Monday, February 16, 2026
Homeఎడిటోరియల్ / బహుళIndian Constitution: పాఠ్యాంశంగా రాజ్యాంగం.. జాతి నిర్మాణానికి మూలాధారం

Indian Constitution: పాఠ్యాంశంగా రాజ్యాంగం.. జాతి నిర్మాణానికి మూలాధారం

Preamble to Constitution: భారత రాజ్యాంగాన్ని చదివారా? అందులో ఉన్న గొప్ప విషయమేంటి? భారత సమాజ నిర్మాణంలో దాని ప్రాత ఏంటి? ఈ మూడు ప్రశ్నలను ఈ వ్యాస రచయితలిద్దరం అనేకమంది డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన విద్యార్థులను అడిగాము. ప్రత్యేకించి ఒక పాఠ్యాంశంగా కచ్చితంగా చదవాల్సిన న్యాయశాస్త్ర విద్యా ర్థులను కూడా అడిగాము. వచ్చిన స్పందన మాకు పెద్దగా ఆశ్చ ర్యమనిపించలేదు. న్యాయ విద్యార్థులు పరీక్షలు- మార్కుల కోణంలో మాత్రమే చదువుతున్నారు. మిగిలిన వారందరూ ప్రవేశికలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావించగలిగారు.

- Advertisement -

ఉన్నత చదువులు చదువుతున్న జెన్‌ జి తరం (1996 నుంచి 2012 మధ్య పుట్టిన వారు) పరిస్థితి ఇలా ఉంటే బడి పిల్లలుగా ఉన్న జెన్‌ అల్ఫా (2013 నుంచి నేటి వరకు పుట్టినవారు) సంగ తి చెప్పక్కర్లేదు. విధిగా వారందరి పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ ప్రవేశిక ఉంటున్నప్పటికీ అదేంటో వారికి చెప్పేవారే కరువయ్యా రు. ప్రజాఉద్యమాలు నిర్వహించేవారు సైతం ప్రజలకున్న హక్కు లను కాపాడాల్సిన ఆవశ్యకత రీత్యా అవసరమైన మేరకు మాత్ర మే చదువుతున్నారు.

ఇందుకు కారణం లేకపోలేదు. మన యూనివర్శిటీలు, విద్యావేత్తలు, అకాడెమీషియన్లు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చేసిన హెచ్చరికను పట్టించుకోకపోవడమే ఆ కారణం. ఆయన రా జ్యాంగాన్ని న్యాయవాదులకే పరిమితమైన డాక్యుమెంట్‌ కాదని, అదొక సామాజిక జీవన విధానం అని మానవతావాద పత్రమని చెప్పారు. అంబేద్కర్‌ చెప్పిన మాటలకు అర్థమేంటి? భారత రా జ్యాంగం అనేది వ్యక్తిగత జీవితం నుండి సామాజిక సంస్థల వరకు, కుటుంబం నుండి జాతీయ ప్రభుత్వాల వరకు మార్గద ర్శక సూత్రాలను నిర్దేశిస్తుంది. పౌరుడిగా జీవించే విధానం, పౌ రుల మధ్య సంబంధాలు, వారి హక్కులు, విధులు పేర్కొనడమే కాకుండా దేశం పట్ల, దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి పట్ల ఉండా ల్సిన బాధ్యతలను కూడా నిర్వచించింది.

దాంపత్య జీవితంలో భార్యా భర్తల మధ్య సమానత్వం నుండి, పని ప్రదేశాల్లో నైతిక ప్రవర్తన వరకు, రోడ్డు మీద నడిచేటప్పుడు ట్రాఫిక్‌ నియమాలు పాటించడం దగ్గర నుంచి, ప్రతీ భారతీయుడి జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ మన రాజ్యాంగ ప్రభావం ఉంటుంది. కాబట్టి, రాజ్యాంగం చదవడం అనేది న్యాయశాస్తం చదవడం కాదు, మరింత సమర్థవంతమైన, న్యాయమైన సమగ్రమైన జీవనం గురించి అర్థం చేసుకోవడం.
భారత రాజ్యాంగం ఆవిర్భావంపై లోతైన పరిశోధన చేసిన గ్రాన్‌ విల్‌ ఆస్టిన్‌ భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటి, అగ్రశ్రేణి సామాజిక డాక్యుమెంటు అని సంబోధిస్తారు. ఇందులో నాలుగు ముఖ్యమైన అంశాలున్నాయి.

మొదటిది, స్వాతంత్య్రానికి పూ ర్వ రాజ్యాంగ రచన లక్ష్యమంతా జాతీయ పునరుజ్జీవమే ప్రధా నం. రెండోది, అప్పటికే 65 ఏళ్లుగా భారతదేశంలో జరిగిన జాతీయ, సామాజిక విప్లవాల ఉమ్మడి డిమాండ్ల వల్ల ప్రాథమిక హక్కులు (ప్రతీ పౌరుడికి లభించే రక్షణలు), ఆదేశిక సూత్రాల (పౌరుల పట్ల రాజ్యానికి ఉండాల్సిన దృక్పథం)కు మన రాజ్యాం గంలో చోటు కల్పించబడింది. ఇవే మన భారత రాజ్యాంగానికి మనస్సాక్షి. మూడోది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల గతా న్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఏకం చేసినట్లయ్యింది.

