Homeఎడిటోరియల్ / బహుళవిప్లవవాదులంతా ఐక్యమైతే ప్రత్యామ్నాయం సాధ్యమే

విప్లవవాదులంతా ఐక్యమైతే ప్రత్యామ్నాయం సాధ్యమే

మావోయిస్టులు సాయుధ పోరాటం, అజ్ఞాతం వదిలి బయటకు వచ్చి బహిరంగంగా కార్యక్రమాలలో పాల్గొనా లని, ప్రభుత్వం కూడా అందుకు సహకరించాలని కోరుతూ అనేకమంది సామాజిక ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు కోరుతూ వస్తున్నారు. నేను కూడా వ్యాసాలు రాశాను. ఎలక్ట్రానిక్‌ మీడియాలో మాట్లాడాను.

- Advertisement -

నేడు అత్యధికులు బయటకు వస్తున్నారు. నాలుగైదు దశాబ్దాల పాటు అనేక త్యాగాలు చేసిన మావోయిస్టులను సమాజమంతా ఆదరిస్తారు, గౌరవిస్తారు. వారి గురించి కథలు కథలుగా ప్రజలు చెప్పుకోవడం కూడా సహజం. మా రిన పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకొని వీరంతా  ప్రాణాలతో ఉండాలని, ప్రజల పక్షాన ఉండాలని, అందుకు అజ్ఞాతం నుండి బయటికి రావాలని కోరుతున్నారు. వీరు బయటకు వచ్చినందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరో కొంతమంది పరిపక్వత లేని, పరిణామాలు అర్థం చేసుకోలేనివారు భిన్నాభిప్రాయాలు కలిగుండవచ్చు. బయ టికి వచ్చిన మావోయిస్టుల నిర్ణయం తప్పని అనవచ్చు. దానికి  ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. గిల్టీ ఫీల్‌ కావాల్సిన అవసరం లేదు. వారెవరికి అనుభవాలు లేవు. ఎన్ని ఇబ్బందుల తర్వాత, అనివార్యమైన పరిస్థితుల్లో వీరు బయటకు రావాల్సివచ్చిందో వారికి అర్థం కాదు. అందుకే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనాలు వీరి త్యాగాలను గుర్తించారు. హృదయపూర్వకంగా ఆహ్వాని స్తున్నారు.

అజ్ఞాతం వదిలి బయటకు వచ్చినవారు ప్రజల కొరకు ప్రత్యామ్నాయ వ్యవస్థ కొరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పోరాట రూపమే మారుతుంది కాని పోరాటం ఆగదన్నారు. వీరి అమూల్యమైన త్యాగాలు వృధా కాకూడదని మాలాంటి వారం ఆశిస్తున్నాం.

మిగతా దేశం ఎలా ఉన్నా, తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉంది. దానికి ప్రధాన కారణం నాటి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఇప్పటివరకు జరి గిన బహిరంగంగా ఉండి సీపీఎం, సీపీఐ లాగా పనిచేస్తున్న పార్టీలు కావచ్చు, నక్సలైట్ల మూమెంట్‌ కావచ్చు.     తెలం గాణ సాయుధ పోరాట వారసత్వమే దాదాపు అన్ని రాజ కీయ పార్టీలలో ఉన్నారు. మేము ఫలానా తెలంగాణ సాయుధ పోరాట యోధుని కొడుకునని మనువడినని గర్వం గా చెప్పుకుంటుంటారు. కమ్యూనిస్టు  ఉద్యమం అన్నా, కమ్యూనిస్టు పార్టీ అన్నా ఏ పార్టీలో వున్నా అభిమానం చూపిస్తూ ఉంటారు.
అదేవిధంగా గత 50 సంవత్సరాలకు పైగా నక్సలైట్‌ ఉద్యమం తెలంగాణలో బలంగానే వేళ్ళూనికొని  ఉన్నది.  విద్యార్థి ఉద్యమంలో, యువజన ఉద్యమాలలో, రైతు కూలీ ఉద్యమాలలో, విప్లవ రచయితల సంఘం తదితర సంఘాల ద్వారా కొంత కృషి జరిగింది. ఆ సంఘాలలో పనిచేసిన వారు  నిర్బంధాలకు గురైనవారు, దళాలలో పనిచేసినవారు, జైలు జీవితం అనుభవించినవారు, ఆయా కుటుంబాల బం ధువులు తదితర అభిమానులు ఇప్పటికీ అనేకులు ఉన్నారు. తాత్కాలిక నిర్బంధాలకు గురై చురుకుగా కనపడకపోయినా సమయం వచ్చినప్పుడు వారంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులుగానే ఉద్యమానికి సహకరించగల స్థితిలోనే ఉంటారు.

