Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Increasing inequalities: హద్దులు దాటుతున్న అసమానతలు

Increasing inequalities: హద్దులు దాటుతున్న అసమానతలు

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపం చంలో అయిదవ స్థానాన్ని సంపాదించుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బ్రిటన్‌ను కూడా మించి పోయింది. అయితే, పేదల జనాభా విషయంలో మాత్రం భారత్‌ అగ్రస్థానంలో ఉంది. తాజా ప్రపంచ అసమానతల నివేదిక (డబ్ల్యు.ఐ.ఆర్‌) ప్రకారం, భారతదేశంలో 2022 నాటికి 22 కోట్ల 89 లక్షల మంది నిరుపేదలున్నారు. నిరు పేదల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా, సంపన్నుల సంఖ్య ఆయేటికాయేడు గణనీయ సంఖ్యలో పెరిగిపో తోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్య లో అసమానతలు కనిపించడం లేదని ఆ నివేదిక వ్యాఖ్యా నించింది. లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెటీల ఆధ్వర్యంలో ఇనీక్వాలిటీ లాబ్‌ 2017లో రూపొందించిన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం, దేశంలో ఒక్క శాతం సంపన్నులే ఉన్నప్పటికీ జాతీయ సంపదలో వారిదే పెద్ద వాటాగా ఉంటోంది. 1922 నాటి ఆదాయ పన్ను చట్టం ప్రకారం, సంపన్నులు చెల్లించే పన్ను కంటే దిగువ స్థాయి వారు చెల్లించే పన్నుల మొత్తమే ఎక్కువ.
విచిత్రమేమిటంటే, 1930లలో పన్నుల ఆదాయంలో సంపన్నుల వాటా 21 శాతానికి పైగా ఉండేది. 1980ల నాటికి అది 6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం అది 22 శాతానికి పెరిగింది. కాగా, 2017 తర్వాత నుంచి జీడీపీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్‌ విజృంభించడంతో 2020 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తోంది. ఇక కోవిడ్‌ మహమ్మారి కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య మళ్లీ ఒక్కసారిగా పెరిగి పోయింది. గత 45 ఏళ్ల కాలంలో ఇంత భారీ సంఖ్యలో నిరుద్యోగం పెరగడం అన్నది జరగనే లేదు. అయితే, కోవిడ్‌ తర్వాత ఆ సంఖ్య గణనీయంగా తగ్గి సాధారణ స్థితికి చేరుకున్నట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ త న వార్షిక నివేదికలో పేర్కొంది. కోవి్‌డ కాలంలో ద్రవ్యోల్బణం కూడా గత 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. విచిత్రంగా కార్పొ రేట్‌ సంస్థల లాభాలు కూడా దాదాపు మిన్నుముట్టాయి. కోవి్‌డ సమయంలో ప్రజానీకమంతా నానా అవస్థలూ పడుతుండగా, కంపెనీల లాభాలు మాత్రం ఆకాశమే హ ద్దుగా పెరగడం దేశంలోని ఆర్థిక అసమానతలకు అద్దం పడుతోంది.
ఈ రకమయిన ధోరణి భారతదేశానికి కొత్తేమీ కాదు. దేశంలో 2020 నాటికి 120 మంది అపర కుబేరు లుం డగా ఆ సంఖ్య 2022 నాటికి 166కు చేరింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల నిత్యావసరాల సరఫరాలు దెబ్బ తిని ఉండవచ్చు. అనేక వస్తువులకు కొరత ఏర్పడి ఉండ వచ్చు. ధరలు పెరిగి ఉండవచ్చు. కానీ, కొన్ని పరిశ్రమలు విపరీతంగా లాభాలు ఆర్జించిన విషయం కాదనలేనిది. ఆర్థిక మాంద్యం మీద చర్చించడానికి గత జనవరి మధ్య కాలంలో ప్రపంచంలోని సంపన్నులంతా దావోస్లో సమా వేశమైన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆక్స్‌ఫామ్‌ ఇం డియా సంస్థ ‘సంపన్నులదే రాజ్యం’ (సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌) అనే నివేదికను విడుదల చేసింది. కోవిడ్‌ మహ మ్మారి బారినపడి కోట్లాది మంది సాధారణ ప్రజలు నానా అవస్థలూ పడుతుండగా దేశంలోని ఔషధ ఉత్పత్తి సంస్థలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు కూడగట్టుకున్నాయని ఆ నివేదిక గణాంక వివరాలతో సహా తెలియజేసింది.
భారతదేశానిదే అగ్రస్థానం
ప్రపంచ అసమానతల నివేదిక (2022) ప్రకారం, ప్రపంచంలో అసమానతలు నెలకొని ఉన్న దేశాలన్నిటి లో భారతదేశమే మొదటి స్థానం ఆక్రమించి ఉంది. జాతీయ సంపదలో అపర కుబేరుల వాటా పదమూడు శాతం మాత్రమే ఉండగా, మిగిలినవారి వాటా 53 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం సగటు కుటుంబ సంపద 9.83 లక్షల రూపాయలు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది అత్యల్పం. 1990లలో ఆర్థిక సరళీకరణ, ఆంక్షల సడలింపు వంటి మార్పులు చోటు చేసుకున్న తర్వాత, భారతదేశంలో ఈ అస మానతలు మరీ పెరిగి పోయాయి. సంపన్నులు, పేదలకు మధ్య ఉన్న అంతరం ఆ తర్వాత నుంచి తగ్గడమ నేది జరగడమే లేదు. జాతీయ సంపదను సూచికలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ అసమానతలను మదింపు చేయడం జరుగుతోంది. పేదల ఆర్థిక స్థితిగతులను బట్టి చూస్తే, సంపన్న దేశాలలో ఈ అసమానతలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. స్వీడన్‌ వంటి దేశాలలో ఈ అసమానతల స్థాయి చాలా తక్కువగా ఉంటోంది. ఇక వర్ధమాన, పేద దేశాలలో ఈ అసమాన తలు మరీ శ్రుతిమించిపోతున్నాయి.