ఇది భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే సామాజిక విప్లవాలకు కావల్సినంత శక్తినిస్తుందని ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ నేతలు భావించారు. నాలుగోది, అత్యంత కీలకమైనది భారత రాజ్యాంగానికి ఉండే ఆధునిక స్వభావం. కుల, మత, లింగ భేదాలతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానం గా పరిగణించడం, ఇతరుల సంక్షేమాన్ని పట్టించుకోవడమే ఆధునికత. దీన్ని మన రాజ్యాంగం గ్యారెంటీ చేసింది. అందుకే భారత రాజ్యాంగం అనేది మన స్వాతంత్య్రోద్యమ నేతలు భవి ష్యత్తు ఆధునిక భారతదేశం కోసం దేశ పౌరులందరికీ సమ ర్పించిన భవిష్యద్దర్శిని.

వామపక్ష, సామాజిక, ప్రజా ఉద్యమాల వల్ల, వారి పోరాటాలు, త్యాగాల వల్ల హక్కుల గురించి ఈ ఏడు దశాబ్దాల కాలంలో ప్రజలకు ఎంతో కొంత తెలిసింది. ప్రజల్లో ఈ మేరకు చైతన్యం పెరిగింది. ఈ పోరాటాల వల్లే ఆదేశిక సూ త్రాలు కూడా అమలవుతున్నాయి. కానీ తరాలు మారుతున్నా కొద్దీ రాజ్యాంగం పట్ల ఉండాల్సిన చైతన్యం కొరవడిపోతోంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పరణ జరుగుతు న్నప్పుడు పుట్టిన తరం -మిల్లీనియల్‌- (1981 నుంచి 1995 వరకు) సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకత స్థానంలో ఇష్టాన్ని పెంచుకుంది. ఆనాటి నుంచే జాతీయోద్యమాన్ని, దాని చరిత్రను తక్కువ చేసి చూపించడానికి తీవ్ర ప్రయత్నం ప్రారంభమైంది.

బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ దుస్తులు, విలాసవంతమైన సరుకులను సా మ్రాజ్యవాదుల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఇది తప్పని సరైంది. భారత సమాజంలో అప్పటి నుంచి పాశ్చాత్యం పట్ల మోజు అనే విషాన్ని క్రమంగా ఎక్కించడం ప్రారంభమైంది. సోవి యట్‌ కుప్పకూలడం, భారత్‌ అలీన విధానాన్ని వదిలి సామ్రాజ్య వాది అయిన అమెరికా వైపుకు పూర్తిగా మొగ్గే కాలం నాటికి జెన్‌ జి తరం ఉద్భవించింది. పాశ్చాత్య మార్కెట్‌కు మన యువ తను బానిసలుగా చేసి, వారి ఉత్పత్తులు వాడడమే ఆధునికత అని చెప్పే దశ ప్రారంభమైంది. అంతకుముందున్న సమానత్వ భావనలు, దేశం పట్ల ప్రేమ స్థానంలోనే కెరీరిజం, ఎల్లలు దాటిపోవడమే ప్రధానమని నూరిపోయబడింది.

ఇక అక్కడి నుంచి స్వాతంత్య్ర పోరాటానికి వక్రభాష్యాలు, స్వాతంత్య్రోద్య మ నాయకులను తూర్పార పట్టడం, ఈ పోరాట ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగం మౌలిక స్వభావంపై దాడి విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా, మనదేశంలో కనీవినీ ఎరుగని మతకల్లోలాలు, కులదురహంకార హత్యలు, మత మౌఢ్యం విశృంఖలంగా మారిపోయింది. సోషల్‌ మీడియా ఫస్ట్‍గా ఉండే జెన్‌ అల్ఫా తరం నాటికి రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ఆఖరు కు రాజ్యాంగాన్నే మార్చాలనుకునే శక్తులు ఆధిపత్యంలోకి వచ్చేశాయి. అవి ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మిల్లీనియల్‌, జెన్‌ జి, అల్ఫా తరాల్లో జరుగుతున్న పరిణామాల సారాంశం స్వాతంత్య్రోద్యమాన్ని, దాని ఫలితాలను తక్కువ చేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని పలుచన చేయడమే. ఇది ప్రజల మధ్య నిత్య అనైక్యతను, అశాంతిని, హింసను, అరాచకత్వాన్ని పెంచుతోంది. ఆదర్శ వ్యక్తిత్వ, కుటుంబ విలువల స్థానంలో అనై తికత, వినిమయతత్వం, తీవ్రమైన అప్పులు, ఆడంబరాల ప్రద ర్శన వంటివి వెర్రితలలు వేస్తున్నాయి.

