Friday, February 13, 2026
Homeఎడిటోరియల్ / బహుళBJP Education Policy Criticism: విష కౌగిలిలో విద్యా వ్యవస్థ!

BJP Education Policy Criticism: విష కౌగిలిలో విద్యా వ్యవస్థ!

Education Sector Reforms India: మనది మత ప్రమేయం లేని రాజ్యం. ఇది రాతలకే పరిమితమైంది. మోడీ ప్రధాని అయ్యాక దీని అర్థం మారింది. మతమే రాజ్యంగా మా రుతున్నది. మతరాజ్యాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యం. అందుకోసం కొత్త ఎత్తులు వేస్తున్నది. ఈ దేశం లో బహుజనులను ఎట్లా బానిసలు చేయాలో బీజేపీకి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. అందుకే బీజేపీ చాలా జాగ్రత్తగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమే ఎజెండాగా పెట్టుకుంది. గడిచిన పదేళ్ల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీలకు చదువు అందకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నది. విద్యకు బడ్జెట్‌ తగ్గించడం, టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, సెలబస్ను మార్చడం, డ్రాపవుట్లను పెంచడం, ఉద్యోగాలను నిం పాల్సినప్పుడు బ్రాహ్మణులకే పెద్దపీటను వేయడం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, కార్పోరేటు విద్య నంతా మార్వాడీ, బనియా కులస్తులకు అంటగట్టడం మచ్చుకు కొన్ని.

- Advertisement -

సిలబస్ మార్పు

సంఘ్‌పరివార్‌ శక్తులకు చరిత్ర మీద ఎప్పుడూ ద్వేషమే. అందుకే వారు కాంగ్రెస్ పాలనలో ఉన్న సెల బస్ను, వాస్తవాలను తొలగించే పనికి పూనుకున్నారు. హిందూమత కేంద్రంగా మార్పులు చేయడం, ఇతర మతస్తులను దోషులుగా, ద్రోహులుగా చిత్రించడం అందులో భాగమే. పాఠశాల స్థాయిలో పిల్లల మెదళ్ల లో విద్వేష బీజాలు నాటితే రేపు వారు ఏమవుతారు? మతపిచ్చి పట్టిన కూనీకోర్లు తయారవుతారు. ఆ దిశ గా పాఠాలు మార్చడం ఎంతమాత్రం అంగీకారం కా దు. పాఠాలు మార్చడంలో భాగంగా ఆర్‌ఎస్ఎస్ నాయకులైన హెగ్డేవార్‌, గాంధీని చంపిన సావర్కర్‌ల చరిత్రను పాఠ్యాంశాలుగా పెట్టే పని నిత్యకృత్యం చేస్తు న్నారు. ఇట్లా విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కు వైపోతున్నది.

బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవ డానికి ప్రాథమిక స్థాయి ఉండే విద్యా వ్యవస్థను కలుషితం చేయడం క్షమించరాని నేరం. పిల్లలకు శాస్త్రీయమైన విద్య అందాలి. వారు విశాలమైన అవగాహనను పెంపొందించుకోవాలి. అట్లా కాకుండా దేశానికి రేపు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు కాకుం డా మతోన్మాద కార్యకర్తలను తయారు చేస్తోంది. అందుకే బహుజనులు చదువుకునే ప్రభుత్వ విద్యనే టార్గెట్‌ చేస్తున్నది. సెక్యులర్‌ వాతావరణాన్ని ఇష్టపడని బీజేపీ, ఇట్లా ఏకపక్ష నిర్ణయాలతో సెలబస్ మార్చడం మీద దేశ మేధోరంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

రోజురోజుకు పెరుగుతున్న డ్రాపవుట్స్​‍

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో డ్రాప్‌ అవుట్స్​‍ పెరుగుతున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ట్రా ల ప్రభుత్వాలు జాగ్రత్తగా రెండు రకాల పనులు చేస్తు న్నాయి. ఒకటి నిధులను తగ్గించడం. రెండు కొత్త టీచ ర్‌ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడం. ఈ రెండు చర్యల వల్ల క్రమంగా సర్కార్‌ బడులు మూతప డుతున్నాయి. ఈ సర్కార్‌ బడుల్లో చదివే పిల్లలు ఎవ రన్నది బహిరంగ రహస్యమే. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలే మేజర్‌గా ఇక్కడ చదువుతున్నారు. వారి చదువు కొన సాగకుండా ఉండడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రకమైన చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో 27 వేల పాఠశాలలు గడిచిన పదేళ్లలో మూసేశారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కొన్నేళ్లుగా 23 లక్షల టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయ లేదు. దీంతో విద్యార్థుల డ్రాపవుట్‌ సంఖ్య పెరుగుతూ కూలీల సంఖ్య పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా డ్రాప్‌ ఔట్‌ గణాంకాలను పరిశీలిస్తే… ప్రాథమిక స్థాయిలో 2.3, ఉన్నత ప్రాథమిక స్థాయిలో 3.5, అలాగే మాధ్య మిక స్థాయిలో 8.2 శాతంగా ఉంది. ఇక యూనివ ర్సిటీ స్థాయిలో కూడా మరింతగా ఉంది. ఇట్లా డ్రాప్‌ఔట్లను పెంచుతూ బీజేపీ సర్కార్‌ బహజనులను క్రమంగా చదువులకు దూరం చేస్తున్నది. ఉద్యోగాల భర్తీలో పక్షపాతం బీజేపీ చేస్తున్న మరో ముఖ్యమైన చాపకింద నీరు లాంటి కుట్ర ఉద్యోగాల భర్తీ.

