Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Honarary doctorates: డాక్టర్ల యందు సాహితీ డాక్టర్లు వేరయ

Honarary doctorates: డాక్టర్ల యందు సాహితీ డాక్టర్లు వేరయ

ఇటీవల తెలుగు రచయితల పేర్లకు ముందు డాక్టర్‌ అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది, ఇది తెలుగు సాహిత్యానికి శుభ పరిణామంతో కూడుకున్న అభివృద్దా?! లేక చులకన భావం కలిగించే సాహితీ తిరోగమన చర్య?? అనే విషయం తెలియాలి అంటే అసలు ఈ ‘డాక్టర్‌’ అనే ముచ్చటైన మూడు అక్షరాల పదం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి.
‘డాక్టర్‌’ అనే ఆంగ్ల పదానికి వైద్యుడు అనే తెలుగు అర్థం అందరికీ తెలిసిందె..! అంటే ఇది ఒక వృత్తికి సంబంధించిన నామవాచక పదం మాత్రమే కాదు పరిపూర్ణమైన, నిష్ణాతులు, అనె నామ విశేషణ పదం కూడా…!! వైద్యశాస్త్రంలో పరిపూర్ణ అధ్యయనం పూర్తి చేసిన వారికి అందజేసే ధ్రువీకరణ కూడాను, వృత్తిరీత్యా వైద్యుల పేర్ల ముందు ఆంగ్ల ఆచారం ప్రకారం ‘డాక్టర్‌’ అని పెట్టుకోవడం పరిపాటి అది వారి యొక్క పరిపూర్ణ అధ్యయన ప్రతిభకు గుర్తుగా కూడా పరి ణామం చెంది వారికో గౌరవ హోదాను అందిస్తుంది. సాహిత్య అధ్యయనంలో కూడా ఇదే ప్రాతిపదికన ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక కాబడి విశ్వవిద్యా లయ పరిధిలో ఎంచుకున్న అంశం గురించి నిష్ణాతుడు, అనుభవ జ్ఞులైన మార్గదర్శి పర్యవేక్షణలో నాలుగు నుంచి ఐదు సంవత్స రాల పాటు అధ్యయం చేసి ఆ అధ్యయన సారాన్ని సుమారు 300 పూటల గ్రంథముగా వ్రాసి ఆ గ్రంథం తాలూకు మూడు ప్రతులు ఇతర విశ్వ విద్యాలయాలకు పంపి వారి ఆమోదం అనంతరం పరిశోధనకు సంబంధించిన అంశం గురించి ఆచా ర్యుల సమక్షంలో మౌఖిక పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణత పొందిన తర్వాత సంబంధిత అభ్యర్థికి విశ్వవిద్యాలయం పరిశోధనా పరమైన డాక్టరేట్‌ పట్టా ప్రధానం చేస్తుంది, మన తెలుగు సాహితీవేత్తల్లో తొలి పరిశోధక డాక్టరేట్‌ గ్రహీత కళా ప్రపూర్ణ డాక్టర్‌ చిలుకూరి నారాయణరావు, 1828 సంవత్సరంలో చెన్న పురి విశ్వవిద్యాలయానికి ఈయన సమర్పిం చిన ‘11వ శతాబ్దం నాటి తెలుగు భాష’ అనే సిద్ధాంత గ్రంథమే తెలుగు సాహిత్యంలో తొలి పి,హెచ్‌, డి.(డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ) గ్రంథంగా పరిగణించారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగాలపరంగా డిగ్రీ కళాశాలలో ఉద్యో గించే వారికి ఈ పరిశోధక డాక్టరేట్లు విధిగా కావాల్సి ఉంది, మిగతా అందరికీ అవి కేవలం అలంకార ప్రాయమే తప్ప ఎటు వంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు, కానీ సాహిత్య రంగంలో రచయితలుగా చలామణి అయ్యేవారు ఈ ‘డాక్టర్‌” అనే పదం ఒక బిరుదుగా భావించి, పేరు పక్కన బాహాటంగా, నిస్సిగ్గుగా, ఉప యోగించుకుంటూ.. కష్టపడి అధ్యయనం చేసిన పరిశోధక డాక్ట రేట్‌ పట్ట బద్రుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, ఈ తంతు ఇటీవల బాగా ఎక్కువైపోయింది.