భారతదేశంలో పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. సంపన్నుల మీద అత్యధికంగానూ, సాధారణ ప్రజానీకం మీద అతి తక్కువగానూ పన్నులు విధించే పద్దతినొకదానిని భారత్‌ ఆలోచించాల్సి ఉంటుందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా పేర్కొంది.
జీఎస్‌టీ కారణంగా కార్పొరేట్‌ సంస్థలు చెల్లించే పన్నుల మొత్తాలలో తగ్గుదల కనిపిస్తోందని కూడా ఇది తెలిపింది. దీన్ని అత్యవసరంగా సవ రించాల్సిన అవసరం ఉందని అది సూచించింది. అసమానతలకు ఇది కూడా కారణమవుతోందని ఇది తెలిపింది. ఇక 2022-23లో 19.34 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూను ఆశించడం జరిగింది. ఇందులో 88 శాతం ఆదాయం పన్నుల ద్వా రానే వచ్చే అవకాశం ఉంది. సంపన్నుల మీదా, కార్పొరేట్‌ సంస్థల మీదా పన్నులు సరిగ్గా విధించనందువల్ల అసమా నతలు పెరగడానికి అవకాశం ఏర్పడింది. నిజానికి, పన్నులలోని అసమానతలే సమాజపరమైన, ఆర్థికపరమైన అసమానతలకు ప్రధాన కారణం అవుతోంది. జీఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కార్పొరేట్‌ సంస్థల పన్నుల చెల్లింపులలో తగ్గుదల ప్రారంభం అయింది. పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
కొన్ని పరిష్కార మార్గాలు
విచిత్రమేమిటంటే, భారతదేశం కేవలం నాలుగు శాతం జీడీపీతో మౌలిక సదుపాయాలను కల్పించగల స్థి తిలో ఉందని, తన పౌరులకు భద్రతలను సమకూర్చ గలుగుతుందని, పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి ప థకాలు, బాలల సంక్షేమం వంటి ప్రధాన అవసరాలను తీర్చగలుగుతుందని 2015లోనే ఐక్యరాజ్య సమితి డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యు.ఎన్‌.డి.పి) తన నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వానికి, సమాజానికి, ప్రైవేట్‌ రంగా నికి మధ్య సరైన సమన్వయం కుదిరినప్పుడు సమాజానికి సంబంధించిన అనేక సమస్యలను తి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ కాలంలో పరిష్కరించడానికి వీలవుతుందని కూడా ఆ నివేదిక పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ‘సంపన్నులదే రాజ్యం’ నివేదిక ప్రకారం, జీఎస్‌టీలో 64.3 శాతం వసూళ్లు 50 శాత ం సాధారణ ప్రజల ద్వారానే జరుగుతు న్నాయి. ఇక 50 శాతం మంది నిరుపేద భారతీయులు పరోక్ష పన్నుల ద్వారా అత్యధికంగా సంపదను సమ కూరుస్తున్నారు. సంపన్నులు పరోక్ష పన్నుల మొత్తం ద్వారా 6 శాతం మాత్రమే జాతీయ సంసదను పెంచు తుండగా పేదలు 50 శాతానికి పైగా పరోక్ష పన్నుల ద్వారా జాతీ య సంపదను పెంచడం జరుగుతోంది.
ఈ విధమైన మితిమీరిన అసమానతలు, అతి పేదరికం, అతి సంపన్నత వంటివి దీర్ఘకాలంలో ఏ దేశా నికైనా, ఏ ఆర్థిక వ్యవస్థకైనా తీవ్రస్థానిలో హాని చేయడం ఖాయమని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సి.ఇ.ఓ అమితా బ్‌ బేహార్‌ హెచ్చరించారు. సుమారు 65 శాతం మంది అయిదేళ్ల లోపు పిల్లలు ప్రాణాలు కోల్పోతుండడాని కి పౌష్టికాహార లోపం, ఆరోగ్య సంరక్షణ సమస్యలు, ఆకలి కారణమని ఈ మధ్య సుప్రీంకోర్టుకు భారత ప్రభుత్వం తెలియ జేసింది. ఇదంతా అసమానతల ఫలితమేన నడంలో సం దేహం లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం, సంపద పన్నును, లాభాల పన్నును విధించడం ద్వారా అక్రమ లాభాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. సంప న్నుల మీద కనీసం ఒక్క శాతమైనా పన్నును పెంచడం, మూలధన లాభాల మీద పన్ను విధంచడం వంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది. వారసత్వ సంపద మీదా, ఆస్తుల మీదా, భూముల మీదా పన్నులను పెంచడం వల్ల ఉపయోగ ముంటుంది. ఇక నికర సంపద మీద కూడా పన్ను విధించాల్సి ఉంటుంది. జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యం మీదా, 6 శాతాన్ని విద్య మీదా ఖర్చు చేయడం వల్ల దీర్ఘ కాలంలో అసమానతలు తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News