ఈ విషయంలో కూడా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఒకటి మోడీ, అమిత్‌ షాలు తీసుకొచ్చిన EWS రిజర్వేషన్లు. దీని ద్వారా 10 శాతం ఉద్యోగాలు ప్రత్యక్షంగా భర్తీ అవుతున్నాయి. ఇక సెంట్రల్‌ యూనివర్సిటీలల్లో ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు కూడా బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తున్నారు. దేశ జనాభాలో బ్రాహ్మణుల జ నాభా 3 నుండి 5 శాతం మాత్రమే. కానీ, వీరు ఉద్యో గాల్లో చూస్తే… ఉన్నత స్థాయి సివిల్‌ సర్వీసుల్లో 70 శాతంగాను, న్యాయవ్యవస్థలో 50 శాతంగాను, గవ ర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు 48 శాతంగాను, రాజకీ యంగా చూస్తే లోక్‌సభలో 37 శాతం, రాజ్యసభలో 36 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా నింపిన రెండు కోట్ల ఉద్యోగాల్లో సింహ భాగం ఒకే ఒక్క సామాజిక వర్గానికి దక్కాయి. అది బ్రాహ్మణ సామాజిక వర్గం. బీజేపీని, ఆర్‌ఎస్ఎస్ను నడిపిస్తున్న బ్రాహ్మణులు చక్రం తిప్పుతున్నారనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి?

తమ భావజాలానికే పెద్దపీట

మేధో నిలయాలుగా ఉండాల్సిన యూనివర్సిటీ లను సైతం సంఘ్‌పరివార్‌ శక్తులు భ్రష్టుపట్టిస్తున్నా యి. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో సిలబస్ మార్చి, ఉద్యోగాలను కుదించిన సర్కార్‌, ఉన్నత విద్యా నిల యాలైన యూనివర్సిటీల్లో పూర్తిగా తమ కార్యకర్తలనే అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా నింపుతున్నారు. ఆఖ రికి ఒక ఎస్సీ పోస్ట్‍ పడ్డా సరే, వారిలో ఎవరైతే తమ కాళ్లకింద పడి ఉంటారో వారినే సెలక్ట్‍ చేస్తున్నారు. దీనికి అనేక సాక్ష్యాలు కనిపిస్తాయి. సాధారణంగా యూనివర్సిటీ ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు ఒక అభ్యర్థికి చెందిన అకాడమిక్‌ రికార్డు చూడాలి. ఇంట ర్వ్యూలో ఆ అభ్యర్థి సబ్జెక్టును సామార్ధ్యాన్ని చూడాలి. బోధన శక్తిని పరిగణనలోకి తీసుకోవాలి. బీజేపీ మా త్రం ఈ పద్ధతికి తిలోదకాలిచ్చింది. కేవలం తమ అను బంధ సంఘాల్లో పని చేసిన కార్యకర్త అయితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో ఇవాళ టాలెంట్‌ కలిగిన ఎంతోమంది నిరుద్యోగుల పొట్ట కొడుతున్నది. ఇవాళ అభ్యర్థుల జాబితాను ఫైనల్‌ చేసేది యూని వర్సిటీ అధికారులు, వైస్ ఛాన్సలర్‌ లేదా సెలక్షన్‌ కమిటీలు కాదు. బీజేపీ అనుబంధ సంఘాల నాయ కులు చేయడమే ఇందుకు నిదర్శనం.