ఈ సందర్భంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి.. ఒక దశాబ్ద క్రితం పల్లెటూర్లలో గ్రామీణ వైద్యులు రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌ (ఆర్‌. యం. పి,) చేస్తూ సాధారణ విద్యా అర్హతలతోనే పేర్ల ముందు డాక్టర్‌ అనే పదం సర్వసాధారణంగా రాసుకొని బోర్డులు పెట్టుకునేవారు, దాని ద్వారా జరుగుతున్న నష్టాలు వివ రిస్తూ కోర్టును ఆశ్రయించిన అసలైన వైద్యశాస్త్ర అధ్యయన డాక్టర్ల వాదనలోని వాస్తవాన్ని గమనించిన గౌరవ న్యాయస్థానం గ్రామీ ణ వైద్యుల చర్యను తప్పు బట్టి దాన్ని నేర చర్యగా పరిగణించి తీ ర్పు ప్రకటించింది ప్రస్తుతం ఆ డాక్టర్ల తీరు పరిసమాప్తి అయింది.
అచ్చంగా అదే విధంగా మరో విచిత్ర తీరు నేడు తెలుగు సాహిత్యంలో ప్రవేశించింది, 1970 దశకం నుంచి మన విశ్వ విద్యాలయాల్లో ఈ గౌరవ డాక్టరేట్ల విధానం అమలులోకి వచ్చిం ది, యు.జి.సి గుర్తింపు పొందిన ప్రామాణిక విశ్వవిద్యా లయాలు తమ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన, పరిశోధనలు చేసి న, విద్యార్థులకు ప్రతి ఏడాది విశ్వవిద్యాలయ వార్షికోత్సవం (కాన్వగేషన్‌) సందర్భంగా ప్రధానం చేసే డిగ్రీ పట్టాలు, డాక్టరేట్‌ పట్టాలతో పాటు, విశ్వవిద్యాలయ కమిటీ ఎంపిక చేసిన వివిధ రంగాలలో చాలా ఏళ్లుగా నిస్వార్ధంగా కృషి చేస్తున్న ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ల ప్రధానం జరిగేది, ఈ గౌరవ డాక్టరేట్లు ప్రతి విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది ఇవ్వాలనే నియమం ఏమీ లేదు.
ఇక ఈ ‘గౌరవ డాక్టరేట్లు’ కూడా సభల్లో చేసే సత్కార, సన్మానాల వంటివే…!! సన్మాన సభలో ఇచ్చిన మహారాజా తల పాగా, మెడలో పూలదండ, శాలువా, ఆ కార్యక్రమంలోనే ధరి స్తాము తప్ప వాటినే ధరించి ఎల్లకాలం తిరగం..!! అలాగే ప్రామా ణిక విశ్వవిద్యాలయాలు అందించిన గౌరవ డాక్టరేట్‌ సైతం పేరు ముందు పెట్టుకోవడం ఒక రకమైన నేరంతో కూడిన, కుసంస్కా రం, అందుకే ప్రజాకవి కాళోజీ వంటి వారు సైతం విశ్వవిద్యాల యాలు నుంచి లభించిన గౌరవ డాక్టరేట్లను ఎప్పుడూ పేరు ముందు ప్రదర్శించుకోలేదు.