వెరసి నిత్య కల్లోల భారతంగా మారబోతున్నది.ఈ నేపథ్యంలో భారతదేశాన్ని ప్రేమించే, దేశభక్తుల ముం దున్న కర్తవ్యమేంటి? మన భారత రాజ్యాంగాన్ని జెన్‌ జి మొద లుకుని జెన్‌ అల్ఫా తరాల వరకు అర్థం చేయించాలి. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న నాలుగు గుండెకాయలాంటి పదాలు -సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర- భారతదేశ లక్ష్యాలని చెప్పాలి. ఈ ప్రతీ లక్ష్యం సారాంశం సమా నత్వమేనని బోధించాలి. సార్వభౌమాధికారం అంటే ప్రపంచ దేశాలతో పాటు సమానంగా నిలబడటం; సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ సమానమని; లౌకికత అంటే అన్ని మతాలు సమానమని; ప్రజాస్వామ్యం అంటే ప్రతి పౌరుడు సమానమని; గణతంత్రం అంటే ప్రజలందరూ కలిసి దేశాన్ని నడుపుతున్నా రని చైతన్య పర్చాలి. అంతకు ముందు అసమానతలతో నిండిన భారతదేశంలో, ఈ రాజ్యాంగం ఒక మహత్తరమైన, ఆధునిక సమానత్వ సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రాతిపదిక ను రూపొందించిందని వివరించాలి.

అప్పుడే మనదేశ విదేశాంగ విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉంటున్నాయా? లేవా? అనేది పరిశీలించేందుకు, తగు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుం ది. ఈ స్థితి రావాలంటే ఈ విషయాలన్నింటినీ దేశ ప్రజలందరికీ అర్థం చేయించాలి. ముఖ్యంగా భవిష్యత్తు ఆధునిక భారత నిర్మా ణానికి జెన్‌ జి, జెన్‌ అల్ఫాల మీద కేంద్రీకరించాలి. వీరంతా విద్యాలయాల్లో ఉంటారు. చదువుతూ ఉంటారు. కాబట్టి కిండర్‌ గార్డెన్‌ పిల్లలతో మొదలుకుని ఉన్నత విద్య చదువుతున్నవారి వరకు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా మార్చి క్రమపద్ధతిలో సారా న్ని అర్థం చేయించడమే నేటి కీలక కర్తవ్యం.

జెన్‌ ఆల్ఫాతరానికి, ఆట, పాట, మాట, రాత, గీత పద్ధతు ల్లో భారత రాజ్యాంగ విలువలైన సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి వాటిని పిల్లల మనస్సుల్లో నాటాలి. ఈ ప్రక్రియ కిండర్‌ గార్డెన్‌ నుంచే ప్రారంభించాలి. ఈ విధంగా చిన్నతనం నుండే ఆసక్తిగా నేర్పితే, రాజ్యాంగం అనేది సమాజంలో శాం తిగా సామరస్యంగా జీవించడానికి అవసరమైన నియమాల సముదాయం అనే అవగాహన పిల్లలలో రూపుదిద్దుకుంటుంది. ఇదే పునాది పైన మానవతా విలువలు జీవితాంతం పాటించా ల్సిన సూత్రాలు నిలబడతాయి.

జెఎన్‌ జి తరంలో ముఖ్యంగా ఓటు హక్కును కూడా విని యోగించుకుంటూ దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతున్న వా రు పాఠశాల ఉన్నత విద్య మొదలుకొని, ఇంటర్మీడియట్‌, డిగ్రీ /లేదా తత్సమాన పట్టా అందించే చదువుల్లో ఉంటారు. ఈ కా లంలోనే వారికి హక్కులు, విధులు, దేశపు ప్రాథమిక నిర్మా ణం, ప్రభుత్వ యంత్రాంగం పని తీరు తెలియచెప్పాలి. ఇప్పుడు పా ఠశాల స్థాయిలో రాజ్యాంగం గురించి ప్రాథమిక సమాచారం మాత్రమే అందించబడుతోంది. ఉన్నత విద్యలో కేవలం రాజనీతి శాస్త్రం లేదా న్యాయశాస్త్రం చదివే విద్యార్థులకు మాత్రమే రా జ్యాంగం అనేది పాఠ్యాంశంగా ఉంది. ఇంజినీరింగ్‌, వైద్యం, వ్యాపార నిర్వహణ లేదా ఇతర వృత్తిపరమైన కోర్సుల విద్యా ర్థులు, భవిష్యత్తులో సమాజంలో నాయకులుగా మారే అవకా శం ఉన్నప్పటికీ, రాజ్యాంగం గురించి లోతైన అవగాహన లేకుం డానే బయటికొస్తున్నారు. దీంతో పెద్ద శూన్యత ఏర్పడింది. దీనిని పూడ్చాలి.

డా. సోమేశ్వర్‌ బోనకుర్తి
వ్యవస్థాపకులు, ‘పునాది’ ది సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ & రీసెర్చ్‍
జగదీష్‌
వ్యవస్థాపకులు, యూనిటీ ఫౌండేషన్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News