కమ్యూనిస్టు ఉద్యమం చీలికలుపేలికలు కావటం, ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం,  రోజు రోజు బలహీనపడి అస్తిత్వం కొరకు ఏదో ఒక పాలక పార్టీలతో జత కలవడం లాంటి పరిణామాలతో ప్రజలు కమ్యూనిస్టు ఉద్య మానికి దూరం కావడం జరుగుతుంది. వివిధ కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాలలో ఉన్నవారి కంటే కమ్యూనిస్టు పార్టీల బయటున్నవారే ఎక్కువగా ఉన్నారు. వారందరూ కమ్యూ నిస్టుల ఐక్యత కోరుకుంటున్నారు. వీరంతా కనీస కార్యక్ర మంతో కమ్యూనిస్టులంతా కలవాలని భావిస్తున్నవారే. ఇలాంటి శక్తులన్నీ సరైన వామపక్ష ప్రత్యామ్నాయం కనపడితే కలిసి నడవడానికి వెనుకాడవు.
మావోయిస్టులు  ఇంతకాలం  సాయుధంగా ఉండటం వలన, అజ్ఞాతంలో ఉండటం వల్ల మిగతా కమ్యూనిస్టు పార్టీ లతో కలిసి పనిచేసే అవకాశం లేకుండాపోయింది. కానీ ఇప్పుడు అందరూ కలిసి బహిరంగంగా, బయట పనిచేయడా నికి అవకాశం ఏర్పడింది. కాబట్టి అందుకు కావలసిన విధి విధానాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

గత ఐదారు నెలలలో మావోయిస్టుల నుండి దఫదఫా లుగా సోను, ఆశన్న, బార్స్‍ దేవా, చంద్రన్న, దామోదర్‌, దేవ్‌జీ, సంగ్రాం తదితరులతోపాటు వందలాది మంది వివిధ స్థాయి నాయకులు, దళ సభ్యులు బయటకు వచ్చారు. వారం దరి మధ్య చిన్నచిన్న విషయాలపైన భిన్నాభిప్రాయాలు, అపార్థాలు ఉన్నట్టు వివిధ సందర్భాలలో బహిర్గతమైనవి. వీటిని ఆసరా చేసుకుని అటు శత్రువులు ఇటు మిత్రులను కునేవారు సహితం అపరిపక్వతతో వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా సమన్వయం చేసుకొని వీరి మధ్య ఉన్న మిత్రభేదాలను, భిన్నాభిప్రాయలను, అపార్థా లను తొలగించుకొని ఐక్యంగా సాగాల్సిన అవసరం ఉన్నది. కమ్యూనిస్టులు అన్ని త్యాగం చేయగలరు కానీ ఒక్క ఇగోను అహంభావాన్ని మాత్రం త్యాగం చేయలేకపోతున్నారని వామపక్ష అభిమానుల చర్చల్లో ఉన్నది. ఆ అభిప్రాయాలను ఆచరణలో తప్పని రుజువు చేసుకోవాలి.

బయటికి వచ్చిన వారంతా ఐక్యంగా ఉంటేనే ఒక శక్తిగా కనపడతారు. మిగతా వామపక్ష, అభ్యుదయ, ప్రజాస్వామ్య శక్తులను సమైక్యపరచడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడానికి అవకాశం ఏర్పడు తుంది. ఛత్తీస్గడ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వీరి చొరవతో ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పడుతుందో చెప్ప లేము. కానీ తెలంగాణలో మాత్రం కచ్చితంగా అన్ని వామ పక్షాలు కలిసి ఒక కనీస కార్యక్రమంతో ముందుకు పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని విశ్వసించ వచ్చు. పోరాటం సాయుధంగా ఉండదు, అంతమాత్రాన ప్రజల కోసం జరిగే మా పోరాటం ఆగదని మావోయిస్టు నాయకులు బయటికి వచ్చిన సందర్భంగా ప్రకటించారు. అది తెలంగాణలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికి మార్గం సుగమం చేస్తుందని  ఆశిద్దాం.
జి. రాములు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News