ప్రస్తుతం మన తెలుగు రచయితల్లో కనిపిస్తున్న డాక్టర్లలో పరిశోధనలు చేసిన వారు 20% ఉంటే, మిగతా శాతం అనామక విశ్వవిద్యాలయ ఏజెంట్ల ద్వారా 5 నుంచి 50 వేల వరకు చెల్లించి గంటలోనే గౌరవ డాక్టరేటును టోపీతో కూడిన ప్రత్యేక దుస్తులతో అందుకుని పేరు ముందు డాక్టరు పెట్టుకుని ఆధునిక ప్రసార మాధ్యమాలలో బాజాలు కొట్టుకుంటూ, తమ గురించి బాగా తెలిసిన వారి దగ్గర చులకనై పోవడంతోపాటు, క్రమేణ తమ చర్యల ద్వారా అందరి ముందు నవ్వుల పాలు అవు తున్నారు.
ఈ ‘కొనుగోలు డాక్టర్ల‘ హోరు భరించలేక, వారితో జత కూడా లేక, నిజమైన పరిశోధనలు చేసిన కొందరు పరిశోధక విద్యార్థులైన డాక్టర్లు తమ పేరు ముందు డాక్టర్‌ పదం పెట్టుకోవ డానికి ఇష్టపడని పరిస్థితులు నేడు దాపురించాయి.
ఈ ‘కొనుక్కోగలిగే గౌరవ డాక్టరేట్లు’ అమ్మకానికి ఈమధ్య వాట్సప్‌ సమూహాలు కూడా వేదికలుగా మారుతున్నాయి. వీటికి ప్రత్యేకంగా ఏజెంట్లు కూడా పుట్టుకొచ్చి ఆర్థికపరమైన అనేక మోసాలు కూడా చేస్తున్నారు.
అలా ‘కొనుక్కున్న డాక్టరేట్లు’ కేవలం గౌరవ డాక్టరేట్లుగానే భావించాలి, వాటిని పేరు ముందు పెట్టుకోవడం నేరంగా పరి గణించాలి,.. కానీ ఆ చర్యను కొందరు సమర్థించి ప్రోత్సహించే వారు లేకపోలేదు, అందుకే యు. జి. సి (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌) దేశంలోని విశ్వవిద్యాలయ విద్య, పరిశోధనల విలు వలు పెంచడానికి ఎటువంటి కఠినమైన చర్యలు చేపడుతుందో అదే విధంగా, ప్రామాణికమైన విశ్వవిద్యాలయాల పరిశోధనల విలువలకు ఆటంకం కలిగిస్తున్న ఈ గౌరవ డాక్టరేట్‌ పట్టాల పంపిణీ ముఠాలను తక్షణమే ఉక్కు పాదంతో నియంత్రించాలి,
ఇక సహృదయ ‘కొనుగోలు గౌరవ డాక్టరేట్‌ రచయిత లంతా’ మీదైన సాహితీ మనసు పెట్టి ఒక నిమిషం ఆలోచిం చండి.. మన పేరు పక్కన డాక్టర్‌ అనే పదం చూసి మన రచనలు చదువుతారా? లేక మన రచనలోని ప్రతిభ బట్టి చదువుతారా?? అనే విషయం బుద్ధితో ఆలోచించాలి.
అంతేగాక ఈ అక్రమ చర్యను బాహాటంగా పత్రికల ముఖంగా.. ప్రదర్శించుకోవడం ద్వారా మీ గౌరవం ఏమాత్రం పెరగదు, సరికదా మీగురించి తెలిసిన అందరి ముందు అభాసుపాలు అవుతారు, రచయితలు అనబడే సాహితీవేత్తలు అంటేనే సభ్య సమాజంలో మిగతా వర్గాల వారికి ఆదర్శంగా నిలవాలి, హుం దాగా వ్యవహరించి సమాజాన్ని నిత్యం చైతన్య పరచాలి, అలాం టిది మనమే ఇలాంటి చౌకబారు పనులు చేస్తే ఇక మనకు మన రచనలకు భవిష్యత్తులో ఎలాంటి విలువ ఉంటుంది?! ఒక్కసారి సమాజ హితం కోరే రచయితలుగా ఆలోచించండి.

  • డా॥ అమ్మిన శ్రీనివాసరాజు
    పరిశోధక రచయిత, 77298 83223.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News