఆఫ్ఘనిస్థాన్లలో కూడా మన చరిత్ర వాస్తవ రూపంలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ విద్యావిషయిక పరిశోధనా మండలి కొన్ని పాఠ్యాంశాలను మార్చడానికి ప్రయత్నించినప్పుడు సహజ ంగానే కాంగ్రెస్‌తో సహా కొన్ని పార్టీలు, కొందరు చరిత్రకారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ తన భావజాలంతో చరిత్రను వక్రీకరించి నప్పుడు, తమకు అనుకూలమైన పాఠ్యాంశాలను పాఠ్య పుస్తకాల్లో జొప్పించినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని, ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయని నాయకులంతా ఇప్పుడు చరిత్రను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేస్తు న్నప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ తన భావజాలాన్ని జొప్పిస్తోందంటూ విమ ర్శలు సాగిస్తున్నాయి.
నిజానికి దేశ చరిత్రను అసలైన వాస్తవాలతో తిరగ రాయడమనేది బీజేపీ ఎజెండా లో ముఖ్యమైన భాగం. దేశానికి అటల్‌ బిహారీ వాజ్పేయీ ప్రధానమంత్రిగా ఉండగా చరిత్రను చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. అప్పట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విద్యా వ్యవహారాలను చూస్తున్న మురళీ మనోపగార్‌ జోషి కొన్ని పాఠ్యాంశాలను మార్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్‌ నాయకత్వం దీనికి శతావిధాలా అడ్డుపడింది. దేశ చరిత్రను కాంగ్రెస్థీకరణ చేయడంలో తప్పేమీ లేదు కానీ కాషాయీ కరణ చేయడం మాత్రం తప్పుగా వీరికి కనిపించింది. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వా త మళ్లీ చరిత్రను తిరగరాసే ప్రయత్నం ప్రారంభమైంది. 2020లో ఇందుకు సంబంధించి జాతీయ విద్యావిషయిక పరిశో ధనా మండలి (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) పెద్ద ప్రయత్నమే ప్రారంభించింది. ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించిన దగ్గర నుంచీ కాంగ్రెస్‌ నాయకులతో సహా కొందరు కుహానా చరిత్రకారులు మళ్లీ అడ్డుపుల్లలు వేయడం ప్రారంభించారు.
ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠ్యాంశాలలో కొన్ని అధ్యా యాలను, పాఠాలను తొ లగించడం, అనవసర వాక్యాలను తీసేయడం వంటి చర్య లను చేపట్టడానికి ప్రభుత్వం ఒక విద్యావేత్తలు, చరిత్రకారుల కమిటీని నియమిం చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ పరిశోధన మండలి గత ఏడాది ఒక నివేదికను కూడా రూపొందించి వెల్లడి చేసింది. అయితే, అందులో పొందుపర చిన కొన్ని అంశాలను ఆ తర్వాత తొలగించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. నివేదికలోని జాబితాల్లో చేర్చలేకపోయిన విషయాన్ని ప్రభుత్వం అంగీ కరించినప్పటికీ వివాదం మాత్రం సద్దుమ ణిగేలా కనిపించడం లేదు. పన్నెండవ తర గతి చరిత్ర పాఠంలో మహాత్మాగాంధీకి, నాథూరామ్‌ గాడ్సేకి కులం అంటగడుతూ చేసిన ప్రస్తావనలను తొలగించడం సబబుగానే ఉంది కానీ, మహాత్మా గాంధీకి హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన ప్రస్తావనలో తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేయడం మాత్రం అసమంజసంగా కనిపిస్తోంది. మొఘల్‌ రాజులకు సంబం ధించి మూడు అధ్యాయాలను తొలగించడం జరిగింది. అదే విధంగా ఆర్‌.ఎస్‌.ఎస్కు సంబంధించి చేసిన విమర్శలను కూడా ఎత్తేయడం జరిగింది. 2002లో జరిగిన గోధ్రా అల్లర్లకు సంబంధించిన వక్రీకరణలను కూడా ఎత్తేయడం సహజం.
పాఠ్యాంశాలలోని కొన్ని అధ్యాయాలు, వాక్యాలను తొలగించడం నిష్పక్ష పాతంగా జరగలేదని విమర్శిం చడం జరుగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పాఠ్యాంశాలను తొలగించారన్న వాదన ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సరిపోతుంది కానీ, విద్యావంతులు, మేధావులు, దేశభక్తుల అభిప్రాయంలో మాతం మరింతగా చరిత్రను తిరగ రాయాల్సిన అవసరముందనే విషయం అర్థమవుతోంది. దేశాన్ని ఉద్దరించిన రాజుల చరిత్రలను తొలగించి, దేశాన్ని, దేశ సంస్కృతిని ధ్వంసం చేసిన మొఘల్‌ రాజుల చరిత్రను మాత్రం ఆకాశానికి ఎత్తేయడం ఏ విధంగా సమర్థనీయమో అర్థం కావడం లేదని వారు భావిస్తున్నా. రు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబం ధించిన చరిత్రలో కూడా ఏ కొందరు నాయకులకో ప్రాధాన్యం ఇచ్చి, అంతకంటే ఎక్కువగా త్యాగాలు చేసి, అంతకంటే ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిన స్వాతంత్య్ర వీరు ల వివరాలను పాఠ్యాంశాల నుంచి తొలగించడాన్ని ఇతర పార్టీల నాయకులు, చరిత్రకారులు ఏవిధంగా సమర్థిస్తారో తెలియడం లేదని కూడా వారు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News