సెలక్షన్‌ కమిటీల్లోనూ దుర్మార్గమే

యూనివర్సిటీ ఉద్యోగాలకే కాదు, యూపీఎస్సీ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో సైతం బీజేపీ రాజ కీయ భాగస్వామ్యం బాగా పెరిగిపోయింది. ఇంట ర్వ్యూల్లో అడిగే ప్రశ్నల దగ్గరి నుండి అభ్యర్థుల పేర్ల దాకా కేవలం హిందువు అయినవారికే ప్రాధాన్యతను ఇవ్వడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంట ర్వ్యూల్లో డైరక్ట్‍గా అడుగుతున్న ప్రశ్నల్లోనే ఇటువంటి తిరకాసు పెడుతున్నారు. అఖండ భారత్‌ మీద మీ అభిప్రాయం ఏమిటి? రామాయణ ఇతిహాసాలను మీ రు ఎలా చూస్తారు? మీరు గతంలో ఏదైనా మా సం ఘంలో పని చేశారా వంటి ప్రశ్నలతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

సంస్కృత శ్లోకాలు నిత్యం పటిం చేవారు, హిందూ సంప్రదాయంతో జీవించేవారినే తప్ప మరొకరిని ఎంపిక చేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లా విద్యా సంస్థల నిండా గడిచిన పదేళ్లుగా బీజేపీ కను సన్నల్లో పని చేస్తున్నవారినే భర్తీ చేయడం ఆశ్చర్యక రమైన విషయం. ఈ రకమైన ధోరణి కూడా బహుజ నులకే అన్యాయం చేస్తున్నది. పేద, నిరుపేద నేపథ్యం నుండి వచ్చిన బహుజనులు ఈ రకమైన పక్షపాత ధోరణుల వల్ల శాశ్వత నిరుద్యోగులుగా మారుతున్నారు.

ఫెల్లోషిప్‌లను ఆపేసిన యూజీసీ

నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీ-2020 పేర సంస్కరణలు తెచ్చింది బీజేపీ. కాకుంటే ఆ సంస్కర ణలు బహుజనులను చదువులకు దూరం చేసేవిగానే ఉన్నాయి. ఒకవైపు విద్యకు కేటాయించే బడ్జెట్‌లో కోత విధించడం మరోవైపు ప్రైవేటైజేషన్‌కు ద్వారాలు తెర వడం ఏకకాలంలో చేస్తోంది. అలాగే యూనివర్సిటీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు ముందు కు పోకుండా అడ్డుకుంటున్నది. గతంలో కాంగ్రెస్ సర్కార్‌ పెట్టిన రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఫెల్లోషిప్‌లతో పాటు పీడీఎఫ్‌కు ఇచ్చే ఫెల్లోషిప్‌లను కూడా ఆపేసిం ది. దీంతో పేద, నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువు లు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఫెల్లోషిప్‌లు కట్‌ చేస్తే ఈ బహుజనులు యూనివర్సిటీలు వదిలి వెళ్లిపోతా రనే కుట్ర బీజేపీ చేస్తున్నది.

2018లో ఆపేసిన ఫెల్లోషిప్‌లను ఇప్పటి వరకు తిరిగి ప్రారంభించలే దంటే, బీజేపీ ఎంతగా బహుజనులకు వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఉద్యోగాలు ఇవ్వదు, మరోవైపు స్కాలర్లుగా పరిశోధనలు చేస్తామం టే నిధులు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది.

చదువుకు దూరం చేసే కుట్ర

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 79 యేళ్లలో చదువు అందరికీ ఇంకా అందనేలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు మాత్రం, తమ బ్రాహ్మణ వర్గ ప్రయోజనాల కోసం బహుజనులను బలిపెడుతు న్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. చదువు ఒక్కటి ఉంటే చాలు ప్రపంచంలో మార్పును తేవచ్చన్నాడు నెల్సన్‌ మండేలా. ఆ చదువు దీపాన్ని ఆర్పేందుకు బీజేపీ పాలకులు నిరంతరం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ పరిణామం రేపు దేశాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.

మరికొన్ని కోట్ల మంది కూలీలు తయారవుతారు. నిత్య దరిద్రులు గా పరాన్నజీవులుగా బతుకులు ఈడుస్తారు. బీజేపీకి కావాల్సింది సరిగ్గా అలాంటి కార్యకర్తలే. అలాంటి వారిని నిర్మాణయుతంగా తయారు చేస్తున్నది. ఈ ప్రమాదాన్ని బహుజనులు అర్థం చేసుకోనన్ని నాళ్లు వారి బతుకులు బాగుపడవు. ఇప్పటికైనా బహుజన మేధావులు, విద్యావంతులు మేల్కోవాలి. రాజ్యాంగం లో పేర్కొన్న Right to Educationను కాపాడుకో వాలి. లేకుంటే మధ్యయుగాలకు భారతదేశం తరలి పోతుంది. తిరిగి కోలుకోవడానికి కొన్ని శతాబ్దాలు పడుతుందనేది పచ్చి వాస్తవం!

డా. పసునూరి రవీందర్‌
(రచయిత, సామాజిక విశ్లేషకులు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News